1, నవంబర్ 2020, ఆదివారం

17-04-గీతా మకరందము

 17-04-గీతా మకరందము.

           శ్రద్ధాత్రయ విభాగ యోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఎవడెట్టి శ్రద్ధ ( గుణము) గలిగియుండునో తదనుగుణ్యమైన ధ్యేయమునే ఆతడు ఆరాధించునని వచించుచున్నారు-


యజన్తే  సాత్త్వికా దేవాన్ 

యక్షరక్షాంసి రాజసాః | 

ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే 

యజన్తే తామసా జనాః ||  


తాత్పర్యము:- సత్త్వగుణముగలవారు దేవతలను, రజోగుణముగలవారు యక్షులను, రాక్షసులను, తమోగుణముగలవారు భూతప్రేతగణములను పూజించుచున్నారు.


వ్యాఖ్య:- ఎవరెవరు ఏ యే గుణము గలిగియుందురో, వారిస్వభావము, వారి నడక, వారి యాహారము, వారి మాట, వారి తీరు, వారు చదువుగ్రంథములు, వారు పూజించుదేవతలు - తదనుగుణ్యముగనేయుండును. ఈ విషయము నిదివఱకు 14వ అధ్యాయమున తెలిపియుండిరి. భావము దృఢపడుటకొఱకై  మఱల నిపుడు తెలియజేయుచున్నారు.

కామెంట్‌లు లేవు: