7, సెప్టెంబర్ 2023, గురువారం

కృష్ణం వందే జగద్గురుం


 కృష్ణం వందే జగద్గురుం🙏🙏🌷👌🙏🙏


❤️-బ్రహ్మాండ దర్శనం-❤️

((బాపుగారి . విశ్వరూపం )

🚩

ఇది బ్రహ్మాండ దర్శనం. దీనినే “మృద్భక్షణమున విశ్వరూప ప్రదర్శనము” అంటారు పోతనగారు. కృష్ణుడు నోరు తెరిచాడు. సమస్త పర్వతములతో, నదులతో, సముద్రములతో, చెట్లతో, నరులతో, లోకంతో, నంద వ్రజంతో, నందవ్రజంలో వున్నా పశువులతో, తన యింటితో, తనతో, నందుడితో కలిసి అందరూ లోపల కనపడ్డారు. ఇన్ని బ్రహ్మాండములు పిల్లవాడి నోటిలో కనపడుతుంటే ఆవిడ తెల్లబోయింది.

💥'కలయో వైష్ణవమాయయో యితర సంకల్పార్థమో సత్యమో

తలపన్ నేరకయున్నదాననో యశోదాదేవి గానో పర

స్థలమో బాలకుడింత యాతని ముఖస్థంబై యజాండంబు ప్ర

జ్వలమై యుండుటకేమి హేతువొ మహాశ్చర్యంబు చింతింపగన్!!

💥నోరు తెరిస్తే పిల్లవాని నోట్లో వున్నవి అన్నీ చూసి

యశోద “ఇది కలా? వైష్ణవ మాయా? ఏదయినా సంకల్పమా? అసలు నేను యశోదనేనా? నేను నా యింట్లోనే ఉన్నానా? వీడు నా కొడుకేనా? వీని నోట్లో బ్రహ్మాండములు అన్నీ ఉన్నాయా? ఆలోచించి చూస్తె చాలా ఆశ్చర్యంగా ఉంది. పిల్లవాడేమిటి? నోట్లో బ్రహ్మాండములు ఏమిటి?” అని ఆశ్చర్యపోయింది. యశోద కృష్ణుని కేవలము తన కొడుకుగా భావన పెంచుకుంది. ఈ ప్రేమయే భక్తి. తెలియకుండా ప్రేమించినా ఆమె ఈశ్వరునే ప్రేమించింది. ఇటువంటి భక్తికి పర్యవసానము జ్ఞానము. ఇదే విశ్వరూప సందర్శనము.

🚩అయితే ఇక్కడ పరమాత్మ ఒకటి అనుకున్నారు. అమ్మ యిలా జ్ఞానంతో ఉండిపోతే నాకు అమ్మగా ఉండలేదు. కాబట్టి మరల వైష్ణవ మాయ కప్పాలి అనుకొని ఆమె జ్ఞానమును ఉపసంహారం చేశాడు. అంతే!

ఆమె వైష్ణవమాయలోకి వెళ్ళిపోయింది.

ఇదే పరమాత్మ అనుగ్రహం అంటే.⁠⁠⁠⁠🙏

కామెంట్‌లు లేవు: