30, మార్చి 2024, శనివారం

లోక రీతి

 శ్లో! అన్యముఖే దుర్వాదో యః ప్రియవదనే స ఏవ పరిహాసః

ఇతరేంధన జన్మా, యో ధూమః, సోగరుభవో ధూపః

—నీతి శాస్త్రం.


ఇతరుల నోటి నుంచి వచ్చిన అపశబ్దం లేక చెడ్డ మాట, మనకు కావలసిన వారి నోటి నుంచి గానీ, మన పిల్లల నోటి నుంచి గానీ వస్తే, అది పరిహాసంగా తీసుకుంటాం. ఇతర 

కట్టెల నుంచి వచ్చిన పొగను 'ధూమం' అంటాము. అదే అగరు పుల్లల నుంచి వస్తే 'ధూపం' అని, గౌరవంగా, ప్రత్యేకంగా పిలుస్తాం.

ఏ కాలమయినా, ఇది అన్వయించుకోదగ్గ శ్లోకం. పర, తన మధ్య తేడా ఎప్పటికీ వుంటుంది. మన పిల్లల అల్లరి ముద్దుగా వుంటుంది. మన పిల్లల అల్లరిలో పదవ వంతు ఇతర 

పిల్లలు చేసినా, భరించలేక పంపించేస్తాము.

మన పిల్లలు బాగా తింటే, మా వాడు మంచి 'తిండి పుష్ఠి' కలవాడు అంటాం, అదే తిండి ఇతరులు తింటే, వాడొట్టి 'తిండి పోతు' అని వెంటనే వెటకారంగా అంటాం. ఇలా ఎన్ని 

ఉదాహరణలన్నా చెప్పవచ్చు. ఇది లోక రీతి, నీతి.


*ఆదిరాజు ప్రసాద్ శర్మ*

కామెంట్‌లు లేవు: