1, జూన్ 2024, శనివారం

ఎక్కడ రామ నామ స్మరణ

 *ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులారా!* 


84 లక్షల జీవరాశులలో మానవ జన్మ  ఉత్కృష్టమైనజన్మ మోక్ష

ప్రాప్తికి ఆధారభూతమైన జన్మ.

అజ్ఞానాంధకారంలోకొట్టుమిట్టాడు  మానవాళిని సన్మార్గంలో పెట్టి మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్రామాయణం. అందులో మానవునికిఏర్పడే గ్రహదోషాలను తొలగించుకోవడానికి,రామాయణంలోని అనేక సర్గలు పారాయ ణచేస్తే ఫలితాలుఉన్నాయి., అందులోని సుందరకాండ పారాయణ విశేషించి ఆంజనేయస్వామికి సంబంధించినది .             

                                          *"కలౌ కపివినాయకం"* అన్నారు పెద్దలు, చిరంజీవి అయిన హనుమంతుడు వైశాఖ మాసం లో  కృష్ణ పక్షంలోని దశమితిధి శనివారం పూర్వాభాద్రనక్షత్రం లో జన్మించినట్లు పరాశరసంహిత తెలియచేస్తోంది ,హనుమంతుడు

శివాంశ సంభూతుడు , కామరూపి ప్రప్రధమంగా శ్రీరాముని చూసి నప్ప హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో (పండితుడుగా) కనపడగా

శ్రీరామచంద్రుడు, లక్ష్మణుని తో

చతుర్వేద పండితుడు, శాస్త్ర పండితుడు,నవవ్యాకరణపండితుడు *" హనుమ"* అని పేరుతో చెప్పగానే హనుమంతుడు,నా ఆరాధ్యదైవం ఇన్నాళ్ళకు దర్శనం ఇచ్చాడని, పరమానందంతో పరవశించాడు. తనహృదయంలో

శ్రీరామచంద్రుని నిలుపుకొని రామనామ స్మరణచేస్తూ రామభక్తులను కాపాడుతూ మానవాళికి రామభక్తి గొప్పత నాన్ని తెలుపుతూ మానవులకు *"శ్రీరామరక్ష సర్వజగద్రక్ష"* అని

బోధించాడు , సంహిత గ్రంధాల లో హనుమంతుడు లంకలో ప్రవేశించునపుడు బ్రహ్మ హనుమంతుని 32 నామాలతో స్తోత్రంచేశారని ఆ32 నామాల వరుసని సుందరహనుత్ నామా

వళిగా ప్రసిద్ధి గాంచినవి, ఈనామావళి స్మరిస్తే విశూచీ లాంటి సర్వ వ్యాధులు నశిస్తా యని బ్రహ్మ వరం ఇచ్చినాడని తెలుపుచున్నది , అందుకే తులసీ దాసు  *" నాశైరోగ హరై సబ్ పీర జపతు నిరంతర హనుమత వీర"* అన్నారు హనుమాన్ చాలీసాలో. హనుమంతుని ,జపం పూజాది కాల వల్ల గ్రహదోషాలు నశిస్తాయని మంత్ర శాస్త్రవచనం, ముఖ్యంగా ఏలినాటిశని, ,అష్టమ శని, అర్థాష్టమశని, దోష నివారణకు హనుమంతుడిని శనివారంనాడు

నువ్వులనూనెలో గంగసిందూరం కలిపి హనుమంతుని విగ్రహానికి రాసిన శనిదోషాలు పోతాయని

ఋషివాక్యం., మనం నిద్రించే ముందు *"రామ స్కంధం"* చదివి

పడుకుంటే దుస్వప్నాలు రావు. హనుమంతుని ద్వాదశనామావళి *"హనుమాన్ అజనాసూనో వాయుపుత్రో మహాబలః"* అన్న

నామావళిని స్మరిస్తే ప్రయాణాలు క్షేమంగా జరుగుతాయని ప్రతీతి. ఎక్కడ రామ నామ స్మరణ జరుగునో అక్కడ హనుమంతుడు రక్షకుడుగా ఉంటాడని ప్రతీతి . అందుకే ఆధ్యాత్మిక భక్తులారా *ఈరోజు అనగా ఈ శనివారం హనుమజ్జయంతి* విశేషమైన రోజు ఆ హనుమంతుని పూజించి నామస్మరణచేసి ,రాబోయే రోజుల్లో,   ఆయురారోగ్యాలను, ధైర్యాన్ని  సుఖం సంతోషాలను ప్రసాదించమని వేడుకుందాము.

*శ్రీరామ జయరామ జయజయరామ*

కామెంట్‌లు లేవు: