7, సెప్టెంబర్ 2023, గురువారం

ఆదినారాయణుడు

 భాగవతమును అనుసరించి ఆదినారాయణుడు కర్మబంధనములు లేకుండా త్రిగుణాలను అవహింపజేసుకొని మాయ ( ప్రకృతి) ఆలంబనముగా చేసుకుని సృష్టి రచన చేశారు. మొట్టమొదటి సృష్టియే విరాట్ పురుషుడు. విరాట్ పురుషుని నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకాలకులుగా నియమింపబడ్డారు. ఇందులో ఆదినారాయణడే విరాట్ పురుషుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా తానై ఉన్నాడు.

బ్రహ్మ మానస పుత్రులు ( సృష్టి చేయలేమని దూరంగా ఉన్న సనకసనందన సనత్కుమార్ సనత్సుజాతలు) ద్వారా

అఖిలాండ సృష్టి కొనసాగించాడు. ఆనాడు సృష్టించబడిన జీవులు ఇన్ని కోట్ల సంవత్సరములు అనేక శరీర ముసుగులొ రూపములతో  ప్రళయ అంతము వరకు జీవత్వము కొనసాగించి పిమ్మట ప్రకృతిలో కలిసిపోయి ఆ పిమ్మట జీవులతో కూడిన ప్రకృతి భగవంతునలొ కలిసిపోతుంది. 

శుభం భూయాత్. శ్రీకృష్ణార్పుణమస్తు:

కామెంట్‌లు లేవు: