ఏ దేముడిని పూజించాలి.
ఇటీవల చాలా చోట్ల
నేను ఆ దేముడిని పూజించాలా
ఈ దేముడిని పూజించాలా ఈ బాబాను పూజించవచ్చా,
ఆ స్వామీజీని పూజించవచ్చా. కొందరు రమణ మహర్షిని, కొందరు
రాగాహావేంద్రస్వామిని, కొందరు సాయిబాబాను ఇలా వాళ్ల ఇష్ట
దైవంగా పూజిస్తున్నాము ఇందులో తప్పేముందని కొందరు అంటుంటే, కొందరు ఆలా మనుషులను దేముడిగా
పూజించవద్దు అని కొందరు వారి
మనోభావాలు దెబ్బతింటాయి అని ఇలా పలువులు
పలుతెరంగులుగా వ్యాఖ్యానిస్తున్నారు. వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను.
ఈ పృద్విమీద బుద్దిజీవి
అంటే వెంటనే మనం మనిషి అంటాము. అది
నిజమే
"జంతూనాం నరజన్మ దుర్లభం"
జంతుజన్మలో మానవ జన్మ దుర్లభమం
అని ఆర్యోక్తి. కేవలము మనుషులు మాత్రమే వివేకంతో అలోచించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలరు. ఇతర జంతుకోటికి కేవలము,
ఆహారము, శారీరిక కామ సుఖాలే ముఖ్యం,
కొన్ని జంతువులు సంతానాన్ని సాకటానికి తాపత్రయ పడటాన్ని మనం చూస్తాము. కానీ
మనిషిలాగ అవి ఆలోచించలేవు. కేవలం
వాటి లక్ష్యం ఆహార సముపార్జన మాత్రమే.
కొన్ని సందర్భాలలో కొన్ని జంతువులు మనుషులకన్నా ఎంతో సంఘటితంగా ఉండటమే
కాక ఐకమత్యతను కూడా మనం జంతువులనుంచి
నేర్చుకోవాలా అని అనిపిస్తుంది.
ఒక కాకి ఏదయినా
ఆహారపదార్ధం చుస్తే వెంటనే అది అరవటం ఆ
అరుపులు విని అనేక కాకులు
రావటం చూస్తుంటాము. అది కాకులలో వున్న
ఐకమత్యం. అదే
ఒక కుక్క ఏదయినా ఆహారపదార్ధం
చుస్తే అది గమనించి ఇంకొక
కుక్క అక్కడికి వస్తే మొదటి కుక్క
దొరికిన దానిని తినటం మాని కొత్తగా
వచ్చిన కుక్కని అక్కడినుండి తరమటానికి ప్రయత్నిస్తుంది, అది కుక్కలకు వున్న బుద్ది. అందుకేనేమో
ఎవరైనా వక్రంగా ప్రవర్తిస్తే వాడికి కుక్క బుద్ది అని
అంటాం కదా.
మనం మానవ అభివృద్ధిని
గమనిస్తే మన చరిత్ర ఒకటే
చెపుతున్నది అది ఏమిటంటే నా
దేముడు గొప్ప అంటే నా
దేముడు గొప్ప, నా మతం గొప్ప
అంటే నా మతం గొప్ప
అని చిన్న చిన్న అడ్డుగోడలు
పెట్టుకొని మనిషి మనిషికి మధ్య
దూరాన్ని పెంచుకుంటున్నాడు.
ఒకసారి మన పురాతన ఋషిప్రోక్తమైన
ఉపనిషత్తులను వేటిని తీసుకున్న మనకు ఒకటే తెలుస్తుంది
అదేమిటంటే
"ఏకం సత్" అంటే
బ్రహ్మ పదార్ధం ఒకటి మాత్రామే ఇంకా
చెప్పాలంటే
"ఏకమేవ అద్వితీయం బ్రహ్మ"
అంటే రెండవది లేనిది కేవలం ఒక్కటిగా వున్నది
బ్రహ్మ మాత్రమే అని అర్ధం. ప్రతి
రోజు ప్రతి దేవాలయంలోను ప్రతి
దేవి దేవతల పూజ అనంతరం
పఠించే మంత్రపుక్ష్మంలోని ఈ వాక్యాలను చుడండి
యచ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే
శ్రూయతేஉపివా
అంతర్బహిశ్చ తత్సర్వం
వ్యాప్యనారాయణ స్థితః
భావం: ఏ జగత్తు
ఐతే మన కంటికి కనపడుతున్నదో అదే విధంగా మన
చెవులకు వినపడుతున్నదో అది మొత్తం నారాయణునిచే
వ్యాపింపబడి వున్నది అని అర్ధం, మనం
ఈ జగత్తును అంటే కంటికి కనపడేది
మొత్తం అనగా భూమి, సూర్య
చంద్రులు, నక్షత్రాలు అన్నీకూడా జగత్తు అని అర్ధం. అంటే
ఇక్కడ మొత్తం భగవత్స్వరూపం కాక వేరయిది ఏమి
లేదు అంటే ఈ మంత్రాన్ని
పటించే వారు, అలాగే దానిని
వినే వారు అంతాకూడా ఆ
భగవంతుడు మాత్రమే అందుకు భిన్నంగా ఏది లేదు అని
అర్ధం చేసుకోవాలి.
గీతలో శ్రీ కృష్ణ
భగవానుల వారు ఎవరెవరు నన్ను
ఏ ఏ రూపాలలో
పుజిస్తే వారికి ఆ రూపంలో నేను
అనుగ్రహిస్తాను అని పేర్కొన్నారు.
కొన్ని వేల సంవత్సరాలకు మునుపే
మన భారత దేశంలోని మహర్షులు
వారి వారి తపః శక్తితో
ఎన్నో విషయాలను తెలుసుకోవటమే కాక భగవత్ తత్వాన్ని
మనకు కళ్ళకు కట్టినట్లు చూపించారు. దైవశక్తి ఒక్కటే ఈ జగత్తు అంతావ్యాపించి
ఉన్నదన్నది సత్యం. ఆ
సత్యాన్ని తెలుసుకోలేక మనకు వున్న మిడి
మిడి జ్ఞనంతో దేముళ్ళకు కూడా మానవ సహజమైన
త్రిగుణాలను అంతకట్టటమే కాక రాజకీయనాయకులు ప్రవర్తించే
విధంగా మనము ప్రవర్తించటం ఎంతవరకు
సబబు అన్నది విజ్ఞులైన ప్రతివారు గమనించాలి. ఆ అద్వితీయమైన పరమాత్మ
జ్ఞ్యానాన్ని పొందటానికి అందరు కృషి చేసి
జన్మ సార్ధకత చేసుకోవాలి.
దేవీదేవతల పూజలు కేవలము భౌతికమైన
కోరికలు తీర్చుకోవటానికి మాత్రమే కానీ మోక్షానికి మాత్రం
కాదు. మోక్షం కేవలం జ్ఞ్యానరూపంలో ఉన్నదన్న
విషయం తెలుసుకొని తదనుగుణంగా అందరు కృషి చేయాలి.
ఓం తత్సత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి