పెండ్లికల
గోదాదేవి
ప్రాణసమానభంగి కనుపాప నజస్రము గాచు రెప్పగన్
పాణితలమ్ము నందునుచి ప్రాక్కృతపుణ్య మటంచు నెంచి "శ్రీ
వాణియె వార్ధిపుత్రియొ భవానియొ బిడ్డగ వచ్చెనో! బహిః
ప్రాణవిధమ్ముగా సుత నుపాయన మట్లుగ శౌరి యిచ్చెనో! 81
ఇవ్విధమున దర్కించుచు
మవ్వపు వన్నెల నడరగ మక్కువతోడన్
క్రొవ్విరి చే బట్టినటుల
అవ్వసుధామరుడెలమిని యంజలి నిలిపెన్. 82
వలవలయేడ్చు నంత తరువాటి తదీయకరమ్ము సోకగన్
కిలకిల నవ్వె నా శిశువు కేరుచు పాణిపదమ్ము లూపుచున్
మిలమిల లాడ నొప్పె మిరమిట్టులు గొల్పు విలోచనమ్ములున్
కలకల లాడె మోము, పసికందుకు నాతని గాంచినంతటన్. 83
తలిరుల జొంపమట్లు వెలిదమ్ముల పత్రము వోలె తూలసం
తులితమృదుత్వమై తనరి తోరపు మైజిగి నొప్పి దీప్తిలన్
నలుగునొ యంచు సంశయమునన్ నెఱిపేరిమి నెత్తబోయి భీ
తిలె పెరియాళువారు, లది దివ్యతనుత్వమహత్వమో!కదా! 89
కంజర్ల రామాచార్య
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి