6, జులై 2025, ఆదివారం

తొలి ఏకాదశితో

 ఈ నాటి ఆషాఢ మాసపు తొలి ఏకాదశితో శ్రావణ మాసంలో మనం జరుపుకొను ఎన్నో పండుగల సంబరాలు ఆసన్నమయినట్టే.


సాధారణంగా ఏకాదశి పర్వదినాన్న పెక్కుమంది ఉపవాసాలు ఉంటారు. ఏకాదశి ఉపవాశమన్నది ధాన్యాలతో వండినవి ఆరగించడం నిషేధం అన్నట్టు. అంటే ధాన్యాలు కాకుండా మిగిలినవి ఏవైనా అంటే పచ్చి కూరగాయలు గాని పండ్లు గాని తినగలం. మరుసటిరోజు ద్వాదశి ఘడియలు ఆసన్నం కాగానే పారణ చేపట్టాలి. 


కాని పలువురు మరుసటి రోజు నిత్యపూజ నైవేద్యాలు అయిన తర్వాతనే భోజనానికి ఉపక్రమిస్తారు కదా. అలాంటి వారు ద్వాదశి పారణ ఎలా చేయాలి మరి. సరియైన సందేహమే. 


అలా నిత్యపూజ చేసిన తర్వాత మహా నైవేద్యం సమర్పించి గాని భుజించనివాళ్ళు ఈ ఏకాదశి పారణను ఎలా చేపట్టాలి అన్న విషయాన్ని ఎవరైనా తెలియజేయగలరు.

కామెంట్‌లు లేవు: