వినాయక వ్రతకల్పం ద్వారా భారతీయులకు తెలిసిందేమిటంటే విగ్నేశ్వరుడు ఉండ్రాళ్లు తిని ఆయాసపడుతూ నడిచి వెళుతుంటే చంద్రుడు చూసి నవ్వాడని, తత్ఫలితంగా వినాయకుడు పుట్టలోని ఉండ్రాళ్ళు పగిలి బయటకు వచ్చాయని, దీనికి కిన్కోవహించిన అమ్మవారు పార్వతీదేవి చంద్రుని శపిస్తుందని ఆ శాప విషయముకు వస్తే జనులు చంద్రుని చూస్తే వారికి కష్టాలు ప్రాప్తిస్తాయని సెలవిచ్చారు. వెంటనే దేవతలు ఆ శాపమును సదలించమనగా భాద్రపద శుద్ధ చవితినాడు చంద్రుని ఎవరూ చూడకూడదు అని సెలవిచ్చారు. పొరపాటున చంద్రుని చూస్తే ప్రాయశ్చిత్తం ఏమిటని దేవతలు అడుగగా, అటువంటివారు వినాయకుని పూజ చేసుకుని ఆ పూజాక్షింతలు శిరస్సుపై జల్లుకుంటే ఆ దోష నివారణ జరుగుతుందని సెలవిచ్చారు.
అనగా పొరపాటున చంద్రుని భాద్రపద శుద్ధ చవితి నాడు చూసినవారు ప్రాయశ్చితార్థం గణేశుని పూజ చేసుకుని అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి.
కానీ భద్రపదశుద్ధ చవితి చంద్రుని చూడకుండానే భద్రపద శుద్ధ చవితి నాడు ఉదయం పూజ చేసుకుని రాత్రి చంద్రుని చూస్తే ప్రాయశ్చిత్తం ఎలా ? పొరపాటున చూసిన తరువాత మాత్రమే గణేశ పూజ చేసుకుని అక్షింతలు వేసుకొని ప్రాయశ్చిత్తం పొందాలి కదా. ఆ విధంగా కాకుండా చవితినాడు పగలు అంటే చంద్రుని చూడకుండానే ముందుగా పూజ చేసుకున్న అక్షింతలు వేసుకొనుటవలన స రాత్రి చంద్రుని చూచు శాపము నివారణ అయినట్లేనా. అందువలన శ్రావణ శుద్ధ చవితి నాడు చంద్రుని చూసిన యెడల పునః పూజ చేసుకొని అత్యంత వేసుకుంటూ ఉత్తమం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి