1, నవంబర్ 2020, ఆదివారం

ఆచార్య సద్భోదన*

 *ఆచార్య సద్భోదన*


ఒక దివ్యహస్తం మనల్ని నిరంతరం దిశానిర్దేశం చేసి నడిపిస్తోంది. అది మనల్ని ఎన్నడూ విడిచిపెట్టదు.


భగవంతుడు మనందరినీ సర్వ వేళలా గమనిస్తూనే ఉంటాడు. జీవిస్తున్న వారినీ మరణించిన వారినీ ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. ఆయన వర్తమానంలోనే కాదు సర్వ వేళలా మన రక్షణ భారం వహిస్తాడు.


కనుక మన హృదయాలను శాంతి ధామం చేసుకోవాలి. మన భద్రత, సంరక్షణ ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆయన ఎన్నడూ మన ఎడల ఏమరుపాటు వహించడు.


సున్నితమైన తన క్రియా నిర్వహణలో ఆయన మనపై కోపించవచ్చు, లేదా దీవించవచ్చు. కాని ఆయన నుండి వెలువడే తిట్లుగాని, దీవెనలు గాని మనకు తప్పక సత్ఫలితాలనే ఇస్తాయని గ్రహించి ఆయనపై పూర్తి విశ్వాసంతో మన కర్తవ్యం మనం నెరవేర్చాలి.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: