రేవతి నక్షత్రము - గుణగణాలు, ఫలితాలు
నక్షత్రములలో ఇది 27వ నక్షత్రము. రేవతీ నక్షత్ర అధిపతి బుధుడు, అధిదేవత పూషణుడు, గణము దేవగణం, రాశ్యాధిపతి గురువు.
రేవతి నక్షత్రము మొదటి పాదము
రేవతి నక్షత్ర అధిపతి బుధుడు. ఈ నక్షత్రంలోని మొదటి పాదము జాతకుల మీద గురు బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ నక్షత్రం. వీరికి ప్రధానంగా సత్వగుణం ఉంటుంది. అధ్యాత్మిక విశ్వాసం కలిగి ఉంటారు. వీరికి విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించ గలిగే నేర్పు ఉంటుంది. విద్యా సంబంధిత వృత్తులు, వ్యాపారం, ఉద్యోగాలు అనుకూలం.
ఈ జాతకులకు 16 సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది. వీరు విద్యారంభం నుంచి ప్రతిభ చూపిస్తారు. 16 సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో విద్యసాధన విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి. కేతు దశ అనుకూలిస్తే సమస్యలు ఉండవు. తరువాత 23 సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి ఉంటుంది. శుక్రదశ కాలంలో విద్య కంటే విలాసాల మీద ఆసక్తి అధికం. కాబట్టి పట్టుదలతో విద్య సాధనలో విజయం సాధించాల్సి ఉంటుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 66 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి.
రేవతి నక్షత్ర రెండవ పాదము
వీరు ఆధ్యాత్మిక విశ్వాసం కలిగి ఉంటారు. వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. వీరికి భూ సంబంధిత, వాయు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక విద్య అనుకులిస్తుంది. న్యాయ సంబంధిత విద్య కూడా వీరికి అనుకూలిస్తుంది.
ఈ జాతకులకు 12 సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది. వీరు మొదటి నుంచి విద్యాలో ప్రతిభ చూపిస్తారు. 12 సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలోవిద్యలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ప్రయత్నపూర్వకంగా అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి. కేతు దశ అనుకూలిస్తే సమస్యలు ఉండవు. 19 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి ఉంటుంది. శుక్ర దశ కాలంలో విద్యకంటే విలాసాల మీద ఆసక్తి అధికం. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. ఇక వీరు సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం అవుతుంది. 62 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. రాహు దశ అనుకూలిస్తే విదేశీఉద్యోగావకాశాలు, విదేశీపర్యటనలు కలిసి వస్తాయి. 80 సంవత్సరాలకు వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా జీవితం మళ్లీ గాడిలో పడుతుంది. ఇక వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.
రేవతి నక్షత్రము మూడవ పాదము
వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. వీరికి భూసంబంధిత, వాయు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక విద్య అనుకూలిస్తుంది. న్యాయ సంబంధిత విద్య కూడా వీరికి అనుకూలిస్తుంది. వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు.
ఈ జాతకులకు ఐదు సంవత్సరాల వరకు మాత్రమే బుధదశ ఉంటుంది. కనుక వీరికి విద్యారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఐదు సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతుదశ కాలంలోవిద్యలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి. కేతుదశ అనుకూలిస్తే సమస్యలు ఉండవు. 12 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి ఉంటుంది. శుక్రదశ కాలంలో విద్య కంటే విలాసాల మీదికే మనసు మళ్లుతుంది. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి సఫలం కావాలి. ఈ జాతకులు సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వీరికి సకాలంలోనే వివాహం జరుగుతుంది. 55 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి. 73 సంవత్సరాలకు వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం వస్తుంది. వృద్ధాప్య దశ కూడా సౌఖ్యంగా గడుస్తుంది.
రేవతి నక్షత్రము నాలుగవ పాదము
వీరికి విద్య సంస్థలు స్థాపించి నిర్వహించ కలిగిన సామర్ధ్యం ఉంది. వీరికి విద్యా సంబంధిత వృత్తులు, వ్యాపారం, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వీరికి నాలుగు సంవత్సరాల వరకు మాత్రమే బుధ దశ ఉంటుంది. కనుక వీరికి విద్యారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి.
నాలుగు సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతుదశ కాలంలో విద్యలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే సమస్యలు ఉండవు. 11 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి ఉంటుంది. శుక్రదశ కాలంలో విద్య కంటే విలాసాల మీద ఆసక్తి ఉంటుంది కనుక మనసును పట్టుదలతో విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. ఇక వీరు సకాలంలో జీవితంలోనే స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో జరుగుతుంది. 54 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి. 72 సంవత్సరాలకు వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా జీవితంలో తిరిగి సౌఖ్యం వస్తుంది. వృద్ధాప్యం సాఫీగా గడిచిపోతుంది.
రేవతీ నక్షత్రము ఫలితాలు
ఈ నక్షత్రమున జన్మించిన వాడు రూపవంతుడు, ధనవంతుడు, భోగములను అనుభవించువాడు, పాండిత్యము కలవాడై ఉంటారని శాస్త్రం చెబుతోంది. చరరూప ధన సంపదలు కలవారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు కనిపించని మేధావులు. ఆడంబరం తక్కువ. గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు. వేదవేదాంగాలను తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగి ఉంటారు. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వము ఉంటుంది.
ప్రశాంతంగా నిదానంగా సమాధానాలను చెప్తారు. సమస్యలను పక్కన పెట్ట్టిచక్కగా నిద్రిస్తారు. ఆర్ధిక ప్రగతిని తొందరగానే సాధిస్తారు. త్వరితంగా కోపం రాదు. వ్యాపారంలో మోసం చేసే భాగస్వాముల నుంచి తప్పించుకుంటారు. ముఖ్యమైన సమయాలలో సహాయం చెసే ఆత్మీయుల అండదండ ఉండదు. ఒక వేళ ఉన్నా ప్రయోజనం ఉండదు. దూరప్రాంతాలలో చదువుకుని స్థిరపడడా నికి బంధువుల సహకారం ఉంటుంది. కీలకమైన అధికార పదవులలో వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. నమ్ముకున్న వారిని కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. సహాయం చేస్తారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకు పోతారు.
మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు. విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగితే రాణిస్తారు. బాల్యం నుంచే తెలివితేటలను ప్రదర్శిస్తారు...మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి