ఇప్పుడు ప్రపంచమంతా కరొనతో గజ గజ వణుకుతుంది. ఈ సమయంలో మన ప్రభుత్వం వీధులల్లో తిరిగే వారు విధిగా నోరు, ముక్కు మూసుకునే విధంగా మాస్కులు ధరించాలని అట్లా ధరించని వారిని శిక్షిస్తామని పదే పదే చెప్పటమే కాక కొంతమందికి పోలీసు వారు బుద్ది చెప్పినట్లు మనకు రోజు టీ.వి వార్తలల్లో చూస్తున్నాము. అది కేవలం ప్రభుత్వం ప్రజలను కాపాడుటకు తీసుకొనే చేర్య అని మనందరికీ తెలుసు. కానీ మనం టి.వీలో, వాట్సాపులో అనేక మంది ముఖ్యంగా రాజకీయ నాయకులూ, N.G.O లు అనేక సంఘాల వారు పేదవారికి వస్తువులు, కూరగాయలు మొదలైనవి పంపిణి చేస్తున్నారు. ఇది స్వాగతించదగిన విషయం. కానీ కొంతమంది ఫొటోలకు, వీడియోలకు ఫోజులు ఇచ్చే టప్పుడు వారి మూతికి వున్న మాస్కు ఆటంకిగా భవిస్తూ వారికి తెలియకుండానే మాటి మాటికీ ఆ మాస్కును చేతితో తడమడం, లేక కొంతమంది పూర్తిగా మాస్కు తీసి మైకు పట్టుకొని వారి ప్రతిభను చాటుతున్నారు. వారిని ఉద్దేశించి ఇది వ్రాస్తున్నాను. మీరు చేసే పనులు నిజానికి సమాజోద్ధరణకే, అందులో రవ్వంతయు సంశయం లేదు కానీ మీకు తెలుపదలచింది ఏమనగా మాస్కులు ధరించటం నిజానికి మనకు అలవాటు లేదు. కేవలం ఇప్పటి పరిస్థితిని బట్టి ప్రభుత్వ సూచనల మేరకు మనం వీటిని ధరిస్తున్నాము. దయచేసి రోడ్డుమీదికి వచ్చే వారు ఈ క్రింది సూచనలు పాటించ కోరుతాను.
1) విధిగా మాస్కు ధరించండి. మాస్కు ధరించటం అంటే ఇంటి దగ్గర కట్టుకున్న మాస్కు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు దానిని సవరించటం కానీ ఏచేతితోను తాకటం కానీ, గోక్కోటం కానీ చేయకూడదు. ఒక వేళ తుమ్ము కానీ, దగ్గు కానీ వస్తే వెంటనే వేగంగా జనాలకు దూరంగా వెళ్లి చెవుల దగ్గరినుండి మాత్రమే మాస్కు తీసి తుమ్ముటం కానీ, దగ్గటం కానీ చేసి వెంటనే చెవులనుంచి మాస్కు ధరించి జనాలలోకి రండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్కు మీద మీ చేయి పడకూడదు.
2) మీరు ఇంటికి వచ్చిన తరువాత మాస్కుని చెవులపైనుండి మాత్రమే అంటే మాస్కుని తాకకుండా తీసి పారవేయ దలిచితే మూత వున్నా చెత్తబుట్టలో మాత్రమే వేయండి. వస్త్రంతో కుట్టిన మాస్క్ కానీ లేక మీరు చేతి రుమాలు మొఖానికి కట్టుకున్న యెడల అది కుడా చెవులమీదినుండి తీసి వెంటనే సబ్బుతో కానీ డిటర్జెంట్ తోకానీ ఉతికి ఆరవేసి వెంటనే మీ చేతులు, మొఖం బాగా నురుగు వచ్చే సబ్బుతో కడుక్కోండి. ఈ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కుటుంబ సభ్యులను చేతితో తాక వద్దు.
ఈ సూచనలు ప్రతి వక్కరు విధిగా పాటించండి. .
మీరు ఆరోగ్యంగా వుండండి మీ తోటివారిని ఆరోగ్యంగా ఉండనీయండి.
సర్వే జానా సుఖినో భవంతు,
ఓం శాంతి శాంతి శాంతిః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి