24, జనవరి 2026, శనివారం

దానం అదొక యోగం.

 దానం అదొక యోగం.... ఎంత సిరులు ఉన్న, ఆస్తులు ఉన్న, మేడలు ఉన్న, భూములు ఉన్న, దాన గుణము లేకపోతే మానవ జన్మ సున్నా. 

అందుకనే పెద్దలు అంటారు 

వంద మందిలో ఒక శూరుడు జన్మిస్తాడు....

వెయ్యి మందిలో ఒక పండితుడు జన్మిస్తాడు....

లక్ష మందిలో ఒక వక్త జన్మిస్తాడు...

కానీ కోటి మందిలో ఒక దానవుడు జన్మిస్తాడు....

💐 దానం చేయాలన్న మొదట దాన గుణం కలిగి ఉండాలి... ఆ తర్వాత దానిపై శ్రద్ధ ఉండాలి, ఆపై తాను చేసే దానం పై యోగ్యత కలిగి... జ్ఞానం కలిగి ఉండాలి.

🙏 భర్తృహరి అంటాడు 

దానము వల్ల చేతులు ప్రకాశిస్తాయని....

🌷 మనుషులకే కాదు ప్రకృతిలో వృక్ష ,పశుపక్షాదుల ,జీవజాలానికి సేవ చేయడం కూడా దానమేఅని కూడా అంటారు 

దానం లోని రకాలు 

ధర్మం, అర్థం, భయం, కామం, కారుణ్యం. 

🌹అసూయ లేకుండా ఇచ్చేదానం..... ధర్మదానం

🌹 యాచకులు ప్రశంసిస్తే.... అర్థదానం

🌹 దానం చేయకపోతే ఏం చేస్తారో అనే భయంతో ఇచ్చేదానం... భయ దానం 

🌹 ఇష్టమైన వ్యక్తికి ఇస్తే... దానిని కామదానం 

🌹 పేదవాడికి జాలితో ఇచ్చేది... కారుణ్య దానం 

నీ శక్తి కొద్ది తోటి వారికి ఎంతోకొంత ఇవ్వటంలో ఎంతో ఆనందం ఉంటుంది...

👏 నీతి..... చాలామంది అనుకుంటారు తీసుకోవడంలో ఆనందం ఉంటుందని.... అది సరైనది కాదు ఇవ్వటంలోని ఆనందము , పరమానందము ఉంటుంది. 

దానం చేసే వాడి చెయ్యి ఎప్పుడూ పై చేయి గానే ఉంటుంది....

🙏 ధన్యవాదములు.....


Venkateswara Rao

కామెంట్‌లు లేవు: