కంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయం లో వేద పాఠశాల ప్రారంభం చేసి రెండు సంవత్సరాల కాలంలో ఋగ్వేదం లో మొదట బ్యాచ్ విద్యార్థులకి ఇవాళ మూలాంతము పూర్తి చెయ్యటం జరిగినది . (మూలాంతం అంటే బయట చదువులో 10 తరగతి ).అందులో భాగంగా గడిచిన రెండు సంవత్సరాల కాలంలో లోనే విద్యార్థులు కు ఇంత చదువు ఎక్కడ అవ్వదు రాయలసీమ లోనే మొదటి చతుర్వేద పాఠశాల గా దిన దిన ప్రవృద్ధమానంగా ముందుకు సాగుతూ ఉన్నది . పూర్తి చేసిన విద్యార్థులలో ఒకరికి 13 సంవత్సరాలు కావడం కూడా విశేషం .ఇవాళ హనుమజ్జయంతి సందర్భంగా విద్యార్థులకు ఇవాళ పూర్తి చెయ్యటం నిజంగా స్వామి వారు అనుగ్రహం . ఋగ్వేదం ములాంతంలో చివరి పనస చెప్పి స్వామివారి కి సమర్పించటం జరిగినది . ఇలాగే ఎంతో మందిని వేద విద్యార్థులను తయారు చేసి వేద ధర్మాన్ని వేద సంస్కృతి నీ నిలబెడుతూ ముందుకు సాగాలని ఆ శక్తి నీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాలని కోరుతూ కంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయం అఖిల భారత బ్రహ్మణ కరివేన సత్రం కర్నూలు 🙏🙏🙏💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి