*త్రిలింగ క్షేత్ర దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం*
తెలుగు నెలలో అడుగడుగునా దేవాలయాలే ! కృష్ణమ్మా పరవళ్ళు తొక్కే శ్రీశైలం ,గోదావరి పరవళ్ళు తొక్కే కాళేశ్వరం, ద్రాక్షారామం అన్ని ఘనమైన చరిత్ర గలవి.ప్రతి ఒక్కరు జీవితం లో తప్పకుండా ఒకసారి ఆయిన దర్శించాల్సిన దివ్యమైన క్షేత్రలు.
శ్రీ బ్రహ్మరంబ మల్లికార్జున స్వామి దేవాలయం - శ్రీశైలం
-------------------------------------
ద్వాదశ జ్యోతిర్లింగా క్షేత్రాలలో రెండవదైన శ్రీశైలం కర్నూల్ జిల్లా కేంద్రం లో వెలసింది . దట్టమైన నల్లమల అడువల మద్యలో నుంచి వెళ్తే మనకు శ్రీ బ్రహ్మరంబ మల్లికార్జున స్వామి దేవాలయం వస్తుంది .
తెలుగు ప్రజల అదృష్టం ఏంటి అంటే శ్రీశైలం వెళ్లినవారికి ,జ్యోతిర్లింగం మరియు శక్తి పీటం దర్శనం అవుతుంది . ఈ దేవాలయం చుట్టూ ప్రక్కల చూడవలసిన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి .
స్థల పురాణం
-------------------
పూర్వం శిలదుడనే మహర్షి సంతానం కోసం పరమేశ్వరుని గురుంచి తపస్సు చేసాడు . శివుడు ప్రత్యక్షమై కోరుకోమనగా నీకు భక్తులు అయి ఉండే ఇద్దరు పుత్రులను ప్రసాదించమని కోరాడు .
ఈశ్వరుని కృప వలన ఇద్దరు కుమారులు జన్మించారు. వారి పేర్లు నంది ,పర్వతుడు. వారు పరమేశ్వరుని కోసం తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ముందుగ నంది వరం కోరుతూ , నువ్వు ఎల్లప్పుడు నా పై నివసించి ఉండాలి , నిన్ను నేను మోసే భాగ్యాన్ని ప్రసదించమించమని కోరాడు అతని కోరికగా శ్రీశైలానికి 200 కి మీ దూరం లో మహానంది రూపాన్ని పొందాడు . ఆనాటి నుంచి శివుని వాహనముగా మారాడు . తరువాత పర్వతుడు వరం కోరుతూ నేను దాల్చి ,నీవు న పై వెలసి,నా పర్వత శికరాన్ని చుసిన మేరకు ఈశ్వరుడు జ్యోతిర్లింగా రూపం లో వెలిసాడు . పర్వతుడు శ్రీ పర్వతుడుగా అయ్యాడు ,కాల క్రమం లో శ్రీశైలం గ పిలువబడుతున్నది .
శ్రిశైలన్ని ఈ భూమికి మొతానికి నాభి గ చెబుతారు . అందుకీ మనం ప్రపంచం లో ఎక్కడ ఉన్న సంకల్పం చేసేటప్పుడు శ్రిసైలష్య ఏ దిక్కున ఉంటె ఆ దిక్కు గురుంచి చేబుతుంటము .
ఈ దేవాలయం చాల పెద్దది . కృతయుగం లో హిరణ్య శివుడి పూజ మందిరంగా ఉంది . త్రేతా యుగం లో రాముడు ,సీత ఇక్కడ ప్రతిష్టించిన సహస్రలింగం ఇప్పటికి పుజలన్డుకుంటుంది .
తిరుపతి లో ఉన్నది ఆకాశ గంగ, శ్శ్రీశైలం లో ఉన్నది పాతాల గంగ . మన శ్రీశైలం వచ్చి వెళ్ళినట్లుగా సాక్ష్యం చెప్పే సాక్షి గణపతి దేవాలయం ఇక్కడ ఉన్నది .
శ్రీశైలం చుట్టప్రక్కల చూడవలసిన దేవాలయాలు
సాక్షి గణపతి దేవాలయం
హటకేశ్వర స్వామి దేవాలయం
పాలధార పంచదార
శికర దర్శనం
ఖైలస ద్వారం
అక్కమాదేవి గుహలు
భీముని కొలను
గుప్తా మల్లికార్జున దేవాలయం
బ్రహ్మరంబ చెరువు
సాక్షి గణపతి దేవాలయం
--------------------------
తిరుపతి లో ఉన్నది ఆకాశ గంగ, శ్శ్రీశైలం లో ఉన్నది పాతాల గంగ . మన శ్రీశైలం వచ్చి వెళ్ళినట్లుగా సాక్ష్యం చెప్పే సాక్షి గణపతి దేవాలయం ఇక్కడ ఉన్నది .
కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం -కాళేశ్వరం
-------------------------------------
గోదావరి నదిలో ఉపనది ప్రాణహిత కలిసే చోట ఉన్న క్షేత్రమే కాళేశ్వరం .త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమన్మితమైనది .
కరీంనగర్ పట్టణానికి 132 కి మీ దూరం లో మంథని సమీపం లో దట్టమైన అడవి ,చుట్టూ ప్రకృతి రామయనితల మద్య ,గోదావరి నదికి దగ్గరలో వెలసిన ఈ క్షేత్రం చాల పురాతనమైనది .
స్కాందపురాణం లో ఒక కాండం కాళేశ్వర క్షేత్ర మహత్యాన్ని వివరిస్తుంది .
గర్బ గుడి లో రెండు శివలింగాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత . దర్శించిన బక్తులందరికీ ముక్తేశ్వర స్వామి ముక్తి నిస్తున్డటం తో యముడికి పని లేకుండా పోయిందట . అంతట యమ మహారాజు స్వామి ని వేడుకోగా అప్పుడు యమున్ని కూడా తన పక్కనే లింగాకారం లో నిల్చోమన్నాడట . ముక్తేస్వరున్ని చూచి యమున్ని దర్సించకుండా వెళ్తే మోక్ష ప్రాప్తి దొరకదు అని వాళ్ళని నరకానికి తీసుకోని పోవొచ్చు అని శివుడు చెప్పాడట . అందుకీ బక్తులు స్వామి ని దర్శించుకొని,కాళేశ్వర స్వామి ని కూడా దర్శించుకుంటారు .
ముక్తేశ్వర స్వామి లింగం లో మరో ప్రత్యేకత ఉంది .లింగమ్ లో రెండు రంద్రాలు ఉన్నాయి .ఈ రంద్రం లో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడ సమీపం లో ఉన్న గోదావరి ,ప్రాణహిత సంగమ స్థలం లో కలుస్తుంది అని చెబుతారు .
కాళేశ్వరక్షేత్రం శిల్పకళానిలయం. ఇక్కడ ఇప్పటి వరకు బయటపడ్డ అనేకశిల్పాల వల్ల గతవైభవం తెలుస్తుంది. కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం, నరసింహతీర్థం, హనమత్ తీర్థం, జ్ఞానతీర్థం, వాయుసతీర్థం, సంగమతీర్థం, ఇత్యాది తీర్థాలున్నాయి.
కాళేశ్వరంలోని ప్రధానాలయానికి పశ్చిమం వైపు యమగుండం మీద సుమారు ఒక కి.మీ దూరంలో ఆదిముక్తీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించడం విశేషం.
ఈ దేవాలయంలోని కాళేశ్వరునికి ముందు పూజచేసి, అనంతరం ముక్తీశ్వరుని పూజిస్తే, స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.
భీమేశ్వరాలయం -ద్రాక్షారామమ
-------------------------------------
పంచారామ క్షేత్రాల్లో ఒక్కటైనా ద్రాక్షారామమ తూర్పు గోదావరి జిల్లలో ఉంది . ఇక్కడ భీమేశ్వర స్వామి లింగాకారం లో ఉన్నాడు ల లింగం సగ బాగం నల్లగా , సగ బాగం తెల్లగా ఉంటుంది . అర్ధనారిశ్వరుడు అనటానికి ఇది నిదర్శనం . ఇక్కడ లింగం 60 అడుగుల ఎత్తు ఉంటుంది .
దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేయడం వలని దీనికి ద్రాక్షారామం అని పేరు వచ్చింది . అద్బుతమైన శిల్ప సంపద ,మహాశివరాత్రికి ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి .
ఆలయం లో వినాయకుడి తొండం కుడి చేతి మీదగా ఉంటుంది . కాశి లోని విశ్వేశ్వరాలయం లో కూడా ఇలాగె ఉంటుంది . చాళుక్యుల కాలం లో దేవాలయాన్ని నిర్మించినట్లు సాశానల ద్వారా తెలుస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి