🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*ఆర్యా శతకం - 1*
*శ్లోకము - 11*
*కాంచీరత్నవిభూషాం కామపి కందర్పసూతికాపాంగీమ్।*
*పరమాం కలాముపాసే పరశివ వామాంక పీఠికాసీనామ్॥*
*భావము :*
*కాంచీపురమునకు మణిహారముగా ప్రకాశించునది, తన క్రీగంటి చూపులతో మన్మధుని పునర్జీవితుని చేసినది, జగదీశ్వరుని వామ భాగమును తన స్థానముగా చేసుకొనినది అయిన జగన్మాతను ప్రార్థిస్తున్నాను.*
🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి