25, డిసెంబర్ 2025, గురువారం

నిత్యపద్య నైవేద్యం

  *నిత్యపద్య నైవేద్యం-2069 వ రోజు*

*మంచిమాటకు మంచి పద్యం-338. సేకరణ, పద్యరచన, సహజకవి, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు* , తెనాలి, 9347537635, *గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ,తెనాలి*


*మంచి మాట:*

    శీలం ఎక్కడ ఉంటే సత్యము, ధర్మము, ధైర్యము, న్యాయము, లక్ష్మీ.. అక్కడ ఉంటాయి.

    

 *తేటగీతి* 

శీలమెక్కడ యుండునో శ్రేష్టముగను 

సత్య ధర్మధైర్యములు, సహజమునగు 

న్యాయము మరియు శ్రీలక్ష్మి యచటె నుండు 

ఆర్య వాక్కులుగ దలంచి యాలకించు.

కామెంట్‌లు లేవు: