25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

సారస్వతం నామ ఫలం

 శ్లోకం:☝️

 *న కాల భేదాద్రస వర్ణభేదో*

*న జామితా వా న ఋజీష భావః l*

 *సారస్వతం నామ ఫలం తదేత*

*త్సదైక రూపం కృతినో లభన్తే ll*


భావం: సరస్వతీ సంబంధమయిన సారస్వతమును (అంటే సమస్త విద్యలను) ఈ శ్లోకంలో పండుతో పోలుస్తున్నారు కవి.

సారస్వతమను పండుకు కాలదోషము, రస, వర్ణ దోషములు లేవు. అంటే ఈ పండు పాడవదు. ఈ పండు పేరును పదే పదే పేర్కొనుటలో పునరుక్తి దోషం లేదు. చూర్ణ భావము లేదు. అంటే పదే పదే పనస చెప్పటం / వల్లె వేయడం వల్ల అది తరగిపోదు సరికదా, వృద్ధి చెందుతుంది. ఎప్పుడూ ఒకే రూపముగా నుండు ఈ సారస్వత ఫలమును చక్కటి ప్రయత్నము (అభ్యాసము, సాధన) చేసేవారు, నేర్పరులు మాత్రమే పొందగలరు.🙏

కామెంట్‌లు లేవు: