1, జూన్ 2024, శనివారం

01.06.2024. శనివారం

 01.06.2024.      శనివారం


*శ్రీ క్రోధి నామ సంవత్సరం,ఉత్తరాయణం, వసంత ఋతువు*


సుప్రభాతం.....


ఈరోజు వైశాఖ మాస బహుళ పక్ష  *నవమి* తిథి ఉ.07.24 వరకూ తదుపరి *దశమి* తిథి రా.రే.తె.05.04 వరకూ తదుపరి *ఏకాదశి* తిథి, *ఉత్తరాభాద్ర* నక్షత్రం రా.03.16 వరకూ తదుపరి *రేవతి* నక్షత్రం, *ప్రీతి* యోగం మ.03.10 వరకూ తదుపరి *ఆయుష్మాన్* యోగం, *గరజి* కరణం ఉ.07.24 వరకూ,*వణిజ* కరణం సా.06.15 వరకూ *భద్ర(విష్టి)* కరణం రా.05.04 వరకూ తదుపరి *బవ* కరణం ఉంటాయి.

*సూర్య రాశి* : వృషభం ( రోహిణి నక్షత్రం లో)

*చంద్ర రాశి* : మీనం లో

*నక్షత్ర వర్జ్యం*: మ.01.47 నుండి మ.03.17 వరకూ

*అమృత కాలం*: రా.10.46 నుండి రా.12.16 వరకూ


( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం* : ఉ.05.41

*సూర్యాస్తమయం*: సా.06.47

*చంద్రోదయం*: రాత్రి 02.06

*చంద్రాస్తమయం*: మ.01.47

*అభిజిత్ ముహూర్తం*: ప.11.48 నుండి మ.12.40 వరకూ

*దుర్ముహూర్తం*: ఉ.05.41 నుండి 07.26 వరకూ

*రాహు కాలం*: ఉ.08.58 నుండి ఉ.10.36 వరకూ

*గుళిక కాలం*: ఉ.05.41 నుండి 07.19 వరకూ

*యమగండం*: మ.01.52 నుండి మ.03.31 వరకూ.


ఈరోజు తెలుగు రాష్ట్రాలలో *హనుమజ్జయంతి* వేడుకలు జరుపుకుంటారు. చైత్ర పూర్ణిమ రోజున ప్రారంభం అయిన 41 రోజుల హనుమాన్ దీక్ష ఈరోజుతో పూర్తి అవుతుంది.


హనుమాన్ జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం, ఉత్తర భారత దేశంలో చైత్ర పౌర్ణమి తిథి రోజున, తమిళనాడులో మార్గశీర్ష అమావాస్య తిథి రోజున, కర్ణాటక లో మార్గశీర్ష శుక్ల పక్ష త్రయోదశి తిథి రోజున జరుపుకుంటారు.


హనుమాన్ స్మరణం తో....సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నెంబర్: 6281604881.

కామెంట్‌లు లేవు: