23, ఆగస్టు 2020, ఆదివారం

మహా గణపతి సహస్రనామ స్తోత్రమ్

మునిరువాచ
కథం నామ్నాం సహస్రం తం గణేశ ఉపదిష్టవాన్ |
శివదం తన్మమాచక్ష్వ లోకానుగ్రహతత్పర ‖ 1 ‖

బ్రహ్మోవాచ
దేవః పూర్వం పురారాతిః పురత్రయజయోద్యమే |
అనర్చనాద్గణేశస్య జాతో విఘ్నాకులః కిల ‖ 2 ‖

మనసా స వినిర్ధార్య దదృశే విఘ్నకారణమ్ |
మహాగణపతిం భక్త్యా సమభ్యర్చ్య యథావిధి ‖ 3 ‖

విఘ్నప్రశమనోపాయమపృచ్ఛదపరిశ్రమమ్ |
సంతుష్టః పూజయా శంభోర్మహాగణపతిః స్వయమ్ ‖ 4 ‖

సర్వవిఘ్నప్రశమనం సర్వకామఫలప్రదమ్ |
తతస్తస్మై స్వయం నామ్నాం సహస్రమిదమబ్రవీత్ ‖ 5 ‖

అస్య శ్రీమహాగణపతిసహస్రనామస్తోత్రమాలామంత్రస్య |
గణేశ ఋషిః, మహాగణపతిర్దేవతా, నానావిధానిచ్ఛందాంసి |
హుమితి బీజమ్, తుంగమితి శక్తిః, స్వాహాశక్తిరితి కీలకమ్ |
సకలవిఘ్నవినాశనద్వారా శ్రీమహాగణపతిప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |

అథ కరన్యాసః
గణేశ్వరో గణక్రీడ ఇత్యంగుష్ఠాభ్యాం నమః |
కుమారగురురీశాన ఇతి తర్జనీభ్యాం నమః ‖
బ్రహ్మాండకుంభశ్చిద్వ్యోమేతి మధ్యమాభ్యాం నమః |
రక్తో రక్తాంబరధర ఇత్యనామికాభ్యాం నమః
సర్వసద్గురుసంసేవ్య ఇతి కనిష్ఠికాభ్యాం నమః |
లుప్తవిఘ్నః స్వభక్తానామితి కరతలకరపృష్ఠాభ్యాం నమః ‖

అథ అంగన్యాసః
ఛందశ్ఛందోద్భవ ఇతి హృదయాయ నమః |
నిష్కలో నిర్మల ఇతి శిరసే స్వాహా |
సృష్టిస్థితిలయక్రీడ ఇతి శిఖాయై వషట్ |
జ్ఞానం విజ్ఞానమానంద ఇతి కవచాయ హుమ్ |
అష్టాంగయోగఫలభృదితి నేత్రత్రయాయ వౌషట్ |
అనంతశక్తిసహిత ఇత్యస్త్రాయ ఫట్ |
భూర్భువః స్వరోమ్ ఇతి దిగ్బంధః |

అథ ధ్యానమ్
గజవదనమచింత్యం తీక్ష్ణదంష్ట్రం త్రినేత్రం
బృహదుదరమశేషం భూతిరాజం పురాణమ్ |
అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం
పశుపతిసుతమీశం విఘ్నరాజం నమామి ‖

శ్రీగణపతిరువాచ
ఓం గణేశ్వరో గణక్రీడో గణనాథో గణాధిపః |
ఏకదంతో వక్రతుండో గజవక్త్రో మహోదరః ‖ 1 ‖

లంబోదరో ధూమ్రవర్ణో వికటో విఘ్ననాశనః |
సుముఖో దుర్ముఖో బుద్ధో విఘ్నరాజో గజాననః ‖ 2 ‖

భీమః ప్రమోద ఆమోదః సురానందో మదోత్కటః |
హేరంబః శంబరః శంభుర్లంబకర్ణో మహాబలః ‖ 3 ‖

నందనో లంపటో భీమో మేఘనాదో గణంజయః |
వినాయకో విరూపాక్షో వీరః శూరవరప్రదః ‖ 4 ‖

మహాగణపతిర్బుద్ధిప్రియః క్షిప్రప్రసాదనః |
రుద్రప్రియో గణాధ్యక్ష ఉమాపుత్రోఽఘనాశనః ‖ 5 ‖

కుమారగురురీశానపుత్రో మూషకవాహనః |
సిద్ధిప్రియః సిద్ధిపతిః సిద్ధః సిద్ధివినాయకః ‖ 6 ‖

అవిఘ్నస్తుంబురుః సింహవాహనో మోహినీప్రియః |
కటంకటో రాజపుత్రః శాకలః సంమితోమితః ‖ 7 ‖

కూష్మాండసామసంభూతిర్దుర్జయో ధూర్జయో జయః |
భూపతిర్భువనపతిర్భూతానాం పతిరవ్యయః ‖ 8 ‖

విశ్వకర్తా విశ్వముఖో విశ్వరూపో నిధిర్గుణః |
కవిః కవీనామృషభో బ్రహ్మణ్యో బ్రహ్మవిత్ప్రియః ‖ 9 ‖

జ్యేష్ఠరాజో నిధిపతిర్నిధిప్రియపతిప్రియః |
హిరణ్మయపురాంతఃస్థః సూర్యమండలమధ్యగః ‖ 10 ‖

కరాహతిధ్వస్తసింధుసలిలః పూషదంతభిత్ |
ఉమాంకకేలికుతుకీ ముక్తిదః కులపావనః ‖ 11 ‖

కిరీటీ కుండలీ హారీ వనమాలీ మనోమయః |
వైముఖ్యహతదైత్యశ్రీః పాదాహతిజితక్షితిః ‖ 12 ‖

సద్యోజాతః స్వర్ణముంజమేఖలీ దుర్నిమిత్తహృత్ |
దుఃస్వప్నహృత్ప్రసహనో గుణీ నాదప్రతిష్ఠితః ‖ 13 ‖

సురూపః సర్వనేత్రాధివాసో వీరాసనాశ్రయః |
పీతాంబరః ఖండరదః ఖండవైశాఖసంస్థితః ‖ 14 ‖

చిత్రాంగః శ్యామదశనో భాలచంద్రో హవిర్భుజః |
యోగాధిపస్తారకస్థః పురుషో గజకర్ణకః ‖ 15 ‖

గణాధిరాజో విజయః స్థిరో గజపతిధ్వజీ |
దేవదేవః స్మరః ప్రాణదీపకో వాయుకీలకః ‖ 16 ‖

విపశ్చిద్వరదో నాదో నాదభిన్నమహాచలః |
వరాహరదనో మృత్యుంజయో వ్యాఘ్రాజినాంబరః ‖ 17 ‖

ఇచ్ఛాశక్తిభవో దేవత్రాతా దైత్యవిమర్దనః |
శంభువక్త్రోద్భవః శంభుకోపహా శంభుహాస్యభూః ‖ 18 ‖

శంభుతేజాః శివాశోకహారీ గౌరీసుఖావహః |
ఉమాంగమలజో గౌరీతేజోభూః స్వర్ధునీభవః ‖ 19 ‖

యజ్ఞకాయో మహానాదో గిరివర్ష్మా శుభాననః |
సర్వాత్మా సర్వదేవాత్మా బ్రహ్మమూర్ధా కకుప్శ్రుతిః ‖ 20 ‖

బ్రహ్మాండకుంభశ్చిద్వ్యోమభాలఃసత్యశిరోరుహః |
జగజ్జన్మలయోన్మేషనిమేషోఽగ్న్యర్కసోమదృక్ ‖ 21 ‖

గిరీంద్రైకరదో ధర్మాధర్మోష్ఠః సామబృంహితః |
గ్రహర్క్షదశనో వాణీజిహ్వో వాసవనాసికః ‖ 22 ‖

భ్రూమధ్యసంస్థితకరో బ్రహ్మవిద్యామదోదకః |
కులాచలాంసః సోమార్కఘంటో రుద్రశిరోధరః ‖ 23 ‖

నదీనదభుజః సర్పాంగులీకస్తారకానఖః |
వ్యోమనాభిః శ్రీహృదయో మేరుపృష్ఠోఽర్ణవోదరః ‖ 24 ‖

కుక్షిస్థయక్షగంధర్వరక్షఃకిన్నరమానుషః |
పృథ్వీకటిః సృష్టిలింగః శైలోరుర్దస్రజానుకః ‖ 25 ‖

పాతాలజంఘో మునిపాత్కాలాంగుష్ఠస్త్రయీతనుః |
జ్యోతిర్మండలలాంగూలో హృదయాలాననిశ్చలః ‖ 26 ‖

హృత్పద్మకర్ణికాశాలీ వియత్కేలిసరోవరః |
సద్భక్తధ్యాననిగడః పూజావారినివారితః ‖ 27 ‖

ప్రతాపీ కాశ్యపో మంతా గణకో విష్టపీ బలీ |
యశస్వీ ధార్మికో జేతా ప్రథమః ప్రమథేశ్వరః ‖ 28 ‖

చింతామణిర్ద్వీపపతిః కల్పద్రుమవనాలయః |
రత్నమండపమధ్యస్థో రత్నసింహాసనాశ్రయః ‖ 29 ‖

తీవ్రాశిరోద్ధృతపదో జ్వాలినీమౌలిలాలితః |
నందానందితపీఠశ్రీర్భోగదో భూషితాసనః ‖ 30 ‖

సకామదాయినీపీఠః స్ఫురదుగ్రాసనాశ్రయః |
తేజోవతీశిరోరత్నం సత్యానిత్యావతంసితః ‖ 31 ‖

సవిఘ్ననాశినీపీఠః సర్వశక్త్యంబుజాలయః |
లిపిపద్మాసనాధారో వహ్నిధామత్రయాలయః ‖ 32 ‖

ఉన్నతప్రపదో గూఢగుల్ఫః సంవృతపార్ష్ణికః |
పీనజంఘః శ్లిష్టజానుః స్థూలోరుః ప్రోన్నమత్కటిః ‖ 33 ‖

నిమ్ననాభిః స్థూలకుక్షిః పీనవక్షా బృహద్భుజః |
పీనస్కంధః కంబుకంఠో లంబోష్ఠో లంబనాసికః ‖ 34 ‖

భగ్నవామరదస్తుంగసవ్యదంతో మహాహనుః |
హ్రస్వనేత్రత్రయః శూర్పకర్ణో నిబిడమస్తకః ‖ 35 ‖

స్తబకాకారకుంభాగ్రో రత్నమౌలిర్నిరంకుశః |
సర్పహారకటీసూత్రః సర్పయజ్ఞోపవీతవాన్ ‖ 36 ‖

సర్పకోటీరకటకః సర్పగ్రైవేయకాంగదః |
సర్పకక్షోదరాబంధః సర్పరాజోత్తరచ్ఛదః ‖ 37 ‖

రక్తో రక్తాంబరధరో రక్తమాలావిభూషణః |
రక్తేక్షనో రక్తకరో రక్తతాల్వోష్ఠపల్లవః ‖ 38 ‖

శ్వేతః శ్వేతాంబరధరః శ్వేతమాలావిభూషణః |
శ్వేతాతపత్రరుచిరః శ్వేతచామరవీజితః ‖ 39 ‖

సర్వావయవసంపూర్ణః సర్వలక్షణలక్షితః |
సర్వాభరణశోభాఢ్యః సర్వశోభాసమన్వితః ‖ 40 ‖

సర్వమంగలమాంగల్యః సర్వకారణకారణమ్ |
సర్వదేవవరః శారంగీ బీజపూరీ గదాధరః ‖ 41 ‖

శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః |
కిరీటీ కుండలీ హారీ వనమాలీ శుభాంగదః ‖ 42 ‖

ఇక్షుచాపధరః శూలీ చక్రపాణిః సరోజభృత్ |
పాశీ ధృతోత్పలః శాలిమంజరీభృత్స్వదంతభృత్ ‖ 43 ‖

కల్పవల్లీధరో విశ్వాభయదైకకరో వశీ |
అక్షమాలాధరో జ్ఞానముద్రావాన్ ముద్గరాయుధః ‖ 44 ‖

పూర్ణపాత్రీ కంబుధరో విధృతాంకుశమూలకః |
కరస్థామ్రఫలశ్చూతకలికాభృత్కుఠారవాన్ ‖ 45 ‖

పుష్కరస్థస్వర్ణఘటీపూర్ణరత్నాభివర్షకః |
భారతీసుందరీనాథో వినాయకరతిప్రియః ‖ 46 ‖

మహాలక్ష్మీప్రియతమః సిద్ధలక్ష్మీమనోరమః |
రమారమేశపూర్వాంగో దక్షిణోమామహేశ్వరః ‖ 47 ‖

మహీవరాహవామాంగో రతికందర్పపశ్చిమః |
ఆమోదమోదజననః సప్రమోదప్రమోదనః ‖ 48 ‖

సంవర్ధితమహావృద్ధిరృద్ధిసిద్ధిప్రవర్ధనః |
దంతసౌముఖ్యసుముఖః కాంతికందలితాశ్రయః ‖ 49 ‖

మదనావత్యాశ్రితాంఘ్రిః కృతవైముఖ్యదుర్ముఖః |
విఘ్నసంపల్లవః పద్మః సర్వోన్నతమదద్రవః ‖ 50 ‖

విఘ్నకృన్నిమ్నచరణో ద్రావిణీశక్తిసత్కృతః |
తీవ్రాప్రసన్ననయనో జ్వాలినీపాలితైకదృక్ ‖ 51 ‖

మోహినీమోహనో భోగదాయినీకాంతిమండనః |
కామినీకాంతవక్త్రశ్రీరధిష్ఠితవసుంధరః ‖ 52 ‖

వసుధారామదోన్నాదో మహాశంఖనిధిప్రియః |
నమద్వసుమతీమాలీ మహాపద్మనిధిః ప్రభుః ‖ 53 ‖

సర్వసద్గురుసంసేవ్యః శోచిష్కేశహృదాశ్రయః |
ఈశానమూర్ధా దేవేంద్రశిఖః పవననందనః ‖ 54 ‖

ప్రత్యుగ్రనయనో దివ్యో దివ్యాస్త్రశతపర్వధృక్ |
ఐరావతాదిసర్వాశావారణో వారణప్రియః ‖ 55 ‖

వజ్రాద్యస్త్రపరీవారో గణచండసమాశ్రయః |
జయాజయపరికరో విజయావిజయావహః ‖ 56 ‖

అజయార్చితపాదాబ్జో నిత్యానందవనస్థితః |
విలాసినీకృతోల్లాసః శౌండీ సౌందర్యమండితః ‖ 57 ‖

అనంతానంతసుఖదః సుమంగలసుమంగలః |
జ్ఞానాశ్రయః క్రియాధార ఇచ్ఛాశక్తినిషేవితః ‖ 58 ‖

సుభగాసంశ్రితపదో లలితాలలితాశ్రయః |
కామినీపాలనః కామకామినీకేలిలాలితః ‖ 59 ‖

సరస్వత్యాశ్రయో గౌరీనందనః శ్రీనికేతనః |
గురుగుప్తపదో వాచాసిద్ధో వాగీశ్వరీపతిః ‖ 60 ‖

నలినీకాముకో వామారామో జ్యేష్ఠామనోరమః |
రౌద్రీముద్రితపాదాబ్జో హుంబీజస్తుంగశక్తికః ‖ 61 ‖

విశ్వాదిజననత్రాణః స్వాహాశక్తిః సకీలకః |
అమృతాబ్ధికృతావాసో మదఘూర్ణితలోచనః ‖ 62 ‖

ఉచ్ఛిష్టోచ్ఛిష్టగణకో గణేశో గణనాయకః |
సార్వకాలికసంసిద్ధిర్నిత్యసేవ్యో దిగంబరః ‖ 63 ‖

అనపాయోఽనంతదృష్టిరప్రమేయోఽజరామరః |
అనావిలోఽప్రతిహతిరచ్యుతోఽమృతమక్షరః ‖ 64 ‖

అప్రతర్క్యోఽక్షయోఽజయ్యోఽనాధారోఽనామయోమలః |
అమేయసిద్ధిరద్వైతమఘోరోఽగ్నిసమాననః ‖ 65 ‖

అనాకారోఽబ్ధిభూమ్యగ్నిబలఘ్నోఽవ్యక్తలక్షణః |
ఆధారపీఠమాధార ఆధారాధేయవర్జితః ‖ 66 ‖

ఆఖుకేతన ఆశాపూరక ఆఖుమహారథః |
ఇక్షుసాగరమధ్యస్థ ఇక్షుభక్షణలాలసః ‖ 67 ‖

ఇక్షుచాపాతిరేకశ్రీరిక్షుచాపనిషేవితః |
ఇంద్రగోపసమానశ్రీరింద్రనీలసమద్యుతిః ‖ 68 ‖

ఇందీవరదలశ్యామ ఇందుమండలమండితః |
ఇధ్మప్రియ ఇడాభాగ ఇడావానిందిరాప్రియః ‖ 69 ‖

ఇక్ష్వాకువిఘ్నవిధ్వంసీ ఇతికర్తవ్యతేప్సితః |
ఈశానమౌలిరీశాన ఈశానప్రియ ఈతిహా ‖ 70 ‖

ఈషణాత్రయకల్పాంత ఈహామాత్రవివర్జితః |
ఉపేంద్ర ఉడుభృన్మౌలిరుడునాథకరప్రియః ‖ 71 ‖

ఉన్నతానన ఉత్తుంగ ఉదారస్త్రిదశాగ్రణీః |
ఊర్జస్వానూష్మలమద ఊహాపోహదురాసదః ‖ 72 ‖

ఋగ్యజుఃసామనయన ఋద్ధిసిద్ధిసమర్పకః |
ఋజుచిత్తైకసులభో ఋణత్రయవిమోచనః ‖ 73 ‖

లుప్తవిఘ్నః స్వభక్తానాం లుప్తశక్తిః సురద్విషామ్ |
లుప్తశ్రీర్విముఖార్చానాం లూతావిస్ఫోటనాశనః ‖ 74 ‖

ఏకారపీఠమధ్యస్థ ఏకపాదకృతాసనః |
ఏజితాఖిలదైత్యశ్రీరేధితాఖిలసంశ్రయః ‖ 75 ‖

ఐశ్వర్యనిధిరైశ్వర్యమైహికాముష్మికప్రదః |
ఐరంమదసమోన్మేష ఐరావతసమాననః ‖ 76 ‖

ఓంకారవాచ్య ఓంకార ఓజస్వానోషధీపతిః |
ఔదార్యనిధిరౌద్ధత్యధైర్య ఔన్నత్యనిఃసమః ‖ 77 ‖

అంకుశః సురనాగానామంకుశాకారసంస్థితః |
అః సమస్తవిసర్గాంతపదేషు పరికీర్తితః ‖ 78 ‖

కమండలుధరః కల్పః కపర్దీ కలభాననః |
కర్మసాక్షీ కర్మకర్తా కర్మాకర్మఫలప్రదః ‖ 79 ‖

కదంబగోలకాకారః కూష్మాండగణనాయకః |
కారుణ్యదేహః కపిలః కథకః కటిసూత్రభృత్ ‖ 80 ‖

ఖర్వః ఖడ్గప్రియః ఖడ్గః ఖాంతాంతఃస్థః ఖనిర్మలః |
ఖల్వాటశృంగనిలయః ఖట్వాంగీ ఖదురాసదః ‖ 81 ‖

గుణాఢ్యో గహనో గద్యో గద్యపద్యసుధార్ణవః |
గద్యగానప్రియో గర్జో గీతగీర్వాణపూర్వజః ‖ 82 ‖

గుహ్యాచారరతో గుహ్యో గుహ్యాగమనిరూపితః |
గుహాశయో గుడాబ్ధిస్థో గురుగమ్యో గురుర్గురుః ‖ 83 ‖

ఘంటాఘర్ఘరికామాలీ ఘటకుంభో ఘటోదరః |
ఙకారవాచ్యో ఙాకారో ఙకారాకారశుండభృత్ ‖ 84 ‖

చండశ్చండేశ్వరశ్చండీ చండేశశ్చండవిక్రమః |
చరాచరపితా చింతామణిశ్చర్వణలాలసః ‖ 85 ‖

ఛందశ్ఛందోద్భవశ్ఛందో దుర్లక్ష్యశ్ఛందవిగ్రహః |
జగద్యోనిర్జగత్సాక్షీ జగదీశో జగన్మయః ‖ 86 ‖

జప్యో జపపరో జాప్యో జిహ్వాసింహాసనప్రభుః |
స్రవద్గండోల్లసద్ధానఝంకారిభ్రమరాకులః ‖ 87 ‖

టంకారస్ఫారసంరావష్టంకారమణినూపురః |
ఠద్వయీపల్లవాంతస్థసర్వమంత్రేషు సిద్ధిదః ‖ 88 ‖

డిండిముండో డాకినీశో డామరో డిండిమప్రియః |
ఢక్కానినాదముదితో ఢౌంకో ఢుంఢివినాయకః ‖ 89 ‖

తత్త్వానాం ప్రకృతిస్తత్త్వం తత్త్వంపదనిరూపితః |
తారకాంతరసంస్థానస్తారకస్తారకాంతకః ‖ 90 ‖

స్థాణుః స్థాణుప్రియః స్థాతా స్థావరం జంగమం జగత్ |
దక్షయజ్ఞప్రమథనో దాతా దానం దమో దయా ‖ 91 ‖

దయావాందివ్యవిభవో దండభృద్దండనాయకః |
దంతప్రభిన్నాభ్రమాలో దైత్యవారణదారణః ‖ 92 ‖

దంష్ట్రాలగ్నద్వీపఘటో దేవార్థనృగజాకృతిః |
ధనం ధనపతేర్బంధుర్ధనదో ధరణీధరః ‖ 93 ‖

ధ్యానైకప్రకటో ధ్యేయో ధ్యానం ధ్యానపరాయణః |
ధ్వనిప్రకృతిచీత్కారో బ్రహ్మాండావలిమేఖలః ‖ 94 ‖

నంద్యో నందిప్రియో నాదో నాదమధ్యప్రతిష్ఠితః |
నిష్కలో నిర్మలో నిత్యో నిత్యానిత్యో నిరామయః ‖ 95 ‖

పరం వ్యోమ పరం ధామ పరమాత్మా పరం పదమ్ ‖ 96 ‖

పరాత్పరః పశుపతిః పశుపాశవిమోచనః |
పూర్ణానందః పరానందః పురాణపురుషోత్తమః ‖ 97 ‖

పద్మప్రసన్నవదనః ప్రణతాజ్ఞాననాశనః |
ప్రమాణప్రత్యయాతీతః ప్రణతార్తినివారణః ‖ 98 ‖

ఫణిహస్తః ఫణిపతిః ఫూత్కారః ఫణితప్రియః |
బాణార్చితాంఘ్రియుగలో బాలకేలికుతూహలీ |
బ్రహ్మ బ్రహ్మార్చితపదో బ్రహ్మచారీ బృహస్పతిః ‖ 99 ‖

బృహత్తమో బ్రహ్మపరో బ్రహ్మణ్యో బ్రహ్మవిత్ప్రియః |
బృహన్నాదాగ్ర్యచీత్కారో బ్రహ్మాండావలిమేఖలః ‖ 100 ‖

భ్రూక్షేపదత్తలక్ష్మీకో భర్గో భద్రో భయాపహః |
భగవాన్ భక్తిసులభో భూతిదో భూతిభూషణః ‖ 101 ‖

భవ్యో భూతాలయో భోగదాతా భ్రూమధ్యగోచరః |
మంత్రో మంత్రపతిర్మంత్రీ మదమత్తో మనో మయః ‖ 102 ‖

మేఖలాహీశ్వరో మందగతిర్మందనిభేక్షణః |
మహాబలో మహావీర్యో మహాప్రాణో మహామనాః ‖ 103 ‖

యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞగోప్తా యజ్ఞఫలప్రదః |
యశస్కరో యోగగమ్యో యాజ్ఞికో యాజకప్రియః ‖ 104 ‖

రసో రసప్రియో రస్యో రంజకో రావణార్చితః |
రాజ్యరక్షాకరో రత్నగర్భో రాజ్యసుఖప్రదః ‖ 105 ‖

లక్షో లక్షపతిర్లక్ష్యో లయస్థో లడ్డుకప్రియః |
లాసప్రియో లాస్యపరో లాభకృల్లోకవిశ్రుతః ‖ 106 ‖

వరేణ్యో వహ్నివదనో వంద్యో వేదాంతగోచరః |
వికర్తా విశ్వతశ్చక్షుర్విధాతా విశ్వతోముఖః ‖ 107 ‖

వామదేవో విశ్వనేతా వజ్రివజ్రనివారణః |
వివస్వద్బంధనో విశ్వాధారో విశ్వేశ్వరో విభుః ‖ 108 ‖

శబ్దబ్రహ్మ శమప్రాప్యః శంభుశక్తిగణేశ్వరః |
శాస్తా శిఖాగ్రనిలయః శరణ్యః శంబరేశ్వరః ‖ 109 ‖

షడృతుకుసుమస్రగ్వీ షడాధారః షడక్షరః |
సంసారవైద్యః సర్వజ్ఞః సర్వభేషజభేషజమ్ ‖ 110 ‖

సృష్టిస్థితిలయక్రీడః సురకుంజరభేదకః |
సిందూరితమహాకుంభః సదసద్భక్తిదాయకః ‖ 111 ‖

సాక్షీ సముద్రమథనః స్వయంవేద్యః స్వదక్షిణః |
స్వతంత్రః సత్యసంకల్పః సామగానరతః సుఖీ ‖ 112 ‖

హంసో హస్తిపిశాచీశో హవనం హవ్యకవ్యభుక్ |
హవ్యం హుతప్రియో హృష్టో హృల్లేఖామంత్రమధ్యగః ‖ 113 ‖

క్షేత్రాధిపః క్షమాభర్తా క్షమాక్షమపరాయణః |
క్షిప్రక్షేమకరః క్షేమానందః క్షోణీసురద్రుమః ‖ 114 ‖

ధర్మప్రదోఽర్థదః కామదాతా సౌభాగ్యవర్ధనః |
విద్యాప్రదో విభవదో భుక్తిముక్తిఫలప్రదః ‖ 115 ‖

ఆభిరూప్యకరో వీరశ్రీప్రదో విజయప్రదః |
సర్వవశ్యకరో గర్భదోషహా పుత్రపౌత్రదః ‖ 116 ‖

మేధాదః కీర్తిదః శోకహారీ దౌర్భాగ్యనాశనః |
ప్రతివాదిముఖస్తంభో రుష్టచిత్తప్రసాదనః ‖ 117 ‖

పరాభిచారశమనో దుఃఖహా బంధమోక్షదః |
లవస్త్రుటిః కలా కాష్ఠా నిమేషస్తత్పరక్షణః ‖ 118 ‖

ఘటీ ముహూర్తః ప్రహరో దివా నక్తమహర్నిశమ్ |
పక్షో మాసర్త్వయనాబ్దయుగం కల్పో మహాలయః ‖ 119 ‖

రాశిస్తారా తిథిర్యోగో వారః కరణమంశకమ్ |
లగ్నం హోరా కాలచక్రం మేరుః సప్తర్షయో ధ్రువః ‖ 120 ‖

రాహుర్మందః కవిర్జీవో బుధో భౌమః శశీ రవిః |
కాలః సృష్టిః స్థితిర్విశ్వం స్థావరం జంగమం జగత్ ‖ 121 ‖

భూరాపోఽగ్నిర్మరుద్వ్యోమాహంకృతిః ప్రకృతిః పుమాన్ |
బ్రహ్మా విష్ణుః శివో రుద్ర ఈశః శక్తిః సదాశివః ‖ 122 ‖

త్రిదశాః పితరః సిద్ధా యక్షా రక్షాంసి కిన్నరాః |
సిద్ధవిద్యాధరా భూతా మనుష్యాః పశవః ఖగాః ‖ 123 ‖

సముద్రాః సరితః శైలా భూతం భవ్యం భవోద్భవః |
సాంఖ్యం పాతంజలం యోగం పురాణాని శ్రుతిః స్మృతిః ‖ 124 ‖

వేదాంగాని సదాచారో మీమాంసా న్యాయవిస్తరః |
ఆయుర్వేదో ధనుర్వేదో గాంధర్వం కావ్యనాటకమ్ ‖ 125 ‖

వైఖానసం భాగవతం మానుషం పాంచరాత్రకమ్ |
శైవం పాశుపతం కాలాముఖంభైరవశాసనమ్ ‖ 126 ‖

శాక్తం వైనాయకం సౌరం జైనమార్హతసంహితా |
సదసద్వ్యక్తమవ్యక్తం సచేతనమచేతనమ్ ‖ 127 ‖

బంధో మోక్షః సుఖం భోగో యోగః సత్యమణుర్మహాన్ |
స్వస్తి హుంఫట్ స్వధా స్వాహా శ్రౌషట్ వౌషట్ వషణ్ నమః 128 ‖

జ్ఞానం విజ్ఞానమానందో బోధః సంవిత్సమోఽసమః |
ఏక ఏకాక్షరాధార ఏకాక్షరపరాయణః ‖ 129 ‖

ఏకాగ్రధీరేకవీర ఏకోఽనేకస్వరూపధృక్ |
ద్విరూపో ద్విభుజో ద్వ్యక్షో ద్విరదో ద్వీపరక్షకః ‖ 130 ‖

ద్వైమాతురో ద్వివదనో ద్వంద్వహీనో ద్వయాతిగః |
త్రిధామా త్రికరస్త్రేతా త్రివర్గఫలదాయకః ‖ 131 ‖

త్రిగుణాత్మా త్రిలోకాదిస్త్రిశక్తీశస్త్రిలోచనః |
చతుర్విధవచోవృత్తిపరివృత్తిప్రవర్తకః ‖ 132 ‖

చతుర్బాహుశ్చతుర్దంతశ్చతురాత్మా చతుర్భుజః |
చతుర్విధోపాయమయశ్చతుర్వర్ణాశ్రమాశ్రయః 133 ‖

చతుర్థీపూజనప్రీతశ్చతుర్థీతిథిసంభవః ‖
పంచాక్షరాత్మా పంచాత్మా పంచాస్యః పంచకృత్తమః ‖ 134 ‖

పంచాధారః పంచవర్ణః పంచాక్షరపరాయణః |
పంచతాలః పంచకరః పంచప్రణవమాతృకః ‖ 135 ‖

పంచబ్రహ్మమయస్ఫూర్తిః పంచావరణవారితః |
పంచభక్షప్రియః పంచబాణః పంచశిఖాత్మకః ‖ 136 ‖

షట్కోణపీఠః షట్చక్రధామా షడ్గ్రంథిభేదకః |
షడంగధ్వాంతవిధ్వంసీ షడంగులమహాహ్రదః ‖ 137 ‖

షణ్ముఖః షణ్ముఖభ్రాతా షట్శక్తిపరివారితః |
షడ్వైరివర్గవిధ్వంసీ షడూర్మిభయభంజనః ‖ 138 ‖

షట్తర్కదూరః షట్కర్మా షడ్గుణః షడ్రసాశ్రయః |
సప్తపాతాలచరణః సప్తద్వీపోరుమండలః ‖ 139 ‖

సప్తస్వర్లోకముకుటః సప్తసప్తివరప్రదః |
సప్తాంగరాజ్యసుఖదః సప్తర్షిగణవందితః ‖ 140 ‖

సప్తచ్ఛందోనిధిః సప్తహోత్రః సప్తస్వరాశ్రయః |
సప్తాబ్ధికేలికాసారః సప్తమాతృనిషేవితః ‖ 141 ‖

సప్తచ్ఛందో మోదమదః సప్తచ్ఛందో మఖప్రభుః |
అష్టమూర్తిర్ధ్యేయమూర్తిరష్టప్రకృతికారణమ్ ‖ 142 ‖

అష్టాంగయోగఫలభృదష్టపత్రాంబుజాసనః |
అష్టశక్తిసమానశ్రీరష్టైశ్వర్యప్రవర్ధనః ‖ 143 ‖

అష్టపీఠోపపీఠశ్రీరష్టమాతృసమావృతః |
అష్టభైరవసేవ్యోఽష్టవసువంద్యోఽష్టమూర్తిభృత్ ‖ 144 ‖

అష్టచక్రస్ఫురన్మూర్తిరష్టద్రవ్యహవిఃప్రియః |
అష్టశ్రీరష్టసామశ్రీరష్టైశ్వర్యప్రదాయకః |
నవనాగాసనాధ్యాసీ నవనిధ్యనుశాసితః ‖ 145 ‖

నవద్వారపురావృత్తో నవద్వారనికేతనః |
నవనాథమహానాథో నవనాగవిభూషితః ‖ 146 ‖

నవనారాయణస్తుల్యో నవదుర్గానిషేవితః |
నవరత్నవిచిత్రాంగో నవశక్తిశిరోద్ధృతః ‖ 147 ‖

దశాత్మకో దశభుజో దశదిక్పతివందితః |
దశాధ్యాయో దశప్రాణో దశేంద్రియనియామకః ‖ 148 ‖

దశాక్షరమహామంత్రో దశాశావ్యాపివిగ్రహః |
ఏకాదశమహారుద్రైఃస్తుతశ్చైకాదశాక్షరః ‖ 149 ‖

ద్వాదశద్విదశాష్టాదిదోర్దండాస్త్రనికేతనః |
త్రయోదశభిదాభిన్నో విశ్వేదేవాధిదైవతమ్ ‖ 150 ‖

చతుర్దశేంద్రవరదశ్చతుర్దశమనుప్రభుః |
చతుర్దశాద్యవిద్యాఢ్యశ్చతుర్దశజగత్పతిః ‖ 151 ‖

సామపంచదశః పంచదశీశీతాంశునిర్మలః |
తిథిపంచదశాకారస్తిథ్యా పంచదశార్చితః ‖ 152 ‖

షోడశాధారనిలయః షోడశస్వరమాతృకః |
షోడశాంతపదావాసః షోడశేందుకలాత్మకః ‖ 153 ‖

కలాసప్తదశీ సప్తదశసప్తదశాక్షరః |
అష్టాదశద్వీపపతిరష్టాదశపురాణకృత్ ‖ 154 ‖

అష్టాదశౌషధీసృష్టిరష్టాదశవిధిః స్మృతః |
అష్టాదశలిపివ్యష్టిసమష్టిజ్ఞానకోవిదః ‖ 155 ‖

అష్టాదశాన్నసంపత్తిరష్టాదశవిజాతికృత్ |
ఏకవింశః పుమానేకవింశత్యంగులిపల్లవః ‖ 156 ‖

చతుర్వింశతితత్త్వాత్మా పంచవింశాఖ్యపూరుషః |
సప్తవింశతితారేశః సప్తవింశతియోగకృత్ ‖ 157 ‖

ద్వాత్రింశద్భైరవాధీశశ్చతుస్త్రింశన్మహాహ్రదః |
షట్త్రింశత్తత్త్వసంభూతిరష్టత్రింశత్కలాత్మకః ‖ 158 ‖

పంచాశద్విష్ణుశక్తీశః పంచాశన్మాతృకాలయః |
ద్విపంచాశద్వపుఃశ్రేణీత్రిషష్ట్యక్షరసంశ్రయః |
పంచాశదక్షరశ్రేణీపంచాశద్రుద్రవిగ్రహః ‖ 159 ‖

చతుఃషష్టిమహాసిద్ధియోగినీవృందవందితః |
నమదేకోనపంచాశన్మరుద్వర్గనిరర్గలః ‖ 160 ‖

చతుఃషష్ట్యర్థనిర్ణేతా చతుఃషష్టికలానిధిః |
అష్టషష్టిమహాతీర్థక్షేత్రభైరవవందితః ‖ 161 ‖

చతుర్నవతిమంత్రాత్మా షణ్ణవత్యధికప్రభుః |
శతానందః శతధృతిః శతపత్రాయతేక్షణః ‖ 162 ‖

శతానీకః శతమఖః శతధారావరాయుధః |
సహస్రపత్రనిలయః సహస్రఫణిభూషణః ‖ 163 ‖

సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ |
సహస్రనామసంస్తుత్యః సహస్రాక్షబలాపహః ‖ 164 ‖

దశసాహస్రఫణిభృత్ఫణిరాజకృతాసనః |
అష్టాశీతిసహస్రాద్యమహర్షిస్తోత్రపాఠితః ‖ 165 ‖

లక్షాధారః ప్రియాధారో లక్షాధారమనోమయః |
చతుర్లక్షజపప్రీతశ్చతుర్లక్షప్రకాశకః ‖ 166 ‖

చతురశీతిలక్షాణాం జీవానాం దేహసంస్థితః |
కోటిసూర్యప్రతీకాశః కోటిచంద్రాంశునిర్మలః ‖ 167 ‖

శివోద్భవాద్యష్టకోటివైనాయకధురంధరః |
సప్తకోటిమహామంత్రమంత్రితావయవద్యుతిః ‖ 168 ‖

త్రయస్త్రింశత్కోటిసురశ్రేణీప్రణతపాదుకః |
అనంతదేవతాసేవ్యో హ్యనంతశుభదాయకః ‖ 169 ‖

అనంతనామానంతశ్రీరనంతోఽనంతసౌఖ్యదః |
అనంతశక్తిసహితో హ్యనంతమునిసంస్తుతః ‖ 170 ‖

ఇతి వైనాయకం నామ్నాం సహస్రమిదమీరితమ్ |
ఇదం బ్రాహ్మే ముహూర్తే యః పఠతి ప్రత్యహం నరః ‖ 171 ‖

కరస్థం తస్య సకలమైహికాముష్మికం సుఖమ్ |
ఆయురారోగ్యమైశ్వర్యం ధైర్యం శౌర్యం బలం యశః ‖ 172 ‖

మేధా ప్రజ్ఞా ధృతిః కాంతిః సౌభాగ్యమభిరూపతా |
సత్యం దయా క్షమా శాంతిర్దాక్షిణ్యం ధర్మశీలతా ‖ 173 ‖

జగత్సంవననం విశ్వసంవాదో వేదపాటవమ్ |
సభాపాండిత్యమౌదార్యం గాంభీర్యం బ్రహ్మవర్చసమ్ ‖ 174 ‖

ఓజస్తేజః కులం శీలం ప్రతాపో వీర్యమార్యతా |
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం స్థైర్యం విశ్వాసతా తథా ‖ 175 ‖

ధనధాన్యాదివృద్ధిశ్చ సకృదస్య జపాద్భవేత్ |
వశ్యం చతుర్విధం విశ్వం జపాదస్య ప్రజాయతే ‖ 176 ‖

రాజ్ఞో రాజకలత్రస్య రాజపుత్రస్య మంత్రిణః |
జప్యతే యస్య వశ్యార్థే స దాసస్తస్య జాయతే ‖ 177 ‖

ధర్మార్థకామమోక్షాణామనాయాసేన సాధనమ్ |
శాకినీడాకినీరక్షోయక్షగ్రహభయాపహమ్ ‖ 178 ‖

సామ్రాజ్యసుఖదం సర్వసపత్నమదమర్దనమ్ |
సమస్తకలహధ్వంసి దగ్ధబీజప్రరోహణమ్ ‖ 179 ‖

దుఃస్వప్నశమనం క్రుద్ధస్వామిచిత్తప్రసాదనమ్ |
షడ్వర్గాష్టమహాసిద్ధిత్రికాలజ్ఞానకారణమ్ ‖ 180 ‖

పరకృత్యప్రశమనం పరచక్రప్రమర్దనమ్ |
సంగ్రామమార్గే సవేషామిదమేకం జయావహమ్ ‖ 181 ‖

సర్వవంధ్యత్వదోషఘ్నం గర్భరక్షైకకారణమ్ |
పఠ్యతే ప్రత్యహం యత్ర స్తోత్రం గణపతేరిదమ్ ‖ 182 ‖

దేశే తత్ర న దుర్భిక్షమీతయో దురితాని చ |
న తద్గేహం జహాతి శ్రీర్యత్రాయం జప్యతే స్తవః ‖ 183 ‖

క్షయకుష్ఠప్రమేహార్శభగందరవిషూచికాః |
గుల్మం ప్లీహానమశమానమతిసారం మహోదరమ్ ‖ 184 ‖

కాసం శ్వాసముదావర్తం శూలం శోఫామయోదరమ్ |
శిరోరోగం వమిం హిక్కాం గండమాలామరోచకమ్ ‖ 185 ‖

వాతపిత్తకఫద్వంద్వత్రిదోషజనితజ్వరమ్ |
ఆగంతువిషమం శీతముష్ణం చైకాహికాదికమ్ ‖ 186 ‖

ఇత్యాద్యుక్తమనుక్తం వా రోగదోషాదిసంభవమ్ |
సర్వం ప్రశమయత్యాశు స్తోత్రస్యాస్య సకృజ్జపః ‖ 187 ‖

ప్రాప్యతేఽస్య జపాత్సిద్ధిః స్త్రీశూద్రైః పతితైరపి |
సహస్రనామమంత్రోఽయం జపితవ్యః శుభాప్తయే ‖ 188 ‖

మహాగణపతేః స్తోత్రం సకామః ప్రజపన్నిదమ్ |
ఇచ్ఛయా సకలాన్ భోగానుపభుజ్యేహ పార్థివాన్ ‖ 189 ‖

మనోరథఫలైర్దివ్యైర్వ్యోమయానైర్మనోరమైః |
చంద్రేంద్రభాస్కరోపేంద్రబ్రహ్మశర్వాదిసద్మసు ‖ 190 ‖

కామరూపః కామగతిః కామదః కామదేశ్వరః |
భుక్త్వా యథేప్సితాన్భోగానభీష్టైః సహ బంధుభిః ‖ 191 ‖

గణేశానుచరో భూత్వా గణో గణపతిప్రియః |
నందీశ్వరాదిసానందైర్నందితః సకలైర్గణైః ‖ 192 ‖

శివాభ్యాం కృపయా పుత్రనిర్విశేషం చ లాలితః |
శివభక్తః పూర్ణకామో గణేశ్వరవరాత్పునః ‖ 193 ‖

జాతిస్మరో ధర్మపరః సార్వభౌమోఽభిజాయతే |
నిష్కామస్తు జపన్నిత్యం భక్త్యా విఘ్నేశతత్పరః ‖ 194 ‖

యోగసిద్ధిం పరాం ప్రాప్య జ్ఞానవైరాగ్యసంయుతః |
నిరంతరే నిరాబాధే పరమానందసంజ్ఞితే ‖ 195 ‖

విశ్వోత్తీర్ణే పరే పూర్ణే పునరావృత్తివర్జితే |
లీనో వైనాయకే ధామ్ని రమతే నిత్యనిర్వృతే ‖ 196 ‖

యో నామభిర్హుతైర్దత్తైః పూజయేదర్చయే^^ఏన్నరః |
రాజానో వశ్యతాం యాంతి రిపవో యాంతి దాసతామ్ ‖ 197 ‖

తస్య సిధ్యంతి మంత్రాణాం దుర్లభాశ్చేష్టసిద్ధయః |
మూలమంత్రాదపి స్తోత్రమిదం ప్రియతమం మమ ‖ 198 ‖

నభస్యే మాసి శుక్లాయాం చతుర్థ్యాం మమ జన్మని |
దూర్వాభిర్నామభిః పూజాం తర్పణం విధివచ్చరేత్ ‖ 199 ‖

అష్టద్రవ్యైర్విశేషేణ కుర్యాద్భక్తిసుసంయుతః |
తస్యేప్సితం ధనం ధాన్యమైశ్వర్యం విజయో యశః ‖ 200 ‖

భవిష్యతి న సందేహః పుత్రపౌత్రాదికం సుఖమ్ |
ఇదం ప్రజపితం స్తోత్రం పఠితం శ్రావితం శ్రుతమ్ ‖ 201 ‖

వ్యాకృతం చర్చితం ధ్యాతం విమృష్టమభివందితమ్ |
ఇహాముత్ర చ విశ్వేషాం విశ్వైశ్వర్యప్రదాయకమ్ ‖ 202 ‖

స్వచ్ఛందచారిణాప్యేష యేన సంధార్యతే స్తవః |
స రక్ష్యతే శివోద్భూతైర్గణైరధ్యష్టకోటిభిః ‖ 203 ‖

లిఖితం పుస్తకస్తోత్రం మంత్రభూతం ప్రపూజయేత్ |
తత్ర సర్వోత్తమా లక్ష్మీః సన్నిధత్తే నిరంతరమ్ ‖ 204 ‖

దానైరశేషైరఖిలైర్వ్రతైశ్చ తీర్థైరశేషైరఖిలైర్మఖైశ్చ |
న తత్ఫలం విందతి యద్గణేశసహస్రనామస్మరణేన సద్యః ‖ 205 ‖

ఏతన్నామ్నాం సహస్రం పఠతి దినమణౌ ప్రత్యహంప్రోజ్జిహానే
సాయం మధ్యందినే వా త్రిషవణమథవా సంతతం వా జనో యః |
స స్యాదైశ్వర్యధుర్యః ప్రభవతి వచసాం కీర్తిముచ్చైస్తనోతి
దారిద్ర్యం హంతి విశ్వం వశయతి సుచిరం వర్ధతే పుత్రపౌత్రైః ‖ 206 ‖

అకించనోప్యేకచిత్తో నియతో నియతాసనః |
ప్రజపంశ్చతురో మాసాన్ గణేశార్చనతత్పరః ‖ 207 ‖

దరిద్రతాం సమున్మూల్య సప్తజన్మానుగామపి |
లభతే మహతీం లక్ష్మీమిత్యాజ్ఞా పారమేశ్వరీ ‖ 208 ‖

ఆయుష్యం వీతరోగం కులమతివిమలం సంపదశ్చార్తినాశః
కీర్తిర్నిత్యావదాతా భవతి ఖలు నవా కాంతిరవ్యాజభవ్యా |
పుత్రాః సంతః కలత్రం గుణవదభిమతం యద్యదన్యచ్చ తత్త -
న్నిత్యం యః స్తోత్రమేతత్ పఠతి గణపతేస్తస్య హస్తే సమస్తమ్ ‖ 209 ‖

గణంజయో గణపతిర్హేరంబో ధరణీధరః |
మహాగణపతిర్బుద్ధిప్రియః క్షిప్రప్రసాదనః ‖ 210 ‖

అమోఘసిద్ధిరమృతమంత్రశ్చింతామణిర్నిధిః |
సుమంగలో బీజమాశాపూరకో వరదః కలః ‖ 211 ‖

కాశ్యపో నందనో వాచాసిద్ధో ఢుంఢిర్వినాయకః |
మోదకైరేభిరత్రైకవింశత్యా నామభిః పుమాన్ ‖ 212 ‖

ఉపాయనం దదేద్భక్త్యా మత్ప్రసాదం చికీర్షతి |
వత్సరం విఘ్నరాజోఽస్య తథ్యమిష్టార్థసిద్ధయే ‖ 213 ‖

యః స్తౌతి మద్గతమనా మమారాధనతత్పరః |
స్తుతో నామ్నా సహస్రేణ తేనాహం నాత్ర సంశయః ‖ 214 ‖

నమో నమః సురవరపూజితాంఘ్రయే
నమో నమో నిరుపమమంగలాత్మనే |
నమో నమో విపులదయైకసిద్ధయే
నమో నమః కరికలభాననాయ తే ‖ 215 ‖

కింకిణీగణరచితచరణః
ప్రకటితగురుమితచారుకరణః |
మదజలలహరీకలితకపోలః
శమయతు దురితం గణపతినామ్నా ‖ 216 ‖

‖ ఇతి శ్రీగణేశపురాణే ఉపాసనాఖండే ఈశ్వరగణేశసంవాదే
గణేశసహస్రనామస్తోత్రం నామ షట్చత్వారింశోధ్యాయః
**********************

బిల్వార్చన ప్రాధాన్యం

కార్తీక మాసం లో బిల్వార్చన ప్రాధాన్యం ఏమిటి? కార్తీక మాసం లో బిల్వదళాలతో శివుణ్ణి, తులసీ దళాళతో విష్ణువు ని సేవించాలి. అసలు ఆ పరమేశ్వరుడు ని చూసిన వెంటనే ఒక బిల్వదళం సమర్పించాలి. ముందుగా బిల్వదళం సమర్పించ కుండా శివునికి అభిషేకం చేయకూడదు. కేవలం జలంతోనే అభిషేకించే సందర్భంలో కూడా తప్పనిసరిగా లింగంపై బిల్వదళం వేయడం తప్పనిసరి అని భక్తులు భావిస్తారు. బిల్వ వ్రుక్చం ను మారేడు అని పిలుస్తారు. మూడేసి ఆకులు పరమేశ్వరుని త్రిశూలాన్ని, త్రినేత్ర లను గుర్తు తెచ్చేలా ఉంటుంది. బిల్వదళం త్రిమూర్తులు కు ప్రతీకగా కూడా చెబుతుంటారు. వివిధ రకాల పువ్వులు తో పూజించడం కన్నా ఒక్క బిల్వదళం సమర్పిస్తే శివుడు ఎక్కువ సంతోషపడతాడని చెబుతారు. అందుకే పరమేశ్వరుని అనుగ్రహం కోరే భక్తులు అత్యధిక సంఖ్యలో బిల్వ దళాళతో పూజిస్తారు. కార్తీకమాసంలో ఎక్కువగా లక్ష పత్రి పూజలు జరుగుతూ ఉంటాయి. బిల్వదళానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దానిని ఎన్ని సార్లు అయినా సమర్పించవచ్చు. ఒకరోజు సమర్పించిన బిల్వదళాన్ని మరుసటి రోజు కూడా సమర్పించవచ్చు. క్రింద పడినా బిల్వదళానికి ఉండే పవిత్రత చెడిపోదు. సేకరణ
*******************

నరదృష్టి తొలగిపోవాలంటే.....

నరదృష్టి*
వారానికి ఓసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి అంటే కంటిదృష్టి దూరమవుతుంది. శారీరక అలసట వుండదు. సోమరితనం పరారవుతుంది. ముఖ్యంగా పుట్టిన రోజుల్లో లేకుంటే మంగళవారం చేస్తే కంటిదృష్టి తొలగిపోతుంది.అనారోగ్య సమస్యలు తలెత్తవు.

అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలంటే.. నిమ్మపండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది వాకిటికి ఇరువైపులా వుంచితే.. అదీ మంగళవారం పూట ఇలా చేస్తే కంటి దృష్టి లోపాలుండవు.

అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణీ వేయడం మంచిది. పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంటా, వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి.. ఆదాయం లభిస్తుంది.

ఋణబాధలుంటే.. వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం మంచిది. కులదైవ పూజ చేయాలి. వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరి కాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపమెలిగిస్తే మంచి ఫలితాలుంటాయి.ఈతిబాధలు తొలగిపోతాయి.

శుక్లపక్షంలో వచ్చే శని, ఆదివారాల్లో సముద్రతీరానికి వెళ్లి ఆ నీటిలో వాటర్ బాటిల్‌లో తెచ్చుకుని అందులో పసుపు పొడిని కలిపి.. ఇంట్లో, కార్యాలయంలో చల్లినట్లైతే కంటి దృష్టి తొలగిపోతుంది. ఇంకా సముద్రపు నీటిలో స్నానం చేయడం ద్వారా శరీరంలోని ఏడు చక్రాలకు బలం చేకూరుతుంది.
****************

మహారాజు యుధిష్ఠిరుడు గొప్ప నీతికోవిదుడు,

మహారాజు యుధిష్ఠిరుడు గొప్ప విద్యావంతుడు, నీతికోవిదుడు, ధర్మయర్మాలు తెలిసినవాడు మాత్రమే కాదు. అద్భుతమైన సమతాద్రుక్పథం కలవాడు. ఒకప్పటి సంఘటన ఇది. పాండవులు వనంలో ఉండగా - ఒక బ్రాహ్మణుడు తన అరణిని, మథించే కర్రను ఒక చెట్టు కొమ్మ కు వ్రేలాడగట్టాడు. (యఙ్ఞవిధికి వలయు అగ్ని ని స్రుష్ఠించుటకు శాస్త నిర్దిష్టములైన రెండు కర్రలను తెచ్చి ఒకదానితో ఒకటి ఒరపిడిపెడతారు. అందు ఒకదానిని ఆరణి అని, రెండవ దానిని మంథనకాష్టము అని అంటారు.) ఆ సమయంలో ఎక్కడనుండియో ఒక లేడి వచ్చి తన కొమ్మును తీట తీర్చుకొనుటకు ఆ కర్రలకు రాచికోవడం మొదలు పెట్టింది. అప్పుడు ఆ కర్రలు దాని కొమ్ము ల లో ఇరుక్కొనిపోయాయి. ఆ కర్రలతో అది పారిపోయింది. ఆ కర్రలు లేకపోవుట చేత తన యఙ్ఞవిధికి అవరోధం కలుగునని ఎంచి ఆ బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వెళ్లి తన ఆరణిని, మంథనకాష్టము ను తెచ్చి ఇమ్మని ప్రార్ధించాడు. అప్పుడు ధర్మరాజు తన సోదరులను నలుగురు ని తీసుకుని ఆ లేడి వెనుక పరుగులు పెట్టాడు. కానీ ఆ మ్రుగము చూస్తుండగానే కనుచూపుకు అందనంత దూరం పోయింది. పరుగులు పెట్టి పాండవులు దాహం వేసింది. అన్న అనుమతి ని తీసుకుని నకులుడు నీటిని వెదకడానికి వెళ్ళగా అతనికి దగ్గర లోనే ఒక జలాశయం కనపడింది. అతడు దానిని సమీపించి నీరు త్రాగబోతుండగా "ఆగు! ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. అనంతరం నీరు సేవించు" అన్న ఆకాశవాణి వినిపించింది. అయినా దాహం ఎక్కువగా ఉండడంతో ఆ వాణిని లెక్క చేయకుండా నీరు త్రాగుడు. వెంటనే అతడు నిర్జీవుడై నేలమీద కూలిపోయాడు. అతని వెనుక ధర్మరాజు, సహదేవుడు ని, అర్జునుడు ని, భీమసేనుడు ని కూడా పంపాడు. వారి ముగ్గురు కి కూడా అదే గతి పట్టింది. ఆఖరికి ధర్మరాజు కూడా ఆ జలాశయం దగ్గర కు వచ్చాడు. అతడు నిశ్చేష్ఠుడై పడియున్న తన నలుగురు సోదరులను చూశాడు. అతనికి కూడా ఆ ఆకాశవాణి వినిపించింది. అంతలో అతనికి విశాలకాయుడైన యక్షుడు కనిపించేడు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు త్రాగినందువలన నీ సోదరులు కు ఈ దురవస్థ పట్టింది. నువ్వు కూడా వీరివలే అనధికారచేష్ఠకు పాల్పడితే ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది అని ఆ యక్షుడు హెచ్చరించాడు. అప్పుడు ధర్మనందనుడు ఆ యక్చుని ప్రశ్నలకు సమాధానం చెప్పుటకు సిద్ధమయ్యాడు. యక్షుడు అడిగిన అన్ని ప్రశ్నలకు అన్నిటికీ క్రమంగా సముచితరీతిని సమాధానం లు చెప్పాడు. అప్పుడు యక్షుడు ప్రసన్నత చెంది రాజేంద్రా! నీ సోదరులలో ఎవర్ని బ్రతికించుమన్న వానిని బ్రదికించెదను. ఎవరిని బ్రతికించ మందువు? అని ధర్మరాజు అడిగాడు. ధర్మరాజు నకులుడు ని సజీవంగా చూడగోరాడు. కారణం ఏమని యక్షుడు అడిగాడు. అందులకు ధర్మరాజు - మహాత్మా! నా తండ్రి కి కుంతి, మాద్రి అను ఇద్దరు భార్యలు ఉన్నారు. నా దృష్టిలో వారు ఇద్దరు నూ సమాన స్థితిలోనివారే. కుంతి కుమారునిగా నేను ఎలా సజీవంగా ఉన్నానో, అలాగే మాద్రి కుమారుడు కూడా ఒకడు సజీవుడు కావాలి అన్నది నా ఆకాంక్ష. ఆ కారణంగా భీముడి ని అర్జునుడు ని కాదని నకులుడు ని సజీవుడు గా ఉండాలని భావిస్తున్నాను అని బదులిచ్చాడు. యుధిష్ఠిరుని బుద్ధి కుశలతను, ధర్మనిష్ఠ ను పరీక్చించడం కోసమే స్వయంగా ధర్మదేవుడు ఈ లీలను సాగించేడు. ధర్మనందనుని సమతాద్రుక్పథం ను చూసి ఎంతయో సంతోషించి తన నిజరూపాన్ని చూపించాడు. అతని నలుగురు సోదరులను కూడా బ్రతికించాడు. అంతేకాకుండా తానే లేడి రూపము న వచ్చి బ్రాహ్మణుని మంథనకాష్టము ను కూడా అతనికి ఇచ్చి వేశాడు. యుధిష్ఠిరుడు ఆ మంథనకాష్టము ను తీసుకుని వెళ్లి ఆ బ్రాహ్మణుని కి ఇచ్చాడు.,... సేకరణ

*ఇది మన సంప్రదాయం*

*జైశ్రీమన్నారాయణ - జైశ్రీహనుమాన్*

సందేహం;- ప్రతి విషయంలోను *ఇది మన సంప్రదాయం* అంటూ ఉంటారు. సంప్రదాయం అంటే ఏమిటి?

సమాధానం;- మన ప్రాచీన ఋషులు, పెద్దలు, తాతలు అంటే పూర్వీకులు  మనకిచ్చిన సంస్కారం, ధర్మం, సంస్కృతి ఇవే సంప్రదాయం అంటే. తల్లిదండ్రుల నుంచి సంతానానికి సంక్రమించే సంపదను *దాయం* అంటారు.

ఈ దాయం ఏ రూపంలోనైనా ఉండవచ్చు. దాయాదులు, దాయభాగం అన్న మాటలు *దాయం* లోంచి వచ్చినవే. ఇలా వచ్చిన ఆస్తిపాస్తులు స్థిరంగా ఉండేవి కావు. అవి పెరుగుతాయి, తరుగుతాయి, వస్తాయి, పోతాయి.

ఇలా కాకుండా, మన జీవితాన్ని ఉన్నత మార్గంలో నడుపుకోవడానికి, మనం పదిమందిలో ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరిగేటట్లుగా మనల్ని తీర్చిదిద్దే సంస్కార పరంపరే సంప్రదాయం. ఇది తరతరాలకూ తరగని బంగారు గని. ఇది ఏ ఒక్క వ్యక్తి  కూడబెట్టలేనిది. విదేశాల నుంచి అరువు తెచ్చుకోలేనిది. అందుకే ఇది సంప్రదాయం అయింది.

పెద్దల వల్ల వచ్చినది దాయం. చక్కగా, సదాచారయుతంగా అందించబడేది ప్రదాయం. ప్రేమతో విశిష్టంగా ప్రదానం చేయబడేది సంప్రదాయం. సంప్రదాయ వాదులు అభివృద్ధి నిరోధకులు, మత దురభిమానులు, పిడివాదులు కారు. ఈ అపార్థం తొలగిపోవాలి.

ఈ సంప్రదాయం సనాతనం కూడా అవుతుంది. సనాతనం అంటే ప్రాచీనం పాతచింతకాయ పచ్చడి కాదు. సనాతనం అంటే త్రైకాలికం. గతంలో ఎలా ఉందో, వర్తమానంలోనూ, భవిష్యత్తులోను అలాగే ఉండేది. అది నిత్య నూతనం.

తోటి వారిని గౌరవించడం, పెద్దలను, గురువులను, అతిథి అభ్యాగతులను పూజించడం, ఆదరించడం, మాధవసేవగా సర్వ ప్రాణి కోటి సేవ చేయడం, స్వీయ ఆరాధన, సర్వాదరణ, దయ, ప్రేమ, సహానుభూతి సనాతన సంప్రదాయ ప్రతిరూపాలే *సంప్రదాయం* అంటే.

*శుభంభూయాత్*
***************

*ఒక్క క్షణం విలువ*

ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒకాయన ఉండేవాడు. 
చాలా చక్కని వాక్పటిమ గలవాడు. 
ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ వుంటే 
వేలమంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు.
ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది.

ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది. 
ఆ ఊరు వెళ్ళే బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు. 
అయితే పొరపాటున బస్సు కండక్టర్ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. 
పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు. 
కానీ బస్సునిండా జనం కిక్కిరిసి ఉండటంతో, 
దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు.

కొద్ది సేపు తరువాత అతని మనసులొ ఆలోచనలు మారాయి.

ఆ కండక్టరు కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు.

ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా! ఎంత మంది తినటంలేదు? నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి? 
ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యనికి ఉపయోగిస్తా......' 
అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు.

అంతలో వూరు వచ్చింది.... బస్సు ఆగింది. 
కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే 
తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా 
కండక్టరుకు ఇవ్వవలిసిన పది రూపాయలు ఇచ్చి 
"మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవి ఎక్కువగా ఇచ్చారు" అన్నాడు. 
దానికి ఆ కండక్టర్ "అయ్యా! నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను. 
మీరు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా 
అని చిన్న పరీక్ష చేశాను" అని అన్నాడు.

పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి 
'పది రూపాయల కోసం తుచ్ఛమైన ఆశతో 
నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను... 
నా అదృష్టం బాగుంది. 
నా మనస్సాక్షి సరైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకొని 
నా విలువలను కాపాడింది' అనుకున్నాడు.

జీవిత కాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా
సర్వనాశనం కావడానికి 
క్షణం చాలు....

ఒకానొక సందర్భం లో మీ శత్రువులు కూడా మీమీద ప్రయోగం చేస్తారు... మీ మంచితనాన్ని నాశనం చేయడానికి.... మీకు సంబంధం లేకుండానే మీ గురించి ప్రచారం చేస్తుంటారు... ఆ ప్రచారం అవునా కదా అని తెలుసుకోకుండా వాళ్ళు కళ్ళు ఉండి కూడా గుడ్డిగా నమ్ముతారు... అది వాళ్ళ కర్మ...

కానీ మీరు మాత్రం జాగ్రత్త... గడియారం లో సెకండ్ ముళ్ళు ఎలా తిరుగుతుందో అలానే మీ జీవితాన్ని ప్రతి సెకండ్ ని గమనిస్తూ ముందుకు సాగండి....

మంచితనానికి ఎపుడు చావు లేదు.... 

మీరు బ్రతికి ఉన్నంత కాలము మంచి పేరుతో జీవించాలి... మరణించాకా కూడా ఆ మంచి పేరు నిలచిపోవాలి.
******************

తెలుగు అక్షరమాలతో అద్భుతమైన వాక్యాలు

అ:- అన్వేషించడం మొదలుపెట్టు...

ఆ:- ఆత్మవిశ్వాసానికి పదునుపెట్టు...

ఇ:- ఇష్టపడటం నేర్చుకో...

ఈ:- ఈర్ష్యపడటం మానుకో...

ఉ:- ఉన్నతంగా ఆలోచించు...

ఊ:- ఊహకు అందేలా ఆచరించు...

ఋ:- ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు...

ఎ:- ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు...

ఏ:- ఏకాగ్రతను అసలు కోల్పోకు...

ఐ:- ఐక్యమత్యాన్ని సాధించడం మర్చిపోకు...

ఒ:- ఒంటరి జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది...

ఓ:- ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒక రోజు గెలుపుకు బాటలు వేస్తాయి...

ఔ:- ఔన్నత్యానికి గెలుపోటములు నీ  పునాదులు అని మరువకు...

అం:- అందని ఎత్తుకు ఎదగాలంటే...

అః:- అఃర్నిశలుగా ఇప్పటి నుండి శ్రమించాలని తెలుసుకో....

క:- కష్టపడి పనిచేయడం నేర్చుకో...

ఖ:- ఖచ్చితత్వం అలవరుచుకో....

గ:- గమ్యాన్ని ఎంచుకొని పయనించు...

ఘా:- ఘాటుగా స్పందించడం నేర్చుకో...

జ్ఞ:- జ్ఞాపకాలను గుర్తుంచుకొని మసలుకో...

చ:- చతురతను ప్రతి విషయంలో నేర్పుగా  వ్యవహరించు...

ఛ:- ఛత్రపతిలా జీవితాన్ని సార్ధకం చేసుకో....

జ:- జగడాలకు దూరంగా ఉండు..

ఝ:- ఝుమ్మంది నాదంగా మారు...

ణ:- జనగణమన గీతాన్ని మర్చిపోకు..

త:- తర తమ బేధాలను అణగదొక్కు.

థ:- థదేకంగా ధ్యానించు....

ద:- దయాదాక్షిణ్యాలు కలిగివుండు...

ధ:- ధర్మమును ఎల్లప్పుడూ ఆచరించు...

న:- నట జీవితం నేర్చుకోకు...

ప:- పరిహాసమాడకు...

ఫ:- ఫలితాలను సమంగా చూడు...

బ:- బలముతో అన్ని పనులు నెరవేరవు...

భ:- భయాన్ని దరిచేర నీయకు...

మ:- మర్యాదగా వ్యవహారించు...

య:- యవ్వనాన్ని అపహాస్యం చేయకు...

ర:- రంగురంగుల జీవితంలో పడి మోసపోకు...

ల:- లక్షణమైన జీవితాన్ని ఏర్పరుచుకో...

వ:- వంచనకు గురికాకు, గురిచేయకు...

శ:- శిరస్సును వంచుకునే పనిచేయకు...

ష:- షడ్రుచులను ఆస్వాదించు...

స:- సన్నిహితులను ఏర్పరుచుకో...

హ:- హానికరమైన పనులు ఏనాడు చేయకు...

ళ:- అవహేళన చేయకు...

క్ష:- క్షణికావేశానికి లోనుకాకు...

ఱ:- ఱణాన ఎదురు నిలువు...!!
*****************

కరోనా-వినాయకచవిత్

కం.  
ఎక్కడ గణపతి మైకులు?
ఎక్కడ నిను గొలుచు బృందమెక్కడ భజనల్?
ఎక్కడ లడ్డూ వేలము?
ఎక్కడ గత ప్రాభవమ్ము మేదినియందున్?
★   ★

తే.గీ.
కొమ్ము దేవర కొలిచేము రమ్ము రమ్ము
వచ్చి వైరసును చిదిమ వాంఛితమ్ము
వక్రతుండుడ సేవింప సక్రమమ్ము
భయమునంతయు పోగొట్టు వందనమ్ము!
★   ★

తే.గీ.
వీధివీధిన అలరారు విగ్రహాలు
సందు సందున పూజించు సంఘములును
సొంపులీనగ నర్తించు బృందములును
కానరావేమి యీవేళ కలికి మాయ !
****************

ఋషి పంచమి వ్రత ప్రాశస్త్యము

భవిష్యోత్తర పురాణం ఈ ఋషి పంచమి వ్రత ప్రాశస్త్యమును వివరిస్తోంది. పేరుకు ఋషి పంచమి అయినా ఇది పూర్తిగా స్త్రీలకు సంబందించిన వ్రతంగా చెప్పబడినది. ఒకానొకప్పుడు సివాశ్వడు అనే రాజు స్త్రీల పాపాల్ని తక్షణమే హరించే వ్రతం గురించి అడుగగా బ్రహ్మ ఈ వ్రతాన్ని ఉపదేశించినట్లుగా " వ్రతకల్పం" పేర్కొన్నది.
పూర్వం విదర్భలో ఉత్తంగుడనే బ్రాహ్మణునకు బాలవితంతువు అయిన ఒక కుమార్తె, వేదాధ్యయనం చేసే ఒక కుమారుడు ఉన్నారు. విద్యార్ధులకు వేదం నేర్పుతూ ఈ బ్రాహ్మణుడు జీవనం చేస్తూ ఉండగా, ఒక రోజు ఆయన కుమార్తె దేహం నుండి పురుగులు రాలిపడ్డాయి. ఈ సంఘటనతో ఆ బాలిక స్పృహతప్పి పడిపోగా, ఉత్తంగుడు తన ఉపాసనా బలం వలన ఆమె పూర్వ జన్మలో రజస్వల అయి ఉండి , ఇంటిలోని అన్నపు గిన్నెలను ముట్టుకోవడం వలన ప్రస్తుతం తన కుమార్తె దేహం క్రిమిభూయిష్టమైనదని తెలుసుకున్నాడు .అప్పుడా బాపడు తన కూతురు చేత ఋషిపంచమీ వ్రతాన్ని చేయించి, గత జన్మలో ఆమె రజస్వలగా ఉన్న సమయంలో చేసిన పాపాలను హరించివేశాడు. భాద్రపద శుద్ధ పంచమి నాడు ఏ స్త్రీ అయితే ఈ వ్రతాన్ని నిష్ఠగా ఆచరిస్తుందో, ఆమె రజస్వలగా ఉండి చేసిన దోషాలన్నీ హరించబడతాయి.

పూర్వకాలంలో ఇంద్రుడు వృతాసుర వధ చేసి బ్రహ్మహత్యా పాతకం పొందాడు.అప్పుడు ఇంద్రుడు తన పాపంలో ఒక పావు వంతు భాగాన్ని స్త్రీలకు ఇచ్చాడు. ఆనాటి నుండి స్త్రీలు రజో ధర్మాన్ని పొంది, రజస్వలలు కావడం ప్రారంభమైనది. రజస్వలా కాలంలో వారు తెలిసీ తెలియక చేసే పాపాలను పోగొట్టడానికి బ్రహ్మ ఈ ఋషిపంచమి వ్రతాన్ని కలిపంచాడని పురాణ కథనం.

విదర్భలో శ్వేతజితుడనే క్షత్రీయుడు, సుమిత్ర అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేవారు. శ్వేతజితుడు కృషి కర్మలో ఉండటం వలన, తెలియక రజస్వల, అయిన స్త్రీలను తాకడం , వారితో సంబాషించడం వంటి పనులు చేశాడు. సుమిత్ర కూడా రజస్వలగా ఉన్నా అందర్నీ ముట్టుకుంటూ ఉండేది. అవసానకాలంలో వారు ఇద్దరూ మృతి చెంది, సుమిత్ర కుక్క గానూ, శ్వేతజితుడు ఎద్దుగానూ సుమిత్ర కొడుకైన గంగాధరుని ఇంటినే జన్మించారు.

కాలం గడుస్తున్నది.సుమిత్ర శ్రాద్ధదినం వచ్చింది. గంగాధరుడు శ్రద్ధగా. శ్రాద్ధ క్రియ ఆచరించి, బియ్యపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించేలోగా,పాయసాన్ని ఒక పాము ముట్టడం చూసిన కుక్క, అతిథులకు ఆ పాయసం పెడితే మరణిస్తారని తలంచి,అందరూ చూస్తూండగానే తాను ఆ పాయసాన్ని ఎంగిలి చేసింది. కుక్కముట్టిన పాయసం పనికి రాదు కనుక వంట మనిషి మళ్ళీ పాయసం వండి అతిథులను తృప్తి పరచింది. కానీ కుక్క పాయసాన్ని ముట్టినందున కోపంతో, ఆ రోజు దానికి ఆహారం ఇవ్వలేదా వంటమనిషి.
కుక్కరూపంలోఉన్నది తానని తెలియక కొడుకు సైతం తన పట్ల నిర్లక్ష్యం వహించడం చూసిన సుమిత్ర ఈనాడు నా కొడుకు చేసిన శ్రాద్ధం వ్యర్ధం అయింది కదా! అని ఎద్దురూపంలో ఉన్న క్షత్రియునకు చెప్పుకుంది. ఈ రెండు మూగ జీవాల భాషను తెల్సిన గంగాధరుడు మర్నాడు తన గురువు వద్దకు వెళ్ళి, వాళ్ళ శాపవృత్తాంతము తెలుసుకుని, తాను ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించి, వారికి పశుజన్మల నుండి విముక్తి కలిగించి, ఉత్తమ గతులు పొందునట్లు చేసి మాతృఋణ విముక్తుడయ్యాడు.

ఈ వ్రతం ఎల ఆచరించాలి?

ఋషిపంచమి వ్రతం ప్రాయశ్చితాత్మకమైన వ్రతం. ఈ వ్రతం విధానాలు మనలో చాలామందికి తెల్సినా ఆచరించే వాళ్ళు తక్కువ! ఒకవేళ ఆచరించినా చాలా అశాస్త్రీయంగా చేయడం విచారకరం.
పంచమినాటి తెల్లవారుఝామున స్త్రీలు స్నానం చేసి పుష్పసంచయనం చేయాలి. స్నానం చేస్తున్న సమయంలోనే వ్రత సంకల్పాన్ని చెప్పుకోవాలి. అనంతరం గణపతి పూజ పూర్తిచేసి, ఉత్తరేణి మొక్కకు పూజసల్పి, దాన్ని సమూలంగా పెరికివేసి,దాని కొమ్మతో దంతధావనం ( పళ్ళుతోమడం) చేయాలి. పుణ్యస్త్రీలు విభుడి, గోపిచందనం,పంచగవ్యములతో స్నానించాలి. ఈ తంతు ముగియగానే ఆకాశంలోని సప్తఋషులను,అరుంధతిని చూస్తూ ఋషి పూజ చేయాలి.

పూజలో నాల్గువత్తుల దీపం ఉండాలి. పూజానంతరం, భోజనంలో బఱ్ఱె పెరుగు, వేయించిన శనగలు, తోటకూర కూరను భుజించాలి.
వివాహితలు ఈ వ్రతంవల్ల భర్త ప్రేమనూ, వితంతువులు రాబోయే జన్మలో ఆయుష్మంతుడైన భర్తను పొందుతారని " వ్రతోత్సవ చరిత్ర " స్పష్టం చేస్తున్నది. ఋషిపంచమి మధ్యాహ్నకాల వ్యాపిని అయి ఉండాలి. పంచమి తిధి ఉభయదినవ్యాపినిగా ఉంటే మొదటిరోజునే ఈ వ్రతం ఆచరించాలి.

నీలమతపురాణం ఋషిపంచమిని వరుణపంచమిగానూ, " జ్యోతిషీ" రక్షాపంచమిగానూ, స్మృతి కౌస్తుభమౌ - చతుర్వర్గ చింతామణి - పురుషార్ధ చింతామణి వంటి పలు ప్రాచీన గ్రంథాలు"ఋషిపంచమి" గానూ పేర్కొనడం జరుగింది. నామాలు వేరు అయినప్పటికి స్త్రీలు ఈ రోజున ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించినట్లయితే జన్మ జన్మలందు రజస్వలయై చేసిన దోషములు హరించబడతాయి. ఇది స్త్రీల వ్రతం. ప్రతి స్త్రీ ఆచరించవలసిన వ్రతం.
********************

దీపారాధన

దీపారాధన చేయటంలో అర్థం ఏమిటి? పూజా మందిరంలో దేవుని ముందు దీపం వెలిగించడం లో మన పూర్వీకులు చాలా వేదాంతం చేర్చిపెట్టారు. నూనె, వత్తి, జ్వాల ఈ మూడింటిని ఎలా వర్ణించారో చూద్దాం. నూనె ను కర్మ ఫలంగానూ, వత్తిని శరీరం గానూ, జ్వాల ను ప్రాణం గానూ భావించారు. కర్మ ఫలం అనే నూనె ఉన్నంతవరకే, వత్తి అనే శరీరంలో, జ్వాల అనే ప్రాణం ఉంటుంది. కర్మ ఫలం పూర్తి అవగానే ప్రాణం శరీరాన్ని వదిలి పెడుతుంది. జ్వాల వెలుగులో దేవున్ని స్పష్టం గా చూస్తూ, చుట్టూ ఉన్న చీకటి ని తొలగిస్తాం. అదేవిధంగా శరీరంలో ప్రాణం ఉండగానే అఙ్ఞానమనే చీకటిని తొలగించి, మనలో ఉన్న ఆత్మను దర్శించమని అర్థం. దేవుని ముందు దీపారాధన చేసేటప్పుడు రెండు ప్రమిదలలో ఒక్కొక్క వత్తి వేసి వెలిగిస్తాము. లేదా ఒకే ప్రమిదలో రెండు వత్తులు వేసి వెలిగిస్తాము. కర్మ ఫలం అనుభవించేటప్పుడు జీవాత్మ తో పాటు పరమాత్మ కూడా సాక్షిగా ఉంటాడు. అందుకే రెండు వత్తులు వేసి వెలిగిస్తారు. దీపం మధ్యలో ఆరిపోతే పాత వత్తి తీసి అదే నూనెలో ఇంకో వత్తి పెట్టి వెలిగిస్తారు. అంటే ఒకసారి ప్రాణం పోయిన శరీరం పనికిరాదని అర్థం. మానవుడు చనిపోయినప్పుడు శిరస్సు వద్ద ఒకే వత్తితో దీపం పెడతారు. అంటే జీవాత్మ పరమాత్మలో కలిసిపోయిందని అర్థం. ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర. సేకరణ
**************

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదునారవ అధ్యాయము*

*పయోవ్రతమును ఆచరింపుమని కశ్యపమహర్షి అదితికి ఉపదేశించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*16.1 (ప్రథమ శ్లోకము)*

*ఏవం పుత్రేషు నష్టేషు దేవమాతాదితిస్తదా|*

*హృతే త్రివిష్టపే దైత్యైః పర్యతప్యదనాథవత్॥6896॥*

*శ్రీశుకుడు వచించెను* - "పరీక్షిన్మహారాజా! దేవతలు ఈ విధముగ స్వర్గమునుండి పారిపోయి దాగికొనగ దైత్యులు స్వర్గాధిపత్యమును పొందిరి. అంతట దేవమాతయైన అదితి అనాథవలె మిగుల దుఃఖించెను".

*16.2 (రెండవ శ్లోకము)*

*ఏకదా కశ్యపస్తస్యా ఆశ్రమం భగవానగాత్|*

*నిరుత్సవం నిరానందం సమాధేర్విరతశ్చిరాత్॥6897॥*

"ప్రజాపతియైన కశ్యపుడు చాలదినములకు పిమ్మట ఒకనాడు తన తపస్సమాధి నుండి మేల్కొనెను. అప్పుడప్ఫుడతడు అదితి ఆశ్రమమునకు ఏతెంచెను. అచట సుఖశాంతులుగాని, ఏవిధమైన ఉత్సాహముగాని, అలంకరణములు గాని, లేకుండుట గమనించెను".

*16.3 (మూడవ శ్లోకము)*

*స పత్నీం దీనవదనాం కృతాసనపరిగ్రహః|*

*సభాజితో యథాన్యాయమిదమాహ కురూద్వహ॥6898॥*

"మహారాజా! అచటికి వెళ్ళి, సుఖాసీనుడైన పిదప అదితి విధ్యుక్తముగా ఆయనను సత్కరించెను. అపుడు అదితి ముఖము దైన్యముతో వాడిపోయి యుండుటను జూచి కశ్యపుడు ఆమెతో ఇట్లనెను"

*16.4 (నాలుగవ శ్లోకము)*

*అప్యభద్రం న విప్రాణాం భద్రే లోకేఽధునాఽఽగతమ్|*

*న ధర్మస్య న లోకస్య మృత్యోశ్ఛందానువర్తినః॥6899॥*

"కల్యాణీ! ఇప్పుడు బ్రాహ్మణులకు ఎట్టి ఆపదయు కలుగలేదుగదా! ధర్మపాలన చక్కగా కొనసాగుచున్నదిగదా! భయంకరమైన కాలమునకు వశులైన జనులకు ఎట్టి అశుభమూ ప్రాప్తింపలేదుగదా!"

*16.5 (ఐదవ శ్లోకము)*

*అపి వాకుశలం కించిద్గృహేషు గృహమేధిని|*

*ధర్మస్యార్థస్య కామస్య యత్ర యోగో హ్యయోగినామ్॥6900॥*

"గృహిణీ! యోగసాధన చేయని వారికి గూడ గృహస్థాశ్రమమున యోగసాధన ఫలము లభించును. ఈ గృహస్థాశ్రమము నందు ధర్మార్థ కామములను ఆచరించుటలో ఏవిధమైన విఘ్నములును వాటిల్లలేదుగదా!"

*16.6 (ఆరవ శ్లోకము)*

*అపి వాతిథయోఽభ్యేత్య కుటుంబాసక్తయా త్వయా|*

*గృహాదపూజితా యాతాః ప్రత్యుత్థానేన వా క్వచిత్॥6901॥*

*16.7 (ఏడవ శ్లోకము)*

*గృహేషు యేష్వతిథయో నార్చితాః సలిలైరపి|*

*యది నిర్యాంతి తే నూనం ఫేరురాజగృహోపమాః॥6902॥*

"దేవీ! నీవు గృహకార్యములయందు నిమగ్నురాలవై అలసిసొలసి ఉండవచ్చును. అప్పుడు ఇంటికి వచ్చిన అతిథులు నీ చేత అతిథి సత్కారములు అందుకొనకయే మరలిపోయి యుండవచ్చును. అందువలన నీకు ధైర్యము కల్గియుండవచ్చును. కనీసము నీరైనను త్రాగకుంఢ అతిథులు వెళ్ళిపోయినచో, అట్టి గృహము నక్కల నివాసమునకు సమానము".

*16.8 (ప్రథమ శ్లోకము)*

*అప్యగ్నయస్తు వేలాయాం న హుతా హవిషా సతి|*

*త్వయోద్విగ్నధియా భద్రే ప్రోషితే మయి కర్హిచిత్॥6903॥*

"శుభాంగీ! నేను ఎప్పుడైననూ బయటికి వెళ్ళినప్పుడు ఉద్విగ్నతకు లోనై నీవు అగ్నులయందు హవిస్సులను సకాలమున సమర్పింపలేదా? యేమి?"

*16.9 (తొమ్మిదవ శ్లోకము)*

*యత్పూజయా కామదుఘాన్ యాతి లోకాన్ గృహాన్వితః|*

*బ్రాహ్మణోఽగ్నిశ్చ వై విష్ణోః సర్వదేవాత్మనో ముఖమ్॥6904॥*

"బ్రాహ్మణులు, అగ్ని, సర్వదేవమయుడైన శ్రీహరికి ముఖము వంటివారు. ఈ ఇద్దరిని పూజించిన గృహస్థుడు సకలకోరికలు పూర్తిగా నెరవేరునట్టి లోకములను పొందును".

*16.10 (పదియవ శ్లోకము)*

*అపి సర్వే కుశలినస్తవ పుత్రా మనస్విని|*

*లక్షయేఽస్వస్థమాత్మానం భవత్యా లక్షణైరహమ్॥6905॥*

"సాధ్వీ! నీవు సర్వదా ప్రసన్నురాలవై యుందువు. కాని, ఇప్పుడు నీ ముఖ లక్షణములను చూచినచో, నీ చిత్తము ఏదో ఒక ఆందోళనకు గురియైనట్లు తోచుచున్నది. నీ పుత్రులు అందరును క్షేమమేగదా!"

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదునారవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
******************

చవితి చంద్రుడు

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

ఈ పద్యం నాదికాదు. ఒక కవిగారిది.

టీవి లోనఁ గనఁబడెఁ జవితి చంద్రుండు🌙
భార్యలు మఱిరువురు వత్తురేమొ!🤔
ఉన్న దానితోనె యూపిరాడక యుండె🤪
విఘ్నరాజ! అడ్డపెట్టరావొ!🙏🏻

              *కవితా ప్రసాద్*
Bhargava Sarma:

ముప్పై దాటిన ఏ ముదిత
వరింపలేదని వేదనచెందుచున్సారచట
మరి ఇరువురు కావలెనా
కవిరాజ నీ ఆశకు కట్టవేయుము ఇపుడే
*****************

ఋణాను బంధo

*ఆధ్యాత్మికత అంటే..!*_
_{అందరినీ ప్రేమించటం }_

_ఆధ్యాత్మికత ఆంటే మనం నిత్యంచేసే పనుల్ని వదిలిపెట్టకుండా ఇంకా నైపుణ్యంతో చేయాలి అని అర్ధం._

_నీలోని నీశక్తి గ్రహించి, నువ్వంటే ఎవరివో తెలుసుకుని జ్ఞానాన్ని జీవితంలో ఆచరించడమే  ఆధ్యాత్మికత._

_ఈ ఆధ్యాత్మికత మనల్ని ఇంకా శక్తి మంతుడిని, జ్ఞానిని, ప్రతిభావంతుడిని చేస్తుంది._

_అందుకే  *"నహి జ్ఞానేన సదృశం"* అన్నది భగవద్గీత. మనలో జ్ఞానం ఆధ్యాత్మికత ఎంత ఉన్నాయో కనీసం వారానికి. ఒక్కరోజు అయినా పరిశీలించు కోవడం మంచింది. కాలం కర్పూరం కొద్దిగా కూడా ఉపయోగించక పోయినా కరిగి  పోతాయి._

_గతంలో మనం చేసుకున్న సత్కర్మల వలన లభించే గొప్ప అవకాశాలు మన నిర్లక్ష్యం బద్ధకం అజాగ్రత్త వలన చేజారి పోతాయి._

_ఆధ్యాత్మిక ప్రస్థానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు క్షణ కాలమైనా దాని పైనుండి దృష్టి మరల్చని స్థితియే ఏకాగ్రత. ఏ ఆకర్షణలు లౌకికమైన ఇంద్రియ సుఖాలు, ఆఖరికి జీవితంలోని మమతా మొహాలు కూడా నీ దృష్టిని మరల్చకూడదు._
     
_నీవు నీఆధ్యాత్మిక ప్రస్థానంతో తాదాత్మ్యం కావాలి. ఇదే సమయంలో మనం మన స్వధర్మాలను ఎంత మాత్రం మరచి పోకూడదు. నిత్య జీవితంలోని మనం నెరవేర్చ వలసిన ప్రతి పనిని మరింత నైపుణ్యంతో శ్రద్ధగా చేయాలి. లక్ష్యం స్థిరంగా ఉండాలి._

_ఆధ్యాత్మికత పేరుతో దీనికి లోపం కలిగిస్తే ఏ వ్యక్తితో మనకి ఉన్న ఈ జన్మలో తీర్చ వలసిన కర్మ ఋణాన్ని తీర్చక పోతే, అది రాబోయే జన్మ జన్మలకి వాయిదాపడే ప్రమాదముంది. ఇది కుటుంబంలోని వ్యక్తులకీ వర్తిస్తుంది, అనుబంధాలకీ, శత్రుత్వాలకీ కూడా వర్తిస్తుంది._

_ఈ కారణంగానే మనం కోరుకున్న వారితో కంటే, మనం కోరుకోని  వారితోనే వేదనా భరితంగాఎక్కువ  జీవితం గడపవలసి వస్తుంది. అనివార్యమైన బంధాలు బంధనాల్లా, వేదనకు గురి చేసినా సహనంతో భరించక తప్పదు.._

_మీకు ఓ సందేహం రావచ్చు. వేధిస్తూ మనతోటే అనివార్యంగా జీవించే వారిని ఎదిరించి దూరంగా వెళ్ళి పోకూడదా అని..?_

_అన్ని బంధాలను వదిలించుకోవడం సాధ్యం కాదు. 'ఋణానుబంధ రూపేణా పశు పత్నీ సుతాదాయా' అన్నారు._

_జీవులని ఋణాలు కలుపుతాయి. ప్రేమలూ కలుపుతాయి. రుణం తీరి పోతుంది. ప్రేమతో ఏర్పడ్డ బంధం పెరుగుతుంది. రుణం తీరిపోయిన వాళ్ళు ఒక్క క్షణం కూడా మనతో ఉండరు._

_ప్రేమ బంధం కలిగిన వారు ఎప్పటికి వెంటే ఉంటారు._

_అందరినీ ప్రేమిద్దాం. అందరితో ఋణానుబంధం కాక ప్రేమానుబంధం పొందుదాం. ఏకాగ్రత సాధిద్దాం !_
*******************

*మనుచరిత్ర* *ప్రబంధపరిచయం* 3

అరుణాస్పదపురం లో ఉండే ప్రవరాఖ్యుడు ప్రొద్దుటే భగవన్నామ స్మరణతో నిద్రలేస్తాడు.
వరణా నదిలో స్నానంచేస్తాడు.
 ఆ ఊరిలోని ప్రజలు అందరూ అతన్ని చూసి మెచ్చుకుంటారు.
 ప్రవరాఖ్యుడి కి బోలెడన్ని మాన్యాలున్నాయి. అవి బాగా పండుతాయి.
పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి. అతడు ఎవరిని దేహి అని  యాచించడు. అంతే కాదు ఎవరైనా ఏదైనా ఇచ్చెదమన్న పుచ్చుకోడు.  ఎవరైనా ఏదైనా ఇచ్చినచో  పుచ్చుకోవటం అంటే వారి పాపమును మనము తీసుకునుట  అనే భావన అతనిది.
. వారి ఇంటిలో నిరతాన్నదానము జరుగును.
పగలు లేదు, అర్ధరాత్రి అని లేదు. అతనికి పుణ్యక్షేత్రములు చూచి రావాలని ఒక ఆశ.
తీర్థయాత్రికులను మిక్కిలి గౌరవించును.
వారిని వారు సేవించిన  తీర్థములను గురించి అడుగుచుండును..
ఒకప్పుడు వారి ఇంటికి ఒక సిద్ధుడు వచ్చినాడు. రుద్రాక్ష పోగులు, అతడొక చిత్రముగా ఉన్నాడు. మనదేశంలో ఒక ధర్మం కలదు. *అభ్యాగత స్వయం విష్ణుః* అని అనగా అతిధి స్వయముగా విష్ణువు అని అర్థము.
అనగా ఇంటికి వచ్చిన అతిధిని విష్ణువుని చూచినట్లు చూడవలయును అని అర్థం.
ప్రవరుడు అతనిని అట్లే చూసినాడు. ప్రవరుడు అతనిని గౌరవించి ఆతిథ్యం ఇచ్చి, అయ్యా! "మీరు ఏఏ దేశములకు వెళ్ళినారు?
ఏమేమి చూచినారు? అని అడిగెను". అతడు తాను చూచిన దేశములను అన్నింటిని చెప్పినాడు.
ఇచ్చట దేశం లో ఉన్న ప్రసిద్ధ క్షేత్రముల పేర్లు కలవు.
సిద్ధుడు ప్రసిద్ధ తీర్థముల, క్షేత్రముల, పేర్లన్నీ చెప్పగా, ప్రవరాఖ్యునకు
 ఒక అనుమానం వచ్చింది.
ఆ సిద్ధుని వయస్సు చిన్నది.
సొరకాయలు కోరుచున్నాడు అనుకుని, "స్వామి మీ వయసు ఇంత చిన్నది కదా! ఇవన్నియు మీరు ఎట్లు చూచితిరి"? అని అడుగగా
ఆ సిద్ధుడుఇట్లన్నాడు "మా దగ్గర పాద లేపనం అని ఒక మందు ఉన్నది. దానిని కాళ్లకుపూసికొన్నచో  ఆకాశమునందు సూర్యుని గుఱ్ఱములు
ఎంత తొందరగా  పోగు లో మేము అంత తొందరగా పోవుదము."
అని చెప్పినాడు.
ఆ మాట విన్న ప్రవరుడి కి మనసు నిలవలేదు.  స్వామి మీ శిష్యుడిని మీరు రక్షించాలి. నాకు తీర్థయాత్ర ఫలము మీరిప్పించాలి.  అని పట్టుబట్టాడు.
ఆ సిద్ధుడు ఇతని కాళ్ళకు ఆ మందు రాసినాడు. ఇంకేమున్నది హిమాలయము చూచుటకు వెళ్ళినాడు  ప్రవరాఖ్యుడు. 

*హిమాలయ పర్వత శోభలు*

ప్రవరాఖ్యుడు వెళ్ళినాడు. హిమాలయ పర్వతములు చూచినాడు.
అక్కడ నదులు కొండలమీద ప్రవహించే సెలయేళ్లు ఆ సెలయేళ్ల చప్పుడులు మద్దెలలు మ్రోగించి నట్లు ఉన్నది .
నెమళ్లు నృత్యము చేయుచున్నవి ఏనుగులు ఎచ్చటబడిన అచ్చటనే తిరుగుతచున్నవి.
 అచ్చట  బదరీ వనము ఉన్నది. పూర్వము  ఆ బదరీ వనములో నరనారాయణులు తిరిగినారు.
ప్రవరుడు అవి అన్నియు చూచినాడు. ఏనుగులు, పులులు, అడవిపందులు, మనుబిళ్ళు, ఎలుగు గొడ్లు,  ఓహో!
ఆ అడవి ఎంత అందముగా వున్నది. భగీరథుడు అచ్చటనే తపము చేసినాడు. గంగ అచ్చటనే భూమికి దిగినది.  అక్కడనే పార్వతి శివుని పెళ్లి ఆడినది.  అచ్చటనే శివుడు మన్మధుని దహించి నాడు.
అరరే! ఎన్ని అందములు. ఎన్ని అందమైన స్థలములు.
అసలు ఈ హిమవత్పర్వతమే ఎన్ని కథలకు పుట్టినిల్లు!
ఈ కొండ యొక్క గొప్పదనమును ఎవరు చెప్పగలుగుదురు?
పాపం ప్రవరాఖ్యుడు అవి అన్నియు చూచుచుండగా అతనికి వేళ తెలియలేదు మధ్యాహ్నమయింది ఆకలి అవుతుంది రేపు వచ్చి చూతములే అనుకున్నాడు.
 తీరా చూడగా కాళ్లకు రాసిన పాద లేపనము కరిగిపోయినది. అడుగుతీసి అడుగు వేయదమన్న కాలు రానిదే. ఇంకేమున్నది ఇంకేమున్నది భయము పుట్టినది. దుఃఖము కలిగినది. ఇట్లనుకున్నాడు
 అరే మా ఊరు ఎక్కడ? ఈ మంచుకొండ ఎక్కడ? నేనుమూర్ఖుడను కాకపోయినచో, ఇక్కడికి వత్తున్నా?ఎన్ని పుణ్యక్షేత్రాలు లేవు?
కాశీకి పోరాదా? గయకు పోరాదా? ద్వారకకు పోరాదా?
నా తల్లిదండ్రులు  ఏమగుదురు?
నా భార్యఏమగును?
నా శిష్యులు
ఏమగుదురు?
ఏ పుణ్యాత్ములైన నన్ను ఇంటికి చేర్చగలరా?
అని దుఃఖించుచునే ఉన్నాడు. నడుచుచునే
ఉన్నాడు..


రేపటి కోసం ఇంకా ఉంది.....  డాక్టర్ నిభాపూడి సుబ్బరాజు
***************

రామాయణమ్.. 39

అమ్మా ,నాన్నగారి ఆజ్ఞ ప్రకారము రేపు నాకు రాజ్యపట్టాభిషేకము !
.
మేమిరువురమూ దీక్షలో ఉండ వలె నని రాజపురోహితులు తెలిపినారు,అందుకు అవసరమైన కార్యక్రమములు నీ చేతుల మీదుగా జరిపించమ్మా అని వినయంగా తల్లిని ప్రార్దించాడు కౌసల్యానందనుడు!.
.
నాయనా నా చిరకాలపు నోములన్నీ ఫలించినవిరా నేడు !
నీవు మహారాజువై ఈ వసుంధరను పరిపాలించాలని ఆ
శ్రీ మహావిష్ణువుకు నేను పెట్టుకొన్న మొరలాలకించాడురా ఆ దేవదేవుడు! .అని దగ్గరకు తీసుకున్నది కౌసల్య తన ప్రియ పుత్రుడిని.
.
ప్రక్కనే వున్న ప్రాణాధికుడయిన తమ్ముడు లక్ష్మణుని చూసి ,లక్ష్మణా ఈ రాజ్యము నీది, ఈ రాజ్యపాలన బాధ్యత నీకోసమే నేనంగీకరించాను . నీ కిష్టమైనభోగములు ,సుఖములు అన్నీ ఆనందంగా అనుభవించు! .అని పలికి రాముడు భార్యతో కూడి దీక్షస్వీకరించటానికి తన మందిరానికి వెళ్ళిపోయాడు.
.
శ్రీరాముని మందిరానికి రాజుకోరిక మీద వశిష్ఠుడు విచ్చేశాడు .
.
రామునిచేత దీక్షాస్వీకారం ఏ విధమైన లోటుపాట్లులేకుండా జరగాలని దశరధుడి కోరిక.
.
అనుకోని అతిధి ఆగమనానికి తొందరతొందరగా తొట్రుపడుతూ వెళ్ళి ఆహ్వానించి ఆయనకు తగిన మర్యాదలు జరిపాడు రాముడు.
.
వశిష్ఠులవారు రాముని చూసి నాయనా నీవూ ,సీతా ఈ రోజు ఉపవాసదీక్షలో ఉండి దర్భలమీదనే విశ్రమించాలి .
రేపు ప్రాతఃకాలముహూర్తమందు నీకు పట్టాభిషేకం జరుగగలదు అని పలికి వైదేహీసహితుడయిన రామునికి మంత్రపూర్వకముగా ఉపవాసము చేయించాడు.
.
ఈ వార్త అప్పుడే నగరమంతా వ్యాపించింది !
ఎవరికి వారు తమకే  పట్టాభిషేకం అన్నట్లుగా కేరింతలు ,త్రుళ్ళింతలు.
.
 వీధులలో ఉత్సవాలు! అయోధ్యానగరవాసుల సంబరాలు అంబరాన్ని చుంబించాయి.అన్ని దారులు రాముడి ఇంటివైపే దౌడుతీసాయి.
.
ఎవరినోట విన్నా ఇవే ముచ్చట్లు ,
.
రాబోయే అద్భుతమైన రోజులగూర్చి ఇప్పడే కలలు !
.
ఆ కలలను గురించిన కబుర్లు!.
.
రాముడి మందిరంకోలాహంగా వున్నది!
స్వచ్ఛమైన నీటితోనిండిన  ఒక సరస్సులో వేలకొద్దీ పద్మాలు విచ్చుకుంటే చూపరులకు ఎంత ఆహ్లాదకరంగా వుంటుందో రాముని భవనంలోకి వచ్చీపోయే పురజనుల ముఖపద్మాలు విచ్చుకొని అంత ఆహ్లాదకరంగా వున్నదట!
.
జనులందరి మదిలో ఒకటే చింత !
ఇంకా తెలవారదేమి? ఈ చీకటివిడిపోదేమీ! ఎవరికీ నిద్దురలేదు...
.
 .తెల్లవారగనే తమ రాజు రాముడు ! ఈ భావనే వారిమదిలో బ్రహ్మానందాన్ని కలుగజేసింది!.
.
రాముని గృహమునుండి వచ్చిన వశిష్ట మహర్షిని చూసి దశరధుడు అన్నీ అనుకున్నట్లుగా సవ్యముగానే జరుగుతున్నవిగదా ! అని ప్రశ్నించి తెలుసుకొని  ,సభచాలించి ,
సింహం గుహలో అడుగుపెడుతున్న విధంగా అంతఃపుర ప్రవేశం చేశాడు.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
******************