23, మార్చి 2020, సోమవారం

మన కర్తవ్యం

మన కర్తవ్యం
ఈ బ్లగుని చూసే వారందరికీ శుభాభివందనాలు.  నేడు మన మానవ జాతి ఒక విపత్కర పరిస్థితిలో వున్నది.  దీనిని మనమంతా జాగరూకతతో, ఐకమత్యంతో సంఘీభావంతో, మరియు సమయస్ఫూర్తితో ఎదుర్కోవలసిన సమయం.  అదే కరోనా మహమ్మారి  ఏదో ఒక క్రూర మృగమో లేక  పామో, తేలో ఎదురు పడింది అంటే మనము జాగ్రత్తగా ఆ వైపుకు పోకుండా ఉండటం లేక దానిని పట్టిచంపటమో లేక చంపించటమో చేసి సదరు జంతువు భారీ నుండి తప్పిచుకోగలం కానీ యిప్పటి పరిస్థితి చాలా భిన్నమైనది.  ఈ కరోనా ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఉండదో  తెలియదు. అది ఎవరిని తాకుతుందో ఎవరిని తకదో తెలియదు.  కాబట్టి అందరం చాలా జాగ్రత్తగా ఈ విషమ పరిస్థితిని ఎదుర్కోవాలి.  ఇది ఒక ప్రాంతలేక ఒక దేశ సమస్య కాదు పూర్తిగా మానవాళిని పట్టి  పీడిస్తున్న  సమస్య.

వ్యాప్తి: కరోనా అనేది ఒక వైరస్ అని చెపుతున్నారు.  వైరసులు బ్యాక్టీరియాలకన్నా చిన్నగా వుండే జీవులు. ఈ జీవులు స్వతగాహ ఎక్కువ కాలం బ్రతక లేవు.  అవి వాటి host cells దొరికితే వాటి మీద ఆధార పడి వాటి సంతానాన్ని వ్యాప్తి చేసుకొని సదరు host cells ని నాశనం చేస్తాయి దాని మూలంగా ఆ host cells కలిగిన మానవుడు వ్యాధిగ్రస్తుడు అవుతాడు.  మన శాస్త్రీయ విజ్ఞానమ్  వైరస్లను చంపగలిగే స్థాయికి ఎదగలేదు.  కాబట్టి వైరస్ సంబంధిత రోగాలకు వ్యాక్సిన్లు కనుగొన్నారు.  వాక్సిను అనేది నిజానికి మందు కాదు.  ఏ వైరస్ వ్యాధికి వ్యాక్సిన్ కావాలో ఆ వ్యాక్సిన్ను ఆ వైరస్ తోటే ఉత్పత్తి చేస్తారు.  వైరస్ లోని ప్రభావాన్ని తగ్గించి దాన్ని ఆరోగ్యకరమైన మానవునికి ఇంజుంక్సిన్ చేసి సదరు మానవునిలోని ఆంటీబాడీలను (ఓరకమైన రోగాన్ని ఎదుర్కొనే కణాలు మానవుని శరీరంలోస్వతగాహ తయారు అవుతాయి) తయారయ్యేరట్లు చేస్తారు.  ఈ ప్రక్రియ ప్రతి ఒక్క వైరస్కి ఉంటుంది.  అంటే ఏ వైరస్కి చెందిన వాక్సిన్ ఆ వైరస్కి సంబందించిన రోగాన్ని మాత్రమే నిరోధిస్తుంది అన్నమాట.  ఈ వాక్సిన్లు తీసుకొనే మానవుడు తప్పని సరిగా ఆరోగ్యవంతుడై ఉండాలి సదరు వ్యక్తి అనారోగ్యంగా ఉంటే ఈ వాక్సిన్ అతని రోగనిరోధక శక్తిని పెంచటం అటుంచి ఆ మనిషికి సదరు వాక్సింకి సంబందించిన రోగం వస్తుంది అన్నమాట.
కొన్ని సూచనలు:  కరోనాకి వాక్సిన్ వెంటనే వస్తుంది మనందరినీ కాపాడుతుంది అని అనుకోవటం మూర్కత్వమే అవుతుంది.  ఎందుకంటె ఒక వైరస్కి సంబందించిన వాక్సిన్ కనుగొనాలి అంటే కనీసం 3నుండి 5 సంవత్సరాలు పట్ట వచ్చు. అదికూడా ఆ వాక్సిన్ ఎంతమేరకు పని చేస్తుంది అనేది కుడా ప్రశ్నర్థకమే .
ఇక్కడ కొన్ని మన పూర్వపు ఆయుర్వేద వైద్యులు చేసేవి పేర్కొంటున్నాను.  అవి ఎంతవరకు పని చేస్తాయి అనేది ఆయుర్వేద వైద్యులు మాత్రమే చెప్పాలి.
1) పూర్వము మన గ్రామాల్లో జ్వరాలు లేక ఏదైనా రోగాలు వాతావరణంతో వస్తే మనవాళ్ళు సూదులు కాల్చి వాతలు పెట్టె వారు " అరవై ఆరు రోగాలకు అగ్ని చికిత్స" అనే నానుడు వుంది. కరోనా రోగంతోబాధ పడే వారికి వాతలు పెడితే వారి శేరీరంలో పుట్టేఆంటీ బాడీస్ ఆ రోగాన్ని తగ్గిస్తుందా.?  అలా తగ్గితే ప్రాణం పోవటం కన్న వాతలతోకొంత కాలం బాధ పడినా తరువాత మందులతో తగ్గించి ప్రాణాలను కాపాడ వచ్చు. (ఇది నేను మా పెద్ద వాళ్ళ నుండి విన్నది చెపుతున్న, ప్రజా శ్రేయస్సు కోసం మాత్రమే ఇక్కడ ఈవిధానం పొందు పరచటం జరిగింది.  మీ మీ బుద్దితో ఈ విధానాన్ని అనుసరించండి.  దీని వల్ల ఎవరికైనా ఏవిధమైన కష్టం వాటిల్లినా ఈ Blog కి కానీ Blogger కి కానీ సంబంధం లేదు.)  ఈ విషయం వైద్యులు గమనించి సరైన విధానాన్ని రూపొందించి కరోనా వ్యాధిగ్రస్తుల్ని కాపాడాలి.

2) ఇక మన ఆయుర్వేదంలో కొన్ని రకాల మందులు చాలా ప్రమాద కార పరిస్థితుల్లో వాడేవి వున్నాయ్ వాటిని అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులు పరిశీలించి పరీక్షించి వాడాల్సిన సమయం వచ్చింది.  కాబట్టి వైద్యులు గమనించి మందులు సూచించాలి.

త్వరలోనే మనమంతా ఆ భగవంతుని దయతో ఈ కరోనా మహర్మారి నుండి బయటపడాలని కోరుకుంటున్నాము.












కామెంట్‌లు లేవు: