🌻🌻కృష్ణం వందే జగద్గురుమ్🌻🌻
సీ. శ్రీమహావిష్ణువు క్షితిభారమును బాప
ప్రార్థితుండయ్యును బ్రహ్మవలన
వసుదేవవిభునకు వనిత దేవకికిని
పుట్టె చెరసాలలో గుట్టు గాను
శ్రీకర వర్షమౌ "శ్రీముఖ" మందున
వరలు " శ్రావణ మాస బహుళ " మందు
" అష్టమీ తిథి " యందు నర్థరాత్రంబున
జన్మించె కృష్ణుండు జగతి పొంగ
తే. ధర్మ సంస్థాపనార్థమ్ము ధరణి వెలసి
దుష్టులనుద్రుంచి బ్రోచెను శిష్టజనుల
విష్ణు పరిపూర్ణ రూపుడౌ కృష్ణ విభుని
భక్తి తోడను తలచి నే ప్రణతు లిడుదు
అందరికి శ్రీకృష్ణజన్మాష్టమి శుభాకాంక్షలు
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి