7, సెప్టెంబర్ 2023, గురువారం

అన్నీ తానై ఉన్నాడు

 బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు తో సహా అన్నీ తానై ఉన్నాడు.. అన్నదానికి  శాస్త్ర(సిద్ధాంత) రూపమే అద్వైతం. భాగవతం పురాణము కాబట్టి కథా రూపంలో ఉంటుంది. మనకున్న శుద్ధి, ఏకాగ్రత, కాంక్ష..స్థాయిని బట్టి.. శ్లోకం చదువుతుంటే కంటికి ఓ దృశ్య రూపాన్ని చూపటం పురాణం యొక్క తియ్యటి లక్ష్యం. తద్వారా మనసులో చెరగని ముద్ర పడి బుద్ధికి చేరి అక్కడ విచారణ ప్రారంభించడానికి పురాణ రూపం సులువైన మార్గం.  బుద్దిలో విచారణ ప్రారంభమైనపుడు అది అనిర్వచనమైన అనుభవానికి దారితీస్తుంది. అది శాస్త్ర-సిద్ధాంత లక్షణం. కాబట్టి ఆది శంకరులు వేదాన్నే శాస్త్ర-సిద్ధాంత-వాదన రూపంలో(అద్వైతాన్ని) నిరూపించారే తప్ప ఇంకోటి కాదు. వ్యాస భగవానుడు చెప్పిన అద్వైతాన్నే ఆదిశంకరులు చెప్పారు అడుగడుగునా నిరూపించారు తప్ప ఇంకోటి చేయలేదు. అన్ని అవతారాలు తన అంశయే.. అన్నదాంట్లో అన్ని భూతములు అనే వొస్తోంది. అన్నీ తానే అయినప్పుడు ఇక ద్వైతం లేదు కదా.

కామెంట్‌లు లేవు: