28, మే 2022, శనివారం

పితృకార్యం

      "పితృకార్యం" అంటే చాల పవిత్రమైనది. "పితృదేవతలు" కూడ "దేవతా" సమానులే..... 


    ఈ మధ్య చాల మంది "శ్రార్ధం" పెట్టడం (( బియ్యం ఇచ్చుకోవడం )) మొక్కుబడి భావిస్తున్నారు. 


      ((శ్రాద్ధక్రియ, విమర్శనదినము))


     చనిపోయిన వారకి "శ్రాద్ధక్రియ" ఎందుకు చేయాలని "సూతుడుని" మునులు అడుగగా "సూతుడు" ఇలా వివరించాడు. 


మరణించినవారు "ప్రేతరూపంలో" ఒక సంవత్సరకాలం ఉండును. అందులో మొదటి పదిరోజులు ఆజీవుని "పంచప్రాణాలలో" ఒకటి చనిపోయిన స్థలంలోను, మరొకటి స్మశానంలోను, మూడవది కర్తయందును, నాలుగవది వాయసములందును, ఐదవది వాయువునందును ఉండును. ఎత్తిపోతలు (సంచయము) అయ్యేదాకా ఆ ప్రాణములు దుర్భరమైన తాపము అనుభవించుచుండును. 


"యథోక్తముగా" కర్మలు చేసిన తరువాత ఆ ప్రాణములన్నియు తాపము శమించి, ఒకచోట చేరి యాతనా శరీరము ధరించును. ఆ యాతనాశరీరము (ప్రేతాత్మ) "నరకమునకు" పోవుటకు ఒక సంవత్సరము కాలము పట్టును. 


మనకొక మాసము "వారికి" ఒక దినము. కనుక ప్రతినెల "మాసికము" పెట్టవలయును. "యమలోకమునకు" పోవు మార్గములో "18 తావుల" ఆగుదురు కనుక "18 మాసికములను" పెట్టి, "సంవత్సరాంతమున" సాహపిండము పెట్టవలెను. ఆ నాటితో మృతులు ప్రేతరూపమును చాలించి "పితృదేవతలగుదురు". 


"పితృదేవతలు" కూడ దేవతా సమానులే.


సంవత్సరాంతమున "సాంవత్సరికము" జరిగిన మరుదినము అయిన "విమోకము" నాడు - యాతనా శరీరములో నున్న జీవుని యమభటులు "యమధర్మరాజు" వద్ద ప్రవేశపెట్టుదురు. "చిత్రగుప్తుని" ఖాతాను కాలము, "సూర్యచంద్రుల సాక్ష్యముతో" సరిచూచెదరు. "జీవులకు" శిక్షలేమైనా ఉంటే అనుభవించి ఆపైన వారు "పుణ్యలోకమునకు" పోవుదురు. "కర్మ" జరుగని జీవులు "ప్రేతరూపములోనే" ఉండవలసివచ్చును. అట్టివారికి "గయలో పిండప్రదానము" చేసినట్లయితే వారి "ప్రేతరూపము" పోయి "పుణ్యలోకములు" ప్రాప్తించును.


"సంవత్సరికము" పెట్టిన మరుసటి దినమున తిథి ప్రయోజనము (ఆబ్దికము) పెట్టవలెను. తదాధి ప్రతి సంవత్సరము మృతనమాసమున "పితరులను, విశ్వేదేవతలను" అర్చించవలెను.


"పితృదేవతలు" (( శ్రార్ధం )) ఆచరిస్తేనే "సంతానభివృధి, వంశాభివృద్ది" కలుగుతుందని "పురాణాలు" చెపుతున్నాయి.

  

  అలాగే ఈ మధ్య చాల మంది "ఇంగ్లీష్ క్యాలెండర్లను" చూసి (( సంవత్సరికం )) ఒక నెల ముందు "పెట్టుకోవాలని" వారికి వారె "నిర్ణయం" తిసుకుంట్టున్నారు. అది చాల తప్పు. 

             "జీవుడు" ఏ రోజైతే మరనిస్తాడో ఆ "మాసం" (( తెలుగు మాసాలు )) ఆ "తిధి" నాడే "శ్రార్ధం" (( బియ్యం ఇచ్చుకోవడం ))

ఆచరించాలి.

కామెంట్‌లు లేవు: