🙏 *ఓం నారాయణ- ఆది నారాయణ* 🙏
*గ్రంథం:* సర్వసమర్థుడు , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు
*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్
*శ్రీ సాయి, శ్రీ స్వామివారు ఒక్కరే!*
*భగవంతుడు ఒక్కడే. కాలానుగుణముగా అనేకమంది మహనీయుల రూపాలలో అవతరించి భక్త రక్షణ చేస్తుంటారు.* ఈ మహనీయుల అందరి మధ్య ఐక్యతేకానీ, సామాన్య మానవులకు వలె విరోధ భావం ఉండదు. శ్రీ సాయినాధుని భక్తురాలికి, శ్రీ వెంకయ్య స్వామివారు భౌతిక దర్శనం ప్రసాదించి, వారి భిక్షను స్వీకరించడం ద్వారా, మహనీయుల మధ్య మనకుండే భేదభావం నశింపజేసుకోమని బోధిస్తున్నారు.
అనంతలక్ష్మి సత్యవతి, నెం.46, 3వ అవెన్యూ DAE టౌన్ షిప్, కల్పాకం - 603 102, తమిళనాడు,
1997 లో "సాయినాథా! నాకు మంచి క్వార్టరు చూపిస్తే నీ పేరుతో అన్నానికి లేని అభాగ్యునికి అన్నం పెడతానని మొక్కుకున్నారు. తనకు మంచి ఇల్లు దొరికింది. కాని అన్నాని లేని అభాగ్యునికి అన్నం పెడతానన్నమాట చెల్లించలేక ఎవరో ఒక ఆయాకు భోజనానికిగాను డబ్బిచ్చారు. తన తప్పు గ్రహించి నిరుపేదయైన మరొకరికి అన్నం పెట్టాలనుకున్నారు. కానీ 25 రోజుల వరకు ఎవ్వరూ దొరకలేదు. 25 వ రోజున, నేను నా మాట చెల్లించుకోలేకున్నాను బాబా, అన్నానికి లేని నిరుపేదను చూపండి అని చెప్పుకున్నది.
నాడు మధ్యాహ్నం 11:30 గంటలకు - ఎముకల గూడు వలెనున్న ముసలాయన, భిక్షగాళ్ళెవరూ రాని మా మూడవ అంతస్తు మేడ మెట్లెక్కి వచ్చి, అన్నం అడిగారు. రాత్రి వండిన అన్నం చాలా ఉంది. అది పెట్టాలనుకున్నాను. వెంటనే ఆ తాత "వేడన్నం ఉందా? పెడతావా? అడిగారు. ఆహా! సాయి నా ప్రార్ధన మన్నించి వచ్చాడని వేడన్నం పార్శిలు కట్టి ఇచ్చాను. ఈ లోగా మా ఎదురింటామె కాఫీ ఇచ్చింది. ఆ మెట్ల మీద కూర్చొని తాగారు. ఒక్క నిమిషంలో అన్ని మెట్లు దిగి ఎలా వెళ్ళారో అర్ధం కాలేదు. వచ్చినది సాయినాధుడే అనుకున్నాను. ఆ తర్వాత మా ఇంట్లో సత్సంగం జరిగింది.
*స్మృతి మాత్ర ప్రసన్నాయ నమః* అనే పుస్తకంలోని శ్రీ వెంకయ్య స్వామి బొమ్మచూచాను. ఆనాడు మా యింటికి వచ్చి అన్నం తీసుకవెళ్ళిన మహనీయుడు వీరేనని స్పష్టంగా గుర్తించాను. సాయినాధుని భక్తురాలనైన మా యింటికి నా పిలుపు లేకుండానే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు వచ్చి భిక్ష గ్రహించారంటే *మహనీయులందరికీ రూపంలో భేదం తప్ప తత్వంలో ఎలాంటి భేదము లేదని బోధిస్తున్నారు*.
🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
"ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః"
'శ్రీ సాయి లీలామృతం, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర. నిత్య పారాయణ గ్రంథం. రచన పూజ శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్.'
"18 వ అధ్యాయం"
-:శిరిడీలో ఉత్సవాలు:-
-:పల్లకి - చావడి ఉత్సవం:-
ఒకరోజు పెద్ద వర్షం వచ్చి మసీదు అంతా తడిసిపోయి బాబాకు కూర్చునేందుకు చోటు కూడా లేకపోయింది. భక్తులు ఆయన నాటి రాత్రికి చావడిలో ఉండమన్నారు. ఆయన అంగీకరించకపోయేసరికి పట్టుబట్టి ఆయనను అక్కడికి తీసుకుపోయారు. ఆ రాత్రి ఆయన అక్కడ విశ్రమించారు. నాటి నుండి ఆయన ఒక రాత్రి మసీదులోనూ ఒక రాత్రి చావడిలోనూ నిద్రించేవారు. వారిని భక్తులు మసీదు నుండి చావడికి వేడుకలతో తీసుకెళ్లడం, క్రమంగా డిసెంబరు 10 1909 నాటికి అది గొప్ప చావడి ఉత్సవంగా రూపొంది, నేటికీ ఇది గురువారం రాత్రి పల్లకి ఉత్సవంగా జరుగుతున్నది.
ఒకప్పుడు హార్ధ నుండి భక్తులు బాబాకోక పల్లకి పార్సిల్ చేసి పంపారు. బాబా దానిని మసీదు ముంగిట పెట్టించి మూడు మాసాలు దానిని తెరవనివ్వలేదు. ఒకరోజు రఘువీరపురంధరే చనువుగా, "బాబా ఈరోజు పల్లకి బయటకు తీసి, పూలతో అలంకరించి, అందులో మిమ్మల్ని చావడికి తీసుకుపోతామన్నాడు." సాయి ఆ పార్సెల్ ఇప్పడానికే ఒప్పుకోలేదు. అయినా అతడు పంతంగా విప్పుతుంటే బాబా గద్దించి, పట్టరాని కోపంతో సట్కా తీసుకొని చంపేస్తానని అతని మీదకు పరిగెత్తారు. భక్తులు భయంతో పారిపోయారు. పురందరే అదేమీ పట్టించుకోకుండా నెమ్మదిగా పార్సిల్ విప్పి పల్లకిని పూలతో అలంకరించాడు. ఇక బాబా మౌనంగా ఉండిపోయారు. అది చూసిన పురందరే పంతంగా ఇకనుంచి మిమ్మల్ని పల్లకిలో ఊరేగింపుతో చావడికి తీసుకెళ్తాము! అన్నాడు అలా మాత్రం ఎన్నటికీ జరగనివ్వను అన్నారు బాబా అతడు అయితే పల్లకి ఖాళీగా మూసుకుపోతాము ఏమి అన్నాడు "సాయి ఉగ్రలై నీవు ముందు బయటికి పోతావా లేదా" అని చెడ్డగా తిడుతూ సట్కా తో బెదిరించారు అతడు త్వరగా ఆ పని పూర్తి చేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు. అతడు అనుమతి కోరినప్పుడు బాబా ఏమీ మాట్లాడకుండా ఊది ఇచ్చారు తర్వాత చావడికి వెళ్ళవలసిన రోజు సాయంత్రం అయ్యేసరికి భక్తులందరూ మొట్టమొదటి పల్లకి ఉత్సవానికి మసీదు వద్ద చేరారు. బాబా మాత్రం పల్లకి ఎక్కనని భీష్మించారు. ఊరి నుంచి అప్పుడేవచ్చినపురందరే తాను సిద్ధం చేసిన పల్లకి లేకుంటే తాను ఉత్సవానికి రానన్నాడు. భక్తులు ఎంత బ్రతిమాలిన బాబా తమ పట్టు విడవలేదు. చివరకు పల్లకీ లో వారి పాదుకలు ఊరేగించాలని, సాయి పాదచారి ఐ ఊరేగింపుతో వెళ్లాలని, రాజీ కుదిరింది. "బాబా పల్లకి నేను కూడా మోసేదా" అన్నాడు పురందరే. వద్దు నీవు 125 వత్తుల దివిటి పట్టుకో అన్నారు బాబా. అలా దివిటీల ఊరేగింపుతో పల్లకి చావడి చేరింది.
నాటి ఉత్సవమయ్యాక సాయి పల్లకిని మసీదులో పెట్టనివ్వలేదు. కనుక మూడు నాలుగు రోజులు అది చావడిలోనే ఉన్నది. చివరికి ఎలాగో ఒక రాత్రి మాత్రం మసీదు ముంగిట ఉంచనిచ్చారు. రెండు వెండి సినిమాలు దొంగలు ఎత్తుకెళ్లారు. కనుక దానికి ఒక షెడ్డును నిర్మించ ఆరంభించాడు పురందరే. బాబా లెండి నుండి గబగబ వచ్చి ఏమిటి చేస్తున్నావ్? అని గద్దిస్తే, అతడు నవ్వుతూ చెప్పాడు.! ఆయన ఉ(గ్గు లై నువ్విక్కడినుంచి పోతావా లేక నీ తల పగలగొట్టనా? అని మీదకెళ్లారు. అతడాయనకాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలాడు. ఆయన మరింత గట్టిగా నాకు నువ్వు వద్దు, పల్లకి షెడ్డు అసలే వద్దు; నన్ను విసిగించకు పో... అని అరిచారు. కానీ అతడు చేస్తున్న పనిలో మాత్రం జోక్యం చేసుకోలేదు.
మధ్యాహ్నం హారతయ్యాక భక్తులందరూ భోజనాలు చేసి తిరిగి మసీదు చేరిన పురందరే మాత్రం వెళ్లకుండా పనిచేస్తూనే ఉన్నాడు సాయి కొన్నిసార్లు అతని కి నెమ్మదిగా చెప్పారు, మందలించారు, గద్దించారు, భోజనానికి వెళ్లకుంటే కొడతానని బెదిరించారు. అయినా అతడు వినిపించుకోలేదు. పట్టరాని కోపంతో పలక్కుండా పదేపదే అతనికేసి చూస్తారు. చేత్తో పోట్ట తడుముకుంటారు,"ఆపనికిమాలిన వాడు భోజనానికి కూడా పోకుండా నా ప్రాణం తీస్తున్నాడు, నువ్వైనా పిలుచుకుపో!" అని కాక సాహెబ్ తో చెప్పారు అతడు సెలవు పెట్టాడు అధయ్యేలోగా పని పూర్తి చేయాలని చేస్తున్నాడు. అతనిని భోజనానికి పిలుచుకెళ్ళనా? అన్నాడు కాక. "వాడు రాడు, ఆ మూర్ఖుడు నేను చెప్పిన వినలేదు! అన్నారాయన. వెంటనే పురందరే వారి పాదాలపై పడి... పసిపిల్ల వానిలా ఏడుస్తుంటే! "ఎందుకు ఏడుస్తావ్? ఊరుకో! అన్నారు బాబా.అతడుకళ్ళుతుడుచుకొని "పొద్దటి నుండి నన్ను ఇంతలా తిడుతున్నారు. కొడతాను, చంపుతాను; అని బెదిరిస్తున్నారు, కానీ నేను ఒక్క పూట భోజనం చేయకపోతే అంత తల్లఢిల్లీ పోతున్నారే! నాపై మీకెందుకు దయ? మమ్మీoతలాపట్టించుకునేదేవరు? అన్నాడు. "నోరు ముయ్! వెళ్లిభోంచెయ్:కడుపుమండిపోతుంది!" అన్నాడు బాబా. అతడు రెండు అడుగులు వేసి, చటుక్కున వెనుక తిరిగి, నేను వెళితే మీరంతా పీకేస్తారు అన్నాడు. బాబా ప్రసన్నులై "నేనేమన్నా రాక్షసుడు నా!!!? నేను అలా ఏమి చేయనులే!" అన్నారు.
"18 వ అధ్యాయం మొదటి భాగం సంపూర్ణం"
'శుభం భవతు'
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి