ప్లాస్మా థెరపీ : ప్రస్తుతం ప్రపంచం ముందున్న ఒకే ఒక ప్రశ్న అదే కరోనాను ఎలా నియంత్రించాలి ఈ విషయం మీదనే ప్రస్తుతం అన్ని దేశాల డాక్టర్లు, మేధావులు పరిశోధనలు చేస్తున్నారు. కరోనాకు మందు ఉండదు ఎందుకంటె అది ఒక వైరస్. వైరస్ నిరోధించటం చాలా క్లిష్టమైన పని. ఎందుకంటె ఇంకా మన సైన్సు antibacterial మెడిసిన్ లాగ antivirus లు కనుగొనే స్థాయికి ఎదగ లేదు. కాబట్టి కేవలం రాకుండా ఆరోగ్యవంతునికి టీకాలు అంటే వాక్సిన్ ఇచ్చి రోగం రాకుండ కాపాడుకోటం మాత్రమే. నేను ఇంతకు ముందే తెలిపాను వాక్సిన్ రావటానికి ఇంకా సమయం పడుతుంది అది కొన్ని సంవత్సరాలు కావచ్చు. మరి అంత వరకు ఏమిటి గతి. ప్రస్తుత పరిస్థితిలో రోగ గ్రస్తులని treat చేయటానికి ఏదో ఒక చికిత్స కావాలి కదా దాని కోసం చేసే ప్రయత్నమే ఈ ప్లాస్మా థెరపీ ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం.
ప్లాస్మా అనేది మనిషి రక్తంలో ఒక భాగం, కాబట్టి రక్తానికి సంబందించిన ప్రాధమిక విషయాలు తెలుసుకుంటే అప్పుడు ప్లాస్మా దాని ఉపయోగం తెలుస్తుంది.
మానవ రక్తం అనేది ఒక ద్రవ రూపంలో ఉన్న కణజాలం. కణజాలం అంటే కణాల సమూహం. ఇది ద్రవ రూపంలో ఉండటానికి కారణం రక్తం శరీరం మొత్తం సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ద్రవ రూపంలో వుండి శరీరం మొత్తంలో దాని అవసరం వున్నచోటికి ప్రసరిస్తూ ఉంటుంది.
రక్తం చేసే పనులు; మొట్ట మొదటగా రక్తం చేసే పని శరీరంలో ఎక్కడ ఆక్సిజెన్ కావాలన్న అక్కడికి ఆక్సిజెన్ సరఫరా చేయటం. ఈ ప్రక్రియ ఎర్ర రక్త కణాల వల్ల జరుగుతుంది. మన రక్తంలో ఎఱ్ఱ రక్తకణాలు ఎక్కువ శాతంలో ఉంటాయి అందుకే రక్తం ఎర్రగా కనబడుతుంది. ఇంకా తెల్ల రక్త కణాలు, ప్లేటిలెట్స్ అనేవి కూడా రక్తంలో ఉంటాయి. ఈ కణాలు కాకుండా వున్న ద్రవ పదార్థమే ప్లాస్మా. ఇందులో నీరు, లవణాలు, ఎంజయ్మలు, ఆంటీబాడీస్ మరియి ప్రోటీన్లు ఉంటాయి. మనకు ముఖ్యమైనవి యాంటీబోడీస్ వీటితోటె ప్లాస్మా థెరపీ చేయాలనీ డాక్టర్లు యోచిస్తున్నారు.
విధానం: కరోనా సోకి నయమయిన రోగి నుండి రక్తాన్ని సేకరించి దానిలోంచి ప్లాస్మాని వేరు చేసి ఆ ప్లాస్మాని కరోనా వ్యాధితో బాధ పడుతున్న రోగి రక్తంలోకి ఇంజక్షన్ ద్వారా ఎక్కిస్తారు.
పని చేసే విధానం: ఎప్పుడైతే రోగి శరీరంలోకి రోగం తగ్గిన మనీషి రక్తమునుండి సేకరించిన ప్లాస్మా ప్రవేశిస్తుందో అప్పుడు ఆ ప్లాస్మాలో వున్నా యాంటీబోడీస్ ఈ రోగిలో వున్న కరోనా మీద దాడి చేయటం మొదలు పెడతాయి. తద్వారా రోగి శరీరంలోని కరోనా వైరస్ నశిస్తుంది. ఈ ప్రక్రియ ఇప్పుడు కొత్తగా చేస్తున్నది కాదు గతంలో కూడా చేసినట్లు మనకు చరిత్ర చెప్పుతున్నది. ఇంకా ఈ ప్రక్రియ మన దేశంలో మొదలు కాలేదు. ఇందులో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. అవి కరోనా రోగి శరీరం తన శరీరంలోకి ప్రవేశించిన ప్లాస్మాను అంగీకరించాలి. అంతే కాకుండా ఏ మనిషి రక్తమునుండి ప్లాస్మా గ్రహించారో ఆ వ్యక్తికి వెరీ ఇతర వ్యాధులు ఉండకూడదు, ఉంటే అవి ఈ రోగికి సోకె ప్రమాదం ఉండొచ్చు.
blood group: కరోనా రోగి రక్తపు గ్రూప్ అతనికి ఇచ్చిన ప్లాస్మా డొనేట్ చేసిన మనిషి రక్తపు గ్రూప్ కలవాలి. కలవకపోతే వేరే కొత్త సమస్యలు తలయెత్తి రోగి మరణించే అవకాశం ఉండొచ్చు. అందుకే ప్రస్తుతం మన డాక్టర్లు AB రక్తపు గ్రూప్ వున్నా మనిషుల ప్లాస్మా ఉపయోగించ టానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటె AB రక్తపు గ్రూప్ను యూనివర్సల్ donors గా పేర్కొంటారు. అంటే ఈ రక్తపు గ్రూప్ కలిగిన రక్తం మిగితా రక్తపు గ్రూపుల వారికీ ట్రాన్స్మిట్ చేయ వచ్చు.
ఏది ఏమైతేనేమి ఇప్పుడు మన డాక్టర్లు చాలా శ్రమ దమాలకు ఓర్చి ఈ కరోనా వ్యాధిని నిర్ములించటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. భగవంతుడు వారి ప్రయత్నాలను సఫలం చేయాలని ఆశిద్దాం.
ఓం శాంతి శాంతి శాంతిః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి