1, ఫిబ్రవరి 2024, గురువారం

జీవకుడి" జీవిత విశేషాలు -

 మరుగున పడిన ఆయుర్వేద వైద్య పితామహుడు అయిన "జీవకుడి" జీవిత విశేషాలు - 


    ఆయుర్వేదం అనగా అందరికి చరకుడు , వాగ్భాటాచార్యుడు , శుశ్రుతుడు మాత్రమే అందరికి గుర్తుకువస్తారు. కాని కాలగర్భంలో కలిసిపోయిన ఒక గొప్ప ఆయుర్వేద వైద్య పితామహుఁడు , శస్త్రచికిత్సా నిపుణుడు గురించి మీకు ఈ రోజు తెలియచేస్తాను. ఆ గొప్ప ఆయుర్వేద వైద్య పితామహుఁడు నామధేయం "జీవకుడు " ఇతను బుద్ధుని కాలం నాటి అనగా క్రీస్తూపూర్వం 6 వ శతాబ్దం నాటివాడు .ఈ వైద్యుని చరిత్ర మనకి ఆశ్చర్యం కొలుపుతుంది.


                 ఇతను గౌతమబుద్ధుని సమకాలికుడు ఆయనకు చికిత్స చేసెను. " కౌమార భృత్యం " అనగా బిడ్డల చికిత్స యందు మిక్కిలి చతురత కలవాడు అని ఇతనికి బిరుదు కలిగి ఉండెను. కాని జీవకుడు కాయచికిత్స యందు శస్త్రచికిత్స యందు గొప్ప ప్రజ్ఞ కలవాడు అని చారిత్రిక నిదర్శనములు కలవు. అతడు మగధరాజ్యమునకు ముఖ్య పట్టణం అగు రాజగృహ నగరము నుండి బింబిసార చక్రవర్తి యొక్క కుమారుడు అగు అభయునిచే అప్పటికే ప్రసిద్ది చెందిన తక్షశిలా నగరం నందలి వైద్యవిశ్వవిద్యాలయమునకు పంపబడెను. ఆ కాలము నందే వేయిమైళ్ల దూరం వైద్యవిద్యను సంపాదించు నిమిత్తం ఇతను పోయననిన ఆశ్చర్యపడవలసిన అవసరమే లేదు .


               తక్షశిలా విశ్వవిద్యాలయము నందు జీవకుడు ఏడు సంవత్సరాలపాటు వైద్యవిద్యను అభ్యసించి గురువువద్దకు సెలవు తీసుకొనుటకు వెళ్లగా గురువు ఇతనిని పరీక్షింపదలచి " ఈ గడ్డపార తీసుకుని తక్షశిలా నగరం చుట్టూ యోజనము దూరములో వైద్యమునకు పనికిరాని మూలికను తెమ్ము " అని పంపించెను . అతడు తిరిగి తిరిగి ఏదో ఒకరకమగు చికిత్సకు కాని , ఆహారంగా గాని పనికిరాని వస్తువు అంటూ ఏమి లేదు అని " న కించిత్ జగ త్యనౌషధం " అని చెప్పెననియు అందుకు ఆ గురువు సంతసించి అతని ప్రయాణ ఖర్చులకు కొంత ధనమును ఇచ్చి వీడ్కోలు పలికే అని పురాతన గ్రంథాలలో ఉన్నది. జీవకుడు సాకేత నగరముకు వచ్చు వరకు ప్రయాణ ఖర్చులకు ధనము లేక అక్కడే కొన్ని రోజులు వేచిచూడవలసిన వచ్చెను.


 * జీవకుడి చికిత్సలు - 


        సాకేత నగరమున ఒక ధనికుడు అగు శెట్టి భార్య ఏడు సంవత్సరముల నుండి తలలో ఏదో సమస్యతో భాధపడుచూ ఎందరు వైద్యం చేసినను కుదరక కష్టపడుచుండును. జీవకుని గురించి విని తన గృహమునకు ఆహ్వానింపగా ఇతడు కొన్ని మూలికలు సంపాదించి వానితో ఒక ఘృతము తయారుచేసి ముక్కుద్వారా నశ్యము చేయించెను. ఈ చికిత్సతోనే ఆమె రోగము నయం అయ్యెను. ఆ కాలములోనే వైద్యదక్షిణగా 16000 బంగారు రూపాయలు ఇచ్చెను . ఒక గుర్రపు బండిని , నౌకరులను ఆయనకు సమర్పించెను. దీనితో జీవకుడు రాజగృహమునకు చేరి తనపోషకుడు అగు అభయునకు తనకు సహాయం చేసిన ధనమును తిరిగి ఇచ్చివేసెను. ఆ తరువాత బింబిసార చక్రవర్తికి కలిగిన" భగంధర " రోగమును కొన్ని లేపనముల సహాయముతో చేసి కుదిర్చెను . ఆ తరువాత జీవకుడు రాజవైద్యుడిగా నియమించబడెను. ఆ తరువాత గౌతమబుద్ధునకు వారి బౌద్ధ సంఘమునకు వైద్యుడు అయ్యెను.


                     జీవకుడు చికిత్స చేసిన అత్యద్భుత చికిత్సలలో కొన్ని బౌద్ధ గ్రంధములలో వర్ణింపబడినవి. రాజగృహ నగరం నందు ఒక వైశ్యశిఖామణి కుమారునకు మితిమీరిన తలనొప్పి అనేక సంవత్సరముల నుండి భాదించుచుండెను. జీవకుడు శస్త్రచికిత్సచే తలలో నొకభాగం తొలచి రెండు పురుగులను తీసివేసి వ్రణమును ఎప్పటివలె కుట్టి ఏదో ఒక లేపమును పూసి కట్టు కట్టెను. ఇందువలన తలనొప్పి నిర్మూలనం అయ్యెను .


              కాశీపట్టణమునకు చెందిన ఒక వ్యక్తి కుమారుడు వ్యాయామము చేయుచుండగా పేగులలో మెలికపడి ఆహారం జీర్ణించుకోలేక మలబద్దకం కలిగి రక్తహీనుడు అయ్యి శల్యావశిష్టుడై యుండెను. అంతట వారు జీవకునిని పిలిపించగా ఇతడు శస్త్రచికిత్సచే సరిచేయుచూ మెలికపడిన పేగులను రోగి భార్యకు చూపించి పేగులను మెలికను విడకొట్టి తిరిగి ఎప్పటివలె ఉదరకుహరమున స్వస్థలమున నిలిపి పైన చర్మం కుట్టి ఏదో లేపనం పూసి మాన్పెను. 


                ఉజ్జయినీ మహారాజు అగు "ప్రద్యోత" చక్రవర్తి కామెర్ల వ్యాధిచేత భాధపడుతుండెను. ఆఖరు వైద్యముగా వారి సంస్థాన వైద్యులను బింబిసార చక్రవర్తి దగ్గరకు జీవకుని కోసం పంపిరి. రోగము కంటే రోగి మొండివాడు అని జీవకునకు తెలుసుకొనెను. ఈ వ్యాధికి ఘృతపానం చేయవలెను . (ఆయుర్వేదం నందు ఘృతము అనగా మూలికలను ఆవునెయ్యితో కలిపి వండుటను ఘృతము అందురు.) ఘృతం పేరుచెప్పగానే రోగికి వాంతి వచ్చుచుండెను. అందువల్ల ఘృతం పనికిరాదు అని రాజు శాసించెను . జీవకుడు కష్టపడి రంగు , రుచి అన్నియు మారునట్లు ఒక ఘృతమును తయారుచేసి ఒకవేళ మహారాజుకు వాంతి అయిన మహారాజు ఘృతం అని కనిపెట్టి ఏమి దండన విధించునో అను శంఖ చేత ఒక యుక్తిని పన్నెను . అదేమనగా మహారాజునకు మందు లొపలికి ఇవ్వగానే తాను ఒక పచ్చిమూలిక సంపాదించి వెంటనే విరుగుడుగా ఇవ్వవలెను అనియు అందుకు వేగముగా పరిగెత్తగల వాహనమును తయారుచేసి వీధిలో సిద్ధముగా నుంచవలెను అనియు ఏర్పాటు చేయించెను .


                  మహారాజునుకు ఔషదం ఇచ్చి ఉపచారవిధానాదులు చేయుటకు తగినవారిని నియమించి వేగముగా నగరం విడిచిపోయెను. చక్రవర్తికి రోగము నివారణ అయ్యెను . కాని వైద్యుడు కనిపించలేదు . రాజు రహస్యం అంతా తెలుసుకుని జీవకునకు చేరవలసిన బహుమానమును బింబిసారుని రాజధానికి పంపెను. ఇలా జీవకుడు ఎన్నో కఠినమైన చికిత్సలు చేయుచుండెను అని " చుల్లవగ్గా " 5 -14 - 1 అనే గ్రంథము నందు కలదు . ఒకసారి బుద్ధునకు అనారోగ్యం కలిగెను. అప్పుడు విరేచనౌషధం ఇవ్వవలసి వచ్చెను. అతిగౌరముగా కాపాడుబడుచున్న పవిత్ర మునీశ్వరుడు అయిన గౌతమ బుద్దునకు లొపలికి తీసికొనుటకు అహితములైన మందులను లొపలికి ఇచ్చుట జీవకునకు ఇష్టం లేదు . అందుచే విరేచనౌషధములను పద్మములో ఇమిడ్చి వాసన చూచుటకు బుద్దునకు ఇచ్చెను. సుఖముగా విరేచనాలైన పిమ్మట వేడినీళ్లలో స్నానం చేయించి సంపూర్ణంగా ఆరోగ్యం కలుగు వరకు ద్రవపదార్థాలను ఆహారంగా ఇచ్చుచుండిరని వ్రాయబడినది . మరొకసారి ఒక భక్తురాలు విందు ఇచ్చినప్పుడు ఆహార దోషము వలన తినినవారందరికి అజీర్ణము పుట్టి దోషప్రకోపం వలన బాధలు పడుచుండిన సమయమున అందరికి చికిత్స చేసెను అని కలదు .


     ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కామెంట్‌లు లేవు: