🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 15*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం*
*వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తక కరామ్ |*
*సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధితే*
*మధుక్షీరా ద్రాక్షామధురిమ ధురీణాః ఫణితయః ||*
ఈ శ్లోకంలో శుక్ల సరస్వతీ స్వరూప ధ్యానం చేయిస్తున్నారు శంకరులు.ఈ శ్లోక పారాయణ వల్ల ఆ తల్లి ధ్యానం వల్ల మంచి మనసు,వాక్కు అనుగ్రహించబడతాయి.మనకి దేవతోపాసనలో మూడు మార్గాలు చెప్పారు.కర్మ, భక్తి, జ్ఞానము. ధర్మబద్ధమైన కోరికతో కర్మ చేయటం వల్ల మనస్సుద్ధి కలిగి అది జ్ఞాన చింతనకు దారి తీయాలి.వీటి సహాయంతో ఒకదాని తరువాత ఒకటిగా సాధనలో ఎదగాలి. అట్టి ధ్యానం ఇక్కడ చెపుతున్నారు.
ఈ వాగ్దేవి(శృంగేరిలోని ఆరాధ్య శారద) ఎలా ఉన్నదంటే..
శరజ్జ్యోత్స్నా శుద్ధాం = శరత్కాలపు వెన్నెల వాలే తేటయైన, శుద్ధమైన తెల్లని వర్ణం కలిగియున్నది.
శశియుత జటాజూట మకుటాం = చంద్రవంక కలిగిన జటాజూటము కలిగియున్నది. నెలవంక అమృతతత్త్వానికి సంకేతం.
వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తక కరామ్ = వరద, అభయ ముద్రలు, స్ఫటిక అక్షమాల(అక్షరముల మాల),పుస్తకము (శాస్త్రములకు సంకేతం). నాలుగు చేతులయందు ధరించి ఉన్నది.అక్షరముల వల్ల, శాస్త్రముల వల్ల లభించేది జ్ఞానము దాని ద్వారా వరము, అభయము.
సకృన్నత్వా నత్వా కథమివ సతాం = ఒక్కసారి నమస్కరించి ధ్యానిస్తే,
సన్నిదధతే మధుక్షీరా ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః = తేనె వంటి, పాల వంటి, ద్రాక్షా రసంవంటి పలుకులు ఆ తల్లి అనుగ్రహిస్తుంది.పాలలోని సత్వ గుణం, తేనెలోని ఆస్వాదనీయ గుణం, ద్రాక్షారసములోని తేలికగా అర్థమయ్యే గుణం. ఇవన్నీ కలబోసిన జ్ఞానమును అమ్మవారు అనుగ్రహిస్తారు.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి