1, నవంబర్ 2020, ఆదివారం

శివానందలహారీ

 🙏 శివానందలహారీ 🙏  

ఘటోవా మృత్పిండోవా2ష్యణురపి చ ధూమోగ్నిరచల

పటోవా తంతు ర్వా పరిహరతి కిం ఘోరశమనమ్ 

వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా 

పదాంభోజం శంభో ర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీ 06



"మట్టి సాధనమౌను మఱి కుండలనుచేయ

              నా మట్టి యేర్పడు నణువు వలన

ధూమంబు కొండపై తోచుచుండెను గాన

             నచ్చోట తప్పక యనలముండు

ధరణిలో వస్త్రముల్ దారంబు వలననే

            నిర్మితం బగుచుండె నిక్కమిద్ది "

యనుచు వ్యర్థంబుగా ననయంబు వాదించి

             తర్కించు కొనినచో దక్కు నేది ?

యీ శుష్క వాదన లీతర్క వచనముల్

            శమను నాపగలేవు క్షణము గూడ

భవ్యమైనట్టి పరమేశు పాదయుగళి

భక్తి చిత్తాన బట్టంగ భవమునందు

సర్వ పాపంబులన్నియు సమసిపోవు

గరళకంఠుని కృపవల్ల గల్గు ముక్తి. 06 


✍️ గోపాలుని మధుసూదన రావు

కామెంట్‌లు లేవు: