8, నవంబర్ 2022, మంగళవారం

దీపం వెలుతురుని

 🙏🪔

శ్లోకం:☝️

*కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః*

  *జలే స్థలే యే నివసంతి జీవాః |*

*దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః*

 *భవంతిత్వం శ్వపచాహి విప్రాః ||*


భావం: క్రిమికీటకాలు, పక్షులు, ఈగలు దోమలు, వృక్షాలు, జలచరాలు, భూచరాలు ఒకటేమిటి ఈ భూమిమీద నివసించే ప్రతీ ఒక్కజీవికీ కూడా ఈ దీపం వెలుతురుని దర్శించగానే ఇక మరుజన్మ అంటూ లేని అనంత పుణ్యాన్ని పొందాలి. వైదిక ధర్మాన్ని శ్రద్ధగా అచరించనివాడు కూడా ఈ దీపకాంతి ప్రసరించడం చేత అభ్యున్నతి కలిగి మరుజన్మలో వేదమునేర్చి లోకోపకారియైన బ్రాహ్మణజన్మను పొంది ఉద్ధరింపబడాలి.🙏

హిందువులు

 *తెలుగు రాష్ట్రాల్లో  73% హిందువులు హిందు వ్యతిరేక శక్తులకే మద్ధతు ఇస్తున్నారు.*


భారత్ టుడే సర్వేలో వెల్లడి


*అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేసేది అధిక శాతం హిందువులే.!!*


ఈ హిందువుల మాటలు ఉద్దేశాలు :-


*1. అందరూ దేవుళ్ళు ఒకటే అంటారూ... వీళ్లు దగ్గర ఉండి చూసినట్లు.*


*2. అన్ని మతాల సారం ఒక్కటే అంటారు.. ఏదో  వీళ్ళు ప్రపంచ జ్ఞానులాగా.*


*3. అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అని  బోధనలు చేస్తారు...  వీళ్ళేదో అన్ని గ్రంధాలు చదివినట్లు.*


*4. వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తి చూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు... ఏదో పెద్ద  వేదాంతుల్లాగా.* 


*5. వాడు మన మతాన్ని తిడితే వాడి పాపాన వాడిపోతాడు అంటారు... ఏదో జ్ఞానుల్లాగ.*


*6. క్రైస్తవులు ప్రతి ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తూ యేసు ఒక్కడే దేవుడు. మీరు రాళ్లకు రప్పలకు పూజిస్తే నరకానికి పోతారు అని మత ప్రచారం చేస్తే వాళ్ళ మతం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మీకేంటి అని అనేవాళ్ళే ఎక్కువ.*


*7. క్రైస్తవుల ఇంటికి ప్రార్దనకు వెళ్లి కేకులు, బిర్యానీ తిని వస్తారు వాళ్ళు మన పూజకు రారు ప్రసాదం పెడితే తినరు దానికి ఈ సిగ్గులేని వెధవలు వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అంటాడు వీళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్లు.*


*8. హిందువులను, హిందు గ్రంధాలను, హిందూ దేవుళ్లను దూషించేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు.*


*9. హిందూ ధర్మం గొప్పతనాన్ని  ప్రచారం చేస్తుంటే (వీళ్ల అతితెలివితో) ఇలా అంటారు... ప్రచారం చేస్తున్నందుకు వీళ్ళకి పైనుంచి డబ్బులు వస్తున్నాయి అందుకే చేస్తున్నారు అని గుసగుసలాడుతారు.*


*10. పూర్తిగా అవగాహన లేకుండా హిందూ ధర్మం కోసం వీళ్ళే అసత్యాలు ప్రచారం చేస్తారు (ఉదా: కృష్టుడికి 16 వేలమంది భార్యలు).*


*11. స్వార్ధంతో రోజు గుడికెళ్లి ఆ దేవునికి అభిషేకాలు పొర్లు దన్నాలు పెడతారు అదే దేవుడిని వేరే మతం వారు తిడుతుంటే చేతకాని చవట దద్దమ్మ లాగా మనల్ని కాదన్నట్లు చూస్తూ ఉరుకుంటారు.*


*12. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్లకు మంచి జరగకపోతే వ్యక్తిగత స్వార్థంతో హిందూ ధర్మాన్ని దూషించి మతం మారిపోతారు.*


*13). ధర్మం గురించి చెబుతుంటే... వీళ్లకి పనీపాటా లేదా, ఏం వస్తుంది వీళ్లకి? ఎప్పుడూ ధర్మం ధర్మం అని కొట్టుకుంటారు, ఈ టైంని సంపాదనకి వాడుకుంటే చాలా సంపాదించుకోవచ్చు, ఈ తెలివితేటలేవో డబ్బు సంపాదించడంలో చూపించుకోవచ్చుగా అని ఎద్దేవా చేస్తారు కానీ వాళ్లకేం తెలుసు ధర్మం బతికి ఉంటేనే సకల సంపదలు అనుభవించొచ్చని, లేదంటే పరాయి మతస్థుడికి బానిసగా బ్రతకాల్సిన గతి పడుతుందని?*


*ఈ సెక్యులర్ హిందువులు (హిందూ ధర్మాన్ని నాశనం చేసేవారు) ఇప్పుడైనా మారండి నిజం తెలుసుకోండి* 


*గొప్పదైన నీ ధర్మాన్ని నీ దేశాన్ని కాపాడుకో. మేలుకోండి హిందువులారా! లేకపోతే కొన్ని రోజులు, కొన్ని ఏళ్ళ తర్వాత మీ పిల్లలకి పూర్వం హిందూమతం ఉండేది అనిచెప్పే దుస్థితి వస్తుంది. హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ, ఆచరిస్తూ తమ పిల్లలను సైతం హిందూ సంస్కృతి సంప్రదాయాలను పాటించేలా పెంచాలని విజ్ఞప్తి.* 

ధన్యవాదాలు 🙏

నవంబర్_8_నాటి_చంద్రగ్రహణం #ధార్మికనియమాలు

 L#నవంబర్_8_నాటి_చంద్రగ్రహణం  #ధార్మికనియమాలు


            ఈ సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రజలకు వార్తల నిజాలు చేరువలో కి వస్తున్నా  , ఫేక్ న్యూస్ లు - ప్రజలను సందిగ్ధం లో పడవేసే విషయాలు పుష్కలంగా హల్ చల్ చేస్తున్నాయి. You Tube వీడియోలలో అబద్ధాల ప్రచారాలు, ప్రజలను confusion లో పడవేసే విషయాలు చెప్పే పండితమ్మన్యులు బాగా ఎక్కువై పోయారు. వచ్చే మంగళవారం నాటి గ్రస్తోదయ #చంద్రగ్రహణం విషయంలో ప్రజలు, పంచాంగకర్తలతో సహా పండితులు కూడా సందిగ్ధం లో పడుతున్నారు. నాకు వచ్చిన ఫోన్ కాల్స్ దృష్టిలో ఉంచుకుని, కొన్ని పంచాంగాలలో ఆయా పంచాంగకర్తలు రాసిన గ్రహణ నియమాలను చూసి ప్రజలు సంశయగ్రస్తులైనారని తెలిసి ఈ పోస్ట్ పెడుతున్నాను. 

            ఈ చంద్రగ్రహణం సంపూర్ణచంద్రగ్రహణమే. అయితే, గ్రహణం మధ్యాహ్నం 2:39 కి ప్రారంభమై ( స్పర్శ) సాయంత్రం 6:19 ( మోక్షం) కి ముగుస్తుంది. ధర్మశాస్త్రంలో  #చంద్రసూర్యోపరాగేచ_యావద్దర్శనగోచరః అని ఉన్నది. అనగా గ్రహణ సమయంలో ఎంతసమయం వరకూ గ్రహణం దృశ్యమానమో అంతవరకూ మాత్రమే పుణ్యకాలం. ఈ గ్రహణం మధ్యాహ్నం ప్రారంభమైనప్పటికీ మనకు చంద్రుడు కనపడడు కాబట్టి మనకు మధ్యాహ్నం 2:39 నుండీ పుణ్యకాలం కాదని గ్రహించాలి.  చంద్రోదయం ఎప్పుడైతే అప్పుడే మనకు చంద్రుడు కనబడడం ప్రారంభిస్తాడు కనుక మనకు చంద్రోదయం నుండి 6:19 కి (గ్రహణం పూర్తయిపోతుంది కాబట్టి ) వరకే పుణ్యకాలం. 

         చంద్రోదయమనేది  గ్రహణం లో చంద్రుడు ఉండగా జరుగుతోంది కనుక ఇది #గ్రస్తోదయచంద్రగ్రహణం. 


1. #పట్టుస్నానం_ఎప్పుడు_చేయాలి? 

      మధ్యాహ్నం 2:39 కు స్పర్శ కావున అప్పుడే స్నానం చేయాలన్న ప్రచారం బాగా జరుగుతోంది. అయితే, అది సరి కాదు. కాలమాధవం లో మాధవాచార్యులు -

     #యత్తు_కాలవిపర్యాసేన_ప్రాప్యమాణం_జ్యోతిశ్శాస్త్ర_మాత్రప్రసిద్ధం_గ్రహణం_తత్ర_స్నానాదికం_నకర్తవ్యమ్


అని చెప్పారు. అంటే పగలు వచ్చిన చంద్రగ్రహణానికి, రాత్రి వచ్చిన సూర్యగ్రహణానికీ స్నానదానాదులు అవసరం లేదు.  అంటే సూర్యోదయ-సూర్యాస్తమయాల నడుమ వచ్చిన చంద్రగ్రహణం, చంద్రోదయ-చంద్రాస్తమయాల నడుమ వచ్చిన సూర్యగ్రహణం రెండూ నిష్ఫలమే. మనం ఏ గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. 

           

             అయితే, వచ్చే చంద్రగ్రహణం లో గ్రహణ స్పర్శ సూర్యాస్తమయం లోపున వచ్చి, మోక్షం సూర్యాస్తమయం దాటాక వచ్చింది. అందుకే దీనిని #గ్రస్తోదయగ్రహణం అని అన్నారు. ఇప్పుడు స్నానం ఎప్పుడు చేయాలి? అన్నది ప్రశ్న. 

        #జ్యోతిర్నిబంధం అనే గ్రంథంలో -  


#గ్రస్తోదితేగ్రహే_గ్రస్తందృష్ట్వా_స్నానం_సమాచరేత్। 

#గ్రస్తాస్తే_మౌక్తికంస్నానం_ముక్తందృష్ట్వా_రవింవిధుమ్ ॥ 


    కాబట్టి ఏ ఊరిలో చంద్రుడు ఎప్పుడు ఉదయిస్తాడో అప్పుడు గ్రస్తచంద్రుని చూసి పట్టు స్నానం చేయాలి. కిందన వీలైనన్ని ప్రదేశాలకు చంద్రోదయం ఇచ్చాను. 


2. #మంత్రజపం_చేసుకోవచ్చా? 

       

      మంత్రం తీసుకున్నవారు విధిగా మంత్రజపం చేసుకుని తీరాలి. అయితే, గ్రహణ పురశ్చరణ అనేది గ్రస్తోదయ, గ్రస్తాస్తమయ గ్రహణాలలో  చేయడం కుదరదని గ్రహించాలి. 


3. #నిత్యభోజనాదుల_విషయం_ఏమిటి ? 


      #గ్రస్తోదయేవిధోః_పూర్వం_నాహర్భోజనమాచరేత్ అన్న వసిష్ఠమహర్షి వాక్యానుసారం పగలు భోజనం మానేయాలి. సూర్యోదయం నుండి గ్రహణమోక్షం వరకూ ఏమీ తినరాదు. అయితే బాల, వృద్ధ, రోగుల విషయంలో మధ్యాహ్నం వరకూ వెసులుబాటు ఇవ్వడం జరిగింది. 


4. #పూర్ణిమతిథినాటి_ప్రత్యాబ్దికం_ఎప్పుడు_పెట్టాలి? 

    

      #గ్రస్తోదయోభవేదిందోః_దివాశ్రాద్ధం_న_కారయేత్। 

      #రాత్రావపితదాకుర్యాత్_ప్రత్యబ్దం_మనురబ్రవీత్ ॥ 


     అని చెప్పబడుటవలన, రాత్రి మోక్షానంతరం శుద్ధ చంద్రబింబాన్ని చూసి విడుపు స్నానం చేసి శ్రాద్ధానికి ఉపక్రమించాలి. 


#వివిధప్రదేశాలలో_చంద్రగ్రహణసమయాలు 👇


 1.గుంటూరు       5:33   to  06:19  ( 46 mts) 

2. విజయవాడ    5:32    to  06:19  (47mts) 

3. విశాఖపట్నం    5:20   to  06:19    (59mts) 

4. తిరుపతి         5:41    to  06:19    (38mts) 

5. బెంగళూరు      5:49     to  06:19   (30mts) 

6. చెన్నై               5:38     to  06:19  ( 41mts) 

7. న్యూఢిల్లీ          5:28      to  06:19 (51 mts) 

8. ప్రయాగరాజ్     5:14      to  06:19  (65mts) 

9. కలకత్తా            4:52       to  06:19 ( 87 mts) 

10. ముంబై           6:01     to  06:19  ( 19 mts) 

11. వారాణసీ        5:09       to  06:19 ( 57 mts) 

12. గౌహతి            4:32       to  06:19 (107 mts) 

13. Hyderabad   5:40       to  06:19 (39 mts) 

14. రాజమండ్రి      5: 27    to  06:19 ( 52 mts) 


#ఏనక్షత్రంవారు_ఏయేరాశులవారికి_శాంతి_అవసరం? 


 సూక్ష్మనక్షత్ర గణితరీత్యా ఆ సమయానికి కృత్తిక నక్షత్రమున్నది కావున కృత్తిక నక్షత్రం వారు, మేష-వృషభ-కన్య-మకర రాశుల వారు తప్పనిసరిగా బింబదానం చేయాలి. 


✍️ డా. తుకారాం

కంచికామకోటిపీఠ_శాస్త్రానుసరణ_ఆదర్శప్రాయం

 #కంచికామకోటిపీఠ_శాస్త్రానుసరణ_ఆదర్శప్రాయం 


               8 నవంబర్ 2022, మంగళవారం నాటి చంద్రగ్రహణం సందర్భంగా పాటించవలసిన ధార్మిక నియమాలలో ప్రజలలో కొద్దిపాటి అసంగ్ధిత నెలకొని ఉన్నది. దానిని కంచికామకోటిపీఠం తొలగించిన తీరు అత్యంత ప్రశంసనీయం. 

      

               ఇది గ్రస్తోదయగ్రహణమని మనకందరకూ తెలిసినదే. గ్రహణస్పర్శ మధ్యాహ్నం 2:39 ని. లకు జరుగుతుంది. అయితే మనకు చంద్రోదయం నుండే గ్రహణం కనబడుతుంది. ముందు, స్పర్శస్నానం మధ్యాహ్నమే చేయాలని కంచి కామకోటిపీఠ పండితులు నిర్ణయించారు. అయితే, శాస్త్రరీత్యా గ్రస్తోదయ చంద్రుని చూసిగానీ స్నానానికి ఉపక్రమించరాదని శాస్త్ర నిర్దేశం. 


               ఈ విషయమై నేను కామకోటిపీఠ సిద్ధాంతి विजय सुब्रह्मण्य सिद्धान्ति लक्कावज्झुल ( LS Siddhanti) గారిని సంప్రదించగా వారు తెలిపిన విషయాలను మిత్రులతో పంచుకుందామని ఈ పోస్ట్ పెడుతున్నాను.


 మొన్న రాత్రి ( 4 నవంబర్, శుక్రవారం)  స్వామివారు పీఠపండితులను సంప్రదించి గ్రహణస్పర్శస్నాన విషయంలో ప్రజలలో అసందిగ్ధత నెలకొని ఉన్నదనీ, దానిని తొలగించాల్సిన బాధ్యత పీఠంపై ఉన్నదనీ, ఈ విషయంపై పీఠపండితులంతా తిరిగి చర్చ చేసి మార్గదర్శకాలను భక్తులకు విడుదల చేయమని ఆదేశించారు. దానితో కామకోటిపీఠ పండితులంతా రాత్రి 11 గంటలనుండి 1:00 వరకు చర్చలు జరిపి గ్రహణస్పర్శ స్నానం శాస్త్రరీత్యా చంద్రోదయ సమయానికే చేయాలని  తిరిగి నిర్ణయించి నిన్న మార్గదర్శకాలను విడుదల చేసారు. 


 #తస్మాచ్ఛాస్త్రం_ప్రమాణంతే_కార్యాకార్యవ్యవస్థితౌ అని గీతాచార్యుడు బోధించినట్లుగా తమ పూర్వ నిర్ణయాన్ని శాస్త్రరీత్యా సవరించి ప్రజలలో నెలకొన్న సందిగ్ధత ను తొలగించినందులకు పీఠపండితులు అభినందనీయులు. #కామకోటిపీఠ స్పందన కు మనమంతా సర్వదా కృతజ్ఞు లము. 


#వారి_మార్గదర్శకాలలోని_ప్రధానవిషయాలు:👇


ఆరోజు మధ్యాహ్నం 2:39 నుండి స్పర్శ స్నానం చేసేవారు మహాసంకల్పం చెప్పుకుని చేయాలనీ, చంద్రోదయసమయానికి లఘుసంకల్ప పూర్వక స్నానం చేయవలెనని తెలిపారు. పై సమయం నుండీ ప్రజలంతా ప్రాపంచిక విషయాలనుండి దృష్టి మరల్చి దైవచింతనలో గడపాలని, సంధ్యావందనాది నిత్యానుష్ఠాలకు లోపం కలుగకుండా వాటిని చంద్రోదయానికి ముందే పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రహణ సమయంలో  మంత్రానుష్ఠానము గావించుకుని, మోక్షానంతరము దానములు ఇచ్చు కోవాలని వివరణ ఇచ్చారు. 


     ప్రజల సందిగ్ధత ను తొలగించినందులకు కంచి కామకోటి పీఠాధిపతులకూ, పీఠ పండితులకూ హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏


హర హర శంకర!!!    జయ జయ శంకర!!!

దివ్యోత్పాతసంహర్తకున్

 

ఒకచో తూర్పున తెల్లవారు నిను డొక్కోయంచు మేల్గొల్పగా 

నొకచో మింటను మంటగొల్పు రవి మొర్రోయంచు వాపోవగా 

నొకచో పశ్చిమమందగించు ద్యుమణీవ్యూహమ్ము శాంతించగా 

నొకరీతిన్ నడువంగరాదుగద! దివ్యోత్పాతసంహర్తకున్ 

*~శ్రీశర్మద*


సీ.

స్వచ్ఛనీరము లేదు స్నానమ్ము చేయింప 

స్వర్గంగ తెప్పించు శక్తి లేదు

శుద్ధమౌ తేనెలజోరు నీకర్పించ 

పూదేనె లభియించు పుడమి లేదు 

భస్మమ్ము దెచ్చి నిన్ భక్తితో స్నానింప 

చితిభస్మమును దెచ్చు చేవ లేదు 

పుఱ్ఱెదండల నిన్ను మిఱ్ఱుగా పూజించ 

భూరిగా యత్నించి పోరలేను 

తే.గీ.

చర్మవస్త్రము లర్పించు మర్మమెఱుగ 

భక్తి తోడుత నినుగొల్తు పాడిదప్ప 

దిక్కులంబరముగ దాల్చిన దేవదేవ! 

భుజగభూషణ నిరతమ్ము బ్రోవుమయ్య! 


ఉ. 

శీతలమావహించు పెనుచీకటివేళల కార్తికమ్మునన్ 

భూతలవాసులన్ మిగుల పోరుకు పొమ్మను రీతి వార్ధులన్ 

మూతులు ముక్కులన్ ముడిచి పోయి మునుంగు మనంగ న్యాయమే? 

నీ తలపోత చాటున ననేకము లుండు గదయ్య శంకరా! 

*~శ్రీశర్మద*

ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


(ఎడమభుజంపై ఉత్తరీయం వేసుకుని పూజచేయాలి)ఇపుడు చదవండి..


* ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు .


సాధారణంగా నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేస్తాడు. ఎవరు చేయాలి అంటే యజమాని నిత్యపూజా చేయాలి. సంకల్పంలోనే ఉంది ‘ధర్మపత్నీ సమేతస్య’ అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే పూజామందిరంలోకి వెళ్ళడం ఇంక అంతకన్నా అన్యాయమైన విషయం ఏం ఉంటుంది? ఇంక దానిమీద వ్యాఖ్యానం చేయడం అనవసరం. కాబట్టి అలాగే పూజ చేస్తారు అని మనం భావన చేయాలి.


 పురుషుడు ప్రతిరోజూ పూజ చేస్తాడు. నైమిక్తిక తిథులలో పూజ చేసేటప్పుడు భార్య కూడా ప్రక్కన కూర్చుంటుంది. వినాయక వ్రతంలాంటిది చేసినప్పుడు. వస్త్రధారణా నియమం అన్నప్పుడు ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ వేసుకుంటుంది, వివాహిత అయితే చీర కట్టుకుంటుంది. అమ్మవారికి అవే కదా ప్రధానం. కాబట్టి మనం కూడా అవే కట్టుకుంటాం.


ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది – ‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ – గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుంది. బట్ట గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని ‘కచ్ఛము’ అంటారు. ‘వికచ్ఛః’- గోచీ పెట్టుకోలేదు; అనుత్తరీయశ్చ – పైన ఉత్తరీయం లేదు; అంటే ఉత్తరీయం ఒక్కటే  ఉండాలి పురుషుడికి. 


చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు. దేవాలయంలోనైనా అంతే. కళ్యాణం చేసుకోవడానికి వెళ్తే ఎవరో వచ్చి చిన్నపిల్లలకి చెప్పినట్లు చొక్కా విప్పండి, బనియను విప్పండి అని చెప్పక్కరలేదు. మనంతట మనమే తీసి కూర్చోవాలి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు. నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు. వాడు వీడికి, వీడు వాడికి కనపడాలి. ఉత్తరీయం ఒక్కటే వేసుకుంటారు. గోచీపోసి పంచె కట్టుకోవాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు.


యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. కాబట్టి ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారు అనుకోండి నీయందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు స్వాగతం చెప్పడానికి ఇంటి బయటికి వచ్చిన ఇంటి యజమాని ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. నేను ఎవరి ఇంటికైనా వెళ్ళాను అనుకోండి, ఆయన ఎడమ భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురు వచ్చి స్వాగతం పలికాడు అనుకోండి ఆయన అభ్యున్నతి కొరకు మంచిమాటలు చెప్పవచ్చు. 

ఆయన అలా రాలేదు అనుకోండి నాపని చూసుకుని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నాకు అయన పెద్దరికం అనడానికి గుర్తు ఏమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి. 


మీరు గమనించండి కావ్యాలలో, పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. నువ్వు భగవంతుడితో సమన్వయము అవుతున్నావు. ఆయన చేయి చాపాలి, కాళ్ళు చాపాలి, ఆయన తింటే కదూ నువ్వు పెట్టింది అందింది. ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడివై అయి ఉండాలి. ఉత్తరీయం వేసుకుని ఉండాలి.


‘అనుత్తరీయశ్చ, నగ్నశ్చ – వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు. ‘అవస్త్రఏవచ’ – మళ్ళీ నొక్కి చెప్పింది వేదం. వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్నమాటకు అర్థం అంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు. ఒక చుట్టు చుట్టి కట్టాను అనుకోండి పూజకు పనికిరాను. గోచీపోసి కట్టే కూర్చోవాలి. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు. 


దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేయరు. అలా పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కానీ, ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు. అవతలి వాడు పదికాలాలు బ్రతకాలి అని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకువచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఉండదు. అందుకే పీటలమీద అల్లుడికి పెట్టాలి అంటే నీకు కోటు కుట్టించాలి అని మోజు ఉంటే బయట కుట్టించు. పీటల మీద కూర్చున్నాడు భగవత్ కార్యంలో. ఆయుఃకారకం నువ్వు ఇచ్చేది. నువ్వు ఉత్తరీయం వేసుకోవాలి. ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు. ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు. అంచు ఉన్న బట్టలు పెట్టాలి. అందుకే ఇప్పటికీ మనవాళ్ళు పంచెల చాపు పెడతారు.


పరమమంగళప్రదుడు అనడానికి గుర్తు అంచు ఉన్న బట్ట గోచీ పోసుకుని కట్టుకుని ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు. శౌచంతో ఉన్నాడు అని గుర్తు. పూజ దగ్గరికి వెళితే లాల్చీ, బనియను కూడా పనికిరావు. తీసేసి ఉత్తరీయం కప్పుకుని గోచీ పోసి పంచె


కట్టుకుని కూర్చుని పూజ చేయాలి. గోచీ ఎంత బాగా పోయాలి. అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు. ఒక అంచు తీసి నీకు వచ్చినట్లు దోపుకుంటే చాలు కచ్ఛ ఉన్నట్లే. కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్రధారణయందు అటువంటి నియమము ఉన్నది. అదేం పెద్ద విశేషమా? అదేం బ్రహ్మవిద్యేం కాదు. పూజయందు ఎప్పుడూ గోచీపోసి పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పురుషుడు పూజ చేయవలసి ఉంటుంది.

కాఫీ తాగావా

 కాఫీ తాగావా?


పరమాచార్య స్వామివారు కేరళలోని కొల్లక్కోడులో మకాం చేస్తున్న సమయం. అక్కడ స్వామివారు ఒక పండితులతో ఒక వేదసభను ఏర్పాటు చేశారు. ఆ సభకు విష్ణుపురం నుండి ఒక వేద పండితుణ్ణి కూడా ఆహ్వానించారు.


పరమాచార్య స్వామివారి ఆదేశం మేరకు శ్రీమఠంలో కాఫీను నిషేధించారు. అది ఆరోగ్యానికి హానికరమే కాక పూజకట్టులో మడికి పనికిరాదని నిషేధించారు. మహాస్వామివారు సేవకులతో సహా ప్రతి ఒక్కరికి కాఫీను త్యజించాలని ఆజ్ఞాపించారు. కాని కాఫీ అలవాటు బాగా ఉన్నవారికి, ఉదయాన్నే కాఫీ పడకపోతే, వారికి ఏదో కోల్పోయినట్టు ఉంటుంది.


కాఫీ లభించకపోవడంతో ఆ విష్ణుపురం పండితునికి కూడా అలాంటి స్థితియే కలిగింది ఆరోజు. ఒక వ్యక్తి వచ్చి వారిని బయటకు పిలుచుకుని వెళ్ళారు. ఎందుకు పిలిచాడో తెలియక బయటకు వెళ్ళిన ఆ పండితునికి, ఆ వ్యక్తి త్రాగడానికి కాఫీ ఇవ్వడంతో చాలా ఆనందపడ్డాడు ఆ పండితుడు.


కొద్దిసేపటి తరువాత వేదసభ మొదలయ్యింది. పరమాచార్య స్వామివారు సభకు వచ్చి వెంటనే ఆ పండితుని వద్దకు వెళ్లి నవ్వుతూ, “కాఫీ తాగారా?” అని అడిగారు. ఆ పండితుడు నిశ్చేష్టుడయ్యాడు. ఎవరికీ తెలయుదులే అనుకుంటే, ఈ విషయం పరమాచార్య స్వామివారికి తెలిసిపోయిందని ఆ పండితుడు భయపడ్డాడు.


తప్పు చేశాననే భావనతో భయపడుతూ “ఎవరో ఇచ్చారు పెరియవ” అని బదులిచ్చాడు.


“నేనే నీకు ఇమ్మని చెప్పాను” అని చెప్పారు స్వామివారు. ఈ మాటలు విన్న పండుతుడు ఆశ్చర్యపోయాడు. పరమాచార్య స్వామివారు తనను ఆదరించిన విధానము, వారి కరుణను తలచుకుని పొంగిపోయాడు.


మహాస్వామి వారిని మనం సంపూర్ణ శరణాగతి చేస్తే, భక్తుల కోరిక మేరకు వాళ్ళను అనుగ్రహిస్తారు. అది మనకు సుఖశాంతులను, సౌభాగ్యాలను, ఐశ్వర్యాలను ప్రసాదిస్తుదనడంలో అతిశయోక్తి లేదు.


--- “శ్రీ పెరియవ మహిమై” పత్రిక నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

జ్వాలాతోరణం

 ॐ         జ్వాలాతోరణం

    కార్తీకమాసంలో రాత్రి పౌర్ణమి గల సాయంత్రం (ఈరోజు) శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి..ఓ కర్రను అడ్డంగా వాటిపై పెట్టి.. ఎండుగడ్డిని తోరణంలా కడతారు. దీనిని యమద్వారం అంటారు. 

    ఈ గడ్డిపై నెయ్యిపోసి మంట వెలిగిస్తారు..

    ఆ జ్వాల కిందనుంచి శివపార్వతుల మూర్తులను పల్లకిలో మూడుసార్లు ఊరేగిస్తారు. 

1. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమశిక్ష. 

    కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి 3 సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుందని నమ్మకం. 

2. జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం.

వేదాధ్యయనం

 వేదాధ్యయనం - విదేశీయానం


పరమేశ్వరుడంతటి దయాళువు, శుక మహర్షి అంతటి ఉన్నతులు అయిన మన మహాస్వామి మనందరినీ ఆదరించి ఆశీర్వదిస్తున్నారు.


1968లో కుంబకోణం శ్రీ రంగరాజచారి పరమాచార్య స్వామియొక్క పరిపూర్ణ కటాక్షంలో మునిగిపోయారు. 1971లో ఋగ్వేద అధ్యయనం పూర్తైన తరువాత, జీవనాధారం కోసం వైదిక వ్రిట్టు చేపట్టాలని భావిస్తే, అందుకు పరమాచార్య స్వామివారు తమ అంగీకారాన్ని తెలపలేదు.


“నీ వేద విద్యార్జనకు నేను తగిన ఏర్పాట్లు చేస్తాను. నీ విద్యార్జన కొనసాగించు” అని స్వామివారు తెలిపారు. ప్రతి నేలా రెండు వందల రూపాయలు రంగరాజచారి కుటుంబానికి అందేట్టు, స్వంతంగా వండుకోవడానికి కావాల్సిన సంభారాలు కూడా ఏర్పాటు చేశారు. రంగరాజచారి గారిది పెద్ద కుటుంబం. కేవలం పరమాచార్య స్వామివారి ఆశీస్సులతోనే అందరి ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిగాయి.


మహాస్వామివారు పండరీపురంలో మకాం చేస్తున్నప్పుడు, రంగరాజచారి స్వామివారిని దర్శించుకుని సాష్టాంగం చేసి నమస్కరించారు. అప్పుడు మహాస్వామివారు, “నువ్వు నాకు సాష్టాంగం చెయ్యొచ్చా?” అని అడిగారు.


“మా సంప్రదాయం ప్రకారం, యజ్ఞోపవీతము, శిఖ లేని సన్యాసిని చూస్తే స్నానం చెయ్యాలి” అని రంగరాజచారి బదులిచ్చాడు.


“అలా అయితే, మరి నా ముందర ఎందుకు సాష్టాంగం చేశావు?”


“ఈ స్వరూపము విష్ణు స్వరూపమే అని నాకు అనిపించింది” అని భక్తితో బదులిచ్చాడు. ఈ శీవైష్ణవ భక్తశిఖామణి జీవితంలో పరమాచార్య స్వామి అనుగ్రహంతో ఒక అద్భుతం జరిగింది. రంగరాజచారిది పేద కుటుంబం. వారి ఆదాయంతో సభ్యులందరినీ చూసుకోవడం కూడా వీలు కాని పరిస్థితి. ఆడపిల్లల పెళ్ళిళ్ళకు డబ్బు కూడా అవసరం. ఇటువంటి స్థితిలో వారికి ఒక మంచి అవకాశం వచ్చింది. 1978లో వేద విద్యాభ్యాసం ముగియగానే, వారిని జర్మని రమ్మని కొందరు ఆహ్వానించారు. అంతటి కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న సమయంలో జర్మని అవకాశాన్ని, నేలకు మూడువేల రూపాయల సంపాదనని ఎలా కాదనగలరు. ఈ డబ్బుతో పాటు మూడేళ్ళ తరువాత మూడు లక్షల రూపాయలు అందుతుంది. కనుక రంగరాజచారి ఈ అవకాశాన్ని ఒప్పుకోవడంలో ఆశ్చర్యం ఏమి లేదు.


ఈ అవకాశాన్ని ఇచ్చినతనికి అన్ని ఏర్పాట్లు చూసుకోమని చెప్పాడు. ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయాడు. అదే సంవత్సరం అక్టోబరు 31న బోంబే నుండి బయలుదేరడానికి నిర్ణయించుకున్నాడు. ఇంత జరిగినా ఈ విషయాలేవీ ఇతరులకు తెలియనివ్వలేదు. అక్టోబరు 27న తన తండ్రికి విషయం తెలపడానికి గ్రామానికి వెళ్ళాడు.


“పరమాచార్య స్వామివారి అనుమతి తీసుకున్నావా?” అని అడిగారు అతని నాన్న. “లేదు, నాకు తెలిసి వారు అనుమతి ఇవ్వరు. స్వామివారు అనుమతించకపోతే, ఇంత డబ్బులు వచ్చే ఈ ప్రతిపాదనని నేను కాదనలేను. వెళ్ళడానికి నేనే నిర్ణయించుకున్నాను. మనకు డబ్బు అవసరం చాలా ఉంది. నాకు ఇంకొక మార్గం కనపడడం లేదు” అని చెప్పాడు.


ఆరాత్రికి తన ఊళ్లోనే ఉండిపోయాడు. రాత్రి మూడు గంటలప్పుడు, నిద్ర రాక మంచంపై అటు ఇటు దొర్లుతున్నాడు. అప్పుడు కళ్ళముందు మహాస్వామివారు ఉన్నట్టుగా లీలగా కనపడుతోంది. దగ్గరకు వచ్చి తనని తాకినట్టుగా తనకు అనుభూతి కలిగింది. తన తల్లి అడిగినట్టుగానే, “వెళ్ళడానికే నిర్నయించుకున్నావా?” అని అడిగినట్టు అనిపించింది. అది కలో, నిజమో అర్థం కావడంలేదు. ఆలస్యం చేయకుండా మరుసటిరోజే పరమాచార్య స్వామివద్దకు వెళ్లి అనుమతి పొందాలని భావించాడు.


అప్పుడు పరమాచార్య స్వామివారు కర్ణాటక రాష్ట్రం, బాదామి దగ్గరలోని బనశంకరి అనే చోట మకాం చేస్తున్నారు. అక్కడకు చేరుకోగానే స్వామివారి దర్శనానికి ముందు, స్నానం చేస్తున్నాడు. అప్పుడు పరమాచార్య స్వామివారి సహాయకులొకరు వచ్చి, “వచ్చి దర్శనం చేసుకోమని పరమాచార్య ఆదేశించారు” అని చెప్పాడు.


తను వస్తున్న విషయం కాని, వచ్చిన కారణం కాని ఎవరికీ తెలియదు. కాని మహాస్వామివారు కబురుచేయడంతో ఆశ్చర్యపోయాడు. అదే ఆశ్చర్యంతో వెళ్లి స్వామివారి ముందు నిలబడ్డాడు.


“ఎప్పుడు బయలుదేరుతున్నావు?” అని అడిగారు స్వామివారు.


“స్వామివారు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు” అని బడులిచ్చాడు స్వామివారు తన తిరుగు ప్రయాణం గురించి అడుగుతున్నరేమో అనుకుని.


“నీవున్నచోటికి తెరిగివెళ్ళే విషయం గురించి నేను అడగడం లేదు. విదేశాలకు వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నావు కదా! దాని గురించి ఎప్పుడు అని అడుగుతున్నా”


ఆ మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు. ఇంకా ఆ విస్మయం నుండి తేరుకునే లోపే, పరమాచార్య స్వామివారు ఇంకొక విషయం తెలిపారు.


“నువ్వు ఇక్కడకు రావడానికి కారణమేంటో చెప్పనా? మొన్న నేను వచ్చి నిన్ను అడిగాను, “వెళ్ళడానికే నిశ్చయించుకున్నావా?” అని. అందుకే వెళ్లబోయేముందు ఇక్కడకు వచ్చావు. అంతేనా?” అని అన్నారు.


ఆరోజు జరిగినది కల కాదని, నిజంగా స్వామివారే వచ్చి ఆశీర్వదించారని తెలుసుకున్న తరువాత రంగరాజచారి భావోద్వేగానికి గురయ్యాడు. 


“నీ మంచి నడతను కొనసాగించు . . . డబ్బు అవసరం లేదు . . . మంచి నడవడిక ముఖ్యం” అని చెప్పి, తమ దివ్య పాదచారణాలను ఆ భక్తుని తలపై ఉంచి కరుణతో ఆశీర్వదించారు.


ఇది అద్భుతం కదా! ఒక సాంప్రదాయస్తుణ్ణి విదేశాలకు వెళ్ళకుండా ఆపారు స్వామివారు. ధర్మం యొక్క సాకార రూపమైన మన స్వామివారు తన భక్తులను ధర్మ మార్గంలో పయనించడానికి అనుకూలంగా అనుగ్రహాన్ని ప్రసరిస్తారు.


--- “శ్రీ పెరియవ మహిమై” పత్రిక నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

7, నవంబర్ 2022, సోమవారం

శివలింగాలలోని రకాలు

 శివలింగాలలోని రకాలు , వాటిని పూజించడం వలన కలుగు ఫలితాలు  - సంపూర్ణ వివరణ .


      దేవతలలో కెల్లా భక్తసులభుడు ఐన వాడు పరమశివుడు . ఈయనకి భోళాశంకరుడు అనే పేరు కూడా కలదు. "ఓం నమ శివాయః " అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఒక మారేడు దళాన్ని సమర్పించి ఒక చెంబుడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు పొంగిపోయి కోరిన వరాలను  ఇచ్చేసేవాడు శివయ్య మాత్రమే . అప్పుడే కొపం , అప్పుడే శాంతం . అదే శివయ్య గొప్పతనం. శివుడు స్వర్గనరకాదులన్నింటినే గాక ఆత్మకు ఆత్మకు మధ్య కర్మబంధాలను కూడా దహించివేయును.  అలాంటి పరమేశ్వరుడి యొక్క పూజ గురించి మీకు వివరిస్తాను. శివుడికి లింగపూజ ప్రధానమైనది. ఎటువంటి లింగాలను పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మీకు సంపూర్ణంగా వివరిస్తాను. 


      ముందుగా మీకు బాణలింగాల గురించి వివరిస్తాను.


 * బాణ లింగాలు  -


          బాణాసురుడు శివుడిని ప్రత్యక్షం చేసుకుని "మీరు సదా లింగ రూపములో ఇక్కడ ఉండవలెను " అని వరము కోరుకున్నాడు. దానికి శివుడు "తధాస్తు " అన్నాడు. అలా ఏర్పడిన లింగాలకే బాణలింగాలు అని పేరు వచ్చింది. ఒక్క బాణలింగ పూజలోనే నానావిధములు అయిన లింగాలను పూజించిన ఫలితాలు వచ్చును. ఇవి నర్మదా మొదలగు నదులలో లభించును. ఈ బాణ లింగాలకు బంగారు , వెండి , రాగి లోహములతో గాని , స్పటికముతో గాని కడకు పాషాణం (నల్ల రాయి ) తో అయినా వేదికను ఏర్పరిచి దానిపైన పూజించవలెను. ఈ బాణలింగాలను మొదట పరీక్షించి సంస్కారం అనగా శుద్ది చేయవలెను . ఈ బాణలింగాలు అనేక విధములుగా ఉండును. ఇందులో మేఘమువలె ఉండి , కపిలవర్ణము గల లింగము శుభప్రదం అయినది. తుమ్మెద వంటి నీల లింగములను పీఠములున్నను లేకపోయినను , శుద్ది లేకున్నను పూజించవచ్చు. సామాన్యంగా బాణలింగాలు తామరవిత్తుల వలే , పండిన నేరేడు పండ్లవలే , కోడిగుడ్డు ఆకారము వలే ఉండును. కొన్ని తెలుపు మరికొన్ని నలుపు , ఇంకొన్ని తేనె రంగుతో ఉండును. ఈ లింగాలు ప్రశస్తమైనవి. 


       వివిధ ద్రవ్యాలతో లింగాలను నిర్మించే విధానం గరుడపురాణంలో కనిపించును. 


    ఆయా లింగాల గురించి వాటి పూజించటం వలన కలిగే ఫలితాల గురించి మీకు వివరిస్తాను.


 * గంధ లింగము  -


     రెండు భాగాలు కస్తూరి , నాలుగు భాగాలు చందనం , మూడు భాగాలు కుంకుమ కలిపి గంధ లింగము తయారుచేయుదురు . దీనిని పూజించిన శివసాయుధ్యం కలుగును.


 *  పుష్ప లింగము  -


     నానా విధములైన సువాసన కలిగిన పువ్వులతో నిర్మించిన పుష్పలింగమును పూజించిన రాజ్యాధిపత్యం కొరకు పూజిస్తారు.


 *  గోమయ లింగము  -


      స్వచ్ఛమైన కపిల (నల్ల ) గోమయమును తెచ్చి లింగము చేసి పూజించిన ఐశ్వర్యము చేకూరును . నేలపైన , మట్టిలోన పడిన పేడ పనికిరాదు .


 *  రజోమయ లింగము  -


       పుప్పొడితో తయారుచేసిన లింగమును పూజించిన దైవత్వం సిద్ధించును . అటుపై శివసాయుజ్యం పొందవచ్చు .


 *  యవ - గోధుమ - శాలిజ లింగము  -


       యవ గోధుమ తండుల  పిండితో చేయబడిన లింగమును పూజించిన సకల సంపదలు కలుగును. పుత్రసంతానం కలుగును.


 *  తిలాపిష్ట లింగము  -


       నువ్వుల పిండితో లింగము చేసి పూజించిన ఇష్టసిద్ది కలుగును.


 *  లవణ లింగము  -


       హరిదళం , త్రికటుకాలు మెత్తగా పొడిచేసి ఉప్పుతో కలిపి లింగమును చేసి పూజించిన వశీకరణం ఏర్పడును .


 *  తుపొత్త లింగము  -


       శత్రు నాశనం చేయును.


 *  భస్మమయ లింగము  -


        సమస్త ఫలితాలను ప్రసాదించును.


 *  గుడోత్త లింగము  -


         ప్రీతిని కలిగించును.


 *  శర్కరామయ లింగము  -


         అన్ని సుఖాలను ఇచ్చును.


 *  వంశాంకుశమయ లింగము  -


        అన్ని సుఖాలను చేకూర్చును .


 *  కేశాస్తి లింగము  -


        సర్వ శత్రువులను నశింపచేయును .


 * పిష్టమయ లింగము  -


      సర్వ విద్యా ప్రదమవును .


 *  దధి దుగ్దద్భవ లింగము  -


      కీర్తిని , లక్ష్మిని ప్రసాదించును.


 *  ధాన్యజ లింగము  -


      ధాన్యప్రదం అగును.


 *  ఫలోత్త లింగము  -


       ఫలప్రదం అగును.


 *  ధాత్రీ ఫలజాత లింగము  -


       ముక్తిని ప్రసాదించును.


 *  నవనీత లింగము  -


       కీర్తి , సౌభాగ్యం ప్రసాదించును.


 *  దూర్వాకాండ లింగము  -


       ఈ లింగమును గరిక కాడలతో తయారుచేస్తారు . దీనిని పూజించుట వలన అపమృత్యువు నశించును.


 *  కర్పూర లింగము  -


       మోక్షమును అనుగ్రహించును.


 *  మౌక్తిక లింగము  -


        సౌభాగ్య ప్రదము .


 *  అయస్కాంత మణిజ లింగము  -


       సకల సిద్ధులను కలిగించును.


 *  సువర్ణ నిర్మిత లింగము  -


        ముక్తిని ప్రసాదించును.


 *  రజత లింగము  -


       ఐశ్వర్యాన్ని వృద్దిచేయును .


 *  ఇత్తడి , కంచు లింగములు  -


       ముక్తిదాయకం .


 *  గాజు , ఇనుము , సీసం లింగములు  -


        శత్రునాశనం చేయును .


 *  అష్ఠలోహ లింగము  -


        కుష్ఠురోగమును నివారించును.


 *  అష్టధాతు లింగము  -


        సర్వసిద్ధి కలిగించును.


 *  స్పటిక లింగము  -


        సర్వకామ ప్రదము . 


         ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. కాని తామ్రము , సీసం , రక్తచందనం , శంఖం , కాంస్యం , ఇనుము ల తయారైన లింగపూజ ఈ కలియుగము నందు నిషేధించబడినది. పాదరసం తో చేయబడిన లింగము అష్టైశ్వర్యాలను అనుగ్రహించును. ఇది అన్నింటి కంటే మహామహిమ కలిగినది . పారద శబ్దములో ప - విష్ణువు , అ - ఈశ్వరి , పార్వతి - కాశిక , ర - శివుడు , ద - బ్రహ్మ  ఇలా అందరూ దానిలో ఉన్నారు . జీవితములో ఒక్కసారైనను పాదరసముతో చేసిన శివలింగాన్ని పూజించిన విజ్ఞానం , అష్టసిద్దులు , ధనధాన్యాలు , సకలైశ్వర్యాలు అన్ని చేకూరును .


           లింగపూజ యందు పార్వతీపరమేశ్వరులు ఇద్దరికి పూజ జరుగును. లింగమూలము నందు బ్రహ్మ , మధ్యలో విష్ణువు , ఊర్ధ్వభాగము నందు ప్రణవాఖ్య పరమేశ్వరుడు ప్రకాశించుచుందురు . వేదిక (పానపట్టం ) పార్వతి , లింగము పరమేశ్వరుడు . కావున శివలింగ పుజ వలన సర్వదేవతా పూజ జరుగుతుందని లింగపురాణం నందు వివరించబడినది . 


 

       మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


కార్తీక పౌర్ణమి

 *2022 నవంబరు 8 మంగళవారం చంద్రగ్రహణం*


శ్రీ శుభకృత్ నామసంవత్సరం మార్గశిర శుద్ధ పూర్ణిమ నవంబరు 8 మంగళవారం భరణి నక్షత్రం మూడో పాదంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం పడుతుంది.

స్పర్శ కాలం మధ్యాహ్నం - 2 గంటల 38 నిముషాలు

మధ్య కాలం మధ్యాహ్నం - 4 గంటల 28 నిముషాలు

మోక్ష కాలం మధ్యాహ్నం -  6 గంటల 18 నిముషాలు

ఆద్యంత పుణ్యకాలం 3 గంటల 40 నిముషాలు


ఈ గ్రహణం భరణి నక్షత్రం మేషరాశిలో పట్టడం వల్ల అశ్విని, భరణి, కృత్తిక నక్షత్ర జాతకులు... మేష రాశివారు ఈ గ్రహణం చూడరాదు. చంద్రోదయం సాయంత్రం 5 గంటల 27 నిముషాలకు అవుతుంది. 


అందుకే విడుపు సమయంలో 51 నిముషాలు మాత్రమే ఈ గ్రహణం కన్పిస్తుంది. 


*నియమాలు పాటించే గర్భిణి స్త్రీలు కూడా సాయంత్రం 5.27 నుంచి 6.18 వరకు కదలకుండా పడుకుంటే చాలు.*



*కార్తీక పౌర్ణమి తేదీ.*


ఇక దృక్ పంచాంగం ప్రకారం నవంబరు 7వ తారీకు సాయంత్రం నాలుగు గంటల 15 నిమిషాలకు పౌర్ణమి తిధి ప్రవేశిస్తుందని, ఎనిమిదో తేదీ సాయంత్రం నాలుగు గంటల 31 నిమిషాలకు ఇది ముగుస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి కి పూర్ణ చంద్రుడు కనిపించడమే ప్రాధాన్యత కాబట్టి, 8 వ తారీకు రాత్రి పౌర్ణమి ఘడియలు ఉండడం లేదు కాబట్టి, *ఏడవ తారీఖునే ప్రామాణికంగా తీసుకొని కార్తీక పౌర్ణమి నిర్వహించుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.* వచ్చే కార్తీక సోమవారం నాటి సాయంత్రం, కార్తీక పౌర్ణమిగా 365 వత్తుల దీపాలను, ఉసిరిక దీపాలను వెలిగించి భగవంతుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతున్నారు.

వంద పనులు విడిచిపెట్టయినా


శత విహాయ భోక్తవ్యం 

సహస్రం స్నాన మాచరేత్ 

లక్షం విహాయ దాతవ్యం

 కోటిం త్యక్త్యా హరిం భజేత్!!


వంద పనులు విడిచిపెట్టయినా


వేళకు భోజనం చేయాలి.


వేయి పనులు విడిచి స్నానం చేయాలి. లక్ష పనులు విడిచి దానం చేయాలి.


కోటి పనులు విడిచి దైవ ప్రార్ధన చేయాలి.


 వంద పనులైన విడచియు ముందు గాను

తృప్తి తో భోజనమ్మును చేయ తగును 

వేయి పనులైన విడచి యు వెనుక బడక 

మనసుతో చేయవలయును  మజ్జ నమ్ము 

లక్ష పనులైన విడచియు లక్ష్య ముంచి

దాన ధర్మాదు లెప్పుడున్ సల్ప దగును

కోటి పనులైన విడచియు కూర్మి తోడ 

హరిని ప్రార్థించ వలయు తా యాత్మ యందు

గోపాలుని మధుసూదనరావు శర్మ

Srimadhandhra Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 66 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


స్వాయంభువ మన్వంతరంలో మీరిద్దరూ (దేవకీ వసుదేవులు) ఒక ప్రజాపతి, ప్రజాపతి భార్య. నీ పేరు సుతపుడు. ఆమె పేరు పృశ్ని. మీరిద్దరూ ఆకులు అలములు తింటూ పన్నెండు వేల దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. నేను ప్రత్యక్షం అయి ‘ఏమి కావాలి?’ అని అడిగాను. మీకు పుత్రుని మీద వ్యామోహం ఉండిపోయింది. ‘నీలాంటి కొడుకు కావాలి’ అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేదు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒకమారు అడిగితే నేను మూడుమార్లు పుట్టాను. ఒకసారి నేను పృశ్నికి పృశ్నిగర్భుడుగా, రెండవమారు అదితి కశ్యపులుగా ఉన్నప్పుడు వామనమూర్తిగా ఇప్పుడు కృష్ణభగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉన్నది. అంతరార్ధం తెలిసినా తెలియకపోయినా నా కథ విని, నన్ను స్మరిస్తూ, నన్ను గురించి చెప్పుకుంటూ మోక్షమును పొందండి’ అన్నాడు.

ఈ మాటలు చెప్పిన తర్వాత ఒక రహస్యం చెప్పాడు. ఈ విషయములు వసుదేవునకు అంతరమునందు ద్యోతకం అయ్యాయి. పరమాత్మ ఈ విషయమును బాహ్యమునందు చెప్పలేదు. ‘ఇదే సమయమునందు యమునానదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా శక్తి స్వరూపమయిన యోగమాయ యశోదాదేవి గర్భమునందు ఆడపిల్లగా జన్మించింది. నీవు నన్ను తీసుకువెళ్ళి ఆ యశోదాదేవి పక్కన పడుకోబెట్టి మరల అక్కడనుంచి ఆడపిల్లను తెచ్చి దేవకి ప్రక్కన పడుకోబెట్టు’ అన్నాడు.

వెంటనే వసుదేవుని కాళ్ళు, చేతులకు ఉన్న సంకెళ్ళు ఊడిపోయాయి. ఈ పిల్లవాడిని తీసి గుండెలమీద పెట్టుకున్నాడు. చాలామంది తలమీద పెట్టుకున్నారు అంటారు. పోతనగారి భాగవతంలో అలా లేదు. గుండెల మీద పెట్టుకున్నాడనే ఉన్నది. ద్వారం దగ్గరకు వెళ్ళాడు. ద్వారమునకు ఉన్న ఇనుప గొలుసులు, తాళములు, మేకులు అన్నీ ఊడిపోయాయి. కంసుడితో సహా అందరూ గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి ఆయన మీద నీడపట్టి శేషుడు వస్తున్నాడు. బయటకు వచ్చాడు ఆకాశం అంతా నల్లటి మబ్బుపట్టి ఉన్నది. గాఢాంధకారము. శ్రావణమాసం, వర్షం పడుతోంది. శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు. విపరీతమయిన వేగంతో ప్రవహిసస్తున్న యమునానది దగ్గరికి వెళ్ళాడు. వసుదేవుడు పరమాత్మను గుండెలమీద పెట్టుకుని యమున వంక చూశాడు.

కృష్ణభగవానుని గుండెలమీద పెట్టుకున్న వసుదేవుని చూడగానే ఆనాడు రామచంద్రమూర్తికి చోటు యిచ్చిన సముద్రములా యమున చోటిచ్చింది. అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మను పడుకోబెట్టాడు. అక్కడ ఆడపిల్ల పుట్టినా ఎవరికీ తెలియదు. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఆ పిల్లను ఎత్తుకుని మళ్ళీ తిరిగివచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ద్వారములు మూసుకున్నాయి. ఇనుపసంకెళ్ళు పడిపోయాయి. వసుదేవుడు ఆ ఆడపిల్లను దేవకీదేవి ప్రక్కన పడుకోబెట్టాడు. వసుదేవుడు కృష్ణపరమాత్మను గుండెలమీద ధరించాడు. అనగా వసుదేవుడు లోపల ఉన్న ఆత్మస్వరూపమును తెలుసుకున్నాడు. ఆయన హృదయగ్రంథి విడిపోయింది. అందుకే ఆడపిల్లను వదలమని వసుదేవుడు ఏడవడు దేవకి ఏడుస్తుంది. ఇంకా విష్ణుమాయ దేవకియందు ఉన్నది. తల్లి కాబట్టి ఉండాలి లేకపోతే కంసునికి అనుమానం వస్తుంది.

ఈ ఆడపిల్ల ఏడ్చింది. అక్కడ వున్న వాళ్ళందరూ లేచారు. పిల్ల పుట్టిందని అనుకున్నారు. ముందుగా తాళం కప్పలమీద రాజముద్ర ఉన్నదీ లేనిదీ చూశారు. రాజముద్ర ఉన్నది. లోపలి వాళ్ళు ఎక్కడికీ వెళ్ళలేదు. వసుదేవుడు అలా కూర్చుని ఉన్నాడు. భటులు పిల్ల ఏడుపు విని కంసుని వద్దకు పరుగెత్తుకు వెళ్ళి విషయం చెప్పారు. చెప్పగానే నిద్రపోతున్న వాడు పరుగెత్తుకుంటూ చెరసాలకు వచ్చి తాళములు తీశాడు. ఆడపిల్ల ఏడుస్తుంటే దేవకీ దేవిని విష్ణుమాయ కప్పేసింది. ఆ ఆడపిల్లే తనపిల్లే, తానే రక్షించుకోవాలని అనుకుని అన్నగారికి కనపడకుండా ఆ పిల్లను పమిటలో పెట్టుకున్నది. ‘అన్నయ్యా! ఇది చంపివేయడానికి మేనల్లుడు కాదు మేనకోడలు. నన్ను నమ్ము ఆరుగురిని చంపేశావు. ఏడవది గర్భస్రావము అయింది ఇది ఆడపిల్ల. ఇంటికి ఆడపడుచు నీకు కోడలు. నువ్వు మన్నన చేయాలి. పసిపిల్లయిన దానిని చంపాడన్న అపఖ్యాతిని నువ్వు కట్టుకోవద్దు. ఈ పిల్లనయినా బ్రతకనివ్వు. చంపవద్దు ’ అని ఏడుస్తూ వేడుకున్నది.

కంసుడు మహోగ్రంగా సోదరిని నిందించి పసిపిల్ల రెండు కాళ్ళు పట్టుకు లాగేసి గిరగిర త్రిప్పి బండకు వేసి కొట్టాడు. ఈ పిల్ల బండకు తగలడం మాని ఆకాశంలోకి వెళ్ళిపోయి దివ్యమైన రథమునందు ఆరూఢయై కూర్చుంది. అటునుంచి విమానములలో దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. శ్రీమన్నారాయణుడు ఆమెకు వరం ఇచ్చాడు. ‘నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే పదునాలుగు నామములతో పిలుస్తారు. భాగవతాంతర్గతంగా ఎవరైతే ఈ నామములు వింటున్న వాళ్ళందరినీ దేశంలో ఎక్కడెక్కడ వున్నా నీవు రక్ష చేస్తావు’ అన్నాడు. ఆ తల్లి ఆకాశంలో నిలబడింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వచ్చి పాటలు పాడుతూ తల్లికి అగరుధూపములు సమర్పిస్తున్నారు. నైవేద్యములు సమర్పిస్తున్నారు. ఆ తల్లి అవన్నీ తీసుకుని క్రింద ఉన్న కంసుని చూసి ‘ఓరీ దుర్మార్గుడా! పిల్లలందరినీ రాళ్ళకు వేసి కొట్టి చంపావు. నన్నుకూడా కొట్టాలని ప్రయత్నం చేశావు. నాతోపాటు పుట్టి నిన్ను చంపేవారు వేరొక చోట పెరుగుతున్నాడు. నీవు చనిపోవడం ఖాయం’ అని చెప్పి దేవతలు సేవిస్తుండగా తల్లి వెళ్ళిపోయింది.

వెంటనే కంసుడు పరుగెత్తుకుంటూ దేవకీ వసుదేవుల వద్దకు వచ్చి ఇంటికి వెళ్ళి మీరిద్దరూ సంతోషంగా ఉండమని చెప్పి వాళ్ళను పంపించి వేశాడు.

అవతల నందవ్రజంలో ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. కృష్ణపరమాత్మ అక్కడ ఆవిర్భవించి ఉన్నారు. పిల్లవాడేమీ ఏడవలేదు. యశోద పొంగిపోయింది. నంద వ్రజం భగవద్భక్తులతోనూ, గోవులతోను నిండి ఉంటుంది. గోపకాంతలు మహా సంతోష పడిపోతు చూచివద్దామని యశోద గృహమునకు వెళ్ళారు. బయటకు వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు ‘అబ్బ పిల్లవాడు ఎంత బాగున్నాడే!’ అని పరవశించిపోతున్నారు. బయట నందప్రభువు పొంగిపోతున్నాడు. బ్రాహ్మణులను పిలిపించి గోవులను దానం ఇచ్చాడు. గొప్ప గొప్ప మేలిమి వస్త్రములు దానం ఇచ్చాడు. పిల్లవాని జాతకము చూసి ఎలా ఉంటాడో చెప్పవలసింది అని వారిని అడిగాడు. ఆ పిల్లవాని జాతకం చూసి ‘లేక లేక పుట్టిన నీ కుమారుడు గొప్ప లక్ష్మీ సంపన్నుడవుతాడు లక్ష్మీదేవి వీనిదే. ఎటువంటి వీరులనయినా ఓడిస్తాడు. గొప్ప దీర్ఘాయుర్దాయమును పొందుతాడని చెప్పారు. పిదప ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు. అక్కడకు వచ్చిన వాళ్ళలో వృద్ధ స్త్రీలను పిలిచి కృష్ణ పరమాత్మకు నీళ్ళు పోయమని అడిగారు. లోకములన్నింటిని ప్రళయం చేసేయ్యాలనుకున్నప్పుడు నీళ్ళలో ముంచేసి తాను మాత్రం ఒక మర్రి ఆకుమీద ఏమీ తెలియనివాడిలా బొటనవ్రేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకునే వటపత్రశాయి ఏమీ తెలియని వాడిలా ఈ వృద్ధ గోపకాంతల తొడల మీద పడుకొని నీళ్ళు పోయించుకొని ఉక్కిరిబిక్కిరి అయిపోయినట్లు పడుకున్నాడు దొంగకృష్ణుడు. ఆఖరుకి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఓ ఉయ్యాలలో పడుకోపెట్టారు.

పూతన సంహారం

కంసుడు అష్టమగర్భమును తాను సంహరించగలనని ఎన్నో ప్రయత్నములు చేశాడు. ఎన్ని ప్రయత్నములు చేసినా అష్టమగర్భం జారిపోయి ఇంకొకచోట పెరుగుతోంది. తన మృత్యువును ఏ ప్రయత్నము చేత అధిగమించలేకపోతున్నాడు. ఈ సత్యమును కంసుడు అంగీకరించి ఉంటే కంసుడి జీవితం వేరొకరకంగా మారి ఉండేది. కంసుడు రాత్రి నిద్రపోయి ఉదయముననే తన మంత్రులను పిలిచి ‘మీరు అందరూ చూసారు. నిన్న నేను ఆ బిడ్డను చంపబోయాను. ఆవిడ వెంటనే స్త్రీగా మారిపోయి పైకి వెళ్ళి నీవు తొందరగా మరణించబోతున్నావు. నిన్ను చంపేవాడు నాతో కలిసి పుట్టి వేరొకచోట పెరుగుతున్నాడు’ అని చెప్పింది. నాకు కొంచెం భయంగా ఉన్నది’ అన్నాడు.

కంసుని చుట్టూ ఉన్నవాళ్ళు ‘రాజా! ఈ మాత్రం డానికే భయపడి పోతావేమిటి? మీ ధాటికి ఆగలేక దేవతలందరూ దాక్కుని ఉన్నారు. మీ శక్తి మామూలుది కాదు. మీరు మాకు ఒక్క ఉత్తరువు ఇచ్చారంటే మేము అంతటా తిరిగి కొత్తగా పుట్టిన పిల్లల దగ్గరనుంచి పళ్ళు వస్తున్న పిల్లల వరకు అందరినీ చంపేస్తాము’ అన్నారు. నీ ప్రధాన శతృవు శ్రీమహావిష్ణువు. గతంలో నీవు కాలనేమిగా ఉండగా నిన్ను సంహరించాడు. నీకు రహస్యం చెపుతాను విను. ఇప్పటికి కూడా పిల్లవాని రూపంలో వచ్చి నిన్ను విష్ణువే చంపుతాడు. విష్ణువు మూలమును తీసివేయాలి. ప్రబలంగా విష్ణువు ఎక్కడ ఉంటాడో దానిని తీసివేయాలి’

ఎవరెవరు సత్యం మాట్లాడుతున్నారో, ఎవరు జపం చేస్తున్నారో, ఎవరు ఈశ్వరుని నమ్ముతున్నారో, ఎవరు ప్రశాంతముగా ఉంటున్నారో, ఎవరు తపస్సు చేస్తున్నారో, ఎవరు అగ్నికార్యం చేస్తున్నారో, ఎవరు వేదం చదువుకుంటున్నారో, ఎక్కడ ఆవులు ఉన్నాయో, ఎక్కడ దూడలు ఉన్నాయో, ఎక్కడెక్కడ హోమములు జరుగుతున్నాయో, వీటినన్నింటిని నాశనం చేసేస్తే విష్ణువనేవాడు లేకుండా పోతాడు. మనకు శత్రువు ఉండడు. వీటినన్నిటిని నాశనం చేస్తాము మాకు అనుజ్ఞ ఇవ్వండి’ అన్నారు. నందవ్రజంలో కృష్ణభగవానుడు పెరుగుతున్నాడు. ‘అజాయమానో బహుధా విజాయతే’ అని వేదం అంటోంది. జన్మించ వలసిన అవసరం లేనివాడు అనేకమయిన జన్మలను పొందుతున్నాడు. అటువంటి వానికి జాతకర్మ చేస్తున్నారు. ఆయన కన్నా ముందు ఉన్నవాడు ఎవడూ లేడు. ఆయన తర్వాత ఉండేవాడు లేదు. ఆయన ఎప్పుడూ తల్లిపాలు త్రాగి ఎరుగడు. అటువంటి వాడు ఈవేళ ఆశ్చర్యంగా యశోదాదేవి ఒడిలో పడుకొని పాలు త్రాగుతున్నాడు. పరబ్రహ్మము అనుగ్రహం ఎంత ఆశ్చర్యం! ఆ యశోద ఎంత పుణ్యం చేసుకున్నదో కదా! ఆనాడు పాలిచ్చి పెంచింది. ఈనాడు కూడా ఆ యశోదను చూడాలనుకుంటే వేంకటాచలంలో వేంకటరమణుని సన్నిధానంలో ఇప్పటికీ పిల్లవాడికి అన్నీ జాగ్రత్తగా అందుతున్నదీ లేనిదీ చూస్తూ వకుళమాతగా కూర్చుంది. ఆయనకు హానీ తెలియదు, వృద్దీ తెలియదు. ఒకనాడు ఉండడం, ఒకనాడు లేకపోవడం, పెరగడం, తరగడం లాంటివి ఉండవు. అలాంటివాడు ఆశ్చర్యంగా రోజురోజుకీ అమ్మ ఒడిలో పెరుగుతున్నాడు. ఎంత తపస్సు చేసినా చూడడానికి వీలుకాని మూర్తి ఇవాళ ఏమీ చేతకాని గోపకాంతల ఇళ్ళల్లో పెరిగి పెద్దవాడయి ఆడుకుంటున్నాడు. నందవ్రజంలో ప్రతి ఇంట్లోకి వెళ్ళి వారు నైవేద్యం పెట్టనవసరం లేకుండా తానే అడిగి తినేవాడు. ప్రత్యక్ష కైంకర్యం ఎంత అదృష్టం. ఎంత చదువుకున్నా బ్రహ్మము ఎలా వుంటుంది అంటే చెప్పడం కుదరదు.

‘యతోవాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహా’

మనస్సు, వాక్కు ఇంకా మేము పరబ్రహ్మము గురించి చెప్పలేమని ఎక్కడ తిరిగిపోయాయో అక్కడ పరబ్రహ్మము ఉన్నది. ఏ చదువు కూడా చెప్పలేని ఆ పరబ్రహ్మము ఇవాళ ఆ గోపకాంతల ఇంట్లో ఒక స్వరూపమై పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఇది పరమాత్మ కారుణ్యము. ఏదయినా ఈశ్వరానుగ్రహంలో నుంచే వస్తుంది.



https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...


instagram.com/pravachana_chakravarthy

పిల్లల కోసం... పూర్తిగా ఉచిత వైద్యం. !

 B Lakshmi


7 July 2016 at 10:01


Facebook for Android.


ఎవరికైనా ఉపయోగ పడవచ్చు ప్లీజ్ అందరికి షేర్ చెయ్యండి


ప్రాణాంతక వ్యాదులు వచ్చినా స్తోమత లేని పిల్లల కోసం... పూర్తిగా ఉచిత వైద్యం. !


మద్రాసు (చెన్నై)లో అత్యాదునిక సదుపాయాలతో 600 మంది


పిల్లల డాక్టర్లుగల హాస్పటల్ ఉంది.


అక్కడ అందించేది పూర్తిగా ఉచిత వైద్యం.


మద్రాసు ఎగ్మోర్ రైల్వై స్టేషనులో దిగి ఎవరిని అడిగినా చిల్డ్రన్ హాస్పటల్ అడ్రస్ చెబుతారు. నవజాత శిశువుల మొదలు 12 ఏళ్ళ పిల్లల వరకు ఎటువంటి వైద్యమైనా సరే... అంటే 10 లక్షల రూ.లు ఖర్చు కాగల గుండె సంబంధిత వ్యాదులైనా సరే, ఉచితంగానే చేస్తారు. అందుకు తగిన సాధన సంపత్తి వారికి ఉంది.


దీనిని కంచి కామకోటి చైల్డ్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు.


ఆసుపత్రిలోని సదుపాయాలు కార్పొరేట్ తరహాలో ఉంటాయి. కనుక ఈ హాస్పటల్ గురించి అవసరమైనవారికి దయచేసి చెప్పండి.


Hospital name- Kanchi Kamakoti Child Trust 12A, Nageshwara Road, Nungambakkam, Chennai-600 034, Tamil nadu


25:9573799997, 9640640878, 9677003334, +914442001800.


ఎవరికైనా ఉపయోగ పడవచ్చు ప్లీజ్ అందరికి షేర్ చెయ్యండి ...

Siva Maha Puranam

 Sri Siva Maha Puranam -- 12 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

ఓంకారేశ్వర క్షేత్రము

కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ

సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే!!

మాంధాతృపురంలో వెలసిన వాడు ఓంకారేశ్వరుడు. ఓంకారేశ్వర క్షేత్రము చాలా చిత్రమయిన క్షేత్రము. అక్కడ రెండు స్వయంభూ శివలింగములు వెలశాయి. అందులో ఒకదానిని ‘ప్రణవాకార పరమేశ్వరుడు’ అంటారు. ఆయన ఓంకార స్వరూపియై ఉంటాడు. రెండవది ‘ఓంకారమమలేశ్వరం’ అంటాము. అమలేశ్వరుడు అనే పేరుతో ఒక శివలింగం ఉంటుంది. ఇలా రెండు లింగములు వెలియడానికి కారణం తెలుసుకోవాలి.

గురుస్వరూపుడు నారదమహర్షి త్రిలోక సంచారి మహానుభావుడు. ఒకసారి వింధ్యపర్వతం దగ్గరకు వచ్చారు. వింధ్యపర్వతమునకు తాను చాలా గొప్పదానను అని, తనంత ఎత్తైన పర్వతం మరొకటి లేదని చాలా అహంకారం ఉన్నది. ఇది ఒక అర్థం లేని ఆభిజాత్యం. అదృష్టం ఏమిటంటే అటువంటి సద్గురువు అయిన నారదునితో వింధ్యపర్వతం మాట్లాడడం. ఎంత అహంకారి అయినా అతనికి ఒక సద్గురువు దొరికాడంటే అతనికి అంతకుమించిన అదృష్టం లేదు. వాని జీవితం మారిపోతుంది. నారదుడిని చూసి విధ్యపర్వతం అహంకారమును బయట పెట్టింది. అసలు వింధ్యుడు చూడగానే నారదునికి నమస్కారం చెయ్యకుండా అహంకారంతో మాట్లాడాడు. నారదుడు ఒక చిరునవ్వు నవ్వి 'నీవు చెప్పినది యథార్థము. నీతో సామానమయిన పర్వతము ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది. మేరుపర్వతం కూడా చాలా గొప్ప పర్వతం. నవగ్రహములు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు అవి మేరుపర్వతమునకు ప్రదక్షిణగా తిరుగుతూ ఉంటాయి' అన్నాడు. ఆమాట వినేసరికి వింధ్య పర్వతానికి చాలా బాధ వేసింది. ‘నాకూ ఉన్నాయి శిఖరములు. వాటి చుట్టూ ఎవరూ తిరగడం లేదు. మేరు పర్వతమునకు ఉన్న కీర్తి నాకు లేదు’ అని అనుకుని ‘నారదా! నేను కూడా అటువంటి కీర్తిని పొందాలి. మేరుపర్వతం కంటే గొప్ప ఉన్నతిని పొందాలి అంటే నన్ను ఏమి చేయమంటావు?” అని అడిగాడు.

నారదుడు మహాశివుణ్ణి గూర్చి తపస్సు చేయమని వింధ్యుడికి సలహా చెప్పాడు. వెంటనే వింధ్యుడు మహాశివుణ్ణి గూర్చి శివ పంచాక్షరీ మహామంత్రమును ఉచ్ఛరిస్తూ తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశాడు. దేవతలు మహాదేవుని వద్దకు వెళ్లి ‘మహాదేవా! వాని తపస్సు సామాన్యంగా లేదు. మీరు వెళ్ళి ప్రత్యక్షం అవండి’ అన్నారు. అంతటా నిండి ఉన్న నిర్గుణ పరబ్రహ్మము సాకారమును పొంది ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు. చేతితో స్పృశించాడు. వింధ్యుడు బహిర్ముఖుడు అయ్యాడు. ‘నాయనా! నీవు చాలా గొప్ప తపస్సు చేశావు. నీవు ఏమి కోరి ఈ తపస్సు చేశావు? ఏమి కావాలో చెప్పు ఇస్తాను’ అన్నాడు. ‘నన్ను లోకములో గొప్పవాడిగా చెయ్యి’ అని అడిగాడు. “నీవు ఇంక అహంకారముతో ప్రవర్తించకు. ఏ నవగ్రహములు అయితే మేరువు చుట్టూ తిరుగుతున్నాయో అటువంటి నవగ్రహములను కవచంగా కట్టుకున్న నేను స్వయంగా వచ్చి నీ శిఖరమును అధిరోహిస్తాను’ అని చెప్పి శంకరుడు వింధ్యుడిని అనుగ్రహించాడు. అపుడు వింధ్యుడు ‘ప్రభూ! దానిని నీ అనుగ్రహంగా భావిస్తాను అహంకరించను’ అని ఆ వింధ్య పర్వత శ్రేణి మీద పరమాత్మ అన్ని చోట్లా ఒక్క స్వయంభూలింగంగా వస్తే వింధ్య పర్వత శిఖరముల మీద స్వామి రెండు స్వయంభూ లింగములుగా వచ్చాడు. ఒకటి ‘ఓంకార లింగము’, ఒకటి ‘అమలేశ లింగము’ ‘ఓంకారమమలేశ్వరం’ అంటాము. ఆ వెలయడం మాంధాతృపురంలో వెలశాడు. ఓంకారం అంటే ప్రణవము. ప్రణవము మోక్ష దాయకము. వింధ్యగిరి మీదికి వెళ్లి దర్శనం చేసిన వారికి మోక్షం వస్తుంది. పక్కన అమలేశుడు ఉన్నాడు. మనందరి యందు ఆనవ మలము, కార్మిక మలము, మాయక మలమని మూడు రకములయిన మలములు ఉంటాయి. స్నానం చేసినా ఈ మూడూ వదలవు. ఈశ్వరుడు ఈ మూడు మలములకు అతీతుడు. మీకు ఈ మూడు మలములకు అతీతమయిన స్థితిని ఇచ్చి , తానే స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి మిమ్మల్ని ఎత్తగలిగినవాడు ఓంకారేశ్వరుడు. కోరిన సమస్త కోరికలనూ తీర్చగలిగిన వాడు. ఆయన నిరంతర ఆనంద స్వరూపుడు. అడిగినది ఏదయినా ఇవ్వగలడు. ఆయన అమరేశ్వరుడిగా, ఓంకారేశ్వరుడిగా ఉన్నాడు. ఇద్దరుగా అక్కడ వెలసి శంకరుడు నిరంతరము జనులకు శుభములను ఇస్తూ ఆ కొండమీద వెలసి ఉన్నాడు. అలా వెలసిన అమలేశ్వరుణ్ణి శంకర భగవత్పాదులు ఒక అద్భుతమయిన శ్లోకముతో ఆరాధన చేస్తారు. మనం అమరేశ్వర లింగమును చూసినప్పుడు ఆ భావనను మనస్సులో తెచ్చుకోవాలి. అమలేశ్వర లింగమును, ఓంకారేశ్వర లింగమును చూసి తత్త్వ విచారణ రీత్యా మీ మనస్సు లోపలి తెచ్చుకోవాలి శంకరులు అంటారు

ఆకాశ శ్చికురాయతే దశదిశాభాగో దుకూలాయతే

శీతాంశుః ప్రసవాయతే స్థిరతరానందః స్వరూపాయతే,

వేదాంతో నిలయాయ తేసువినయో యస్యస్వభావాయతే

తస్మి న్మే హృదయం సుఖేనరమతాంసాంబే పరబ్రహ్మణి!!

‘సాంబే’ అంటే ‘స అంబే’ – అమ్మతో కూడుకున్న అయ్యా ! ఓ శంకరా నీవు పరబ్రహ్మవు. నీవు అమలేశ్వరుడవు. మూడు మలములకు అతీతమై ఉన్న నీవు లింగముగా కనపడుతున్నావు. నీవు నాతో వచ్చినప్పుడు నీవు ఆకాశస్వరూపుడవై ఉన్నావు. నీవు దిగంబరుడవు. పది దిక్కులు కలిసి నీకు వస్త్రము అయ్యాయి. దిక్కులను అంబరముగా కట్టుకున్నవాడవు. చంద్రరేఖను ఆభరణముగా కలిగిన వాడవు. ఎప్పుడూ ఆనందమయ స్వరూపుడవై ఉంటావు. వేదముల చివరి భాగములయిన ఉపనిషత్తులయందు చెప్పబడుతుంటావు. వినయముతో నిన్ను తలుచుకుంటే చాలు మమ్మల్ని ఉద్ధరించడానికి వస్తావు’.

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

instagram.com/pravachana_chakravarthy