25, డిసెంబర్ 2025, గురువారం

తరలశరీర సుందర

  హరిః ఓం నమః.

ఓం నమః శివాయ.


చ ll తరలశరీర సుందర! విదారితమన్మథగర్వ! దేవదే

       వర! గిరిజాస్మితాబ్జ ముఖభాస్కర భూతపతీ! మహేశ! శ్రీ

         హరివరమిత్ర శంకర మహాలయకార ! పరాత్పరా హరా! 

          శరణు సురాపగాధర! శశాంకకళాధర! కావుమీశ్వరా! ll


క ll హాలాహలముప్పొంగగ

      కీలము లాభీలమగుచు గీడ్పడజేయన్

       హేలాగతి విషమున్ ద్రావిన

        శూలీ! మహదేవ! సాంబ! స్తుతులన్ గొనుమా ll


        హర నమః పార్వతీపతయే శివ శివ శంభో కృపాకరా, హరా!


 ----- పరమహంస -----

కామెంట్‌లు లేవు: