1, జూన్ 2024, శనివారం

వేదజ్ఞానము

 🕉️🙏 "వేదజ్ఞానము ఎందుకు పొందాలి? మన ప్రయత్నం దేనికి" మనం ఏ కొద్దిపాటి సమయం కూడా ఊరికే ఉండలేను, మనసుతో వాక్కుతో  కర్మలు చేస్తూ ఉంటాం (మనసా వాచా కర్మణా) మన ఆలోచన మాట కర్మ మంచిదై ఉండాలి, అంటే కర్మానుసారమే బుద్ధి అంటారు, మంచి కర్మ చేస్తే మంచి బుద్ధి పడుతుంది,అని అర్థం మనకు మంచి చెడుల వివేకం లేనిదే మంచి ఎలా ఆచరించ గలుగుతాము, మనకు మంచి బుద్ధి ఎలా పుడుతుంది, ఆ బుద్ధి శుద్ధిగా వుండాలి,బుద్ధి జ్ఞానముతో శుద్ధి అవుతుంది,మంచి కర్మకైన బుద్ధిశుద్ధికైన సత్యజ్ఞానమే కావాలి ప్రధానo ,మనం సంధ్యవందనం లో. గాయత్రి మంత్రం యందు బుద్దులను ప్రేరేపించూ మని ఈశ్వరుని పదే పదే ప్రార్థిస్తున్నాను, ఎందు కంటే బుద్ధి (ప్రజ్ఞా)ప్రజ్ఞాపరాధం జ్ఞానం జ్ఞాపకము నిగ్రహం ఇందులో ఏది లేక పోయిన మన వ్యవహారం సరిగా  వుండదు అందుకే ప్రేరణ  కలిగించమని కోరు చన్నాము,ప్రేరణ అంటే మేల్కొలుపు మని ప్రార్థిస్తున్నాను,మన సంస్కారాల మూలంగానే మనస్సు నిర్మాణంఅవుతుంది.ఎవరిస్వభావము వారిది సంస్కారాలు ఎలా.వుంటే అలా నడుస్తాం,సంస్కారాల స్వభావం పిక్స్ గా వుంటుంది, *మన సంస్కారాల ను మార్చే శక్తి కేవలం జ్ఞానంకే కలదు అందుకే *జ్ఞానంపొందుతూ ధ్యానం చేస్తూ ధారణ కలిగి వుండాలి,* వేద జ్ఞానం మానవమాత్రులు పొంద వలసి ఉన్నది,నిజమైన ఆనందం నశించని ఆనందము పొందాలి, ఈ ప్రపాంచిక సుఖం తాత్కాలికము నిజమైన సుఖం కోసం ప్రయత్న చేయాలి 🕉️🙏

కామెంట్‌లు లేవు: