.
ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం
భాగం 12/12
(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన,
"శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం"
అనే పత్రంలోని ఒక అంశం)
-----------------------
11. ప్రజా జీవనం - నాగరికత
అయోధ్య
అ) తరతరాల ప్రజలకు ఆయురారోగ్యభాగ్యాలని కొల్లలుగా పంచియిచ్చిన దివ్యభూమి.
ఆ) జ్ఞానులయెడ రక్షకులు గౌరవం కలిగి రాజ్యపాలన చేసేవారు.
ఇ) స్త్రీ పురుషులు
- ధర్మప్రవర్తనచే శ్రేష్ఠులు,
- ఇంద్రయనిగ్రహం కలవారు,
- సదాచార సంపన్నులు,
- సత్స్వభావం కలవారు.
ఈ) పౌరులలో
- కామాతురుడుగానీ,
- లోభిగానీ,
- క్రూరుడుగానీ,
- విద్యావిహీనుడుగానీ,
- నాస్తికుడుగానీ ఎంతవెదికినా కనబడని ప్రదేశం.
ఉ) జనులు
- ధర్మాత్ములు,
- అనేక శాస్త్రాలను అధ్యయనం చేసినవారు,
- సుఖసంతోషాలతో, శాంతంగా జీవించేవారు.
వీటన్నింటికీ మూలం సత్యధర్మాలు,
"సత్యం వద - ధర్మం చర" అనేదే ప్రధానం.
లంక
అయోధ్యకు విరుద్ధంగా, సత్య ధర్మాల లోపంవల్లే, లంకలో రావణుడూ అతని పరివారమూ విలాసవంతమైన జీవితాలు గడిపినప్పటికీ, నాశనమయ్యారు.
ధర్మాచరణతోనున్న విభీషణుడే లంకాధిపతి అయ్యాడు.
కేవలం భౌతిక భోగలాలసత మాత్రమే అయితే, అది దేనికి దారితీస్తుందో లంక - రావణ పరివారం ద్వారా తెలుస్తుంది.
త్యాగం - ఆదర్శం
అయోధ్యలో శ్రీరాముని నుంచీ అట్టడుగు స్థాయివరకూ అంతా త్యాగం కనిపిస్తుంది.
పలు అంతస్తుల భవనాలలో నివసిస్తున్నా, జీవనం సత్య - ధర్మబద్ధంగా ఉండడంవల్ల, అయోధ్య ఏ రంగంలోనైనా ఆదర్శవంతంగా కనబడుతుంది.
ముగింపు
శ్రీమద్రామాయణంలో ప్రస్తుత విద్యావిషయాలైన
1. చరిత్ర,
2. సార్వభౌమత్వము - సామ్రాజ్యవాదము,
3. భూగోళ శాస్త్రము,
4. ఆర్థిక, వాణిజ్య విషయాలు,
5. పరిపాలనా విధానం,
6. గణితం - సంఖ్యా శాస్త్రం,
7. భౌతిక శాస్త్రాలు,
8. జీవశాస్త్రం,
9. సాంకేతిక విజ్ఞానం,
10. వైద్యశాస్త్రం,
11. ప్రజా జీవనం - నాగరికత వంటివాటికి సంబంధించి పరిశీలించినప్పుడు,
ఏ విద్యావిషయంపైన అయినా,
శ్రీమద్వాల్మీకి రామాయణ కథ
ఆ విషయానికి సంబంధించి,
- మౌలికంగా,
- సమగ్రంగా,
- ఆదర్శవంతంగా అనేక విషయాలు బోధపడతాయి.
(సమయాభావం వలన, ఆనాటి సదస్సులో సాముద్రిక - జ్యోతిష - ఖగోళా - శకున - వాస్తు - మనస్తత్వాది ఇతర శాస్త్రాలపై విషయాలు సమర్పించడం కుదరలేదు.
తరువాత కూడా ప్రాధాన్యతనిచ్చి, ఇప్పటివరకూ వాటిని తయారుచేసి పెట్టడం జరుగలేదు.
త్వరలో పూర్తయి పంపబడుతుంది.)
శ్రీమద్రామాయణం వల్ల మన మస్తిష్కమే ఒక "విజ్ఞాన సర్వస్వం" (Encyclo Paedia)గా అయి,
- అనూహ్యమైన సత్ఫలితాలతో,
- సుఖసంతోషాలతో కూడిన,
- దైవత్వ జీవతాన్ని కలిగి,
మన దేశం ప్రపంచంలోనే శక్తివంతమై ఉంటుంది.
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి