28, డిసెంబర్ 2024, శనివారం

మితభాషణ పొగరు కరణి

 *2093*

*కం*

మితభాషణ పొగరు కరణి

యతిభాషణ మతిభ్రమమని యనిపించునయా/యనిపించదగున్.(యనిపించునిలన్/భువిన్).

హితభాషణ సమ్మతమగు

సతతము మృదుభాషణమ్మె సరసము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తక్కువ గా మాట్లాడితే పొగరనీ,ఎక్కువగా మాట్లాడితే  పిచ్చి యనీ అనిపించవచ్చు. నచ్చే విధంగా మాట్లాడితే అందరికీ ఆమోదమవుతుంది. మృదువుగా మాట్లాడటం ఎల్లప్పుడూ మనోహరంగా ఉంటుంది.

*సందేశం*:-- తక్కువగానూ, ఎక్కువగానూ,మాట్లాడటం కన్నా ఇతరులకు నచ్చేవిధంగానూ,మృదువుగా నూ మాట్లాడటం అందరికీ అన్నివిధాలుగానూ మంచిది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*.

కామెంట్‌లు లేవు: