ప్రపంచంలో ఎన్నో మతాలు వున్నాయి అలాగే హిందూ మతం కూడా అని అందరు అనుకుంటారు. కానీ నిజానికి హిందూ మతము కాదు ఇది ఒక సనాతన సంప్రదాయం. ఇది ఒక ధర్మము ప్రతి మనిషి తన జీవితాన్ని ఒక క్రమశిక్షణతో ఆచరించ వలసిన ధర్మము . అందుకే హిందూ ధర్మము అని మనం అంటాము. ఎందుకంటె ప్రతి మతానికి ఒక ప్రవక్త ఉంటాడు. అది మనందరికీ తెలిసిందే, మరి హిందూ మతానికి ప్రవక్త ఎవరు చెప్పగలరా చెప్పలేరు. ఎందుకంటే హిందూ మతానికి ప్రవక్త లేడు. అందుకే ఇది ఒక ధర్మము యుగాలనుంచి ఆచరిస్తున్న ధర్మము. హిందువుగా ప్రతి ఒక్కరు కాపాడవలసిన ధర్మం. ఇది మన ధర్మం.
ప్రతి ఒక మతానికి ఒక మత గ్రంథం వుంటున్నది. అది మనఅందరికి తెలిసిందే మరి హిందూ మతానికి ఏ గ్రంధం వున్నది చెప్పండి. మహాభారతమా, రామాయణమా , భగవతమా, వేదాలా, ఉపనిషత్తులా, పురాణాలా చెప్పండి. ఇందులో ఏది హిందూ మత గ్రంధం. చెప్పగలరా చెప్పలేరు. కానీ ఏ మతాన్ని తీసుకున్న కేవలము ఒకే ఒక్క గ్రంధము ఉంటుంది. అదే వారి మతానికి మూలంగా ఉంటుంది. మరి హిందూ మతం విషయంలో ఆలా చెప్పగలరా లేరు. మన ఋషులు ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి ఏర్పాటు చేసిన పరంపరే మన విజ్ఞానం , మన వాగ్మయం.
ఇక దేముడు విషయానికి వస్తే ప్రతి మతము ఒకే ఒక్క దేముడు వున్నాడని ప్రవచిస్తున్నాయి. ఆ దేముడినే వారు ఆరాధిస్తారు. మరి హిందూ మతం విషయానికి వస్తే ఎందరో దేముళ్ళు వున్నారు. కానీ అందరికి మూలం మాత్రం ఆదిపరా శక్తి. ఆ శెక్తే సర్వ చరా చెర సృష్టికి మూలం.
హిందూ ధర్మంలో ఎందుకు ఇంతమంది దేముళ్ళు వున్నారు. అన్న విషయాన్నీ పరిశీలిస్తే మనకు తప్పకుండా కారణం తెలుస్తుంది. అదేమిటంటే ప్రతి దేముడికి ఒక ప్రత్యకత వున్నది. ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క దేముడు వున్నాడన్నమాట అంటే ఉదాహరణానికి ధనానికి ధన లక్ష్మి, విద్యకు సరస్వతి, శక్తికి పార్వతి; అలాగే సృష్టికి బ్రహ్మదేముడు, స్థితికి అంటే ఈ జీవరాశిని నియంత్రించటానికి విష్ణుమూర్తి అలానే లయానికి అంటే సృష్టి ముగించటానికి శంకరుడు అన్నమాట. ఈ రీతిగా ప్రతి విభాగానికి ఒక్కొక్క దేముడు అన్నమాట.
హిందు ధర్మంలో వున్న ఒక ప్రత్యకత ఏమిటంటే మనకు ఏ ప్రయోజనం కావాలో ఆ దేముడిని మనం స్తుతించ వచ్చు. ఆయా దేముడిని ప్రసన్నం చేసుకుంటే ఆ యా కోరికలను ఈడేర్చుకోవచ్చు.
హిందుత్వంలో వున్న ఒక గొప్ప విషయం కాల నిర్ణయం. అంటే పంచాంగం. ఎటువంటి సైన్సు పరికరాలు లేకుండా ఎన్నో సంవత్సరాలనుండి మన జ్యోతిషులు పంచాంగాన్ని గుణిస్తున్నారు. వారు శనిగ్రహాన్ని చుట్టూరా (డిస్క్) ఉంటుందని కనుగొన్నారు. అంతే కాదు ప్రతి గ్రాహం ఎంత వేగంగా గగనంలో తిరుగుతుందో కనుగొన్నారు. ఈరోజు మనం టెలిస్కోపుతో చూస్తూ గ్రహణాలు ముందుగా చెప్పగలుగుతున్నాము. మరి మన హిందూ సంప్రదాయంలో ఎలాంటి పరికరాలు లేకుండా గ్రహణం ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు విడుస్తుందో క్షేణాలతో సహా చెప్పుతున్నారు. అంటే హిందూ దేశం ఎంత విజ్ఞానం కలిగినదో మనకు తెలుస్తున్నది. సూర్య గమనాన్ని బట్టి ఉత్తరాయణం, దక్షిణాయనం అని సంవత్సరాన్ని రెండు భాగాలుగా చేసారు. ఉత్తరాయణం పుణ్య కాలంగా పేర్కొన్నారు.
హిందూ దేశంలో పండగలకు చాల ప్రాధ్యాన్యం వున్నది.
తోలి ఏకాదశి
తోలి ఏకాదశి
ఇంకా వుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి