.శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
#శివామృతలహరి శతకంలోని మరొక పద్య రత్నం;
శా||
నీ లోఁబుట్టితి, బట్టగట్టితిని, కన్నెంగోరి చేపట్టితిన్
నీలో సంసరణాబ్దినీదితిని, నిన్నే దిక్కుగా గొల్చితిన్
నీలో కాలము దీరిపోఁ గలసెదన్ నిశ్చింతగా - ఏల చీ
చీ లజ్జాకర జన్మమృత్యుతపనల్ శ్రీ సిద్ధలింగేశ్వరా!
భావం;
శివా! నీలోనే పుట్టాను, బట్ట కట్టాను, కన్యను కోరి వివాహం చేసుకున్నాను.నీలోనే సంసారం ఈదాను.నువ్వే నాకు దిక్కు అని నమ్మి పూజించాను.
కాలం తీరి పోయాక నీలోనే కలిసిపోతాను.
మళ్లీ జన్మ ఎత్తడం, మళ్లీ మరణించడం అనే లజ్జాకరమైన ప్రక్రియ కోసం తపన ఇంకా నాకెందుకు స్వామీ, నీలోనే ఐక్యం చేసుకోలేవా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!
అని ప్రార్థించారు.
సుబ్బు శివకుమార్ చిల్లర.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి