31, ఆగస్టు 2020, సోమవారం

మనతెలుగు


౼౼౼౼౼౼౼౼
అవధానధారలే యందింపగాజాలు
     అందాలపదహంస లలరుచుండు
నాటక రసరాగ హాటకానందమై
      స్ఫురిత వనమయూర శోభదనరు
వాగ్గేయకార సద్భావనా భాగ్యమై
       భక్తి బంభరకేళి పదముకదుపు
బాలమురళి సినీబాలు సద్గాత్రమై
        శాస్త్ర పరవశతా సారమొలుకు

కళల యరువదినాల్గింట ఘనతసూపు
కలికి సొగసుల సుకుమార కల్పవల్లి
పదము పదము నందియల సవ్వడులమించు
దివ్య రసరాజ్యమౌభాష తెలుగుభాష.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం

కామెంట్‌లు లేవు: