సరస్వతీ ఆవిర్భావ కథ
ఒకానొకప్పుడు ఈ చరాచర జగత్తులో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న వాక్కు సరిగ్గా లేదు. స్పష్టతలేదు. వ్యాకరణాలు లేవు. ఆకాలంలో లోకమంతా సైగల మీద ఎక్కువగా ఆధారపడేది. అప్పుడు త్రిమూర్తులూ, తక్కినటువంటి దేవతలు కలిసి అమ్మవారిని భక్తితో ప్రార్థించారు. అమ్మా! మాకు స్పష్టమైన వాక్కు కావాలి. వాక్కుకు వ్యాకరణం కావాలి. అటువంటి వ్యాకరణాది విద్యలను ఇచ్చేటువంటి ఒక శక్తిని, ఒక దేవతని మాకు ప్రసాదించు అని జగదంబని ప్రార్థించారు. అప్పుడు జగదంబ ఈశ్వరుడి శరీరం నుంచి ఒక సుందరీమణిని సృష్టించింది. ఆవిడ తెల్లగా ఉంది, తెల్లని చీర కట్టుకుంది. చేతిలో వీణ పట్టుకుంది నాలుగు చేతులతో తెల్ల తామర పువ్వులతో, హంసని వాహనంగా చేసుకుని పుట్టింది. ఆవిడే మహాసరస్వతి.ఆ తల్లి పుట్టింది మూలా నక్షత్రం, శరన్నవరాత్రులు ఏడవ రోజు పుట్టింది. (కానీ మూలా నక్షత్రం ఏరోజు ఉంటే ఆరోజు పూజ చేస్తున్నాం ప్రాచీన కాలంలో మాత్రం శరన్నవరాత్రుల్లో అమ్మవారు మూలా నక్షత్రంలో ఒక రూపం ధరించింది )కానీ పుట్టింది మాఘ శుక్ల పంచమి,కాని మూల నక్షత్రం నాడు లోక శ్రేయస్సు కోసం ఒక రూపం ధరించింది. అవిడే మహా సరస్వతి, ఆ సరస్వతీ దేవిని కృష్ణుడు గోలోకంలో కవచంతో స్తోత్రం చేసి పూజించారు. అమ్మవారి యొక్క తెల్లని విగ్రహం తయారు చేసి, తెల్లని వస్త్రం సమర్పించి, 14 శ్లోకాలతో అమ్మని అర్పించాడు.5 14 శ్లోకాలు శ్రీకృష్ణుడే స్వయంగా రాశారు కాబట్టి చాలా గొప్పవి. దానికి సరస్వతీ కవచం అని పేరు. (ఆదౌ సరస్వతీ పూజా శ్రీకృష్ణన వినిర్మితా యత్వసాదాత్ మునిశ్రేష్ట మూరోభవతి పండిత:.) మొట్ట మొదట సరస్వతీ దేవి పూజని గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ తయారు చేసారు. ఆ సరస్వతీ పూజా విధానం, ఆ కవచం చదివి, అమ్మవారు సరస్వతిని పూజిస్తే మూర్ఖుడు కూడా పండితుడవుతాడు. అటువంటి కవచం శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు తప్పక చదవాలి. యాజ్ఞవల్క్యుడు గురు ద్రోహం చేసి తన విద్యలన్నీ కోల్పోయి, ఈ సరస్వతీ కవచం పఠించి, మళ్లీ తిరిగి విద్యలను పొందగలిగాడు. సరస్వతీ దేవి యొక్క విగ్రహాన్ని తెల్లని పువ్వులతో, తెల్లని వస్త్రంతో, తెల్లని గంధంతో పూజించాలి. ఈరోజు ఈ సరస్వతీ కవచం యధాశక్తి పారాయణం చేసి పిల్లలచేత చేయిస్తే అందులో " ఐం" అనే ఒక బీజం చాలాసార్లు అందులో మనకు కనబడుతుంది, అది వాక్ బీజం. ఆ వాక్ బీజం వినడం వల్ల ఎందుకూ పనికిరాని వాడు కూడా పండితుడు అవుతాడు. ఒకప్పుడు వాల్మీకి మహర్షి రామాయణం రాసేముందు, ఇంత గొప్ప రామాయణం అనే గ్రంథాన్ని లోకానికి ఇవ్వాలంటే సరస్వతీ కటాక్షం కావాలని, మూలా నక్షత్రం రోజున సరస్వతి ప్రతిమను పెట్టుకుని, ఆవు పాలతో అభిషేకించి. తెల్లని పువ్వులతో పూజించి, సరస్వతీ కవచం చదివాడు. దేవీభాగవతంలో తొమ్మిదవ స్కంధములో ఉంటుంది. వాల్మీకి మహర్షి ఈ కవచం పారాయణం చేసి ఆ పాండిత్యంతో రామాయణం రాసాడు. వేదవ్యాస మహర్షి కూడా సరస్వతీ కవచాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేసి, అమ్మ పాండిత్యం ఇవ్వగా, అమ్మవారి అనుగ్రహంతో, భాగవతం భారతం అనే 2 ఉద్గ్రంధాలు లోకానికి ఇవ్వగలిగారు. పూర్వం సత్యవ్రతుడు అనేవాడు ఈ సరస్వతీ కవచం ప్రభావంతో 500 శ్లోకాలు రాయగలిగారు.
గురు ద్రోహం చేసిన పాపం నుండి బయటపడటానికి మళ్లీ ఒక గురువుని ఆశ్రయించి సరస్వతీ కవచం ఉపదేశం తీసుకున్న వారు మాత్రమే గురు ద్రోహ పాపం నుండి బయటపడగలుగుతాడు. అలా బయటపడి యాజ్ఞవల్క్యుడు పండితుడయ్యాడు.
ఈ విధంగా అమ్మవారిని పూజించి కథ విని భక్తులందరూ కూడా అనేక శుభాలు పొందాలని గురువుగారు మంగళా శాసనము చేసారు. 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻
**🙏సేకరణ 🙏**
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి