కలిదిండి వెంకటరామరాజుగారు
----------- ---------------------------
(2)
సభలపాల్గొని సరసంబుగాభాషించి
జేజేల నందెడు తేజసుండు,
విద్వాంసులున్ మెచ్చవిజయవిలాసాను--
శీలనంబునుసేయు శీలయుతుడు ,
ఉద్యోగబాధ్యతనొజ్జబంతిగ తోటి
వారెంచ నడయాడు పథికవరుడు ,
రుద్రసంఖ్యనుగల్గు రుచిర శోధకులకు
పట్టాలనిచ్చు సంపన్నజనుడు ,
పెద్దపుల్లేటిసాహితీవేత్తలగుచు
వాసిగలకావ్యసంతతిన్ వరలువాడు
ప్రాచ్యసంస్కృతిప్రాభవారాధకమతి
భీమవరముగౌరవమెంచుప్రేమసుధయె.
శ్రీM.sనారాయణ( కవి చలనచిత్రనటుడు)
----------------------
నవ్వులనారాయణుడన
నివ్వసుధను ఖ్యాతిగొన్న యెమ్మెసను నటుం
డివ్వీటభీమవరమున
సవ్వడిగావించెగాదె! సద్బోధకుడై.
నోపార్కువింగు"మున్నగు
లేపనమునుబోలుకవితలే యల్లెను గా
దే!పొందికగానగరపు
లోపంబులనెత్తిచూప శ్లోకితఫణితిన్.
ఒజ్జ హాస్యచతురుడు విద్వజ్జనుండు
కవి నటుడు దర్శకుడుగాయకవరుండు
గా బహువిధపాత్రలయందుగాఢముద్ర
వైచె నారాయణాహ్వయ భవ్యమూర్తి .
M.s=మైలవరపు సూర్యనారాయణ
విద్య--భాషాప్రవీణ,పత్తేపురం ప్రాచ్యకళాశాల
వృత్తి--కె.జి.ఆర్.యల్ కళాశాల భీమవరం
ప్రవృత్తి--పౌరాణిక సాంఘికనటుడు.
కవితలు--No parkwing(తెలుగువచనకవిత)
రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి