31, ఆగస్టు 2020, సోమవారం

*దిల్ " దివాన్


÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
దివాన్ ఎంత రాజసికమో
కవిరాజులు కూర్చునే
విశాల హాస సింహాసనం కదా!
రాయల సభలా
రవీంద్ర భారతిలా !
పూర్వం అపూర్వంగా ఇందూరులో ఎందరెందరో కవుల సాయంత్ర
సభా సంరంభ వాడుక వేదిక
దివాన్ కవుల వాడకట్టు !
ఆహ్వానంగా
నాల్గు కాళ్ల దివాన్ కవులందరి
సాహిత్య సభా బస !
సంచారంగా
సభకు సభ కదిలినట్లు
నాల్గు ఏండ్ల క్రితం రాజధాని
భాగ్యనగరానికి వేంచేసింది
ఎన్నెన్నో కవిసమయాలను
చెదరకుండా మోసుకుంటూ !
కలివిడితనం లేని కాలానికి
దివాన్ కు ఇప్పుడు దిగులే
ఐనా దివాన్ కు                దిండుకు ఒరిగిన
ప్రతి కవి స్పర్శ ఇంకా
సుపరిచిత యాదిగా వహ్వా !
చందన వ్యాఖ్యానంతో
దిల్ దివాన్
కవిసమ్మేళనం కవిత్వంతో
సుమధురంగా మేళనం !
గది నిండా దివాన్
గది కన్నా విశాలంగా దివాన్
దివాన్ దిల్ లో
కవులందరి హృదయ స్పందన
కాలం తెలిసేది కాదు
సాయంత్రం సైతం రాత్రి వరకూ
దివాన్ పై ఉండుడే మరి !
ఆపుకారి సూర్యప్రకాశ్
ఘనపురం - కాసర్ల
చింతల -కొండా - మోతుకూరి
ఇంకాఎందరో కవుల కాణాచి
ఈ దిల్ దివాన్ !
దివాన్ పై భవిష్యత్తు
ఆశగా  పూలుపూలుగా
పరుచుకొని ఉంది -
తిరిగి భాగ్యనగర ఇందూరు
 కవిచంద్రులతో పుష్పకమే
నా దిల్ దివాన్
రోజూ కందాళై డైరీలో
కవిత్వంగా పదపీఠమే నువ్వు !
దిల్ దివాన్ !
గట్టిగా కవులందరినీ పిలువు
కాలం మారి వసంతంగా
నీ పై సభ                            సాహితీ సామ్రజ్యమౌతుంది !
చదివిన ప్రతి కవి కవిత కావ్యమౌతుంది  !
     - కందాళై రాఘవాచార్య

కామెంట్‌లు లేవు: