.
_*సుభాషితమ్*_
𝕝𝕝 శ్లో𝕝𝕝
*యన్మనసా ధ్యాయతి తద్వాచా వదతి!*
*యద్వాచా వదతి తత్కర్మణా కరోతి*!
*యత్కర్మణా కరోతి తదపి సంపద్యతే!!*
తా𝕝𝕝 *ఏదైతే మనం మనస్సుద్వారా ఆలోచన (ధ్యానం ) చేస్తున్నామో, అదే వాక్కు ద్వారా వచించాలి*..... *ఏదైతే వాక్కు ద్వారా వచిస్తున్నామో, అదే కర్మ-పని ద్వారా చేయాలి. ఏదైతే కర్మ ద్వారా చేస్తున్నామో ఆ సత్ కర్మ ఫలాలను సత్యదృష్టితో దర్శించి సర్వజనుల సౌఖ్యాన్ని ఆకాంక్షించాలి*.......
*:ఒక మంచి విషయము:*
పాపములు:- పరులకు కీడుదలచుట మనస్సు చేసిన పాపము; పరులను పరుష వాక్యములు పలుకుట నోరు చేసిన పాపము; పరధనమును అపహరించుట చేతులు చేసిన పాపము; పరుల శ్రమమునెంచని వాని వద్దికి తిరుగుడట కాళ్లుజేసిన పాపము, పరనిందవినుట చెవులు చేసిన పాపము, ప్రీతిలేని అన్నము తినుట నాలుక చేసిన పాపము, పరస్త్రీలను ఆలింగనము చేయుట దేహము చేసిన పాపము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి