28, ఫిబ్రవరి 2022, సోమవారం

న్యాయంబేర్పడు

 భీమవరం

------------

శ్రీతాడిమళ్ళజగన్నాథరావుగారు, న్యాయవాది.

----------------------------------------- ----------------

న్యాయంబేర్పడు వాదనాంచిత జగన్నాథుల్ విదేశీయులే 

శ్రేయంబంచు తలంపసంస్కృతముఖశ్రీమార్చియాంగ్లానికిన్

ధ్యేయ శ్శుద్ధి నుపన్యసించి మన పద్యేందుప్రభన్ జాటిరే!

న్యాయోత్సాహులు తాడిమళ్ళకుల సత్యాలోకనాస్వాంతులే!

(సంస్కృతశ్లోకాలు ఆంగ్లానికి అనువదించారు. మలేషియా మొదలైనదేశాలలోఆంగ్లంలోభారతీయవైభవంగూర్చి ఉపన్యసించేవారు.)

శ్రీరాయసంవెంకట్రామయ్యగారు (రిటైర్డుఇన్కంటాక్సుకమీషనరు)

----------------------------------------

పాతకాపులు రాయసవంశభవులు

పేరువేంకటరామయ్యవిమలమతులు

వచనకవితాధనాఢ్యులు ప్రచురపద్య

సౌరభాస్వాదనానంద సౌమ్యనిధులు.

యామిని కవితాసంపుటి ఆమనివలె

బుద్బుదశుకవిలాసాదియద్భుతమగు

సారసత్కవిత్వనిధుల స్వాంతతతిని

పులకలొదవజేసెడురత్నములగనియగు

(పాతకాపులు=ప్రాచీనమైనకుటుంబాలవారు ,నియోగిబ్రాహ్మణులు.)

శ్రీపోల బాల గణేష్ గారు

-------------------------------

వచనకవితా రచనలకు స్వాగతమన

సంపుటిత్రయమ్ములమణుల్ సంతరించి

సాహితీయజ్ఞమును సల్పు సాధుమతులు

పోల బాల గణేషుల పొలుపునెంతు.

శ్రీ పెరుమాళ్ళ రాంపండుగారు

---------------- -------------------

శ్రీపెరుమాళ్ళ వంశ్యు వయసే తలపోయక వార్థకంబునన్

తా పరుగెత్తె పద్యకవితా లలితాంగి దయామృతంబుకై 

యోపిక రామపండుకవి యుత్సుకతామతినాయువుండ నా

హా!పరమేశులీలలు మహాద్భుతమెన్నగ జాలువారమే!

   (మావుళ్ళమ్మశతకం సమస్యాపూరణలు అనేకం)

రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం .

సులక్షణ మహారాజు కథ*

 _*మాఘమాసం*_

          🕉️ _*సోమవారం*_🕉️

🌴 _*ఫిబ్రవరి  28వ తేది 2022*_🕉️

  _*🕉️మాఘ పురాణం🕉️*_ 

🌴 _*27 వ అధ్యాయము*_🌴

🕉🌴🌹🕉️🕉️🌹🌴🕉️

*సులక్షణ మహారాజు కథ*

☘☘☘☘☘☘☘☘

గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లనెను. జన్మ సంసారమను అను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాసవ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరియొక కథను వినుము. పూర్వము ద్వాపరయుగమున అంగదేశమును పాలించుచు సులక్షణ రాజు కలడు. అతడు సూర్యవంశమున జన్మించినవాడు. బలపరాక్రమములు కలవాడు ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వానికి నూరుగురు భార్యలున్నను సంతానము మాత్రము లేదు. రాజులందరును వానికి సామంతములై కప్పములు చెల్లించుచున్నను సంతానము లేదను విచారము మాత్రము రాజునకు తప్పలేదు.

నేనేమి చేసిన కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును , పెద్దలు పుత్రులు లేనివారికి దరిద్రునికి , కృతఘ్నునకు , వేదహీనుడగు విప్రునకు సద్గతి లేదనియందురు. పుత్రులు లేని నేను మహర్షుల యాశ్రమమునకు పోయి అచట పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైన ఉపాయము చెప్పగలరేమో ? ప్రయత్నించి చూచెదను అని నిశ్చయించెను. అనేకమంది మహర్షులు కల నైమిశారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిశారణ్యమునకు వెళ్లెను , అచట మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి యిట్లనిరి. రాజా ! వినుము నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు , సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రధసప్తమి నాడు కూష్మాండ దానమును చేయలేదు. అందువలన నీకీ జన్మలో సంతానము కలుగలేదు. ఇందువలననే ఇంతమంది భార్యలున్నను నీకు సంతానము కలుగలేదు అని చెప్పిరి. అప్పుడు రాజు నాకు సంతానము కలుగు ఉపాయము చెప్పుడని వారిని ప్రార్థించెను. అప్పుడా మునులు ఓక ఫలమును మంత్రించి రాజునకిచ్చిరి. దీనిని నీ భార్యలందరికిని పెట్టుము. ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చెను. రాణులు సంతోషముతో వారికెదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషముతో స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యా గృహమునుంచెను. స్నానము మున్నగునవి చేయవలెనని లోనికి వెళ్ళెను. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగలించి తానొక్కతియే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు. సేవకులను , రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదనిరి , తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. రాజు యేమియు చేయలేక ఊరకుండెను. కొన్నాళ్లకామె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య యిట్లు గర్భవతి యగుట మిగిలిన భార్యలకిష్టము లేదు. ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నములను చేసిరి. కాని దైవబలమున అవి అన్నియు వ్యర్థములయ్యెను. కాని వారు చేసిన ప్రయత్నము వలన గర్బపాతమునకిచ్చిన మందుల వలన చిన్న భార్య మతిచెడెను. ఎవరికి తెలియకుండ అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు ఆమె అలసెను ఒక పుత్రుని కని యొడలు తెలియకపడియుండెను. గుహలోనున్న పులి బాలింతను యీడ్చుకొని పోయి భక్షించెను.

అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి యెండ మున్నగువాని బాధ ఆ శిశువునకు లేకుండ చేసినది. తేనె పండ్ల గుజ్జు మున్నగువానిని బాలునకు పెట్టి ఆ పక్షులు వానిని రక్షించినవి. బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటుపడి అచటనే తిరుగుచుండెను. అచటి సరస్తీరమున అతడాడుకొనుచుండగా హంసలు నదిలో విహరించెడివి. ఒకనాడు పవిత్రదినమగుటచే  సమీప గ్రామముల వారు సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి , అట్లు వచ్చినవారిలో ఇద్దరు భార్యలుండి సంతానను లేని గృహస్థు ఒకడు వారితో బాటు స్నానమునకు వచ్చెను. అచట తిరగాడుచున్న బాలుని చూచి ముచ్చటపడి ఇంటికి గొనిపోవలెను అని తలచి ఈ బాలుడెవరు యెవరి సంతానము అడవిలో యేల విడువబడెను అని యెంత ఆలోచించినను వారికి సమాధానము దొరకలేదు , వనమున , జలమున , గర్భమున నెచటనున్న వానినైనను రక్షించి పాలించు వాడు శ్రీమన్నారాయణ మూర్తియే కదా ! ఆయనయే నాకీ బాలుని యిట్లు చూపినాడని తలచెను. బాలుని ఇంటికి గొనిపోయెను. సవతులైన వాని ఇద్దరు భార్యలు ఎవరికి వారు వారే ఆ బాలుని పెంచవలెను అని పరస్పరము వివాద పడుచుండిరి ఈ విధముగా రెండు సంవత్సరములు గడచెను. ఒకనాడు ఆ గృహస్థు ఇంట లేని సమయములో పెద్ద భార్య ఆ బాలుని అడవిలో విడచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు బాలుని యెంత వెదకినను కనిపించలేదు.

అడవిలో విడువబడిన బాలుడేడ్చుచు వింటివలెనున్న తులసి పొదవద్దకు వెళ్ళెను అచటె పండుకొనెను. తులసీ స్పర్శవలన బాలునకా వనమున యెట్తి ఆపదయు రాలేదు. శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడచినది యెవరును లేని ఆ బాలుడు యేడ్చుట తప్ప మరేమి చేయగలడు. వాని దైన్యము , నిస్సహాయత ఆ అడవిలోనుండు పశుపక్ష్యాదులలోని జీవలక్షణమునకు విలువైనది. అడవిలో గల ప్రాణులు , మృగములు , పక్షులు అచటికి వచ్చినవి , బాలుని నిస్సహాయత ధైర్యము వానిలోని దివ్యలక్షణములను మేల్కొలిపి వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులును కన్నీరు కార్చినవి. ఒకరి బాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్ష్యాదులు యిట్టి సహానుభూతి నందినప్పుడు మరియొక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా ! అట్లే బాలుడును పక్షియోమృగమైనప్పుడు వాని దుఃఖము యెట్లుండునో కదా , బాలుడు పశుపక్ష్యాదులు  విభిన్నజాతులవారైనను వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము ఒక చోటనుండి రేవునుండి వచ్చినదే. అదియే దివ్యత్వము , కాని విచిత్రమేమనగా బాలునికి తనజాతిదే అయిన స్త్రీ వలన ఆపదవచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య , ఆమెలోని దివ్యత్వము లోపించినది. సృష్టి విచిత్రమని యనుకొనుట తప్ప మనకే సమాధానమును తోచదు. ఇదియే భగవంతుని లీల , అట్లు వచ్చిన పక్షులు , మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు యెండ వానిపై బడకుండ రెక్కలతో నీడను కల్పించినవి , తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకము నుండి మరల్చినవి. మృగములును. తేనె , ముగ్గినపండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు పక్షులు వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు , పక్షులు వానికి తాము చేయగలిగిన యుపచారములను చేసి వాని దుఃఖములను  మాన్పించి తమ యుపచారములచే వాని ఆకలిని తీర్చినవి. బాలుడు తులసి పాదౌలో నుండుట , తులసిని జూచుట , తాకుట మున్నగు పనులను ఆతర్కితముగ చేయుటచే పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహము నాతడు పొందగలిగెను. తన జాతికి చెందని పశుపక్ష్యాదుల సానుభూతిని , యుపచారములను పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారము వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగల్గెను. అప్రయత్నముగ వాని నోటి నుండి కృష్ణ , గోవింద ,  అచ్యుత మున్నగు భగవన్నామముల ఉచ్ఛారణ శక్తి కలిగినది. అతడా మాటలనే పలుకుచు తులసి పాదులో నివసించుచు , ఆడుకొనుచు కాలమును గడుపసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన యొక బాలునకట్టి దయను పశుపక్ష్యాదుల ద్వారా చూపినది. అట్టి తులసి మన ఇండ్లలోనుండి మనచే పూజింపబడిన మనపై యెట్టి అనుగ్రహమును చూపునో విచారింపుడు. తులసి మన ఇంట నుండుట వలన మనము తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహము కలిగి మరెన్నియో ఇహపరలోక సుఖములనంద వచ్చును. పాపములను పోగొట్టుకొనవచ్చును. భగవదనుగ్రహమును మరింత పొందవచ్చును.

*🌳రాజకుమారుని పూజ - శ్రీహరి యనుగ్రహము🌳*

సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్యయేమైనదో తెలిసుకొనవలెనని సేవకులను పంపి వెదకించెను. కాని ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి యూరకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమునందువలెనే శ్రీహరినామస్మరణ చేయుచు పశుపక్ష్యాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి , తండ్రి , తాత , సోదరుడు యిట్టి బంధువుల నెరుగడు. కేవలము శ్రీహరి నామోచ్ఛారణము శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యెను. శ్రీహరి దర్శనము కలుగలేదు అని విచారము వానికి కల్గెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేరు. ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతము నాచరింపుమని వానికి చెప్పెను. రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటల ననుసరించి మాఘస్నానము పూజ మున్నగు వానిని ప్రారంభించెను.

మాఘశుక్ల చతుర్దశినాడు రాజకుమారుని పూజాంతమున శ్రీహరి వానికి దివ్యదర్శనమునిచ్చెను. శుభమును కలిగించు బాహువులలో బాలుని కౌగిలించుకొనెను. ఓ బాలకా నాభక్తుడవైన నీకు వరమునిత్తును కోరుకొమ్మని పలికెను. బాలుడును నాకు నీపాద సాన్నిధ్యమును చిరకాలమనుగ్రహింపుమని కోరెను. శ్రీహరి బాలకా ! నీవు రాజువై యీ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకుము , పుత్రపౌత్ర సమృద్ధిని , సంపదలను , భోగభాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకుపొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వసంపదలను , సర్వసమృద్దులను , సర్వసుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడువక చేయుము. ఆ తరువాత నా సన్నిధిని చేరుమని పలికెను. అచటనున్న సునందుడను వానిని పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చుమని చెప్పెను. సపరివారముగ అంతర్దానమందెను. సునందుడును రాజకుమారుని దీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించెను. పుత్రుని వానికి అప్పగించెను తన స్థానమునకు తాను పోయెను.

సులక్షణ మహారాజు ఆశ్చర్యమును , ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడని పెరిడెను. బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వానిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగెను. వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలును సమాగమనము చేసి పరలోకమునకు భర్తననుసరించి తరలిరి. సుధర్ముడు భక్తితో తండ్రికి , తల్లులకు శ్రద్ధతో శ్రార్ధకర్మల నాచరించెను. సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగ ప్రజారంజకముగ చిరకాలము రాజ్యమును పాలించెను. పుత్రులను , పౌత్రులను పెక్కు మందిని పొందెను. అతడెప్పుడును మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోను , మనుమలతోను , భార్యలతోను కలసి జీవించియున్నంతవరకు మాఘమాస వ్రతము నాచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

జహ్నుమునీ ! ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడువక ఆచరింప వలయును. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు యెట్టి భయమునుండదు. ఈ వృత్తాంతమును వినినవాడును విష్ణుభక్తుడై మాఘమాసవ్రతము నాచరించి విష్ణుప్రియుడై ఇహపరలోక సుఖములనంది శ్రీహరి సాన్నిధ్యమునందును. సందేహము లేదు అని జహ్నుమునికి గృత్నృమదమహర్షి చెప్పెను.

     🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

నేను భారతీయుడిని

 భారతీయుడా తిప్పరా మీసం..

తొడ కొట్టి చెప్పు నాది భారత్ మా ప్రధాని మోదీ అని..

ఇవాళ నీ జెండా కి ఉన్న పోగారెంతంటే

నీ జెండా చూసి AK 203 నుంచి వచ్చే బుల్లెట్స్ ఆగి పోయేటంత..

గురి పెట్టిన మిసైల్స్ కూడా ఒక్క క్షణం ఆగి అది భారతీయుని జెండా అని ఆలోచించేటంత...

ఉక్రెయిన్ లో చిక్కుకు పోయిన ప్రపంచ ప్రజలను రక్షించుకునేందుకు ఆగ్ర దేశాలు అంటూ వీర్రవీగే అమెరికా, బ్రిటన్ లు సైతం అల్లాడతుంటే. భారతీయులు మాత్రం త్రివర్ణపతాకాన్ని చేత బట్టి అవలీలగా ఉక్రెయిన్ సరిహద్దులు దాటుతున్నారంటే మోడీ లాంటి సమర్ధ నాయకుడు భారత్ కి ఉండడమే.

మన విమానాలు ఆకాశంలో ఎగురుతుంటే మేఘాలు సైడ్ ఇస్తున్నట్లు రష్యా ఫైటర్ జెట్స్ సైడ్ ఇచ్చి మరీ సెక్యూరిటీ గా తోడొచ్చి సరిహద్దులు దాటిస్తున్నాయంటే ఇంతకంటే గర్వం నికేముంది అందుకే మీసం తిప్పి తొడకొట్టి చెప్పు నేను భారతీయుడినని, మా నాయకుడు మోదీజీ అనీ.

*భారత్ మాతాకి జై* ✊

సుగుణ రూపనగుడి ::*

 🌻🌻🌻🌻🙏🙏🌺🌺🌺🌺

*తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ (సి.పి.బ్రౌన్)* గారి వర్ధంతి.సందర్బంగా .....

           *:: సుగుణ రూపనగుడి ::* 

చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ (సి.పి.బ్రౌన్) తెలుగుకే ఆయన వెలుగు. తను విదేశీయుడైనా తెలుగు తన భాష కాకపోయినా తెలుగుకు ఎనలేని సేవ చేశాడాయన. ఆయన 1798 నవంబరు 10వ తేదీన కలకత్తా లో 

జన్మించాడు. తండ్రి డేవిడ్. బ్రౌన్ ఇంగ్లాండు నుంచి వచ్చి కలకత్తా లోని ఒక బడిలో బడి పర్య వేక్షకుడిగా ఉద్యోగంలో చేరాడు. సి.పి. బ్రౌన్ తెలుగు నేర్చుకొని *తెలుగు ఆంగ్ల నిఘంటువు (* dictionary)వ్రాసాడు. ప్రమాదంలో బొటనవేలు పొతే ఎడమ చేతితో వ్రాయడం అలవాటు చేసుకొని ప్రూఫులు దిద్దుకొని 1852 లో నిఘంటువులు ప్రచురించాడు. మన తాళపత్ర గ్రంథాలు పరిశీలించి వేమన పద్యాలు చదివి మురిసి పోయే వాడట. *వేమన పద్యాలను ఆంగ్లములోకి అనువదించిన* మొదటి ఆంగ్లేయుడు అతడే.     3వారాలపాటు తెలుగు ఛందస్సు నేర్చుకొని 1152 పద్యాలను పరిష్కరించి అనువదించాడు. వీటన్నిటికీ తన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ అప్పు చేసి, విరాళాలు సేకరించి అవిరామంగా తెలుగు భాషాభివృద్ధికై పాటు పడ్డాడు. ఎంతమంది తనను విమర్శించినా     "వివేకి తన మీద రాళ్ళు విసిరిన వారిని విమర్శించ కుండా ఆ రాళ్ల తోనే గూడును నిర్మించుకుంటాడు" అనే సామెతను బ్రౌన్ నిజం చేసాడు. తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కోసం 

*'The Grammar of Telugu Language'* అనే పేరుతొ ఇంగ్లీషులో తెలుగు వ్యాకరణం వ్రాశాడు. ప్రతినెలా తన ఆదాయంలో 500 రూపాయలను (ఆకాలంలో) కుంటి,గుడ్డి,అవిటి వాళ్లకు ధర్మం చేసే వాడట. తెలుగు, కన్నడ గ్రంథాలకు కేటలాగులు వ్రాసి వాటిని భారతదేశానికి పంపించాడట. ఎవరి దగ్గరైనా గ్రంథాలు వున్నాయని తెలిస్తే డబ్బులిచ్చి కొనుక్కునే వాడట. ' *విష్ణుపురాణం* '  అనే తాళపత్ర గ్రంథం  లభిస్తే 1రూపాయకి 200వందల పద్యాల చొప్పున కూలీ యిచ్చి ఆ కావ్యమంతా కాగితాల మీద వ్రాయించాడట. లేఖకులు ఏ మాత్రం తప్పులు వ్రాసినా తప్పుకు పావలా (25పైసలు) జరీమానా విధించే వాడట. బ్రౌన్ గురించి చిన్న వ్యాసం లో చెప్పడమంటే కొండను అద్దములో చూపించడమే. 

30 సంవత్సరాల పాటు తెలుగు భాషా సాహిత్యాలే ఊపిరిగా జీవించిన *సి.పి. బ్రౌన్* తెలుగు జాతికి చిరస్మరణీయుడు. తెలుగు వారందరూ ఆనయను గురించి తప్పక తెలుసు కోవాలి. తెలుగు జాతి ఆయనకు ఏంతో ఋణ పడి వుంది. 

నూరార్లు లెక్క సేయక 

పెర్లోందిన విబుధ జనుల బిలిపించుచు వే

నూర్ల అర్థ మిచ్చు వితరణి 

చార్లేసు ఫిలిప్సు బ్రౌను సాహెబు కరుణన్

ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌను కుటుంబం ఇంగ్లండు వెళ్ళిపోయింది. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో సీపీ బ్రౌన్ గ్రీక్, లాటిన్, పారశీ, సంస్కృత భాషల్లో ఆరితేరాడు, బ్రౌను అక్కడే హిందూస్థానీ భాష నేర్చుకున్నాడు. తరువాత 1817 ఆగష్టు 4 న మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాథమిక జ్ఞానాన్ని సంపాదించాడు. వేమన, సుమతి శతకాలతోపాటుగా పల్నాటి యుద్ధం లాంటి చారిత్రిక కావ్యాలను నన్నయ్య, తిక్కన, గౌరన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, రామరాజ భూషణుల కృతుల పరిష్కరణ - ప్రచురణల ముద్రింపచేసాడు.

లండన్ యూనివర్సిటీ కాలేజీకి బ్రౌన్ రూపొందించిన తెలుగు కోర్సు పాఠ్యాంశాలు *'బ్రౌన్ లేఖలు'*  నుండి

1820 ఆగస్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన, పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు. తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. భాష నేర్చుకోవడం లోని ఈ ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకై పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్ధమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం, భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునల్వేలి మొదలైనచోట్ల పనిచేసి, 1826లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు. అక్కడ ఒక బంగళా కొని, సొంత డబ్బుతో పండితులను నియమించి, అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండేవాడు.

కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచితంగా భోజనవసతి కూడా కల్పించాడు. దానధర్మాలు విరివిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేసాడు.

1834లో ఉద్యోగం నుండి తొలగించడంతో ఇంగ్లండు వెళ్ళిపోయి, తిరిగి 1837లో కంపెనీలో పర్షియను అనువాదకుడిగా ఇండియా వచ్చాడు. బ్రౌను మానవతావాది. 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. పందొమ్మిదో శతాబ్ది తొలిపాదం చివర్లో తాను తెలుగు సాహిత్యంలో కృషి మొదలుపెట్టేనాటికి నెలకొని వుండిన స్థితిగతులను గురించి బ్రౌన్ స్ఫుటమయిన మాటల్లో అభివర్ణించాడు. ‘అప్పటికి తెలుగు సాహిత్యం కొనప్రాణంతో కొట్టుకులాడుతోంది. 

1825 నాటికి ప్రమిదలో దీపం కొడిగట్టిపోతోంది. తెలుగు సాహిత్యం దాదాపు అంతరించిపోతూ ఉండడం నా కళ్లబడింది. నేను 30 ఏళ్లు కృషి చేసి, దాన్ని పునఃప్రతిష్ట చేశాన’న్నాడు బ్రౌన్. నిరలంకారంగా మాట్లాడ్డం బ్రౌన్ శైలి. ఈ మాటల్లో కూడా అందుకే అతిశయోక్తులు కనిపించవు. 1827 నాటికే, బ్రౌన్ ‘ఆంధ్ర గీర్వాణ ఛందము’ అనే పుస్తకం రాసినప్పటికీ, ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన పుస్తకం 1829 నాటి ‘వేమన శతకం’. అప్పటికి బ్రౌన్ అయిదేళ్లుగా వేమన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇందులో దాదాపు ఏడొందల పద్యాలకి ఆంగ్లానువాదాలతోపాటు విస్తృతమయిన పదకోశం కూడా సమకూర్చారు. మరో పదేళ్ల తర్వాత, 1164 పద్యాల మేరకి విస్తరింపచేసి, తిరిగి ‘వేమన శతకం’ అచ్చువేశారు.

[పదవీ విరమణ తరువాత 1854లో లండన్‌లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితుడైనాడు. బ్రౌన్ 1884 డిసెంబర్ 12 న తన స్వగృహము 22 కిల్డారే గార్డెన్స్, వెస్ట్‌బార్న్ గ్రోవ్, లండన్లో అవివాహితునిగానే మరణించాడు. ఈయనను కెన్సెల్ గ్రీన్ శ్మశానంలో సమాధి చేశారు.

తాతాచారి

బ్రౌన్ కొలువులో తొలి తెలుగు కథకుడు తాతాచారి అనే పేరుతో ప్రాచుర్యం పొందిన నేలటూరు వేంకటాచలం. తాతాచారి చెప్పిన కథలను విన్న సి. పి. బ్రౌన్ అందులోంచి 24 కథలను, దానితోపాటు శ్రీకృష్ణమాచారి చెప్పిన రెండు కథలను కలిపి 1855లో పుస్తకంగా ముద్రించారు. అదే సంవత్సరం వీటి ఆంగ్లానువాదాన్ని *'పాపులర్ తెలుగు టేల్స్* ' అనే పేరుతో ప్రచురించారు. 1916లో 'తాతాచారి కథలు ' గిడుగు వేంకట అప్పారావు సంపాదకత్వంలో ద్వితీయ ముద్రణ పొందాయి. 1951లో వావిళ్ల వారి తృతీయ ముద్రణ, 1974లో బంగోరె సంపాదకుడిగా చతుర్థ ముద్రణ పొందాయి. నెల్లూరు జిల్లా గూడూరు తాలూకా గునుపాడు గ్రామవాసి. తిరుపతి బాలబాలికలకు వీధి బడుల్లో చదువు చెబుతూ జీవితం సాగించారు. 1848లో చెన్నపట్నం వెళ్లి బ్రౌను కొలువులో ఏడేళ్లు తాను బ్రతికి వుండిన పరియంతరమున్నాడు. పల్నాటి వీర చరితం, వసు చరిత్ర మొదలైన గ్రంథా ల పరిష్కార కృషిలో ఆయనకు సాయపడ్డారు.

తాతాచార్యులు కావ్య తర్క వ్యాకరణముల యందు ప్రవీణత గలవాడు. తాతాచారి కథలు నీతి బోధకాలే కాక, ఆనాటి సామాజిక స్థితికి దర్పణంగాను ఉన్నాయి. అందులోని శైలి శుద్ధ వ్యావహారికమైనందు వల్ల పండిత శైలికి దూరంగా ఉందనే బ్రౌన్ ప్రశంసకు యోగ్యమైంది. తాతాచారి కథల్లో- గ్రామశక్తికి పొంగలి పెట్టిన కథ, దేవరమాకుల కథ, వెట్టి వాండ్ల పట్టీ కథ, వాలాజీపేట రాయాజీ మసీదు కథ, హాలింఖాన్ మోసపోయిన కథ, మనిషి సద్గతి దుర్గతి తెలిపే కథ, పొగచుట్ట కథ- లాంటివి ఉన్నాయి.[6]

ఏనుగుల వీరస్వామయ్య

సి.పి.బ్రౌన్‌కు తెలుగులో తొలి యాత్రాచరిత్రకారుడు, పండితుడు ఏనుగుల వీరాస్వామయ్యతో సాన్నిహిత్యం ఉండేది. వీరాస్వామయ్యకు, బ్రౌన్‌కు నడుమ తరచు ఉత్తరప్రత్యుత్తరాల్లో వారి అభిరుచియైన సారస్వత సంరక్షణలో జరిగిన ప్రగతి, చేసిన పనులు వంటివి పంచుకుంటూండేవారు. వీరాస్వామయ్య బ్రౌన్‌కు రాసిన లేఖలో తాను సంపాదించిన అరుదైన స్కాందం అనే గ్రంథమూ, దానికి గల తెలుగు అనువాదం గురించిన వివరాలు తెలిపి, వీటిని ప్రచురించగలరేమో పరిశీలించమన్నారు. తాను వ్రాసిన అపురూపమైన యాత్రాచరిత్ర కాశీయాత్ర చరిత్రను ప్రచురించగలరేమో పరిశీలించవలసిందిగా బ్రౌన్‌ను కోరారు

బ్రౌను స్మృతి చిహ్నంగా, *కడపలో* ఆయన నివసించిన బంగళా స్థలంలో *బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్* ఆధ్వర్యంలో ప్రభుత్వము మరియు ప్రజల నిధులు మరియు సహకారంతో బ్రౌన్ గ్రంథాలయాన్ని నిర్మించింది. వివిధ సంస్థలు, వ్యక్తులు గ్రంథాలను విరాళంగా ఇచ్చారు.2006 నవంబర్ 10 న భాషాపరిశోధనా కేంద్రంగా యోగి వేమన విశ్వవిద్యాలయంలో భాగమైంది.

నాటి పండితుడు, అద్వైతబ్రహ్మ శాస్త్రి: "సరస్వతికి ప్రస్తుతమందు తమరు ఒకరే నివాస స్థానంగా కనపడుతున్నారు. ఎక్కడ ఏ యే విద్యలు దాచబడి ఉన్నవో అవి అన్నీ తమంతట తామే తమ సన్నిధికి వస్తూ ఉన్నవి... తమరు పుచ్చుకున్న ప్రయాసల వల్ల తేలిన పరిష్కార గ్రంథములు ఆకల్పాంతమున్నూ తమయొక్క కీర్తిని విస్తరిస్తూ ఉంటవి"

ప్రముఖ పరిశోధకుడు బంగోరె (బండి గోపాల రెడ్డి) : "నిలువ నీడ లేకుండా పోయిన తెలుగు సరస్వతిని ఆహ్వానించి, తన బంగళాలో ఒక సాహిత్య పర్ణశాల ఏర్పరచి, ఆ వాగ్దేవిని నిండు ముత్తైదువ లాగా నడయాడేటట్లు చేయగలిగాడు బ్రౌన్"

బంగోరె: "ప్రపంచంలోని తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ సంస్థలు అన్నీ కలిసి తెలుగు భాషకు చేసిన సేవ, బ్రౌను ఒక్కడే చేసిన సేవలో ఓ చిన్న భాగం కూడా కాదు"

 *"సి.పి.బ్రౌను* అను నాతడు ఆంధ్రభాషామతల్లి సేవకే జన్మమెత్తినట్లు కానవచ్చుచున్నది. ఇతడు ఆంధ్ర వాజ్మయాభివ్రుద్దికి చేసినంతటి పని ఇటీవలి వారెవ్వరూ చేయలేదని చెప్పిన అతిశయోక్తి కానేరదు" - కొమర్రాజు లక్ష్మణరావు

"ఆంధ్రభాషోద్దారకులలో కలకాలము స్మరింపదగిన మహనీయుడు, మహావిద్వాంసుడు సి.పి.బ్రౌను" – వేటూరి ప్రభాకరశాస్త్రి

వేమన పద్యాలను వెలికితీసి ప్రచురించాడు. 1829లో 693 పద్యాలు, 1839లో 1164 పద్యాలు ప్రచురించాడు. 

1841లో     "నలచరిత్ర"ను ప్రచురించాడు.

"ఆంధ్రమహాభారతము", "శ్రీమద్భాగవతము" లను ప్రచురించాడు. తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కొరకు వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాసాడు. 

1840లో వ్యాకరణాన్ని ప్రచురించాడు.

లండన్‌లోని "ఇండియాహౌస్ లైబ్రరీ"లో పడి ఉన్న 2106 దక్షిణభారత భాషల గ్రంథాలను మద్రాసు తెప్పించాడు.

"హరిశ్చంద్రుని కష్టాలు" గౌరన మంత్రిచే వ్యాఖ్యానం వ్రాయించి 1842లో ప్రచురించాడు.

1844లో "వసుచరిత్ర"', 1851లో "మనుచరిత్ర" ప్రచురించాడు. జూలూరి అప్పయ్య శాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించాడు. 

1852లో "పలనాటి వీరచరిత్ర" ప్రచురించాడు.

  🔸🔸🔸🔸🍀🍀🔹🔹🔹🔹

సంకల్పించుట

 శ్లోకం:☝️

    *యదాచరిత కళ్యాణి*

*శుభంవా యదివాఽశుభం l*

    *తదేవ లభతే భద్రే*

*కర్తాకర్మజమాత్మనః ll*

భావం: మానవుడు అనుభవించేది తాను చేసిన మంచి చెడు కర్మల ఫలమే! అంటే తాను ఆచరించిన కర్మలననుసరించి ఫలితం ఉండును కనుక, సత్కర్మలు చేయ ఉద్యుక్తుడై పట్టుదలతో ఆసాంతము చేస్తే సాధ్యము కానిది ఏదియు లేదు. కానీ కేవలము సంకల్పించుట చేత మాత్రము జరుగదు కదా!

కలివర్తన

 🪔💎🕉️

*_-|¦¦|శుభోదయమ్-సుభాషితమ్|¦¦|-_*

🕉️🪔💎

యత్ర భార్యాగిరోవేదాః యత్రధర్మో ర్థసాధనమ్ 

యత్రస్వ ప్రతిభామానం, తస్మైశ్రీ కలయేనమః ॥ 

{కలివర్తన దర్పణము

కలివిడమ్బనమ్} 

ఏ కలి యుగంలో భార్యల మాటలే వేదాలో, ఏ కలి యుగంలో ధర్మం అంటే ధన సంపాదనకు వుపయోగపడుతుందో, ఏ కలి యుగంలో తన తెలివే పరమ ప్రమాణమో, అటువంటి శ్రీ కలియుగానికి ఒక్క నమస్కారం.... 🙏

-------------------------

కామమస్తు జగత్సర్వం కాలస్యాస్య వశంవదమ్

కాలకాల ప్రపన్నానాం కాలః కిం నః కరిష్యతి॥

ఈ ప్రపంచమంతా కాలానికి కట్టుబడి వుంటే వుండనీ, 

మేము కాల కాలుణ్ణి 

(కాల నాశకుడైన శివుని భక్తులం....) 

మమ్మల్ని కాలమేం జేస్తుంది..... 🙏

27, ఫిబ్రవరి 2022, ఆదివారం

రైల్వే సమాచారం

 రైల్వే సమాచారం *

 🚂🚂🚂🚂🚂🚂🚂

 =====================

 * జూలై 1 నుండి * రైల్వే యొక్క ఈ 10 నియమాలు మార్చబడ్డాయి ....

 =====================

 * 1 *) వెయిటింగ్ లిస్ట్ యొక్క ఇబ్బంది ముగుస్తుంది.  రైల్వే నడుపుతున్న సువిధ రైళ్లలో ప్రయాణీకులకు ధృవీకరించబడిన టికెట్ల సౌకర్యం ఇవ్వబడుతుంది.

 ...................................

 * 2 *) జూలై 1 నుండి తత్కాల్ టిక్కెట్ల రద్దుపై 50 శాతం మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది.

 ...................................

 * 3 *) జూలై 1 నుండి తత్కాల్ టిక్కెట్ల నిబంధనలలో మార్పు ఉంది. ఎసి కోచ్ కోసం ఉదయం 10 నుండి 11 వరకు టికెట్ బుకింగ్ చేయగా, స్లీపర్ కోచ్ ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 వరకు బుక్ చేయబడుతుంది.

 ...................................

 * 4 *) జూలై 1 నుండి రాజధాని మరియు శతాబ్ది రైళ్లలో పేపర్‌లెస్ టికెటింగ్ సౌకర్యం ప్రారంభించబడుతోంది. ఈ సౌకర్యం తరువాత, శతాబ్ది మరియు రాజధాని రైళ్లలో పేపర్ టిక్కెట్లు అందుబాటులో ఉండవు, బదులుగా టికెట్ మీ మొబైల్‌లో పంపబడుతుంది.

 ........................

 * 5 *) త్వరలో రైల్వే టికెటింగ్ సౌకర్యం వివిధ భాషలలో ప్రారంభం కానుంది.  ఇప్పటివరకు, రైల్వేలలో హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి, కానీ కొత్త వెబ్‌సైట్ తరువాత, ఇప్పుడు టికెట్లను వివిధ భాషలలో బుక్ చేసుకోవచ్చు.

 ......................

 * 6 *) రైల్వేలో టిక్కెట్ల కోసం ఎప్పుడూ పోరాటం ఉంటుంది.  ఇలాంటి పరిస్థితుల్లో జూలై 1 నుంచి శాతాబ్ది, రాజధాని రైళ్లలో బోగీల సంఖ్య పెరుగుతుంది.

 ......................

 * 7 *) ప్రత్యామ్నాయ రైలు సర్దుబాటు వ్యవస్థ, సువిధ రైలు మరియు ముఖ్యమైన రైళ్ల నకిలీ రైలు రద్దీ సమయంలో మెరుగైన రైలు సౌకర్యాన్ని అందించడానికి ప్రణాళిక చేయబడ్డాయి.

 ......................

 * 8 *) జూలై 1 నుంచి రాజధాని, శాతాబ్ది, దురోంటో, మెయిల్-ఎక్స్‌ప్రెస్ రైళ్ల మార్గాల్లో సువిధ రైళ్లను రైల్వే మంత్రిత్వ శాఖ నడుపుతుంది.

 ........................

 * 9 *) జూలై 1 నుండి రైల్వే ప్రీమియం రైళ్లను పూర్తిగా ఆపబోతోంది.

 ......................

 * 10 *) సువిధ రైళ్లలో టిక్కెట్ల వాపసుపై 50% ఛార్జీలు తిరిగి ఇవ్వబడతాయి.  ఇది కాకుండా, ఎసి -2 లో రూ .100, ఎసి -3 పై రూ .90 /, స్లీపర్‌లో ప్రయాణీకుడికి రూ .60 / - తగ్గించబడుతుంది.

 ప్రజా ప్రయోజనాల కోసం జారీ చేస్తారు

 ........................................

 * రైలులో నిర్లక్ష్యంగా నిద్రించండి *, గమ్యం స్టేషన్ వద్దకు రైల్వే మేల్కొంటుంది ....

 =====================

 మీరు 139 కు కాల్ చేసి మీ పిఎన్‌ఆర్‌లో వేకప్ కాల్-డెస్టినేషన్ అలర్ట్ సదుపాయాన్ని సక్రియం చేయాలి.

 ...................................

 గమ్యస్థాన స్టేషన్‌కు చేరుకునే ముందు రాత్రి రైలులో ప్రయాణించే ప్రయాణికుల కోసం రైల్వే వేకప్ కాల్-డెస్టినేషన్ హెచ్చరిక సౌకర్యాన్ని ప్రారంభించింది.

 .........................

 * గమ్యం హెచ్చరిక అంటే ఏమిటి *

 =====================

 > ఈ లక్షణానికి * గమ్యం హెచ్చరిక * అని పేరు పెట్టారు.

 =====================

 సౌకర్యాన్ని సక్రియం చేసినప్పుడు, గమ్యం స్టేషన్ రాకముందే మొబైల్‌లో అలారం వినిపిస్తుంది.

 ........................

 > లక్షణాన్ని సక్రియం చేయడానికి

 ...................

 * హెచ్చరిక * అని టైప్ చేసిన తరువాత

 ...................

  * పిఎన్‌ఆర్ నంబర్ * టైప్ చేయాలి

 మరియు 139 కు పంపండి.

 ...................

 > 139 * కాల్ చేయాలి *.

 కాల్ చేసిన తరువాత, భాషను ఎంచుకుని, ఆపై 7 డయల్ చేయండి.

 ...................

 * 7 డయల్ చేసిన తరువాత, పిఎన్ఆర్ నంబర్ డయల్ చేయాలి *.  ఆ తరువాత ఈ సేవ సక్రియం అవుతుంది

 ...................................

 > ఈ లక్షణానికి * వేక్-అప్ కాల్ * అని పేరు పెట్టారు.

 ......................

 అది స్వీకరించే వరకు మొబైల్ బెల్ మోగుతుంది

 ......................

 ఈ సేవను సక్రియం చేసినప్పుడు, స్టేషన్ రాకముందే మొబైల్ గంట మోగుతుంది.  మీరు ఫోన్‌ను స్వీకరించే వరకు ఈ గంట మోగుతూనే ఉంటుంది.  ఫోన్ అందిన తరువాత, స్టేషన్ రాబోతున్నట్లు ప్రయాణికుడికి సమాచారం ఇవ్వబడుతుంది.

 ........................................

 🙏🏻 * దయచేసి ఈ సందేశాన్ని అందరికీ పంపండి. *

సులక్షణ మహారాజు కథ*

 _*మాఘ పురాణం - 27 వ అధ్యాయము*_

*🚩🚩హైందవ సమాచార భక్తినిధి*

🚩🚩🚩 *మామిళ్ళపల్లి జగన్ మోహన్ శర్మ* *9182440553*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*సులక్షణ మహారాజు కథ*

☘☘☘☘☘☘☘☘☘

గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లనెను. జన్మ సంసారమను అను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాసవ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరియొక కథను వినుము. పూర్వము ద్వాపరయుగమున అంగదేశమును పాలించుచు సులక్షణ రాజు కలడు. అతడు సూర్యవంశమున జన్మించినవాడు. బలపరాక్రమములు కలవాడు ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వానికి నూరుగురు భార్యలున్నను సంతానము మాత్రము లేదు. రాజులందరును వానికి సామంతములై కప్పములు చెల్లించుచున్నను సంతానము లేదను విచారము మాత్రము రాజునకు తప్పలేదు.

నేనేమి చేసిన కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును , పెద్దలు పుత్రులు లేనివారికి దరిద్రునికి , కృతఘ్నునకు , వేదహీనుడగు విప్రునకు సద్గతి లేదనియందురు. పుత్రులు లేని నేను మహర్షుల యాశ్రమమునకు పోయి అచట పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైన ఉపాయము చెప్పగలరేమో ? ప్రయత్నించి చూచెదను అని నిశ్చయించెను. అనేకమంది మహర్షులు కల నైమిశారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిశారణ్యమునకు వెళ్లెను , అచట మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి యిట్లనిరి. రాజా ! వినుము నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు , సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రధసప్తమి నాడు కూష్మాండ దానమును చేయలేదు. అందువలన నీకీ జన్మలో సంతానము కలుగలేదు. ఇందువలననే ఇంతమంది భార్యలున్నను నీకు సంతానము కలుగలేదు అని చెప్పిరి. అప్పుడు రాజు నాకు సంతానము కలుగు ఉపాయము చెప్పుడని వారిని ప్రార్థించెను. అప్పుడా మునులు ఓక ఫలమును మంత్రించి రాజునకిచ్చిరి. దీనిని నీ భార్యలందరికిని పెట్టుము. ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చెను. రాణులు సంతోషముతో వారికెదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషముతో స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యా గృహమునుంచెను. స్నానము మున్నగునవి చేయవలెనని లోనికి వెళ్ళెను. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగలించి తానొక్కతియే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు. సేవకులను , రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదనిరి , తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. రాజు యేమియు చేయలేక ఊరకుండెను. కొన్నాళ్లకామె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య యిట్లు గర్భవతి యగుట మిగిలిన భార్యలకిష్టము లేదు. ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నములను చేసిరి. కాని దైవబలమున అవి అన్నియు వ్యర్థములయ్యెను. కాని వారు చేసిన ప్రయత్నము వలన గర్బపాతమునకిచ్చిన మందుల వలన చిన్న భార్య మతిచెడెను. ఎవరికి తెలియకుండ అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు ఆమె అలసెను ఒక పుత్రుని కని యొడలు తెలియకపడియుండెను. గుహలోనున్న పులి బాలింతను యీడ్చుకొని పోయి భక్షించెను.

అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి యెండ మున్నగువాని బాధ ఆ శిశువునకు లేకుండ చేసినది. తేనె పండ్ల గుజ్జు మున్నగువానిని బాలునకు పెట్టి ఆ పక్షులు వానిని రక్షించినవి. బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటుపడి అచటనే తిరుగుచుండెను. అచటి సరస్తీరమున అతడాడుకొనుచుండగా హంసలు నదిలో విహరించెడివి. ఒకనాడు పవిత్రదినమగుటచే సమీప గ్రామముల వారు సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి , అట్లు వచ్చినవారిలో ఇద్దరు భార్యలుండి సంతానను లేని గృహస్థు ఒకడు వారితో బాటు స్నానమునకు వచ్చెను. అచట తిరగాడుచున్న బాలుని చూచి ముచ్చటపడి ఇంటికి గొనిపోవలెను అని తలచి ఈ బాలుడెవరు యెవరి సంతానము అడవిలో యేల విడువబడెను అని యెంత ఆలోచించినను వారికి సమాధానము దొరకలేదు , వనమున , జలమున , గర్భమున నెచటనున్న వానినైనను రక్షించి పాలించు వాడు శ్రీమన్నారాయణ మూర్తియే కదా ! ఆయనయే నాకీ బాలుని యిట్లు చూపినాడని తలచెను. బాలుని ఇంటికి గొనిపోయెను. సవతులైన వాని ఇద్దరు భార్యలు ఎవరికి వారు వారే ఆ బాలుని పెంచవలెను అని పరస్పరము వివాద పడుచుండిరి ఈ విధముగా రెండు సంవత్సరములు గడచెను. ఒకనాడు ఆ గృహస్థు ఇంట లేని సమయములో పెద్ద భార్య ఆ బాలుని అడవిలో విడచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు బాలుని యెంత వెదకినను కనిపించలేదు.

అడవిలో విడువబడిన బాలుడేడ్చుచు వింటివలెనున్న తులసి పొదవద్దకు వెళ్ళెను అచటె పండుకొనెను. తులసీ స్పర్శవలన బాలునకా వనమున యెట్తి ఆపదయు రాలేదు. శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడచినది యెవరును లేని ఆ బాలుడు యేడ్చుట తప్ప మరేమి చేయగలడు. వాని దైన్యము , నిస్సహాయత ఆ అడవిలోనుండు పశుపక్ష్యాదులలోని జీవలక్షణమునకు విలువైనది. అడవిలో గల ప్రాణులు , మృగములు , పక్షులు అచటికి వచ్చినవి , బాలుని నిస్సహాయత ధైర్యము వానిలోని దివ్యలక్షణములను మేల్కొలిపి వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులును కన్నీరు కార్చినవి. ఒకరి బాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్ష్యాదులు యిట్టి సహానుభూతి నందినప్పుడు మరియొక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా ! అట్లే బాలుడును పక్షియోమృగమైనప్పుడు వాని దుఃఖము యెట్లుండునో కదా , బాలుడు పశుపక్ష్యాదులు విభిన్నజాతులవారైనను వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము ఒక చోటనుండి రేవునుండి వచ్చినదే. అదియే దివ్యత్వము , కాని విచిత్రమేమనగా బాలునికి తనజాతిదే అయిన స్త్రీ వలన ఆపదవచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య , ఆమెలోని దివ్యత్వము లోపించినది. సృష్టి విచిత్రమని యనుకొనుట తప్ప మనకే సమాధానమును తోచదు. ఇదియే భగవంతుని లీల , అట్లు వచ్చిన పక్షులు , మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు యెండ వానిపై బడకుండ రెక్కలతో నీడను కల్పించినవి , తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకము నుండి మరల్చినవి. మృగములును. తేనె , ముగ్గినపండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు పక్షులు వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు , పక్షులు వానికి తాము చేయగలిగిన యుపచారములను చేసి వాని దుఃఖములను మాన్పించి తమ యుపచారములచే వాని ఆకలిని తీర్చినవి. బాలుడు తులసి పాదౌలో నుండుట , తులసిని జూచుట , తాకుట మున్నగు పనులను ఆతర్కితముగ చేయుటచే పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహము నాతడు పొందగలిగెను. తన జాతికి చెందని పశుపక్ష్యాదుల సానుభూతిని , యుపచారములను పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారము వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగల్గెను. అప్రయత్నముగ వాని నోటి నుండి కృష్ణ , గోవింద , అచ్యుత మున్నగు భగవన్నామముల ఉచ్ఛారణ శక్తి కలిగినది. అతడా మాటలనే పలుకుచు తులసి పాదులో నివసించుచు , ఆడుకొనుచు కాలమును గడుపసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన యొక బాలునకట్టి దయను పశుపక్ష్యాదుల ద్వారా చూపినది. అట్టి తులసి మన ఇండ్లలోనుండి మనచే పూజింపబడిన మనపై యెట్టి అనుగ్రహమును చూపునో విచారింపుడు. తులసి మన ఇంట నుండుట వలన మనము తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహము కలిగి మరెన్నియో ఇహపరలోక సుఖములనంద వచ్చును. పాపములను పోగొట్టుకొనవచ్చును. భగవదనుగ్రహమును మరింత పొందవచ్చును.

*🌳రాజకుమారుని పూజ - శ్రీహరి యనుగ్రహము🌳*

సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్యయేమైనదో తెలిసుకొనవలెనని సేవకులను పంపి వెదకించెను. కాని ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి యూరకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమునందువలెనే శ్రీహరినామస్మరణ చేయుచు పశుపక్ష్యాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి , తండ్రి , తాత , సోదరుడు యిట్టి బంధువుల నెరుగడు. కేవలము శ్రీహరి నామోచ్ఛారణము శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యెను. శ్రీహరి దర్శనము కలుగలేదు అని విచారము వానికి కల్గెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేరు. ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతము నాచరింపుమని వానికి చెప్పెను. రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటల ననుసరించి మాఘస్నానము పూజ మున్నగు వానిని ప్రారంభించెను.

మాఘశుక్ల చతుర్దశినాడు రాజకుమారుని పూజాంతమున శ్రీహరి వానికి దివ్యదర్శనమునిచ్చెను. శుభమును కలిగించు బాహువులలో బాలుని కౌగిలించుకొనెను. ఓ బాలకా నాభక్తుడవైన నీకు వరమునిత్తును కోరుకొమ్మని పలికెను. బాలుడును నాకు నీపాద సాన్నిధ్యమును చిరకాలమనుగ్రహింపుమని కోరెను. శ్రీహరి బాలకా ! నీవు రాజువై యీ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకుము , పుత్రపౌత్ర సమృద్ధిని , సంపదలను , భోగభాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకుపొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వసంపదలను , సర్వసమృద్దులను , సర్వసుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడువక చేయుము. ఆ తరువాత నా సన్నిధిని చేరుమని పలికెను. అచటనున్న సునందుడను వానిని పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చుమని చెప్పెను. సపరివారముగ అంతర్దానమందెను. సునందుడును రాజకుమారుని దీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించెను. పుత్రుని వానికి అప్పగించెను తన స్థానమునకు తాను పోయెను.

సులక్షణ మహారాజు ఆశ్చర్యమును , ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడని పెరిడెను. బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వానిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగెను. వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలును సమాగమనము చేసి పరలోకమునకు భర్తననుసరించి తరలిరి. సుధర్ముడు భక్తితో తండ్రికి , తల్లులకు శ్రద్ధతో శ్రార్ధకర్మల నాచరించెను. సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగ ప్రజారంజకముగ చిరకాలము రాజ్యమును పాలించెను. పుత్రులను , పౌత్రులను పెక్కు మందిని పొందెను. అతడెప్పుడును మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోను , మనుమలతోను , భార్యలతోను కలసి జీవించియున్నంతవరకు మాఘమాస వ్రతము నాచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

జహ్నుమునీ ! ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడువక ఆచరింప వలయును. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు యెట్టి భయమునుండదు. ఈ వృత్తాంతమును వినినవాడును విష్ణుభక్తుడై మాఘమాసవ్రతము నాచరించి విష్ణుప్రియుడై ఇహపరలోక సుఖములనంది శ్రీహరి సాన్నిధ్యమునందును. సందేహము లేదు అని జహ్నుమునికి గృత్నృమదమహర్షి చెప్పెను.

*🚩🚩హైందవ సమాచార భక్తినిధి*

🚩🚩🚩 *మామిళ్ళపల్లి జగన్ మోహన్ శర్మ* *9182440553*

మీరే తానై స్వామివారు వస్తే,

 ***భక్తకవి బమ్మెర పోతన***

# ***భోజనం వడ్డించమని***

# ***అడిగాడు పోతన ***

# ***తన భార్యతో. ***

# ***ఆమె చోద్యంగా చూస్తూ ***

# ***‘అదేమిటండీ! ***

# ***ఇప్పుడే కదండీ ***

# ***భోజనం చేసి వెళ్లారు. ***

# ***మళ్లీ భోజనం అంటున్నారు? ***

# ***మళ్లీ అప్పుడే ఆకలయిందా’ ***

# ***అని నవ్వుతూ అడిగింది ***

# ***ఆ సాధ్వీమణి.***

# ***దిగ్భ్రమ చెందాడు పోతన.***

# ***ఇదేమిటి? ***

# ***ఈవిడ ఇలా చెబుతోంది***

# ***అని విస్మయంగా చూశాడు***

# ***భార్య వైపు. ***

# ***‘నేను భోంచేశానా?’ ***

# ***అని అడిగాడు. ***

# ***‘అవును. ***

# ***కూర్చుని ఒక పద్యం***

# ***కాబోలు వ్రాశారు. ***

# ***ఆపైన నేను భోజనం***

# ***చేయమంటే చేశారు. ***

# ***మీరు తిన్న తర్వాత***

# ***అలవాటు ప్రకారం, ***

# ***నేను మీరు తిన్న***

# ***విస్తరిలోనే భోం చేశాను’ అంది.***

# ***‘ఏదీ నువ్వు తిన్న విస్తరి?’***

# ***‘బైట తొట్లో వేశాను’ ***

# ***అంది ఇల్లాలు.***

# ***బయటికి వచ్చి ***

# ***కుప్పతొట్లో చూశాడు. ***

# ***అప్పుడే ఒక కుక్క ***

# ***ఆ విస్తరిని నోటిలోకి***

# ***లాక్కుని దొరకకుండా***

# ***పరుగెత్తి పోయింది.***

# ***ఇంట్లోకి వచ్చి కూర్చుని***

# ***తను వ్రాస్తున్న చోట***

# ***కూర్చుని చూశాడు. ***

# ***అక్కడ ఒక త్రాటియాకుపైన-***

# ***"అలవైకుంఠ పురంబులో***

# ***నగరిలో ***

# ***నామూల సౌధంబు దాపల ***

# ***మందార వనాంతరామృత***

# ***సరః ప్రాంతేందు ***

# ***కాంతోపలోత్పల ***

# ***పర్యంక ***

# ***రమావినోదియగు ***

# ***నాపన్న ప్రపన్నుండు ***

# ***విహ్వల నాగేంద్రము***

# ***పాహిపాహి యన***

# ***కుయ్యాలించి సంరంభియై"***

# ***మొసలితో ***

# ***యుద్ధం చేస్తూ శక్తులుడిగి ***

# ***చేష్టలు కోల్పోయిన ***

# ***నాగేంద్రము (గజశ్రేష్ఠుడు) ***

# ***ఈ జగత్తును ఎవరు***

# ***సృష్టించి పరిరక్షిస్తుంటారో ***

# ***వారు కాపాడాలి అని ***

# ***‘ఎవ్వనిచే జనించు’ ***

# ***‘జగమెవ్వని లోపల ***

# ***నుండు లీనమై’ ***

# ***అని అర్థిస్తుంది, ప్రార్థిస్తుంది, ***

# ***అపుడు***

# ***‘అల వైకుంఠ నగరంలో, ***

# ***సౌధంలో మూలన***

# ***మందార వనామృత***

# ***సౌరభంలో ***

# ***రమాదేవితో క్రీడిస్తున్న***

# ***ఆపద్బాంధవుడైన***

# ***శ్రీమహావిష్ణువుకు ***

# ***ఆ గజేంద్రం యొక్క ***

# ***మొర వినిపించి, ***

# ***వెంటనే పూనుకుని***

# ***ఉన్నపళాన ***

# ***ఆపద్రక్షకుడు***

# ***ఉపక్రమించినవాడై రక్షణకు!... ***

# ***దిగ్భ్రమతో ***

# ***పోతన కళ్ల వెంట ఆనందభాష్పాలు! ఆనందాతిరేకం! ***

# ***అంతలోనే దుఃఖాతిరేకం!***

# ***పరుగు పరుగున వచ్చి***

# ***దిగ్భ్రమతో నిశ్చేష్టుడయిన***

# ***భర్త పోతనను చూసి***

# ***కుదుపుతూ ***

# ***‘స్వామీ స్వామీ!’ ***

# ***అని పిలిచింది ***

# ***ఆ పతివ్రతామతల్లి.***

# ***తేరుకుని ఆమె భుజంపై***

# ***తలవాల్చి మళ్లీ ***

# ***అమిత రోదనకు గురయ్యాడు పోతన.***

# ***కాసేపు అతడిని దుఃఖింపనిచ్చి, ***

# ***ఆపైన ఓదారుస్తూ ***

# ***‘ఏం జరిగింది నాథా!***

# ***ఎందుకంతగా***

# ***దుఃఖిస్తున్నారు’ ***

# ***అని అడిగింది ఇల్లాలు.***

# ***‘శ్రీరామచంద్రుడు!***

# ***శ్రీరాముని దర్శనభాగ్యం పొందావు నువ్వు! ***

# ***అనంత భాగ్యరాలివి!***

# ***ధన్యాత్మవు. ***

# ***నాకా భాగ్యం కలుగలేదు’***

# ***అని చెపుతూ ఉన్నాడు పోతన. ***

# ***ఏడుస్తూ ఉన్నాడు. ***

# ***‘అవునా స్వామీ! ***

# ***నిజమా!***

# ***ఇంతక్రితం వచ్చి వ్రాసి,***

# ***భోజనం చేసి వెళ్లినవారు***

# ***సాక్షాత్ శ్రీమన్నారాయణుడైన***

# ***శ్రీరామచంద్రమూర్తియా?***

# ***అవును దేవీ! ***

# ***ఇది శ్రీరాములవారు ***

# ***తమ స్వహస్తాలతో వ్రాసిన పద్యం! విను’ అని ***

# ***ఆ పద్యాన్ని వెక్కిళ్ల ***

# ***మధ్యనే పాడుతూ, ***

# ***చెపుతూ, ఏడుస్తూ ***

# ***‘చూడు - ***

# ***నువ్వు భగవంతుడి దర్శనం పొందావు - ***

# ***వారు వ్రాస్తున్నది చూశావు, ***

# ***నీ స్వహస్తాలతో ***

# ***భోజనం పెట్టావు - ***

# ***వారి స్పర్శనం పొందావు! ***

# ***నాకేదీ ఆ భాగ్యం? ***

# ***ఆ స్వామి తిన్న ఎంగిలాకును ***

# ***ముట్టుకునే భాగ్యం కూడా నాకు లేకపోయింది కదా!’ ***

# ***అని మళ్లీ ఏడుస్తూ ***

# ***తీవ్ర ఆవేదనకు గురయ్యాడు***

# ***పోతనామాత్యుడు.***

# ***‘స్వామీ! ***

# ***మీరు తీవ్రమైన దుఃఖంతో***

# ***ఆవేదన చెందుతున్నారు.***

# ***శ్రీరామచంద్రమూర్తి ***

# ***మీ రూపంలో వచ్చి, ***

# ***మీరు వ్రాసినట్లుగా వ్రాసి, ***

# ***మీరు తిన్నట్లుగా తిని, ***

# ***నాకు మహద్భాగ్యమైన అవకాశం ఇచ్చారు. ***

# ***మీరే తానై స్వామివారు వస్తే, ***

# ***మళ్లా మీకు దర్శనం ఇవ్వలేదని దుఃఖిస్తారేం? ***

# ***ఇంత గొప్ప ***

# ***‘మహా భాగవత కావ్యాన్ని’ తెనిగిస్తున్న ***

# ***మీ అపూర్వమైన ***

# ***పాండిత్యం చూసి, ***

# ***ఆనందం పట్టలేక, ***

# ***మీ రచనలో ***

# ***తానూ పాలుపంచుకోవాలని నిశ్చయించుకుని, ***

# ***మీకు భ్రమ కలిగించి***

# ***బయటకు పంపి, ***

# ***తాను మీ రూపంలో వచ్చి,***

# ***‘తనను గురించి తానే’***

# ***గొప్పగా వ్రాసుకున్నాడు. ***

# ***ఇంత మహాభాగ్యులు మీరు. ***

# ***మీరు తెనిగిస్తున్న***

# ***శ్రీ ‘మహాభాగవతం’ ఆచంద్రార్కం ***

# ***ప్రసిద్ధ పొందుతుంది. ***

# ***మీ రాముడు ***

# ***మీ లోపల ఆత్మారాముడై ఉన్నాడు. ***

# ***దుఃఖం మాని, ***

# ***ప్రశాంతంగా కూర్చుని ధ్యానమగ్నులుకండి! ***

# ***మీకే అర్థం అవుతుంది’ అంది.***

# ***వెంటనే***

# ***ధ్యానమగ్నులయ్యారు పోతనామాత్యులు. ***

# ***తన ధ్యాసను***

# ***భ్రూమధ్యంలో నిలిపి, ***

# ***తన ఉచ్ఛ్వాసనిశ్వాసలను***

# ***తదేకంగా గమనిస్తూ***

# ***అంతర్ముఖుడయాడు. ***

# ***తన హృదయ కుహరంలో***

# ***కొలువైవున్న***

# ***ఆత్మారాముడిని చూసి***

# ***పరమానంద భరితుడయ్యాడు***

# ***‘రామదాసు’లాగా ! - ***

# ***శ్రీరామ జయరామ జయజయరామ !!***

# ***(ఈ కధ మనందరిలో ***

# ***భక్తిని కలిగించాలని ప్రార్ధిస్తూ...)***

*"ది స్కై గెట్స్ డార్క్ స్లోలీ

 Good Morning friends 

*"ది స్కై గెట్స్ డార్క్ స్లోలీ" (The Sky gets dark slowly)-* 

ఇది జో డాక్సిన్ అనే చైనీస్ రచయిత వృద్ధాప్యం గురించి, వృద్ధుల సమస్యల గురించి చిత్రీకరించిన అద్భుతమైన నవల‌. 

*మనమంతా తెలియకుండా వృద్ధాప్యం లోకి అడుగుపెడతాం. అందులో అనివార్యమైనవి, సున్నిత మైన అంశాలెన్నో ఉంటాయి. సరిగ్గా అర్థం చేసుకోలేక మనోవ్యథకు, అపరాధ భావంతోనో, అహంభావం తోనో, మితిమీరిన ఆత్మస్థైర్యం తోనో లేక అంతుపట్టని ఆత్మ న్యూనతా భావంతోనో సతమతమయ్యే ఎందరో వయోవృద్ధుల జీవితాలలోకి తొంగిచూసి, వారి ఆత్మగత భావాలను, అనుభవాలను క్రోడీకరించి వ్రాసిన గొప్ప మనో విశ్లేషణా గ్రంథమిది.*

ఆకాశం నెమ్మదిగా చీకటవుతుంది. *60 ఏళ్ళు దాటిన వారికి కూడా జరిగేది ఇదే.* పరిచయాలు, సంబంధాలు నెమ్మదిగా తగ్గనారంభిస్తాయి.‌ యవ్వనాన్ని ఎలాగ గడిపామో, వార్ధక్యాన్ని కూడా ధైర్యంగా గడపాలి. చాలామంది వృద్ధులు తమకే అన్నీ తెలుసని, తమ జీవితానుభవం చాలా గొప్పదని అనుకుంటూ ఉంటారు. కాని ముసలితనంలో వచ్చే శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొనడంలో వారి పరిజ్ఞానం చిన్న పిల్లలతో సమానం. వచ్చే సమస్యలకు తగిన సన్నద్ధత విషయంలోను, వాటిని పరిష్కరించడం లోను వారు విఫలమవుతూ ఉంటారు. దానివల్ల వారు తీవ్రమైన వత్తిడికి గురై అనారోగ్యం పాలవుతారు. ఇటువంటి పరిస్థితి నుండి తప్పించుకోవాలంటే, వారు విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని, కొన్ని సూత్రాలను పాటించాలి. 

*మీకు బాగా పరిచయస్తులైన వారు ఒక్కొక్కరుగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవచ్చు. అది మీకు ఎంతో బాధను కలిగించవచ్చు. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఇలా ఎవరైనా కావచ్చు. వారు లేని లోటు మీకు భరించలేనిదిగా అనిపించవచ్చు. ఇంతకంటె బాధాకరమైన విషయమేమిటంటే మీ జీవిత భాగస్వామి మీకు దూరం కావచ్చు. అయినా మీరు దుఃఖంతో క్రుంగి పోకూడదు. అధైర్యంతో కృశించి పోకూడదు. *ఒక్కరూ ధైర్యంగా బ్రతకడానికి సన్నద్ధం కావాలి. ఒంటరిగా బ్రతకడానికి అలవాటు పడాలి. దిగులుతో కూడిన మీ ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోవాలి. ఆ ఏకాంతం మీకు ఆత్మావలోకనానికి సహాయపడాలి.*

*మీరు ఇంతకుముందు ఎంత గొప్ప ఉద్యోగం చేసి ఉన్నా, ఎన్ని పదవులు అలంకరించినా మీ వయస్సు పెరుగుతున్న కొద్దీ మిమ్మల్ని సమాజం పట్టించుకోదు.* పెరుగుతున్న మీ వయసు మీకు ముసలివాడు అనే ముద్ర వేస్తుంది. క్రమంగా మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని పట్టించుకోవడం మానేస్తారు. దానికి మీరు బాధపడకూడదు. అది సహజం. మీరు ఒక ప్రక్కగా నిలబడి మీకంటె చిన్నవారు చేసే హడావుడిని, సంతోషాలను, సంబరాలను మౌనంగా వీక్షించాల్సి ఉంటుంది. అలా మౌనంగా ఉన్నపుడే మీకు లభించవలసిన గౌరవం మీకు లభిస్తుంది. కాబట్టి ఆత్మ న్యూనతా భావంతో అందరి దగ్గర మీ బాధను వ్యక్తం చేయకండి.

వయస్సు పెరుగుతున్న కొద్దీ మీకు అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అధైర్య పడకండి. ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి. ముందు ముందు ఇంకా గడ్డు కాలం రావచ్చు. బాత్రూమ్ వంటి చోట కాలు జారి పడి, ఎముకలు విరగవచ్చు. ఆశావహ దృక్పథం తో ముందుకు సాగండి. సరైన పోషకాహారం తీసుకుంటూ, తగినంత శారీరక వ్యాయామం చేస్తూ రోజులు గడపండి. 

పూర్తిగా మంచానికి పరిమితమయ్యే పరిస్థితి రావచ్చు. అందుకు సిద్ధంగా ఉండండి. అది మీ బాల్యం తిరిగి వచ్చినట్లు భావించండి. బాల్యంలో మీ తల్లి మంచంపై ఉంచి పెంచింది. మిమ్ములను సాకింది. ముదిమి వయసులో మీరు మంచాన పడితే మిమ్ములను మీ పిల్లలు చూడవచ్చు. చూడక పోవచ్చు. ఏ ఆయాలకో, నర్సులకో అప్పజెప్పవచ్చు. వారు అయిష్టంగానే మీకు సేవ చేస్తారు. కాని మీరు వారిపై చిరాకు పడకండి. మీ పిల్లలు మీకు సేవ చేయలేదని నిందించకండి. మీ వద్దకు వచ్చిన వారిని నవ్వుతూ పలకరించండి. వారు మళ్ళీ మళ్ళీ మీ వద్దకు వచ్చేలాగ చేసుకోండి. మీకు సాయం చేస్తూ, మీ అవసరాలు తీరుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలపండి.

మీ సంపాదన పట్ల, మీరు దాచుకున్న సొమ్ము పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. కష్టపడి మీరు కూడబెట్టుకున్న ధనాన్ని ఎగరేసుకు పోవడానికి ఎందరో మోసగాళ్ళు, నయ వంచకులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీ ధనాన్ని మీకు ఇష్టమైన విధంగా ధర్మ కార్యాలకు గాని, దైవ కార్యాలకు గాని వినియోగించండి. మిమ్మల్ని నమ్ముకుని సేవ చేసే పనివారికి, మీ సమీప బంధువులకు మీ ధనాన్ని ఖర్చు చేయండి. అర్హులైన వారికి దానం చేయండి. కాని మీ అవసరాలకు, మీ ఆరోగ్యం కొరకు తగినంత ధనాన్ని ఎప్పుడూ ఉంచుకోండి. *మీ స్నేహితులతో ఆనందంగా గడపండి. ధనం పంచుకుంటే తరుగుతుంది, కాని ఆనందం పంచుకుంటే పెరుగుతుంది*.

*ప్రతి ఒక్కరి జీవితం లోను వృద్ధాప్యం అనే చీకటి తెరలు ప్రవేశించి, రాబోయే కటిక చీకటికి మనల్ని సన్నద్ధం చేస్తాయి. ఇది అనివార్యం. కనుక ప్రశాంత చిత్తంతో వృద్ధాప్యాన్ని స్వీకరించండి.* ఒక సింహం లాగ మీ జీవితాన్ని సింహావలోకనం చేసుకోండి. ఒక గరుడ పక్షి లాగ మీ జీవితాన్ని విహంగ వీక్షణం చేయండి. ఒక సనాతన సంప్రదాయ అనుయాయిగా మీ గురించి మీరు ఆత్మావలోకనం చేసుకోండి. మీ నేటి పరిస్థితికి ఎవర్నీ నిందించకండి. ఇప్పటికైనా మీ వల్ల జరగాల్సిన పనులు ఉండి ఉంటే వాటిని పూర్తిచేయండి. ఎదుటివారిని చులకనగా చూడకండి. తక్కువ చేసి మాట్లాడకండి. ఇప్పటినుంచీ మీరు మీ అనుబంధాలను క్రమక్రమంగా తగ్గించుకోవాలి. ఈ లోకాన్ని వదలి వెళ్ళే సమయానికి మీరు ఏ తాపత్రయం, తపన లేకుండా ప్రశాంతంగా ఉండాలి. అందుకు ఇప్పటినుంచే మిమ్మల్ని మీరు తీర్చి దిద్దుకోవాలి. మీ ప్రయాణం అనివార్యం. ఇది లోక సహజం. ప్రకృతి సహజం. కాలమనే అనంత ప్రవాహంలో మనమంతా ఎప్పుడో ఒకప్పుడు కలసి పోవాల్సిందే. ఆ ప్రవాహానికి ఎదురీదాలని అనుకోవడం పొరపాటు. ముదిమి వయసులో ఆ ప్రవాహంతో పాటు ప్రయాణించి పరమాత్మ అనే మన గమ్యాన్ని చేరుకోవడమే మనందరి కర్తవ్యం. 😷😷

ఏకైక విమానం

 రష్యా గగనతలం మీదుగా పయనిస్తున్న ఏకైక విమానం మన భారత ఎయిర్ ఇండియా విమానం. అదీ మన భారత దేశ నాయకత్వం గొప్పతనం అంటే. 🇮🇳 

యుద్దం లో పాల్గొంటున్న తమ సైనిక విమానాలకు ఎటువంటి ప్రమాదం ఎదురవ్వకుండా తమ గగనతలం మూసివేసింది రష్యా కానీ భారత ప్రభుత్వం తమ పౌరులను భారత తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా విమానాలకు అనుమతి ఇవ్వాలని కోరితే వెంటనే రష్యా ప్రభుత్వం ప్రత్యేక భద్రతను కల్పించి మరీ భారత విమానాలను తమ గగనతలం పై పయనించేలా సహకారిస్తామని హామి ఇచ్చింది.

మోదీ జీ, యూ ఆర్ గ్రేట్. 🙏

దేశభక్తి vis-a-vis స్వేచ్ఛ,సంపద

 🌹 *దేశభక్తి vis-a-vis స్వేచ్ఛ,సంపద* 🌹

*అందమైన ఉక్రెయిన్ దేశం.* *ఎన్నో గొప్ప పేరున్న మెడికల్* *విశ్వవిద్యాలయాలు.* *ఆధునిక వసతులు.* *ప్రజలు కూడా ధనవంతులు.* *ఇంటి ముందు లక్సరీ కార్లు.* *విలాసవంతమైన జీవనం.* *మరి ఇప్పుడు ఏవీ?* *ఆ దేశం పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు* *చేసుకోలేకపోయింది.* *ఆ దేశ ప్రధాని* *సామాన్య ప్రజలను కూడా ఆయుధాలు పట్టుకొని పోరాడమంటుంది చివరికి దేశం ఇలా!* *ఉప్పు,* *పప్పు,* *పెట్రోల్, రేట్లు కాదు.* *వీటన్నింటి కంటె ముఖ్యమైనది దేశం.* *దేశం మీద భక్తి ఉండాలి.* *ధర్మం మీద భక్తి ఉండాలి.* *మరీ ముఖ్యంగా హిందువులు ఐక్యతగా ఉండాలి.* *తమ శత్రువు ఎవరొ తెలుసుకోవాలి.* *వందేమాతరం* *భారతమాతాకీ జై!అనని వారిని* *మెజారిటీ హైందవుల ధర్మాన్ని గౌరవించని వారి పట్ల చాలా అప్రమత్తత కలిగి ఉండాలి.* *ఏందుకంటే మనం శరణార్ధులుగా పారిపోవడానికి మరో దేశం లేదు కాబట్టి!*🇮🇳

*గుప్త.ఆర్.యమ్.హేచ్*🙏

సమస్యల్లో ‘కనీసం కొన్ని’ తగ్గించుకోవచ్చు

 వృద్ధాప్యంలో డబ్బు అవసరం:

నువ్వు వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనం లో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. నీ సమవయసు వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు.

నీకు అప్పటివరకూ అండగా ఉన్న నీ తల్లిదండ్రులూ, అమ్మమ్మా నాయనమ్మలూ, తాతయ్యలూ ఎప్పుడో నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నీ భాగస్వామి కూడా నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉండవచ్చు.

బయటకి రాలేని నిస్సహాయతతో నీ స్నేహితులు తమ ఇళ్ళల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు.

నీ మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు. ఈ సొసైటీ నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయివుంటుంది.

దాహంతో దూరంగా ఎక్కడో ఒక కాకి అరుస్తూ ఉంటుంది. నీ లాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు. నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది.

అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది.

పక్క మీద గంటల, రోజుల తరబడీ పడుకొని ఉండటం దినచర్య అవుతుంది. పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి సంభవిస్తుంది. ఒకటే తేడా ఏమిటంటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి తల్లి ఉంది. ఇప్పుడెవరూ లేరు. అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ. నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు.

నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో తిరిగావనీ, జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం చేశావనీ, కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావనీ నిన్ను మందలిస్తూ ఉంటారు.

ప్రొద్దున్న లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో, కీళ్ళ నొప్పులో ప్రారంభం అవుతాయి. బాత్‌రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపకశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్‌గా ‘నీకు కాన్సర్’ అని చెప్పటం మొదలైనవి అన్నీ నీ జీవితంలో భాగమైపోతాయి.

నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే, నువ్వు సంపాదించిన డబ్బు నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా, చూసీ చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క గదిలో నీ వాళ్ళు చర్చిస్తూ ఉంటారు.

మరేం చెయ్యాలి? THE SKY GETS DARK SLOWLY అనే పుస్తకంలో రచయిత “ప్రస్తుత జీవన విధానం మార్చుకుంటే. పై సమస్యల్లో ‘కనీసం కొన్ని’ తగ్గించుకోవచ్చు. ఆకాశo క్రమక్రమంగా నల్లబారుతోందనీ, ఒక్కొక్క దీపమే ఆరిపోతుందనీ గ్రహించిన వ్యక్తి మరణానికి ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే చావు పట్ల భయం ఉండదు. జీవితపు ఆఖరి స్టేజి కోసం ఆరోగ్యవంతంగా ప్రిపేర్ అవ్వాలంటే అయిదు సూత్రాలు గుర్తుంచుకోవాలి” అంటాడు.

(BOOK BEING RELEASED NEXT MONTH LAST WEEK)

పెరుగు , మజ్జిగ , వెన్న ఉపయోగాలు

 పెరుగు , మజ్జిగ , వెన్న ఉపయోగాలు - వాటిని సేవించువారు పాటించవలసిన నియమాలు .

   ఆవుపెరుగు మిక్కిలి జిడ్డుగా ఉండును. శ్లేష్మాన్ని కలుగచేయును . రక్తం చెడగొట్టును . గ్రామాల యందు పాడిపంటలు విశేషముగా ఉన్నను మనుష్యులు రోగాలబారిన పడుటకు ముఖ్యకారణం పెరుగు తీసుకొను విషయంలో నియమాలు పాటించకపోవడమే ప్రధాన కారణం. రాత్రి యందు పెరుగు ఉపయోగించుట మంచిది కాదు. 

          పెరుగు ప్రీతికరమైన పదార్థం కావడం మూలాన పిల్లలు , పెద్దలు మితిమీరి సేవించెదరు. అందువలన రక్తం చెడి రక్తపిత్త రోగం , విసర్పి కలుగును. విసర్పి అనగా శరీరం నందు రక్తం చెడి మాంసం , చర్మములతో కలిసి సర్పం పాకే విధముగా తొందరగా శరీరం అంతా గుడ్లగుడ్లగా ఉండును. ఇది తరచుగా చిన్నపిల్లలకు వచ్చును. కుష్టు , పాండురోగం , పచ్చకామెర్లు మొదలగు వ్యాధులు వచ్చును. పెరుగు వేడిచేయును . అదే దానికి కొంచం నీరు కలిపి మజ్జిగలా చేసుకుని తాగితే చలువచేయును . అందుకే వేసవికాలం నందు పెరుగు తీసుకోరాదు . శీతాకాలం , వర్షాకాలం నందు పెరుగు పగలు తీసుకోవచ్చు . 

              మూత్రం బొట్లుబొట్లుగా పడు వ్యాధి నందు , రొంప, చలిజ్వరం , నోటికి రుచి లేకపోవటం , శరీరం కృశించి ఉండు రోగములు కలిగి ఉండువారు పెరుగు వాడటం మంచిది . పెరుగు శుక్రాన్ని పెంచును.

  పెరుగు తీసుకొనువారు పాటించవలసిన నియమాలు - 

 *  పెరుగుతో కోడిమాంసాన్ని భుజించరాదు .

 *  పెరుగుతో నిమ్మపండు భుజించరాదు .

 *  పెరుగుతో అరటిపండు భుజించరాదు . 

 *  పెరుగు వేడివేడి అన్నంతో పాటు తినరాదు.

 *  పెరుగు రాత్రి పూట భుజించరాదు .శరీరంలో కఫం వృద్ధిచెందును. మరియు జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి.

    పగలు పెరుగు భుజించువారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవలెను.

 *  తేనె - పెరుగు = మంచి రుచి కలుగును.

 *  ఉసిరిక పచ్చడి - పెరుగు =  శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను పోగొట్టును . 

 *  నెయ్యి - చక్కెర - పెరుగు =   వాతాన్ని తగ్గించును , ఆహారాన్ని జీర్ణం చేయును . 

 *  చక్కెర -  పెరుగు =   దప్పిక, తాపాన్ని హరించును . 

 *  పెసరపప్పు - పెరుగు  =  రక్తంలోని వాతాన్ని హరించును . 

  మజ్జిగ ఉపయోగాలు - 

    పెరుగునకు నాలుగోవ భాగం నీరు కలిపి బాగుగా మజ్జిగ తయారుచేయవలెను. దానిలో వెన్న తీయరాదు. ఇటువంటి మజ్జిగని ఉదయం , మధ్యాహ్న భోజనంలో ఉపయోగించుచున్న ఏ వ్యాధితోను బాధపడరు.  బాగుగా చిక్కగా ఉండి వెన్నతీయని  మజ్జిగ పుష్టిని కలుగచేయును . కఫాన్ని కలిగించును. శ్రమను , దప్పికను పొగొట్టును. బాగుగా చిలికి వెన్నతీసిన మజ్జిగ తేలికగా జీర్ణం అగును.

          శరీరంలో వాతం పెరిగినపుడు మజ్జిగలో శొంటి, సైన్ధవలవణం లేదా ఉప్పు కలిపి లొపలికి తీసికొనవలెను. శరీరంలో పైత్యం పెరిగినపుడు మజ్జిగతో పంచదార కలిపి వాడవలెను. శరీరంలో కఫం ఎక్కువైనప్పుడు శొంటి, పిప్పిళ్లు , మిరియాల చూర్ణం కలిపి మజ్జిగతో కలిపి తాగవలెను . 

                మన శరీరంలో జఠరాగ్ని మందగించి ఆకలి లేనపుడు మరియు వాత వ్యాధుల్లో మజ్జిగ అమృతంగా పనిచేయును . విషం , వాంతులు , నోటి నుండి నీరు కారుట, విషమజ్వరం , పాండువు , రక్తవిరేచనాలు , మేథస్సు, మొలలు , భగన్దరం , అతిసారం , ప్లీహానికి సంబంధించిన వ్యాధులు , ఉదరరోగం , బొల్లి , కుష్టు , క్రిములను మొదలయిన వాటిని మజ్జిగ సేవించుట వలన పోగొట్టుకోవచ్చు. 

          మజ్జిగ భూమిపైన పోసిన అక్కడ ఉన్న గడ్డిపోచలు , పచ్చిక వంటివి మాడిపోయి మరలా మొలవవు. ఇదే సూత్రం మొలలు వ్యాధికి సంక్రమించును. మొలల వ్యాధిలో మొలకలు ఊడిపోవుటకు మజ్జిగ సేవనం తప్పనిసరి . మజ్జిగ తాగుట వలన వాత, శ్లేష్మములచే ధమనుల్లో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయి రక్తప్రసరణ సాఫీగా జరుగును. దీనివలన శరీరపుష్టి పెరుగును . మజ్జిగ తాగుట వలన 80 రకాల వాతరోగాలు నయం అగును.

  మజ్జిగలోని రకాలు  - 

  *  పెరుగును కవ్వముతో చిలికి అందు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ.

 *  పెరుగును చక్కగా కవ్వముతో చిలికి అందు వెన్నను సగం మాత్రమే తీసివేసిన మజ్జిగ .

 *  పెరుగును చక్కగా కవ్వముతో చిలికి వెన్నను ఎంతమాత్రం తీయకుండా ఉంచిన మజ్జిగ.

     కఫం ఎక్కువ ఉన్నప్పుడు , అగ్ని మందగించినప్పుడు మిక్కిలి బలహీనంగా ఉన్నప్పుడు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ వాడవలెను.

      పైత్యం ఎక్కువ అయ్యి , అగ్నిమాంద్యం ఉన్నప్పుడు బలం మధ్యమంగా ఉన్నప్పుడు సగం వెన్న తీసిన మజ్జిగను వాడాలి.

     వాతం ఎక్కువుగా ఉన్నప్పుడు వెన్న అసలు తీయని మజ్జిగని వాడవలెను.

  వెన్న ఉపయోగాలు - 

         ఆవు వెన్న బలం కలిగించును. జఠరాగ్ని పెంచును. వాతం మరియు పిత్తాన్ని పోగొట్టును రక్తదోషాలను, క్షయరోగం, మొలలు , దగ్గు పోగొట్టును . చిన్నపిల్లలకు అమృతం వలే పనిచేయును . బక్కచిక్కి ఉన్నచిన్నపిల్లలకు ఉదయాన్నే తేనె , ఆవు వెన్న , పంచదార కలిపి తినిపించిన బలం కలుగును. క్షయరోగులు బాగా చిక్కి శల్యం అయినపుడు ఈ ప్రయోగం చాలా బాగా పనిచేయును . 

          గేదె పెరుగు బలకరం . మిక్కిలి చమురు కలిగి ఉండును. వాతం , శ్లేష్మం కలుగచేయును . మధురంగా ఉండును. పచ్చిపాలు తీసిన వెన్న సేవించిన కండ్లకు మంచిది . ఎల్లప్పుడూ అప్పటికప్పుడు తీసిన వెన్న మంచిది . నిలువ వెన్న చాలా రోగములను తెచ్చిపెట్టును. కావున విడిచిపెట్టవలెను. 

     ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  గమనిక  -

           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 

        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు  550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 

      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass  pincode and landmark తో సహా ఇవ్వగలరు . 

             కాళహస్తి వేంకటేశ్వరరావు . 

         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                    9885030034

పుణ్యక్షేత్రములలో నదీస్నానము*

 _*మాఘమాసం*_

          🌞 _*ఆదివారం*_🌞

🌴 _*ఫిబ్రవరి 27వ తేది 2022*_🌴

  _*🌞మాఘ పురాణం🌞*_

🌴 _*26 వ అధ్యాయము*_🌴

🕉🌹🌞🌞🌞🌞🌹🕉️

*పుణ్యక్షేత్రములలో నదీస్నానము*

☘☘☘☘☘☘☘☘

ఈ విధముగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజునకు వశిష్టులవారు వివరించగా , ఆ రాజు *"మహర్షి ! మీ కృపవలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయము నాకు గలదు , అది ఏమనగా , మాఘమాసమందు యే యే తీర్థములు దర్శింపవలెనో సెలవిం"* డని వినమ్రుడై కోరగా వశిష్టులవారు మరల యిట్లనిరి. దిలీప మహారాజా ! మాఘస్నానములు చేయుట యందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థమహిమలను గురించి వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. మాఘమాసములలో నదీ స్నానము ముఖ్యమైనది. మాఘస్నానములు చేయలేక , తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకము. ఏలననగా మాఘమాసములో యే నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నదీస్నానము సర్వపాపహరమైనది. ఆవశ్యమైనది కూడా , అటులనే ప్రయాగ అతిముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములలో అతి ప్రధానమైన గంగానది సముద్రములో కలియుచోట మాఘస్నాన మాచరించిన యేడు జన్మలలోని పాపములన్నియు సహితము హరించును. మాఘమాసములో నదీస్నానముతో బాటు విష్ణు దేవాలయములు , మహేశ్వరాలయములు మొదలగు మూడువందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలము కల్గుటయేగాక మరల జన్మలనేవి కలుగదు.

ఇక త్రయంబకమను ముఖ్యమైన క్షేత్రం కలదు , ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచటనే పవిత్ర గోదావరి నది జనించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పొగొట్టుకొనుట కిచ్చటనే ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతము మీదుగా గోదావరిని ప్రవహింప జేసినాడు. కావున మాఘమాసములో గోదావరియందు స్నానము చేసిన యెడల తక్షణమే సకల పాపములూ హరించి పోవుటయే గాక , ఇహమందు , పరమందు కూడా సుఖపడుదురు , మన దేశములో యెన్నో నదులున్నవి , ప్రతి నదీతీరమున యెన్నో క్షేత్రములున్నవి , ఆ నదులలో మహానదులు , పుణ్యనదులు ముఖ్యములు అవి వందకు పైగావున్నవి. అటువంటి కొన్నిపేరు స్మరించినచో ఆ నదీ తీరాలలో నున్న క్షేత్రదేవతలను కూడ స్మరించినట్లే అగును. అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తుచేసుకొందాము. నందిని , మందాకిని, నళిని , తామ్రవర్ణి , భీమరధి , గంగా , యమున , నేత్రావతి , పంపానది , కృష్ణవేణీ , మహేద్రతనయ , గోదావరి , నర్మదా మొదలైనవి మహానదులు. భగీరధి , గంగ , నర్మద , యమున , సరస్వతి , కృష్ణవేణీ , బాహుద , భీమరధి , తుంగభద్ర , రేణుక , మలావహరి , కావేరి, క్పతమాల , తామ్రపర్ణి , విశోక , కేశికి , గండకి , విచిత్రక , వశిష్ఠప్రవర , కాశ్యపి , సరయు , సర్వపాపహరి , కుశాపతి , పల్గుని కరతోయ , పుణ్యద , ప్రణిత మొదలైనవి పుణ్యనదులు. మహానదులు చిరకాలము నుండి ప్రవహించుచున్నవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నమువలన వారి పుణ్యము కొలది ప్రవహించి వారి పుణ్యము నందించునని , మహానదులు , పుణ్యనదులు రెండు విశిష్ట లక్షణములు కలిగిన గంగ , యమున మొదలైన నదులు , మహానదులుగానూ పుణ్యనదులుగాను అయివుండవచ్చును. ఈ నదులలో చేసిన స్నానం విశేషఫలప్రదం , మనము ఆ నదులలో స్నానము చేయలేకపోయినను , పవిత్ర మాఘమాసమున ఆ పేర్లను తలుచుకొన్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను , ఆ నదీతీరములయందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లే అగును కదా. గౌతమీనదిలో మరికొన్ని ప్రసిద్దములగు ఉపనదులు కూడా కలసి తమతమ స్నేహసౌభ్రాతృత్వములను చాటుచున్నవి. అటులనే *"వరం తప"* అని ఉపనది ప్రవహించేచోట కూడా శివుడు లింగాకారముతో వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు. ఆ క్షేత్రము బ్రహ్మ హత్యా మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతి వృత్తము గలదు. సావధానుడవై ఆలకింపుము.

విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకును , ఈశ్వరునకు అయిదేసి తలలు వుండెడివి. ఈశ్వరునికి పంచరుద్రుదు , త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు ! బ్రహ్మ దేవుడు నాకును ఐదు తలలున్నవి నేనే గొప్పవాడనని శివునితో వాదించెను. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదుతలలను నరికి వేసెను. వెంటనే శివునకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొన్నది. శివుడు భయపడి , తాను నరికిన బ్రహ్మ తలను చేతపట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలోవున్న బ్రహ్మతల యెండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు సహజముగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి *"భిక్షాందేహీ"* యనగా గృహిణులు భిక్షపట్టుకొని గుమ్మము కడకురాగా శివుని జగన్మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి , కోపం కలవారై తమ భార్యలు శివుని వెంటపోవుట సహించలేక , అతనికి *"పురుషత్వము నశించునుగాక"* అని శపించిరి. ఈశ్వరుడును చేయునదిలేక క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమయి పోయినాడు , అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన ఆ లింగమమితమైన తేజస్సుతో ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి , ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరముగా నుండెను. అప్పుడు బ్రహ్మ , విష్ణువులు , శివుని  వద్దకు వచ్చి వాని నోదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకువెళ్ళి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటినుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగాకారమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు.

      🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

*కలింగ కిరాతుడు - మిత్రుల కథ*

 _*మాఘమాసం*_

        🍁 _*శనివారం*_🍁

🌴 _*ఫిబ్రవరి  26వ తేది 2022*_🌴

    _*🍁మాఘ పురాణం🍁*_

 🌴 _*25 వ అధ్యాయము🌴*_

🕉🌹🌴🍁🍁🌴🌹🕉️

*కలింగ కిరాతుడు - మిత్రుల కథ*

☘☘☘☘☘☘☘☘

గృత్నృమదమహర్షి జహ్నుమునితో మరల నిట్లు పలికెను. ఓయీ ! మాఘమాస వ్రత మహిమ తెలుపు మరియొక కథను చెప్పెదను వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాసవ్రతము నాచరించి పాప విముక్తుడగునని యీ కథ తెలుపును వినుము. అతి ప్రాచీనమైన యీ కథ శ్రీహరి కథామహిమను తెలుపును.

పూర్వమొక కలింగ కిరాతుడు కలడు. అతడా ప్రాంతమున సంపద కలవాడు , పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో నొకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెదకుచు అడవిలో తిరుగుచుండగా నొకవిప్రుని జూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నదీ స్నానము చేయవలయునని బయలుదేరెను. మార్గ మధ్యలో ఆయాసముచే నొక మఱ్ఱిచెట్టు నీడలో విశ్రమించి మరల ప్రయాణము చేయదలచెను. కిరాతుడతని చూచి వాని వద్ద నున్న వస్త్రములు , ధనము మున్నగువానిని అపహరింప వలయునని తలచెను. తన వారితో వచ్చి యీ బ్రాహ్మణుని వద్దనున్న అన్నిటిని బలవంతముగ తీసికొనెను.

ఓయీ ! నీవు దాచిన ధనమునిమ్ము , లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును *'నేను దరిద్రుడను నా వద్ద ధనమేమియు లేదని సమాధానము నిచ్చెను. వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతుడు అచటి మార్గమున ప్రయాణించువారిని చంపి వారి నగలను , ధనమును దోచుకొనుచుండెను. అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారి గూడ దోచుకొని చంపుచుండెను. వానికి ధనమును సంపాదింప వలయునను కోరిక విపరీతముగా పెరుగుచుండెను.

ఇట్టి కిరాతునకు బంగారు నగలను చేయువాడొకడు మిత్రుడుగ నుండెను. అతడును కిరాతునివలె క్రూరుడు , వంచనాపరుడు , బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారము హరించెడివాడు. కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని స్వర్ణకార మిత్రునికిచ్చెడివాడు. అతడును నగలమ్మి అందులో కొంత ధనమును తీసుకొని మిగిలిన ధనమును కిరాతునకిచ్చెడివాడు. వీరికి మరియొక శూద్రుడు మిత్రుడుగ నుండెను. వాని తల్లియును అట్టిదే భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్చావర్తనురాలయ్యెను. ఈ విధముగ నాకుటుంబమున కుమారుడు , తల్లి ఇద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనులుగా నుండిరి. వాని తల్లి చీకటిలో కామాతురయై తన విటుడు వచ్చుచోటికి పోయెను. చీకటిగానున్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని యామె వానికై వేచియుండెను. అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కాముకురాలయిన తన కిష్టురాలయిన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలో నున్న తల్లి తాను కోరిన ఆమెయనుకొనెను , వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాననుకొన్న విటుడే అనియనుకొన్నది. ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు యెరుగక తమకు కావలసిన వారేయనుకొనిరి. ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి , సమాగమమైన తరువాత వారిద్దరును ఒకరి నొకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంత కాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలననుభవించుచుండెను. కుమారుడు మాత్రము నిర్భయముగా నుండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యెను. కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపినవాడు. సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగలలో బంగారమును దొంగలించువాడు. శూద్రుడు తల్లితో వ్యభిచరించినవాడు. ఈ ముగ్గురికిని బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు. అతడు వారితో కలసి వారితోబాటు పాపకార్యములను చేయుచుండెను , బ్రాహ్మణుడగుటచే వాడు పౌరోహిత్యమును కూడ చేయుచుండెను. వీరి కలయికతో పంచ మహాపాపములొకచోట చేరినట్లయ్యెను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు , కల్లుత్రాగువాడు , క్రూరుడు , బంగారము నపహరించినవాడు , గురుపత్నితో రమించినవాడు వీరైదుగురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను , అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణునొకనిని జూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలలను ధరించెను. లేడి చర్మము దర్భలు చేతబట్టియుండెను. గోవింద నామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయిదీనుడై యున్నవానిని చూచి నీవెవరవు ఎక్కడికి పోవుచున్నావని యడిగెను. అతడును నేను బ్రాహ్మణుడను , కిరాతుని వద్ద పని చేయువాడనని పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై యుండి కనులు తెరచి యిట్లనెను.

ఓయీ ! నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపములను చేసినవాడు , హింసాపరుడు. వానికి బంగారమును దొంగలించినవాడు మిత్రుడు. వారికొక శూద్రుడు మిత్రుడు తల్లితో రమించినవాడు. ఇట్లు పంచమహాపాపములను చేసినవారితో తిరిగి నీ బ్రహ్మతేజమ్మును కోల్పోతివి. పాపాత్ములతో మాటలాడినను , వారిని చూచినను , తాకినను , వాడును వారివలె పాపాత్ముడగును. అట్టివారితో మాటలాడక తప్పనిసరి అయినను దర్భను చేత బట్టి మాటలాడవలెను. అట్లు చేసిన పాపమంటదు. నీవట్టి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని పాపివైతివి. ఇట్టి నీతో మాటలాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు , మద్యపానము చేసినవాడు , గురుతల్పగమనము చేసినవాడు , బంగారమును దొంగలించిన వాడు , వీరితో స్నేహము చేసినవాడు వీరైదుగురు పాపులే. ఇట్టివారికెంత దూరముగ నున్న అంత మంచిది. అని వీరవ్రతుడు నిశ్శంఖులునితో పలికి మిన్నకుండెను.

నిశ్శంఖులుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞానీ ! నన్ను దయతో రక్షింపుము. నాకీ భయంకర పాపమునుండి విముక్తి యెట్లు కల్గును ? సర్వపాపహరణ క్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపుమని వీరవ్రతుని ప్రార్థించెను. వాని మాటలను విని , దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్తము నిట్లు చెప్పెదను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థ యాత్రలను పన్నెండు సంవత్సరముల పాటు చేయుము. ప్రతి ఇంటను బిచ్చమెత్తుకొని ఆ బిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతఃకాల స్నానము చేసి మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణముననే ముక్తి కల్గును. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును. కావున పన్నెండు సంవత్సరములు పూర్తిగాగాని , సంవత్సరము పాటు కాని ప్రయాగ మాఘస్నానము నాచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము ఈ ప్రకారమొక మాసము చేయుము అని అనెను. నిశ్శంఖులుడును అట్లేయని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతాదులకు ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరెను. వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికిని ఆచరింపదగినదని చెప్పెను. నిశ్శంఖులుడును వీరవ్రతునకు నమస్కరించి పన్నెండు సంవత్సరముల ప్రాయశ్చిత్తమును చేసికొన్న తరువాత నాకు ధర్మము నుపదేశింప గోరుదునని యడిగెను. ఆ ధర్మము నప్పుడు చెప్పుదును పొమ్మని పలికెను.

నిశ్శంఖులుడును కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును నిశ్శంఖులుని మాటలను విని భయమును , పశ్చాత్తాపమును పొందిరి. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలచి ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్నభోజనము , మాఘస్నానము చేసి పాపవిముక్తులైరి. నిశ్శంఖులుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీ నగరము చేరి కొంతకాలముండి తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతము నాచరించెను. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము , ప్రయాగ స్నానము. నిశ్శంఖులుడును వీరవ్రతుడు చెప్పినట్లు పన్నెండు సంవత్సరములు ప్రాయశ్చిత్తము నాచరించెను. పాపవిముక్తుడై వీరవ్రతుని వెదకుచు నైమిశారణ్యమునకు బోయి వీరవ్రతునకు నమస్కరించి యిట్లు పలికెను.

వీరవ్రతుడు తనకు నమస్కరించిన నిశ్శంఖులుని లేవనెత్తెను. ప్రేమతో కుశలము అడిగెను. రెండు గడియలు ఆలోచించి యిట్లనెను. ఓయీ నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానముచే దుష్టసాంగత్యజనిత దోషము కూడ పోయినది. నీవిప్పుడు బ్రహ్మతేజస్సుతో నున్నావు. మంత్రపూతమగు జలముతో మూడు దినములు స్నానము చేయింతును. నిరాహారముగ నీవీ మూడు దినములుండును. అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవనెను. నిశ్శంఖులునిచే మంత్రజలమున స్నానము మూడు దినములు చేయించెను. నిశ్శంఖులుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై యుండెను.

వీరవ్రతుడు నిశ్శంఖులునకు ఇట్లు ఉపదేశించెను. ఓయీ ! నిరంతరము సంతోషముగనుండుము. వేదమార్గమును అతిక్రమింపకుము. శాస్త్రముననుసరించి కార్యములనాచరించుము. వివాహము చేసుకొని గృహస్థ ధర్మము నాచరింపుము. ప్రాణహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము , సంధ్యా వందనము మున్నగు నిత్య కర్మలను మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగియుండుము. హరిని హరుని పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకుము. ఇతరుల వృద్ధిని జూచి విచారపడకుము. పరస్త్రీలను తల్లివలె చూడుము. చదివిన వేదములను మరువకుము. అతిధుల నవమానింపకుము. పితృదినమున శ్రార్థమును మానకుము. చాడీలను చెప్పకుము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండుధారణము చేయుము. రుద్రాక్షమాలను ధరించి రుద్రసూక్తముతో శివుని అర్చింపుము. తులసి మాలను ధరించి తులసీ దళములతో లక్ష్మీనారాయణులను , బిల్యదళములతో శివుని అర్చింపుము. హరిపాద తీర్థమును సేవింపుము. నివేదాన్నమును భుజింపుము , యతీస్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామక్రోదాది శత్రువులను జయింపుము , మాఘస్నానమును మానకుము , మనస్సు నదుపులో నుంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాదికము నాచరింపుము , అని వీరవ్రతుడు నిశ్శంఖలునకు ధర్మప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను.

నిశ్శంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతినంది మరల కాశీనగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘస్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖమిగ నుండెను తరువాత మరణించి ముక్తి నందెను.

      🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

తులసీ మహాత్త్యము*

 _*మాఘమాసం*_

          🌹 _*శుక్రవారం*_🌹

🌴 _*ఫిబ్రవరి 25వ తేది 2022*_🌴

    _*🌹మాఘ పురాణం🌹*_

🌴 _*24 వ అధ్యాయము*_🌴

🕉🎋🌹🎋🌹🎋🌹🕉️

*శ్రీమన్నారాయణుని అనుగ్రహము - తులసీ మహాత్త్యము*

☘☘☘☘☘☘☘☘

గృత్నృమదమహాముని జహ్ను మునితో నిట్లనెను. సత్యజిత్తు యేకాదశియందు భార్యతో బాటు ఉపవాసముండెను. కేశవుని గంధపుష్పాదులతో నర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగ జపించుచు జాగరణ చేసెను. ఏకాదశినాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను.

నీలమేఘమువలె నల్లనిచాయతో , నల్లని ముంగురులతో పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో , విచిత్రకుండలములతో చెక్కిళ్లు ప్రకాశించుతుండగా , సూర్యకాంతినిమించు కిరీటముతో , హారకేయూరాది విభూషణములతో , పచ్చని పట్టు బట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతునిపైనెక్కివచ్చెను. మునిగణములు శ్రీమన్నారాయణుని స్తుతించు భార్యతోబాటు శ్రీమన్నరాయణుని పాదములపైబడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి 'నాయనా ! కోరిన వరము నిచ్చెదను అడుగూ అనెను.

అప్పుడు సత్యజిత్తు 'స్వామి ! యింద్రాదులకు పూర్వమువలెనే సంచరించు శక్తి నిమ్ము వారిపై దయనుంచుము. తరువాత నాకును , నాభార్యకును నీ సాన్నిద్యము ననుగ్రహింపుము అని కోరెను. శ్రీహరి దయతో వాని కోరిక నంగీకరించెను ఇట్లనెను. ఓయీ ! యీ ఏకాదశితిథి సమస్త పుణ్యముల నిచ్చును. నేనీ తిథియందే నీకు ప్రసన్నుడనైతిని , కావున యీ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్య యీ పారిజాత వృక్షమును పెకిలించి యింద్రునకిండు , పవిత్రము , వనవాసి. నాకిష్టము అయిన యీ తులసిని నకిమ్ము, నీకు శుభము కలుగును, మరియొక ఆలోచన వలదు అని పలికెను. సత్యజిత్తును అట్లేయని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి యింద్రాదుల కిచ్చెను. తులసిను లక్ష్మీపతియగు శ్రీహరికిచ్చెను. శ్రీహరియనుగ్రహము వలన ఇంద్రాదులందరును శక్తిమంతులై శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలిచిరి.

శ్రీహరి యింద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను జూచి యిట్లనెను. ఈ యేకాదశితిథి నాడు నీవు భక్తితో నీ విధముగ నన్ను పూజించి నా అనుగ్రహము నుండుట వలన మిక్కిలి ఉత్తమమైనది. నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ యేకాదశీతిథి సర్వజీవుల పాపములన్నిటిని పోగొట్టి అనంత పుణ్యమునిచ్చును. మందమతులైన మానవులీవిషయమును గమనింపలేరు. పాడ్యమి నుండి పది దినములును యధా ప్రకారము భుజించి యేకాదశి నాడు ఉపవాసమును , జాగరణము చేసి నన్ను స్మరించు వారు నా సాన్నిద్యమును చేరుదురు. ఇహలోకమున సర్వసుఖములను, సర్వశుభములను పొందుదురు. నాకు సంతోషము నిచ్చిన యీ తిథి ఉత్తమ సంభావన నిచ్చి వేలకొలది అశ్వమేధములు చేసినవచ్చు పుణ్యము నిచ్చును. ధర్మవేత్తలగు మునులును యీ తిథి మిక్కిలి పుణ్యప్రదమని యందురు. పన్నెండవ రోజున దేవతలకు మరల శక్తి, పుష్టికలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియయని అందురు. అజ్ఞానముచే ఏకాదశి భుజించువారు మహాపాపముల నందుదురు. దశమినాటి రాత్రి భోజనమును మాని , ఏకాదశినాడు రెండు పూటల భోజనమును మాని , ద్వాదశి నాటి మధ్యాహ్నమున నొకమారు భుజించి నాటి రాత్రి భుజింపకయుండిన చాతుర్భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని యందురు. ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యధా శాత్స్రముగ పూజించినవాడు నాకిష్టుడు. నా లోకమును చేరును. ఇట్టి యేకాదసి ఉపవాసము చేసినవానినే గాక వాని కులము వారినందరిని రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యము నిచ్చును. నాలుగు వర్ణములవారు , సన్యాసి , వానప్రస్తుడు , స్త్రీబాలవృద్ధులు అందరును ఏకాదశినాడు భుజింపరాదు , ఏకాదశినాడు స్త్రీ సుఖము , నిద్ర , అన్నము వీనిని విడిచి నన్ను పూజించవలెను. నా పాదోదకమును సేవింపవలెను. అన్ని మాసములయందును, శుక్లకృష్ణపక్షములు రెండిటను వచ్చు యేకాదశులన్నియు నిట్లే ఉపవాసముండవలెను. చాంద్రాయణాది వ్రతముల నాచరించుట వలన వచ్చెడి పుణ్యము యేకాదశీ ఉపవాస వ్రతము వలన వచ్చును. కావున మానవులారా , మునులారా , నా భక్తులారా మెరెవ్వరును యీ యేకాదశినాడు అన్ని మాసములయందును. రెండు పక్షములయందును తినరాదు. ఇది సత్యము ఇట్లు ఉపవాసము చేసినవాడు నా లోకమును చేరి నన్ను పొందును. ఇది తధ్యము అని బిగ్గరగా పలికెను. అని గృత్నృమహాముని జహ్నుమునికి వివరించెను.

గృత్నృమహాముని జహ్నుమునితో నిట్లనెను. శ్రీమన్నారాయణుడు యేకాదశి వ్రతవిధానమును మహత్త్యమును వివరించి యింద్రాదులతో నిట్లనెను. మీరీ పారిజాత దివ్యవృక్షమును తీసికొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాతవృక్షమును తీసికొని స్వర్గమునకు పోయిరి. వారందరును వెళ్లిన తరువాత తులసి శ్రీమన్నారాయణునితో నిట్లనెను. స్వామీ ! నీ పాపపద్మముల యందాసక్తి గల నన్ను దయ చూడుము. నాకు నీవు తప్ప మరియొక్క గతిలేదు. నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకొందుము అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి భూమియందు అమృతము వలన పుట్టిన తులసి ! నీవు నాకిటురాలవు. నా వద్దకు రమ్ము నిన్ను నేను హృదయమున ధరింతును. సందేహము వలదు. నీవు పవిత్రురాలవు పవిత్రతను కలిగించుదానవు పాపనాశిని తులసి దళములతో కలిగి యున్న నిన్ను చూచినవారు గంగా స్నానము చేసిన వారువలె పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించినవారు పునర్జన్మ నుండదు. అమృతము నుండి పుట్టిన తులసి నీ దళములను మాలగా చేసి నా కంఠమున సమర్పించినవారు అంతులేనంత అనంతకాలము నా లోకమున నుండి నాలోనైక్యమగుదురు. నిన్ను తమ యిండ్లయందు గాని తోటలయందు గాని పెంచువారికి యే పాపములును అంటవు.ప్రాతఃకాలమున నిద్రలేవగనే నిన్ను చూచి నమస్కరించినవాడు ఆ దినమున సర్వ సుఖముల నందును.

*యన్మూలే సర్వతీర్థాని యన్మభ్యే సర్వదేవతాః*

*యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం ||*

అను శ్లోకమును చదివి నీకు నమస్కరింపవలెను. తులసి ! నీ దళములతో నీటిని తన శరీరముపై జల్లుకొనువాడు అపవిత్రుడైనను పవిత్రుడగును. నీ కుదురు మొదలులోనున్న మట్టిని తిలకముగ నుదుటిపై ధరించినవాడు. సర్వసుఖములను పొందును. యక్షరాక్షస పిశాచాదుల వలన వానికి యే బాధయు నుండదు. అమృత సంభవా తులసీ త్రైలోక్యపావనీ నేను నిన్ను లక్ష్మీదేవిని సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరములిచ్చెను. తులసి దళములను కాండములను శాఖలను అన్నిటిని శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శవలన తులసి మరింత కాంతిని పవిత్రతనుపొందెను. అప్పుడా తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీరూపమునంది శ్రీహరి అంశను పొందెను. మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి యెడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణతులసి యను పేరు పొందెను. ఆ వైపున ఉన్న ఇతర వృక్షములను తులసీ సాన్నిధ్యముచే పవిత్రములయ్యెను. తులసి యున్న ప్రదేశము పాపములను పోగొట్టును.

అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి 'నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపుడు ' అని పలికెను. సత్యజిత్తు కూడ శ్రీహరిని పూజించి , బ్రాహ్మణులకు భోజనమును పెట్టి తన భార్యతో కలసి భుజించెను. ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తరువాత శ్రీహరి అందరును చూచుచుండ సత్యజిత్తు దంపతులతోను తులసితోను కలసి గరుత్మంతుని పైనెక్కి తనలోకమునకు పోయెను. నాయనాజహ్నుముని ! యిది ఏకాదశీ వృత్తాంతము. ఏకాదశీ వృత్తాంతము. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలము నిచ్చునని స్పష్టమైనది కదా. అన్నియేకాదశులలోను మాఘమాసమునందలి యేకాదశి మరింత శుభప్రదము. ఆనాడు ఉపవాసముండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసినవారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుజ్యమును పొందుదురు. ఏకాదశినాడు ఉపవాసము ద్వాదశినాడు పారణ ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యధాశక్తిగ గోదానము , భూదానము , వస్త్రదానము , సువర్ణదానము , సాలగ్రామ శిలాదానము మున్నగువానిని ఉత్తముడైన బ్రాహ్మణునకు , బ్రాహ్మణులకు యీయవలెను. అట్టివారు యిహలోకమున చక్రవర్తియై తుదకు శ్రీహరి సాయుజ్యమునందును. ఇట్టి పవిత్రమైన కథను వినువాడును శ్రీహరి కరుణా కటాక్షమునంది విష్ణువును చేరుదురు. నిస్సందేహముగా చెప్పుచున్నాను అని గృత్నృమదమహర్షి జహ్నుమునికి వివరించెను.

      🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

నారదుని దౌత్యము - దేవతల దైన్యము

 _*మాఘమాసం*_

        🌹 _*గురువారం*_🌹

🌴 _*ఫిబ్రవరి 24వ తేది 2022*_🌴

     _*🌹మాఘ పురాణం*_🌹

 🌴 _*23 వ అధ్యాయము🌴*_

🕉️🌴🌹🌴🌹🌴🌹🕉️

*నారదుని దౌత్యము - దేవతల దైన్యము*

☘☘☘☘☘☘☘☘

గృత్నృమదమహర్షి జహ్నువుతో నిట్లనెను. పారిజాత పుష్పములకై వెళ్లిన యక్షుడింకను రాకపోవుటకు కారణమేమని ఇంద్రుడు విచారించెను. పారిజాత పుష్పముపై నున్న ఇష్టము అధికమగుటచే తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను గూడ తనతో తీసికొనివచ్చెను. సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు దీసికొని పోదలచిరి. ఆ మహోత్సాహములో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కిదాటిరి. ఫలితముగా దివ్యశక్తులను గోల్పోయిరి. శక్తివిహీనులైరి , ఇంద్రాదులింకను రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి పారిజాతవృక్షమును పెకలింపదలచి యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారును శక్తి హీనులై పడియుండిరి.

మరునాటి ఉదాట్యమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను జూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా ! మీరు మానవులమైన మాకంటె గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యమునేల చేసితిరి. మీరు నాకు తెలియకుండ పుష్పములను దొంగతనముగా తీసికొని పోదలచుట దోషము కాదా ? అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమునకాశపడి భూమిపై వ్రానియవమానము నందినట్లు మేమును పారిజాత పుష్పముల కాశపడి ధర్మమును తప్పి దొంగలించి ఇట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితియేమిటో యెట్టిదో చెప్పుమని యడిగిరి. సత్యజిత్తు వారికేమియు సమాధానమును చెప్పక తన ఆశ్రమమునకు పోయెను.

ఇంద్రుడు మొదలగువారు ఆహారము లేక దుఃఖపడుచు నచట పదునొకండు దినములుండిరి. వారికి ఆ కాలమున అమృతాహారము లేదు. కామధేనువు ఇచ్చు మధురక్షీరమును లేదు. కల్పవృక్షము , చింతామణి ఇచ్చునట్టి పుష్టికరములైన భక్ష్యభోజ్యములును లేవు. మిక్కిలి దీనులై యుండిరి. సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించెను. తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను. తానేమి చేయవలెనో దేవతల దుస్థితి తన వలన యేర్పడినది యెట్లు తొలగునో తెలియక దీనులైయున్న దేవతలపై జాలిపడెను. అశరణ శరణ్యుడైన శ్రీహరిని యధాపూర్వకముగ పూజించుచు తానును భార్యయు నిరాహారులై యుండిరి. ఈ విధముగా సత్యజిత్తు కూడ పదనొకండు దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక , శ్రీమన్నారాయణుని తలచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడు ఆకాశమున దిరుగుచు దేవతల దురవస్థను గమనించెను. వారికెట్టి సహాయము చేసిన వారి దురవస్థపోవునో అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి యిట్లు స్తుతించెను.

*🌳నారదకృత విష్ణుస్తుతి🌳*

*ఆర్తత్రాణపరాయణాయభవతే నారాయణాయాత్మనే*

*గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ చేశాయచ ||*

*మిత్రానేక హిమాంశుపావక మహాభాసాయ సాజ్యప్రదే*

*శ్రీమత్పంకజపత్ర మేత్ర నిలసత్ కృష్ణాయ తుభ్యం నమః ||*

*అచ్యుతాయాదిదేవాయ పురాణ పురుషాయచ*

*సర్వలోక నిధానాయ నమస్తే గరుడ ధ్వజ ||*

*నమో అనంతాయ హరయ క్షీరసాగరవాసినే*

*భోగీంద్ర తల్పశయన లక్ష్మ్యాలింగిత విగ్రహ ||*

*నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన*

*సర్వేశ సర్వగస్త్యంహి సర్వాధారస్సురేశ్వర ||*

*సర్వంత్వమేవ వృజసి నత్త్వ రూపస్త్యమవహి*

*పురుషాపి గుణాధ్యక్ష గుణాతీత స్స్నాతనః ||*

*పరబ్రహ్మసి విష్ణుస్త్యం బ్రహ్మసి భగవాన్ భవః*

*సృష్తిస్థితిలయాదీనాం కర్తాత్వం పురుషోత్తమ ||*

*త్రిగుణోసిగుణాధార స్త్రిమూర్తిస్త్యం త్రయీరమః*

*ఆ సీత్త్యన్మాయయా సర్వం జగత్ స్థావర జంగమం ||*

*త్వమేనైకార్ణవేజాతే జగత్యస్మిన్ జగత్పతే*

*జగత్ సహృత్యసకలం ప్రిత్వా భాబేహనే తు భాసకః ||*

*త్వమేవ సర్వలోకానాం మాతాత్వం నా పితా విభో*

*గురుస్త్యం సర్వభూతానాం శిక్షకస్పుదాయకః ||*

*ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావర జంగమం*

*ప్రసీదపాలయవిభో నమస్తే సురవల్లభ ||*

నారదుని స్తుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరియేమియు నెరుగనివానివలె *'నారదా ! స్వాగతము ఇప్పుడెందులకీ స్తుతి ? నీకేమి కావలయునో చెప్పుము. ఏమి చేసిన నీకు సుఖము అగునో అది యెట్టిదైనను దేవాదురులు సాధింపజాలనిదైనను నీకు సమకూర్చెదను చెప్పుమని యడిగెను. నారదుడును తలవంచి ఇంద్రాదులు చెడుపనిని చేసి ఆపదపాలైరి. భూమియందు పారిజాతమును వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాని యందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతి దినము దొంగలించు చుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో బాటు వెళ్లి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడుతవలె దేవతా గుణముతో పడియున్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు పదునొకండు దినముల నుండి నిరాహారులై దీనులై పడియున్నారు. భగవాన్ శ్రీమన్నారాయణ మూర్తీ ! నీవిప్పుడు వారిని దయయుంచి రక్షింపవలయునని నారదుడు కోరెను.

నారదుని మాటలను విని శ్రీహరి *'నారదా ! అమృతకలశము నుండి తొణికి పడిన రెండు బిందువుల అమృతమే పారిజాత వృక్షముగను , తులసిగను అయినది. అనగా ఆ రెండును అమృతము నుండి పుట్టినవి. రెండు మిక్కిలి పవిత్రములు , సత్యజిత్తనువాడు ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అదియొక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను , తులసి దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను , ఇట్టి ఉత్తమునికి దీనులకును జీవనాధారమగు పుష్పసంపదను త్రిలోకాధిపతియగు ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరకాదీనుడగు సత్యజిత్తు నన్నర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో జల్లగా భోగలాలనుడగు ఇంద్రుడు నా నిర్మాల్యమును గూడ దాటెను త్రొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపతియగు ఇంద్రుడు వారి అనుచరులు శక్తిహీనులై తోటలో పడి యున్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలిసికాని , తెలియకకాని దాటిన , తొక్కిన యెంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు నేమి చేయవలెనో తెలియక తానును భార్యతో బాటు నిరాహారుడై నన్నర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు పదనొకందు దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారిని జూచి భార్యతోబాటు నిరాహారుడై యుండెను. దేవతల పుష్తికై నన్ను ప్రతిదినము అర్చించు చూనే ఉన్నాడు. నేడు పదకొండవ దినము అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడ ఉపవాసముండి నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు జాగరణమొనర్చినచో నేను ప్రసన్నుడై అతడేది కోరినను వెంటనే ఇచ్చెదను. అతడే కాదు ఏవరైనను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికిని కోరిన దానినిచ్చెదను అని విష్ణువు సమాధానము '* నిచ్చెను. నారదుడును యేమియును మాటలాడలేక తన దారిన బోయెను అని గృత్నృమదమహాముని జహ్నువునకు చెప్పెను.

     🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

ఆశయా బధ్యతే

 🪔 *ॐ卐 _¦శుభోదయమ్-సుభాషితమ్|¦-_ ॐ卐* 💎

శ్లో𝕝𝕝 ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|

ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా𝕝𝕝 ఈ మనుష్యులు ఎల్లప్పుడూ *ఏదియో చేయవలెనను అనే ఆశతోనే జీవింతురు..... కానీ తరిగి పోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు*..... కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము....

తెలుసుకోలేరు

 శ్లోకం:☝️

*అధీత్య చతురో వేదా*

    *ధర్మశాస్త్రాణ్యనేకశః |*

*బ్రహ్మతత్త్వం న జానాతి*

    *దర్వీ పాకరసం యథా ||*

భావం: అనేక పక్వాన్నాదులలో తిరిగెడు గరిటెకు వాని రుచులు ఎట్లు తెలియవో, అట్లే నాలుగు వేదములు చదివినను సమస్త ధర్మ శాస్త్రములను పరిసీలించినను, బ్రహ్మతత్త్వమును తెలుసుకోలేరు.

ప్రశ్న పత్రం సంఖ్య: 44

 ప్రశ్న పత్రం సంఖ్య: 44

కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.

1) క్రిందిది పంచభూతాలలో లేదు

i ) నీరు 

ii ) గాలి 

iii ) పొగ 

v ) అగ్ని 

2) చందమామ రావే జాబిల్లి రావే వ్రాసింది

i ) దాశరధి రంగాచార్య

 ii ) త్యాగరాజు 

iii ) పెద్దన 

iv ) శ్రీ తాళ్ళపాక ఆన్నమాచార్య

3) భగవత్గీత వీటి సారం అంటారు 

i )పురాణాల 

 ii ) ఉపనిషతుల

 iii ) వేదాల   

iv ) సాంప్రదాయాల

4)  ఇంట గెలిచి ___ ;గెలవాలి అంటారు

i ) గచ్ఛ ii ) ఊళ్ళో

 iii ) రచ్చ  

iv ) రచ్చబండ 

5) కావ్యేషు ---------  రమ్యం

i ) బూటకం 

ii ) ప్రబంధం  

iii )నవల  

iv ) నాటకం 

6)  180 డిగ్రీలు వున్నదానికే ________ అని పేరు

i ) లంబరేఖ 

ii ) సరళరేఖ 

iii ) ముళరేఖ 

|iv ) ఈ మూడు 

7) మనదేశంలో గృహావసరాలకు సరఫరా చేసె విద్యుత్

i )110V  ఉంటుంది 

ii ) 220V  ఉంటుంది 

 iii ) 250V  ఉంటుంది 

iv ) 300V  ఉంటుంది

8) ఇది పురాణం కాదు

i ) మార్కండేయ పురాణం 

ii ) అగ్నిపురాణం

 iii ) వరుణ పురాణం 

iv ) వాయు పురాణం 

9) అన్నదమ్ముల ఆస్తి పంపకాల వివాదాలను ఈ కోర్టు పరిష్కరిస్తుంది 

i ) సివిల్ కోర్టు ,  

 ii ) క్రిమినల్ కోర్టు 

.iii ) కన్స్యూమర్ కోర్ట్ ,

iv ) ఫామిలీ కోర్టు 

10) వడ్లు ఈ రకము భూమిలో పండుతాయి

i ) మెట్ట భూమి ii ) మాగాణి భూమి iii ) బంజరు భూమి iv ) ఇసుకనేలా 

11) సహధర్మచారిణి అంటే

i ) ధర్మ,అర్ధ,కామాలనే మూడు ధర్మాలను సమంగా పంచుకునేదని 

 ii ) ధర్మ,అర్ధ,కామ మోక్షాలనే  ధర్మాలను సమంగా పంచుకునేదని

iii ) అధర్మ కార్యాలను పాలుపంచుకునేది అని 

 iv ) ఆస్తిలో వాటా కోరునది అని

 12) పాలపుంత అనునది

i ) గ్రామాలలో పాల కుండను వుంచు ఉట్టి 

 ii ) గ్రామాలలో పాల కుండను వుంచు గూడు

 iii ) నక్షత్ర మండలము

iv ) రాసి చక్రము 

13) వటపత్ర సాయి అనగా

i ) మర్రి ఆకుమీద పవళించిన వాడు 

ii ) తమలపాకు మీద పవళించిన వాడు

iii ) తామర ఆకుమీద పవళించిన వాడు

iv ) జామ ఆకుమీద పవళించిన వాడు

14) జనక మహారాజు ఒక 

i ) ఆత్మవేరు పరమాత్మ వేరని నమ్మిన వాడు 

 ii  )స్థితప్రజ్ఞుడు 

 iii ) మనుషులంతా ఒకటేనని నమ్మినవాడు 

iv ) సన్యాసం ఒకటే దేముడిని చేరు మార్గమని తెలుసుకున్నవాడు 

15) జాతక చక్రంలో _____గదులు ఉంటాయి 

i ) తొమ్మిది 

 ii )  పది 

 iii ) పన్నెండు 

 iv ) పదహారు

16) తమలపాకులు వీటికోసం వాడరు

i ) తాంబూలంలో

 ii ) పూజలలో   

 iii ) తోరణాలలో

 iv ) పేరంటంలో

17) "దేహశుద్ది" అనునది దీనికి ఉపయోగిస్తాము   

i ) ఇతరులను కొట్టటం 

 ii ) మంచినీటితో దేహాన్నిశుద్ధి చేయటం  

 iii ) పన్నీరుతో స్నానం చేయటం

 iv ) చెరువులో స్నానం చేయటం 

18) పూర్వాకాలంలో ఇలా అనేవారు  "  కాశీకి పోయినవారు _____పోయినట్లే"

i ) కాటికి 

 ii ) ఏటికి  

iii ) హిమాలయాలకు 

iv ) ద్రాక్షారామానికి 

19)" సరళీ స్వరాలు" అనునవి

i ) సరళ పాడే స్వరాలూ 

 ii ) సంగీతంకు సంబందించినది 

 iii ) సాహిత్యానికి సంబందించినది 

 iv )  సంగీతము ఇష్టమైనది మరియు స్పష్టమైనది 

20)  లాయర్లకు మరియు డాక్టర్లకు వత్యాసం 

i ) కోటురంగు ii ) బూటు రంగు iii ) చొక్కారంగు iv ) అన్నీకూడా

26, ఫిబ్రవరి 2022, శనివారం

జీవితం కోసం

 ఏమండోయ్ ! ఇవాళ ఎక్కువ బట్టలు వెయ్యకండి ! పని మనిషి రెండు రోజులు రానంది .

ఏమొచ్చింది ? అడిగాడు ప్రకాష్.

వాళ్ళ ఊరు వెడతాను, కూతురినీ మనుమలనూ చూసి వస్తాను అందండీ ! అక్కడ పండగట .

" సరేలే బట్టలు ఎక్కువ వెయ్యను " అన్నాడు ప్రకాష్

" ఏమండీ ! పాపం దానికి ఒక 500 ఇస్తానండి . వినాయక చవితికి ఇచ్చినట్టు ఉంటుంది . పిల్ల దగ్గరకి వెడుతోంది కదా ! ఏదైనా పట్టుకు వెడుతుంది . "

" నీ చేతికి ఎముక లేదు . వచ్చే దీపావళికి ఇద్డువులే ! . రేపు పిజ్జా కొనుక్కోవాలి "

" ఈ వారం పిజ్జా మానేద్దాము . పాచిపోయిన 8 ముక్కాలా బ్రెడ్ కోసం ఎందుకండీ ! దానికి ఇస్తే ఎంత సంతోషిస్తుందో... ?"

" మా పిజ్జా దానికి ఇచ్చెస్థావన్నమాట . సరే నీ ఇష్టం " మనసులో ఏడుస్తూనే ఒప్పుకున్నాడు ప్రకాష్.

నాలుగు రోజుల తరువాత పనిమనిషి వచ్చింది

" పండుగ బాగా జరిగిందా ? " అడిగాడు ప్రకాష్

సంతోషంగా చెప్పింది ఆమె

" అమ్మగారు నాకు 500 ఇచ్చారండి. రెండు రోజులు 500 ఖర్చు పెట్టి చాలా బాగా గడిపాము 150 పెట్టి మనవరాలుకి డ్రెస్ కొన్నాను .. 40 రూపాయలతో బొమ్మ కొన్ననండి . 50 రూపాయలతో స్వీట్స్ కొన్నానండి . 50 రూపాయలు గుడిలో ఇచ్చానండి . 60 రూపాయలు బస్ టిక్కెట్లు అయ్యాయండి. అల్లుడికి 50 రూపాయలు పెట్టి బెల్ట్ కొన్నానండి. 25 రూపాయలు పెట్టి అమ్మాయికి గాజులు కొన్నానండి. 75 రూపాయలు మిగిలాయండి. పిల్లకు కాపీ పుస్తకాలూ పెన్సిళ్ళూ కొనమని మా పిల్లకి ఇచ్చానండి.

ఆశ్చర్య పోయాడు ప్రకాష్. 500 రూపాయలతో ఇన్నా ?

తన 8 ముక్కల పిజ్జాను గురించి ఇలా అనుకున్నాడు

మొదటి ముక్క - 150 రూపాయల డ్రెస్

రెండో ముక్క -40 రూపాయల బొమ్మ

మూడో ముక్క - 50 రూపాయల స్వీట్స్

నాలుగో ముక్క - గుడిలో ఇచ్చిన 50 రూపాయలు

ఐదో ముక్క - బస్ టికెట్లు 60 రూపాయలు

ఆరో ముక్క - 50 రూపాయల అల్లుడి బెల్ట్

ఏడో ముక్క - 25 రూపాయలు గాజులు

ఎనిమిదో ముక్క - కాపీ పుస్తకాలూ పెన్సిళ్ళూ

ఎనిమిది ముక్కలో కళ్ళ ముందు తేలుతూ కనిపిస్తున్నాయి

ఇన్నాళ్ళూ పిజ్జా ఒక వైపే చూశాడు. పిజ్జా రెండో వైపు ఎలా ఉంటుందో పనిమనిషి ఖర్చు చూశాక తెలిసింది.

తనది ఖర్చు పెట్టడానికి జీవితం

ఆమెది జీవితం కోసం ఖర్చు పెట్టడం.

“Spending for life” or “ Life for spending.....

"విలాసం .... అవసరం .... అత్యవసరం"... తేడా తెలుసుకున్నవాళ్ళు ధన్యజీవులు....!!! pl share this msg..

సేకరణ

ఏ స్తోత్రం చదివితే

 ఏ స్తోత్రం చదివితే  ఏ ఫలితం వస్తుంది... 

ఈ మెసేజ్ save చేసి పెట్టుకోండి... ఎన్ని వేల రూపాయలు వచ్చిన ఇలాంటి సి డి గా కానీ క్యాసెట్ లుగా కానీ కొనలేరు .. ఈ వివరణ కూడా మీకు ఎక్కడా దొరకదు... మనలో చాలా మందికి ఏమి చదివితే ఏ ఫలితం వస్తుంది అవి ఎలా చదవాలి ఎక్కడ దొరుకుతాయి తదితర వివరాలు ఏమీ తెలియదు... ఇక్కడ కొన్ని స్తోత్రాలు వాటిని చదవడం వల్ల వచ్చే ఫలితాలను ఇస్తున్నాము... ప్రతి స్తోత్రం కింద ఉన్న లింకులో వాటిని ఎలా చదవాలి వీడియో guide తో వచనంతో పిడిఎఫ్  అన్ని లింకులు ఇచ్చాము...

మీ అయిన వాళ్ళకి ఈ లింక్ ని పంపించడం మరిచిపోవద్దు...

💠దక్షిణా మూర్తి స్తోత్రం - ఏ స్తోత్రం పఠించాలో తెలియనప్పుడు, విద్యా సిద్ధికి, https://tinyurl.com/69fa4f22

💠 గణనాయకాష్టకం - అన్ని విజయాలకు !!

https://bit.ly/36t2H69

💠 శివాష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !!శివ అనుగ్రహం !!

💠 ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం !!

https://bit.ly/36LY3As

💠శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది !!

💠 అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి !!

https://bit.ly/2Q8O4QD

💠 కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం !!

💠 దుర్గష్టోత్తర శతనామం - భయహరం !!

https://bit.ly/3dGR0Nc

💠 విశ్వనాథ అష్టకం - విద్య విజయం !!

https://bit.ly/3uTXnT6

💠 సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం !!

💠 హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ !!

యంత్రోధారక హనుమత్ స్తోత్రం - ఆరోగ్య సమస్యల నివారణ, పిశాచపీడ.. https://tinyurl.com/yth83p7k

💠 విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !!

💠 భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి !!

💠 శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం !!

💠 లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం !! https://bit.ly/3sVXsEw

💠 కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం !!

💠 ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !! https://bit.ly/3mD0mwg

💠 శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం !!

https://bit.ly/3hvpkgB

💠 లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి !!

💠 శ్యామాల దండకం - వాక్శుద్ధి !!

💠 త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి !!

💠 శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి !!

💠 శని స్తోత్రం - శని పీడ నివారణ !!

https://bit.ly/2QVTGgZ

💠 మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం !!

💠 అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి !!

https://bit.ly/2YvUGZW

💠 కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం !!

https://bit.ly/39SphH2

💠 కనకధార స్తోత్రం - కనకధారయే !!

https://bit.ly/2Ry0vWm

💠 శ్రీ సూక్తం - ధన లాభం !! https://bit.ly/2R4Tv3o

💠 సూర్య కవచం - సామ్రాజ్యంపు సిద్ది !!

https://bit.ly/3dLBuzU

💠 సుదర్శన మంత్రం - శత్రు నాశనం !!

💠 విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం !! Https://bit.ly/3dL4Mie

💠 రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!

💠 దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు !!

💠 భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు !! https://bit.ly/2SCaL0x

💠 వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!https://bit.ly/345D3mB

💠 దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!

Https://bit.ly/2RziDjc

💠 లాలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి !! https://tinyurl.com/bjhd6w42

💠 రుక్మిణీ కల్యాణం- పెళ్లి కావడం కష్టంగా ఉన్నవారికి.. కోరిన వారిని పెళ్లి చేసుకోవడానికి https://bit.ly/36Y4RLB

💠 మహా మృత్యుంజయ మంత్రము - అపమృత్యు దోషాలను నివారించడానికి https://bit.ly/3jlAUtS

💠 మణిద్వీప వర్ణన https://https://tinyurl.com/3yd3c7de

🙏🙏🙏