చిన్నికవి వన్నె కోరిక
******************
తే.గీ.
కోర్కెలే వేరు ! నా యెద కోపు వేరు!
ఊరికే నుండ బోనునా వూరి కే ద
యిన ను జేయక బ్రతుకు నీద లేను
గీతమయిన గేయమయిన చేత నగును
మెప్పు లొద్దు పెద్ద బులుపు గొప్ప లొ ద్దు
ఒక్కరైన నాదు కవిత చక్క నన్న
చాలు నదియెగా పదివేలు మేలు భళిర
చిన్న కవికి జనుల చిన్నె వన్నె చాలు
రుద్ర వీణపైన ప్రణవ నాద గీతి
మీట గలను చీకటిలోన బాట లేని
బ్రతుకులకు చిరు దివ్వె గా వెతలు మాప
తురుపు ముక్కనై చుక్కనై తులువుల మసి
జే య పీడిత తాడిత జీవులందు
నూత్న వి న్నూత్న భావాలు నుడువ గలను
సమసమాజ నిర్మాణాన సమిధ గాను
ప్రమిద గానుండ గలను నా వ్రాత తోడ
....... రాఘవ మాస్టారు.......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి