🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 31*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
శ్రీరామ కృష్ణులు ఏదో ఉపదేశించబోతున్నారని నరేంద్రుడు అనుకొన్నాడు. కాని జరిగింది మరొకటి! కాలాంతరంలో నరేంద్రుడు అప్పుడు ఏం జరిగిందో ఇలా చెప్పాడు:...
"నా చేయి పుచ్చుకొని కళ్ల వెంట ఆనందబాష్పాలు స్రవిస్తూండగా, చిరపరి చితుడైన వ్యక్తిలా ఆప్యాయత ఉట్టిపడే స్వరంలో ఆయన నాతో ఒకింత విలపిస్తూ ఇలా అన్నారు. 'ఓ, ఇంత ఆలస్యంగా వచ్చావే! లౌకికుల ప్రాపంచికమైన సంభాషణలతో నా చెవులు తూట్లుపడ్డాయి. నా ఆత్మానుభవాన్ని గురించి ఒక యోగ్యుడైన వ్యక్తితో ముచ్చటించడానికి ఎంతగా పరితపించానో తెలుసా! మరు క్షణమే చేతులు జోడించి నిలబడే నాతో, 'అయ్యా, తాము సనాతన ఋషియైన నరుడు; నారాయణుని అవతారం, లోకుల దుఃఖాన్ని బాపడానికి ఈ లోకంలో మానవునిగా జన్మించారు' అంటూ ఏదేదో చెప్పారు.
"కాని నేను లోలోపల, 'ఇదేం చోద్యం! నేను విశ్వనాథ దత్తా కుమారుణ్ణి. కాని ఈయన నన్ను ఋషి అనీ, నారాయణుడనీ అంటున్నారు! సందేహం లేదు.. ఈయన తప్పక పిచ్చివాడై ఉండాలి' అని అనుకొన్నాను. అయినప్పటికీ నేను ఏమీ మాట్లాడలేదు.”
తదనంతరం నా చేతులు పుచ్చుకొని, “నాయనా, త్వరలోనే ఒక రోజు ఒంటరిగా వస్తానని వాగ్దానం చేయి" అని వేడుకొన్నారు. ఆయన వేడుకోలును తిరస్కరించలేక అందుకు సమ్మతించాను.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి