10, డిసెంబర్ 2020, గురువారం

మణిపురం అనే నగరంలో ఒక రాజు ఉండేవాడు

 మణిపురం అనే నగరంలో ఒక రాజు ఉండేవాడు. అతని ధర్మపత్ని పతివ్రత. ప్రభుభక్తి పరాయణ. ఆమె ఒకసారి తన మెడలోని అత్యంత విలువైన అందాల హారాన్ని తీసి గట్టు మీద పెట్టి స్నానం చేయసాగింది. ఆకాశంలో తిరుగుతున్న ఒక గ్రద్ద యొక్క ద్రుష్టి ఆ ఆభరణం మీద పడింది. పడగానే హారాన్ని ఆ గ్రద్ద తన్నుకొని పోయింది. ఆది ఆకాశంలో ఒక పేద ముదుసలి గుడిసె మీదుగా వెళ్తూ ఆ గుడిసె కప్పు మీద చచ్చిన పాము నొకదానిని చూసింది. చూసినదే తడవుగా ఆ గ్రద్ద ఆ హారాన్ని అక్కడ విడిచి పామును నోట కరుచుకొని పోయింది.

          కొంతసేపటికి రాజాంతహపురము చేరిన రాజుగారికి రాణిహారం పోయిన విషయం తెలిసింది. రాణికి ఆ హారాన్ని ఎలాగైనా తిరిగి తెచ్చి ఇచ్చే ఏర్పాటు చేస్తానని రాజు నచ్చజెప్పాడు. వెంటనే కొలువు చేరి జరిగిన కథనంతా సభాసదులకు విన్నవించారు. రాణిగారి హారాన్ని తిరిగి తెచ్చి అప్పజెప్పినవారికి కోరిన బహుమానం ఇవ్వబడుతుందని నగరమంతా చాటింపు వేయించేడు. మరుసటి రోజు నే ఒక వ్రుద్దురాలు ఒక హారాన్ని తీసుకుని రాజాస్థానానికి వచ్చింది. ఆ హారాన్ని రాజుకు సమర్పించింది. రాజు మిక్కిలి సంతసించి ఆ అవ్వను "వరం కోరకో" అన్నాడు. అప్పుడు ఆమె మహారాజా! ఈ రోజు మొదలు ఎనిమిదవరోజు వరకూ ఈ నగరంలో ఎవరూ మహాలక్ష్మి పూజచేయరాదు. ఆ పూజను కేవలం నేనే జరిపిస్తాను. ఈ పూజకు కావలసిన తైలము, పూజాసామాగ్రి నా ఇంటికి పంపించండి అని కోరింద.

         రాజు ఆశ్చర్యచకితుడై ఆ అవ్వను ఇలా ప్రశ్నించాడు. ఈ బహుమానం వలన నీ కొరిగేదేమిటి? వ్రుద్దురాలు ఆ ప్రశ్నకు బదులుగా "రాజా! ఈరోజు న లక్ష్మీ పూజ, దీపావళి పండుగ చేసినట్లు అయితే మహాలక్ష్మి ప్రసన్నురాలవుతుంది. వారి ఇంట్లో లక్ష్మి స్థిరనివాసం ఏర్పరుచుకుంటుంది. రాజు మరింత సంతసించి నాకూ లక్ష్మీ పూజ చేయాలని ఉంది అన్నాడు. అంత అవ్వ మొదట నా పూజ జరగనీ తదుపరి నీ పూజ చేతువుగాని అంది. ఈ విధంగా వారిరువురి పూజతో లక్ష్మీదేవి ప్రసన్నురాలై వారి ఇంట లెక్కలేనంత ధనసమ్రుద్ధి ఏర్పడింది. లక్ష్మీనివాసంగా వారి ఇళ్ళు కళ కళ లాడాయి.

       కాబట్టి ధర్మరాజా! లక్ష్మీ ప్రసన్నం కోసం రాజప్రాసాదాల నుండి పూరిగుడిసెలవరకూ ఈ రోజుల్లో లక్ష్మీ పూజ జరుపబడుతూ వస్తోంది.

సుహేల్ దేవ్ పాసి అనే రాజు

 సుహేల్ దేవ్  పాసి అనే రాజు పేరు తెలుసా - 

బహుశా తెలియకపోవచ్చు...  కానీ  మీకు మొహమ్మద్ గజని పేరు తెలుసా , maximum అందరికీ తెలియవచ్చు... 


ఈ మొహమ్మద్ గజని సైన్యాన్ని ఓడించి అతడిని ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి రాకుండా 20 సంవత్సరాలు ఆపిన ఆ మహా వీరుడే సుహేల్ దేవ్ పాసి అనే రాజు, 

ఈ రోజున ఉత్తరప్రదేశ్ లో  దళితులు అని పిలవబడే పాసి కులానికి చెందిన రాజు. 


ఆనాటి కాశి లోని బ్రాహ్మణులచే ఇంద్రుడి అవతారం గా కొలవబడిన ధర్మాత్ముడు ఆయన, 

మరి మనం చదుకున్న మన దేశ చరిత్ర లో ఈయన లేకుండా కేవలం గజని నే ఎందుకున్నాడు, మనం చదివింది అసలు మన చరిత్రేనా.


గజని కి చెందిన 6  మంది సేనాధ్యక్షులని వారి సైన్యం తో సహా మట్టుబెట్టి గజని ని అవధ్ ప్రాంతాల్లోకి రాకుండా చేసిన మొదటి రాజు ఈ పాసి వీరుడు.


అలాంటి సుహేల్ దేవ్ పాసి ని గెలవడానికి గజని సైన్యం వాడిన ఆయుధం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు అది ఏమిటో తెలుసా...

                           "ఆవులు"

                    మీరు విన్నది నిజమే.

సుహాల్ దేవ్ పాసి కి గల గోభక్తి ని తెలుసుకున్న గజని తన సైన్యానికి ముందుగా ఆవులను అడ్డుగా పెట్టుకుని, తాము బాణాలు వేస్తె ఎక్కడ గోవులు చనిపోతాయేమో అని ఆగిన సుహాల్ దేవ్ పాసి ని దగ్గరగా వచ్చి దాడి చేసి జయించారు.


ఇంతటి గొప్ప వీరుడి చరిత్ర మనకు ఈరోజున ఇరాన్ వాళ్ళ చరిత్ర పుస్తకాలలో కనబడుతుంది. వారు ఒక గొప్ప వీరుడిగా గౌరవిస్తున్న ఈ పాసి వీరుడిని మన మాత్రం ఎప్పుడో మరచిపోయాము, 


ఇలాంటి వీరుడిని గౌరవించడానికి భారత్ దేశానికి 2018  లో తీరిక దొరికింది. 2018  లో మోడీ ప్రధానిమంత్రి అయ్యాక  సుహాల్ దేవ్ పాసి పేరుమీద స్టాంపు విడుదల చేసారు.   


 2017  లో యోగి ఆదిత్య నాథ్ RSS వాళ్ళు నిర్వహిస్తున్న రాజా సుహాల్ దేవ్ పాసి సూర్య మందిర్ ని ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుని ఆయనకు ఒక గొప్ప స్మారకం కట్టాలనే కోరికతో  50  కోట్లతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి  చేస్తున్నారు.  


మనకు, మన ముందు తరాలకు మన నిజమైన చరిత్ర ఎప్పుడు తెలుస్తుందో.

25 నుంచి కొవిడ్‌ టీకా

 *_💉25 నుంచి కొవిడ్‌ టీకా!_*


*_ప్రారంభించనున్న ప్రధాని మోదీ_*


*_జనవరి 15 నాటికి ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు!_*


*హైదరాబాద్‌: భారతీయులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. యూకేలో మంగళవారం మొదలైన టీకా పండుగ.. మనదేశంలోనూ డిసెంబరు 25న (ఆ రోజు వాజ్‌పేయి జయంతి) మొదలు కాబోతోంది!! ఆ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ టీకా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకూ తెలియజేసింది. తొలిదశ టీకా కార్యక్రమంలో భాగంగా.. కరోనాపై పోరులో ముందువరుసలో నిలిచిన వైద్యసిబ్బందికి జనవరి 15 నాటికల్లా వ్యాక్సిన్‌ అందించేందుకు అన్ని రాష్ట్రాలకూ టీకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఆ తర్వాత నుంచి సామాన్య ప్రజలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేనున్నారు. కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌ లైవ్‌ డెమాన్‌స్ట్రేషన్‌పై.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. కొవిడ్‌ టీకా కార్యక్రమ ఏర్పాట్లను వేగవంతం చేయాల్సిందిగా రాష్ట్రాల అధికారులకు ఈ భేటీలో సూచించింది. టీకాలు ఎలా అందించాలనే విషయాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించింది.*


*వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగ అనుమతులు కోరుతూ నాలుగు రోజుల వ్యవధిలో భారత్‌ బయోటెక్‌, ఫైజర్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు (డీసీజీఐ) దరఖాస్తులు సమర్పించిన సంగతి తెలిసిందే. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎ్‌ససీఓ) పరిధిలోని కొవిడ్‌-19 విషయ నిపుణుల కమిటీ ఈ మూడు విజ్ఞప్తులను బుధవారం పరిశీలించనుంది. ఈ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్నామని.. వీలైనంత త్వరలోనే ఆ మూడిటిపై లేదా వాటిలో ఏదో ఒకదానిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. తొలి దశ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు గుర్తించిన వైద్య సిబ్బంది వివరాలను కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌లోకి అప్‌లోడ్‌ చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. తొలి దశలో మూడు కోట్ల డోసుల టీకాను నిల్వచేసేందుకు ప్రస్తుతం ఉన్న శీతల గిడ్డంగులు సరిపోతాయని ఆయన స్పష్టం చేశారు.*

మార్గశిరము- మహిమాన్వితము

 మార్గశిరము- మహిమాన్వితము

**********************

చింతపట్ల.వెంకట రమణాచారి.

మౌనయోగి,

జర్నలిస్ట్,

హైదరాబాద్,9493331195

**************************


 కాలాన్ని కొలిచేందుకు మనం ఎన్నో రకాల కొలమానాల్ని వాడతాము. వీటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి.

 చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని చాంద్రమానంగా  లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు . ఆయా రాశులలో సూర్యుడు తిరిగే కాలమును సౌరమాసం అంటారు . ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు. అదేవిధముగా కర్కాటకరాశిలో సూర్యుడు తిరిగే కాలము కర్కాటకమాసము అంటారు .

ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం . కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు. మానవులకు ఒకసంవత్సరం దేవతలకు ఒకరోజు అంటారు . ఈలెక్కన ఉత్తరాయణం రాత్రి , దక్షిణాయనం పగలుగా భావించబడుతోంది . సూర్యుడు కర్కటకరాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు . అక్కడనుండి దక్షిణాయనం ప్రారంభం ప్రారంభమవుతుంది. అనగా, ఇది రాత్రి కాలం . మకరరాశిలో ప్రవేశించు సమయం మకరసంక్రమణం ఇక్కడినుండి ఉత్తరాయణం . అనగా, పగలుగా భావన . ఇలా భావిచినప్పుడు, దక్షిణాయనమునకు చివరిది, ఉత్తరాయణమునకు ముందుది ఐన ధనుర్మాసం ప్రాతఃకాలమువలె పవిత్రమైనది. కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈనెలలో ఆరాధిస్తారు . . . ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదే. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని 'పండుగ నెలపట్టడం' అనికూడా అంటారు. ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది.

 ధనుర్మాసంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామివారి దేవాలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు.

ధనుర్మాసంలో ఉదయ సాయంత్ర సంధ్య సమయాలలో ఇంటిని శుభ్రం చేసుకుని శుచియై దీపారాధన చేయడం వలన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని భావన.

 సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడమే ధనుర్మాసము. తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు అనగా భోగి పండుగ రోజు వరకు ధనుర్మాసం ఉంటుంది. ఈ మాసం విష్ణుఆలయాలలో తిరుప్పావై పఠనం గోదా కల్యాణాలు నిర్వహిస్తారు.

 శ్రీ వైష్ణవ సంప్రదాయస్తులు మార్గశిర పౌర్ణమి నుండి పాడ్యమి వరకు ధనుర్మాస వ్రతం స్వీకరిస్తారు.

 మార్గళి పేరుతో పిలువబడే ఈ ఉత్సవము నెలరోజులు కొనసాగుతోంది.

 ఈ నెల రోజులు బ్రహ్మ ముహూర్తం లో భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్యప్రబంధ తిరుప్పావై 30 పాశురాలను చదివి పూజలు చేస్తారు.

ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి చెప్పాడని పురాణంలో పేర్కొనబడింది.

నారాయణ సంహిత, బ్రహ్మాండపురాణం, ఆదిత్య పురాణాలలో,  భాగవతంలో కూడా వివరించబడింది


 ధనుర్మాసంలో శ్రీకృష్ణుని పూజలో ప్రతిరోజూ తులసి మాల వేసి పూజించడం వలన కన్యలకు కోరుకున్న వరుడు దొరికి వివాహం అవుతుంది.

 విష్ణుచిత్తుడు ఒక వైష్ణవ భక్తుడు తన మనసంతా శ్రీరంగనాథుని ఆరాధన కొరకు వినియోగించిన వాడు.  అతనికి తులసి మొక్కల లో దొరికిన అమ్మాయి గోదాదేవి.  తనకు సంతానం లేనందున తన కుమార్తెగా పెంచుకుంటాడు.తండ్రికి పూజలో సహకరిస్తూ తులసి మాలలు పుష్పాల మాలలు అల్లుతుంటుంది.

 గోదాదేవి కూడా రంగనాథుని ఆరాధిస్తూ పూజిస్తూ ప్రతిరోజు రోజుకు ఒకటి చొప్పున 30 పద్యాలను రచిస్తోంది. వాటిని పాశురాలు అంటారు. ముప్పై పాశురాల సంకలనమే తిరుప్పావై గా పేరుగాంచింది. మానవమాత్రులను కాదని రంగనాధునే పెళ్ళాడతనని భీష్మించుకు కూర్చుంటుంది. రంగనాధుని అనుగ్రహంతో తనలో లీనం చేసుకుంటాడు.


 ఈ రచన మీ పత్రిక జనవరి 2021 సంచిక కొరకు మాత్రమే రాసింది. అనుకూలతను బట్టి మీరు ఏదైనా మార్పులు చేసినచేసుకోవచ్చు.కాపీ కాదు అని హామీ ఇస్తున్నాను.

చింతపట్ల.వెంకట రమణాచారి.

మౌనయోగి,

జర్నలిస్ట్,

హైదరాబాద్,9493331195

నేటి సమాజం

 _*💫 నేటి సమాజం ♨️*_


_ఒక బ్యాంకులో దొంగతనం జరిగే సమయంలో దొంగలు తుపాకీలు చూపెట్టి అక్కడి వారిని బెదిరించారు._


_ఈ డబ్బు ప్రభుత్వానికి సంబంధించినది. కానీ మీ ప్రాణాలు మీకు సంబంధించినవి. ఎవరూ మాతో పోరాడకుండా అలాగే నేలపై పడుకోండి అని చెప్పారు.._


_మనసు మార్చే మాటలంటే  ఇవే..._


_"This is called Mind changing concept. Changing the conventional way of thinking"._


_దొంగలను పక్కదారి పట్టించాలని ఒక స్త్రీ అనాగరికంగా ప్రవర్తించడంతో... ఒక దొంగ మేము దొంగతనానికి వచ్చాము. ఇక్కడ అత్యాచారం చేయడానికి రాలేదు అని ఆమెను భయపెట్టాడు._


_దీన్నే చేసే పనిలో "నిమగ్నత" అవసరం అనేది._

 

_"Being a proffesional focus only on what you are trained"._


_దొంగతనం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక డబ్బును లెక్క పెడదాం అన్నాడు ఒక దొంగ. అందులో ఒకడు అంత డబ్బు ఇప్పుడు ఎక్కడ లెక్కపెడతాం... ఎంత డబ్బు పోయింది అన్నది రేపు ప్రభుత్వమే చెప్తుందిలే అని అన్నాడు._


_దీన్నే అంటారు చదువుకన్నా అనుభవం గొప్పది అని.._


_This is called "Experience" Now a days experience is more important than paper qualification !!_


_దొంగతనం జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పే ముందు బ్యాంకు అధికారి బ్యాంకులో దొంగతనం జరిగింది 20 కోట్లు, ఇంకో 30 కోట్లు మనం అందరం పంచుకుని 50 కోట్లు దొంగతనం జరిగిందని చెపుదాం అన్నాడు._


_దీన్నే ఆసందర్భాన్ని కూడా మనకు ఉపయోగరంగా మార్చుకోవడం అంటారు._ 


_"This is called Swim along with the tide connverting an unfavourable situation to yours"._


_ఇది విన్న ఒక అధికారి ప్రతి సంవత్సరం ఇలాంటి దొంగతనం జరిగితే బాగుంటుంది అని అన్నాడు._  


_ఇదే స్వార్థపూరిత లోకమంటే.._


_"This is called killing boredom world. Personal importance is more important than your job"._


_మరుసటి రోజు వార్తల్లో బ్యాంక్లో 100 కోట్లు దొంగతనం జరిగినట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే ఆయన భాగం 50 కోట్లు._ 


_ఆశ్చర్యపోయిన దొంగలు వెంటనే లెక్కపెట్టడం మొదలు పెట్టారు. ఎన్నిసార్లు లెక్కపెట్టిన 20 కి దాటట్లేదు.._


_దొంగల్లో ఒకడికి ఆవేశం కట్టలు తెంచుకుంది. మనం మన ప్రాణాలు పణంగా పెట్టి దొంగతనం చేస్తే వీళ్ళు దొరల్లా 80 కోట్లు దోచుకున్నారు  అని. చదువు అవసరం ఇప్పుడు తెలిసింది._


_True knowledge is now a days very important than money in this world._


_ఇప్పుడు మన సమాజంలో ఇలాంటి వారే అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు..!_


🙏🇮🇳😷🌳🏵️🤺🥀

జీవిత సత్యాలు

 🌷🌷🌷🌷


(సేకరణ)


_*💫 జీవిత సత్యాలు 🥀*_


_జననం ధర్మమని,  మరణం తప్పదని అందరికి తెలుసు 60 లేదా 70 కాకపోతే 80 సంవత్సరాలు.._


_👉 ఉత్త చేతులలో తల్లి గర్భంనుండి వచ్చాము, ఖాళీ చేతులలో భూగర్భంలోకి పోతాం....  తొలిస్నానం గుర్తులేదు,  చివరిస్నానం తెలియదు..._ 


_👉 నీ గురించి నీవు ఎక్కువ మాట్లాడుతున్నావ్ అంటే నీకు #నేను అన్నది పోలేదన్నమాట..._


_👉 జ్ఞానమున్న వారితో  వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానునితో వాదించకు నీ విజ్ఞతను కోల్పోతావు.._ 


_👉 ఈ ప్రపంచమంతా అవకాశవాదులతోనే నిండి ఉంది, ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది._


_👉 మనం ఎంత మంచిగా ఉన్న ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్లమే,  కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది.._


_👉 బయట గరికగడ్డి పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరగదు. అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివారు అభివృద్ధి చెందలేదు.._ 


_👉 ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచేలోపు,  అబద్దం అందంగా తయారై అందర్నీ తనవైపు ఆకర్షిస్తుంది.._ 


_👉 మీ దగ్గర డబ్బులేకుంటే మీ రక్తసంబంధంలోనే విలువుండదు అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది. ఒకప్పుడు గుణం చూసి దగ్గరయ్యేవారు,  ఇప్పుడు ధనం చూసి దగ్గరవుతున్నారు..._


_👉 ఎదుటి వ్యక్తి నీపై నేరుగా నెగ్గే దమ్ములేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు.._


_👉 నీ నొప్పి నువ్వు గ్రహిస్తే ప్రాణాలతో బతికి ఉన్నావని అర్ధం, ఇతరుల నొప్పిని కుడా నీవు గ్రహించగలిగితే మానవత్వం గల మనిషిగా బతికి ఉన్నావని అర్ధం.._


_ఇక_చివరిగా.._ 


_👉 మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునేవారి గురించి ఆలోచించకండి ఎందుకంటే..?  వారిస్థానం ఎప్పుడు మీ వెనుకే..!_


🌷🌷🌷🌷🌷🌷🌷

మనిషికి కోరికలు అనంతం

 🍃🌺మనిషికి కోరికలు అనంతం..జీవితం నీటి బుడగ వంటిదని తెలిసీ కలకాలం బతకాలనుకొంటాడు.. నిరంతరం సుఖాల్లో తేలియాడాలని  తపిస్తాడు..తేలికగా తన కోరికలు తీరే మార్గాలు అన్వేషిస్తాడు..భగవంతుడి దయ ఉంటే తన  కోరికలు తీరతాయన్న స్వార్థంతో పూజిస్తాడు..


భగవంతుడు దయామయుడు..అందరి ప్రార్థనలు వింటాడు.. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అనుగ్రహిస్తాడు.. 

నిస్వార్థంగా భగవంతుని నమ్ముకున్నవారికి అడగకపోయినా అనుగ్రహిస్తాడు..


‘భగవంతుడి శరణు వేడుతున్నవారు పరమేశ్వరుడి ప్రీతి కొరకు వేచి ఉండాలి..తమ ఇచ్ఛానుసారం ఈశ్వరుణ్ని జరిపించమని కోరడమంటే ఆయనను శాసించినట్లవుతుంది.. ఆయనను ఒప్పించడం ఎవరికీ సాధ్యం కాదు.. ఎవరికి ఎప్పుడు ఏది అనుగ్రహించాలో భగవంతుడికి తెలుసు’ అన్న రమణ మహర్షి బోధను అర్థం చేసుకున్నవారికి- భగవంతుణ్ని కోరికలు లేని శరణాగతి వేడుకోవాలని అవగతమవుతుంది..


తృప్తిని మించిన సంపద లేదు..అంతులేని కోరికలు కోరుకుంటూ తీరడం లేదని ఆవేదన చెందేవారికి  జీవితమంతా ముళ్లబాటే.. భగవంతుడు ప్రసాదించిన శక్తియుక్తులను వినియోగించుకుంటూ తృప్తితో జీవనం సాగించేవారికి ఆనందం వెన్నంటే ఉంటుంది..

        *శుభోదయం*

       🌳🌳🌳🌳🌳

సుభాషితమ్

 *"సుభాషితమ్"* 


శ్లో|| యత్ పృథివ్యాం వ్రీహి యవం హిరణ్యం పశవః స్త్రియఃl

నాలమేకస్య తత్సర్వం ఇతి పశ్యన్న ముహ్యతిll


తా|| "భూమి మీద ఉన్న ధాన్యం, అంతా బంగారం, పశువులు, స్త్రీసంపద అన్నీ కలిపినా ఒక్కడికి చాలవు. దీన్ని తెలిసిన మానవుడు మోహపడడు.

( *అందుచేత మానవుడికి ముందుగా కావలసినది తృప్తి అని భావం*).

💥🛕💫🌈🍃🌷🌻🌳🌺🌾

ముక్తి మరణాంతరం వచ్చేది కాదు

 ముక్తి మరణాంతరం వచ్చేది కాదు.

బ్రతికుండగానే సాధించాల్సిన స్థితి.

దీనిని తెలియజెప్పే కథనమే "గజేంద్ర మోక్షం".

పూర్వజన్మలవల్ల, కర్మలవల్ల ప్రోగుచేసుకున్నవాసనలవల్ల ఏర్పడిన బంధాలతో ఇంద్రియ భోగలాలసత్త్వములతో కూడిన 'అహం' (నేను అన్నదేహాత్మభావన) మొసలి.

కాగా దానిచే పట్టుబడ్డ మానవుడే గజేంద్రుడు.

జనన మరణ చక్రంలో అనేకసార్లు పడి పరిభ్రమిస్తున్నమానవుడు ముక్తి పొందాలంటే అందుకు తనశక్తి మాత్రమే చాలదు. పరమాత్మ అనుగ్రహశక్తి పరిపూర్ణంగా కావాలి.

ఆ అనుగ్రహంకై ఈ సంసార బంధాల నుండి, ఇంద్రియభోగలాలసల నుండి విముక్తి కల్గించమని ఆ పరమాత్మనే ప్రార్ధించాలి.

ఈ భవసాగరంలో పడిన నన్ను రక్షించమని పరితపిస్తూ రక్షించేంతవరకు వేడుకోవాలి.

పరమాత్మ పలికేంతవరకు ప్రార్ధన ఆపకూడదు - అచ్చంగా గజేంద్రుడి వలె!

తన పరివారంతో మోహంతో కూడి ఒక పెద్ద కొలనులో జలక్రీడలు సాగిస్తున్న గజేంద్రుడు, సంసార సాగరంలో ప్రాపంచిక పరివారంతో మనస్సుతో కూడి కదలాడుతున్న మానవునికి దర్పణం.

గజేంద్రుడు మకరేంద్రుడు బారిన పడిన రీతిలో భవసాగరంలో క్రీడిస్తున్న మానవుడు ఆంతర్యామినే మరచి 'అహం' అనెడి మకరం నోటిలో చిక్కుకొని దుఃఖితుడవుతున్నాడు. గజేంద్రుడు తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నం ప్రారంభించినట్లుగానే మానవుడు కూడా అహం అన్న భావం నుండి బయటపడడానికి సాధన అన్న ప్రయత్నం చేయాలి.

జలంనందు మొసలికి బలం ఎక్కువ.

ప్రాపంచిక సంసారంలో ఇంద్రియభోగలాలసత్త్వంను అలవర్చుకున్న 'అహం' కు కూడా పట్టు ఎక్కువే.

ఈ అహం నుండి విడివడాలంటే తన సాధనాబలంతో పాటు ఈశ్వర అనుగ్రహం కావాలని గజేంద్రునిలాగా గ్రహించి త్రికరణశుద్ధిగా ఆ అనంతుణ్ణి అర్ధించాలి.

గజేంద్ర మోక్ష ఘట్టంలో మొదట గజేంద్రుడు తన శత్రువైన మొసలిని తానుగా జయించడం కష్టమని తెలుసుకొని అందుకు పరమాత్మ మాత్రమే సహాయపడగలడని గ్రహించి పరమేశ్వరుని అనుగ్రహంకై ప్రార్ధించి, అటు పిమ్మట పలుకుటలేదని నిందాస్తుతి చేసి, అంతలోనే పరమభక్తితో వివేక విశ్వాసాలతో నీవు తప్ప ఎవరూ లేరని తనని తాను శరణాగతి చేసుకోగానే ఆ అనంతుడు సుదర్శనచక్రంను ప్రయోగించి మకరసంహారం చేసి దర్శనమిచ్చాడు.

ఆలానే మానవుడు కూడా తనకి తానుగా ఈ ప్రారబ్ధవాసనలను అద్దుకున్న 'అహం'భావనను జయించడం కష్టమని గ్రహించి పరమాత్ముని భక్తివిశ్వాసాలతో ప్రార్ధించి,

ఈ జన్మల పరంపరలో పడి అలసిపోతున్నాను,

ఈ భవసాగరంలో ఈదలేను, ఈ జనన మరణ చక్రభ్రమణం నుండి నను రక్షింపుము,

ఈ వాసనాబంధాలను తీసేయమని,

వీటి అన్నింటనందు విముక్తి కల్గించమని (సమస్త ప్రపంచ దృశ్య సంసార భావనా పరిత్యాగమే విముక్తి) వేడుకుంటూ, క్రమేణా కోరిక, కర్మ, అహం సమర్పణ చేస్తూ శరణాగతి స్థితికి వస్తే - అప్పుడు సుదర్శనచక్రమనేజ్ఞానముతో అజ్ఞానఅహంభావనను సంహరించిన పిదప ఆత్మసాక్షాత్కారం అవుతుంది.

జన్మ పరంపరలనుండి విముక్తి పొందడమే ముక్తి.

'తస్మాత్ భావా భావౌ పరిత్యజ పరమాత్మ ధ్యానేన ముక్తో భవతి' సమస్తమును త్యజించగా చివరకు ఆత్మ ఒక్కటే మిగిలివుంటుంది. అదియే ముక్తి. అదియే మోక్షం. ~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి...

బ్రహ్మ_సత్యం_జగత్_మిథ్య

 #బ్రహ్మ_సత్యం_జగత్_మిథ్య


మానవుడు ఒక ముత్యపు చిప్పను చూసి దానిలోని నైగనిద్యాదుల వలన రజతం అనుకొంటాడు. తరువాత దగ్గరకు సమీపించి చూడగా ఆ భ్రాంతి అతనికి తొలగిపోతుంది. అలాగే స్వప్నంలో అనేక యాత్రాదులు చేస్తూ పుణ్యక్షేత్రాలను దర్శించినట్లు అనిపిస్తుంది. మెలకువ రాగానే ఆ భ్రాంతి తొలగిపోతుంది. ఇలా ద్వైత భ్రాంతి అంత తొందరగా తొలగిపోదు. అది చాలా దీర్ఘమైనది.


మనం రాత్రి ఒక గదిలో పడుకుంటే ఆ రాత్రి కలలో విమానం ఎక్కి కాశీ వెళ్ళి, గంగాస్నానం, విశ్వేశ్వర దర్శనం ఆ తర్వాత రామేశ్వర యాత్ర, సముద్రస్నానం, రామనాథ దర్శనం వంటివన్నీ జరిగాయి. మెలకువ రానంతవరకు అది నిజంగా జరిగినట్లే 'సరే' అనిపిస్తూ ఉంటుంది. మెలకువ వచ్చాక అబ్బే అదేం జరగలేదు, 4,5 గంటల్లో ఇంత యాత్ర జరపడం సాధ్యమా? కాదు. ఇది అసత్యమే అని ఆ యాత్రా భ్రాంతి తొలగిపోతుంది. కలగంటున్నంత సేపూ నిజంగా కాశీలో ఉన్నట్లే, యాత్రా జరిగిపోయినట్లే అనిపించినా, మెలకువ వచ్చాక అదంతా మిధ్యయే అనే నిర్ణయం కలుగుతుంది.


అలాగే వ్యవహారంలో జగత్తులో సర్వమూ సత్యమే అనిపిస్తుంది. ఎందుకు? ద్వైత భ్రాంతి ఉండేవరకు. ఎపడైతే ద్వైత భ్రాంతి తొలగిపోతుందో అద్వైత సాక్షాత్కారం వెలువడుతుంది. “यत्रत्वस्य सर्वमात्मैवाभूत् तत् केन कं पश्येत् केन कं जिघ्रेत्, केन कं पश्येत् केन कं विजानीयात्" అని శ్రుతి వచనం. అద్వైత సాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుందో అపుడు ఇంకేమీ లేదు, అరే అపుడు చూడవలసిందేముంది? వినవలసిందేముంది? అనిపిస్తుంది.


आत्मानं चे द्विजानीया दहमस्मीति पूरुषः |

कि मिच्छन् कस्य कामाय शरीरमनुसंज्वरेत् ||


దీనికి మనం ఆశ్చర్యపడనవసరం లేదు. వ్యవహారంలో అలాగే అనుకోవడం భ్రాంతి పడడం జరుగుతుంది "यधास्वप्ने" అని. స్వప్నంలో ఆ భ్రాంతి ఉన్నంతసేపూ తదనుగుణమైన వ్యవహారమున్నట్లే, ఈ ద్వైతభ్రాంతి ఉన్నంత వరకూ "अनपेक्षया" జగత్ సత్యమనే వ్యవహారముండనే ఉంటుంది. అవిద్య, అజ్ఞానం నాశనమయేవరకు అలానే అనిపిస్తుంది. సూర్యోదయ అనంతరం అంధకారం నశించినట్లే ద్వైతభ్రాంతి తొలగి జ్ఞానోదయమవుతుంది. అయితే స్వాప్నిక భ్రాంతి మెలకువ వచ్చే వరకూ మాత్రమే. ఇది సుదీర్ఘం. అదే వ్యత్యాసం. కనుక ఆలోచించి, నిత్యానిత్య వివేకంతో "ब्रह्म सत्यं जगत् मिथ्या जीवः ब्रह्मैक ना परः" అని గ్రహించాలి.


--- జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థ మహస్వామివారు.


|| ॐ नमः पार्वती पतये हरहरमहदेव ||


#జగద్గురు_శ్రీశ్రీ_భారతీతీర్థ_మహస్వామివారి_అనుగ్రహ_భాషణములు


-----------------------------------------

*21-వేదములు

 *21-వేదములు📚((((((((((🕉))))))))))     ఆచార్య వాణి🧘‍♂️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*11. దశోపనిషత్తులు*

((((((((((🕉))))))))))


*కఠోపనిషత్తు :-*


*'కఠ ఉపనిషత్‌' 'కఠోపనిషత్‌' 'కఠకోపనిషత్‌' అనబడే ఉపనిషత్తు కృష్ణయజుర్వేదపు కఠకశాఖలోనిది. యమధర్మరాజుకీ నచికేతుడనే బ్రహ్మచారికీ మరణానంతరం ఆత్మ ఏమౌతుందన్న విషయమైన సంవాదమిది. ఒక కథ వలె ప్రారంభించినా ఒక మహాసత్యాన్ని ఆవిష్కరిస్తుంది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఈ ఉపనిషద్వాక్యాలనే మళ్లీ అంటాడు. ఉదా|| 'నజాయతేమ్రియతేవాకదాచిన్నాయంభూత్వా `ò భవితా వా న భూయః అజోనిత్యః శాశ్వతో`òయంపురాణో నహన్యతే హన్యమానే శరీరే'' (క 2-18) కంకి నుండి గింజలను వేరు చెయ్యాలి. కొబ్బరి ఆకుని తీసివేసి ఈనెను మాత్రం బయట పెట్టాలి.*



*దేహమనే బాహ్య పదార్థం నుండి ఆత్యను నిశ్చయంగా, దృఢంగా వేరు చేయాలి - ఆత్మ తనంతట తానే నిల్వాలి. కామం, కోపం, ద్వేషం, భయం - ఇవన్నీ మనస్సుకి సంబంధించినవే, ఆత్మకి కాదు. ఆకలి దప్పులు దేహానికి సంబంధించినవి. ఆత్మకి కాదు. ఆత్మేతరాలైన వాటిని గుర్తించటం అలవర్చుకోవాలి ఈ అభ్యాసం నిరంతరం కొనసాగిస్తే ''నేను'' అంటే దేహము, మనస్సేనన్న భావం సన్నగిల్లి, క్రమంగా పోతుంది. ఈ దేహాన్నీ మనస్సునీ కలుషితం చేసే అపవిత్రత బారి నుండి తప్పించుకొని నిర్మలమైన 'ఆత్మ' కాగలం. ఆత్మని చుట్టి ఉన్న తొడుగువంటిది ఈ శరీరమని భావించాలి. ఈ దేహం మనకొక అన్య పదార్థమన్నట్టు గుర్తెరిగి యుండాలి. ఈ ప్రపంచంలో ఉంటూ, ఈ శరీరంలోనే మనమున్నామనిపించినప్పుడు ''ఈ శరీరం నేను కాను, ఇది నాది కాదు'' అని అనుకోవటమలవర్చుకోవాలి. అప్పుడు, ముక్తి అన్నది మరణానంతరం సంభవించేదే అనుకోనక్కరలేదు.*



*మోక్ష మంటే మమత నుండి విముక్తే. జీవన్ముక్తుడు ఈ లోకంలోనే ఉంటూ శరీరధ్యాసలేక ఆత్మారాముడై తన ఆనందానికై బాహిర వస్తుజాలాన్ని ఆశ్రయించడు. వేదాలకీ వేదాంతానికీ గల పరమలక్ష్యం మనిషికి విముక్తి కలిగించటమే. భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఈ విషయాన్నే అంటాడు : ''ఈ దేహం నుండి ప్రాణము పోయే ముందే, ఈ లోకంలో నివసిస్తూనే, కామ క్రోధాలను నిగ్రహించి, యోగ స్థితిలో (అంటే, పరమాత్మతో ఏకత్వంతో) ఉండేవాడు ఆనందాన్ననుభవిస్తాడు''. అంటే, ఈ లోకంలో ఉంటూనే తన ఆత్మయొక్క నిజతత్త్వాన్ని ఎరిగి, ఆ అనుభవసిద్ధి కలిగి యుంటే దేహం నశించినా ఏమీ కాదు - ఆ దేహమే తాననిగాని, తనదనిగాని, అతడు జీవించి యున్నప్పుడు కూడ భావించక పోవటం వల్ల.*



*అంటే, మృత్యువు దేహాన్ని తన వశం చేసికొనక ముందే అతడు దేహాన్ని విడిచాడన్నమాట. ''దేహమ''న్న పదంలో మనస్సుకూడా ఉంది. అది మనది కానప్పుడు మృత్యువు కలిగితే మాత్రమేమిటి? దానికి మనపై ఏ విధమైన ప్రభావమూ ఉండదు. మృత్యువు నుండి విముక్తి చెందటం వల్ల అమరుడవుతాడు. ఈ స్థితిలో ఉండటాన్ని పురుషసూక్తంలోని మంత్రాలు వర్ణిస్తాయి. ఇవి కర్మకాండ భాగంలో ఉన్నాయి. ఈ విషయమే ఉపనిషత్తులలో పదే పదే ప్రస్తావింప బడింది. మనకి క్లేశాన్ని కలిగించేది శరీరమూ, తద్వారా మనస్సూ. క్లేశం లేకుండా ఉండటం, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమే - స్వర్గమన్నా, మోక్షమన్నా. ఇది అన్ని మతాలలోనూ ఉంది.*



*కాని అద్వైత సిద్ధాంతం తప్ప మిగిలిన అన్ని ధర్మాలూ ఆ చిదానంద స్థితిని అనుభవించాలంటే వేరే లోకానికి వెళ్లాలని అంటాయి. ఈ లోకంలో ఉంటూనే, దేహం పట్ల మమకారాన్ని పూర్తిగా విడచి, ఆత్మలో లీనమై యుండటం వల్ల పరలోకాల్లో లభించే ఆనందం కంటే అధికమైన ఆనందాన్ని పొందవచ్చని ఆదిశంకరులు నిరూపించారు.*


🕉🌞🌏🌙🌟🚩

జ్ఞానమంజరి

 *🧘23 -అద్వైత జ్ఞానమంజరి🧘‍♂

🕉🌞🌎🌙🌟🚩


అందరూ భగవంతుని అంశలే. మాయకు లోబడి, అజ్ఞానవసులై తన నిజస్వరూపాన్ని, ఆత్మశక్తిని మర్చిపోతున్నారు  మానవులు. అందుకే ఆత్మస్వరూపుడైన శ్రీకృష్ణుడు ముందుగా పార్థునికి జ్ఞానాన్ని ప్రసాదించి, అతనిని తనంతవానిగా చేసి, అఖండవిజయాన్ని చేకూర్చాడు. తనకి, సాధకునికి తేడా లేదని "ఏకత్వాన్ని" నిరూపించాడు. ఏకత్వమే యోగము. యోగేశ్వరుడే శ్రీకృష్ణుడు.



తనలో నెలకొన్న పరమాత్మను గ్రహించడానికి, ప్రతి వ్యక్తి తన జీవనయానంలో చేయవలసిన సాధనను “భగవద్గీత”గా బోధించాడు గీతాచార్యుడు. అందుకే భగవద్గీతను  "జీవనగీత" అని పేర్కొనడం జరిగింది.


                                    "జీవనగీత" (నిత్యజీవితంలో భగవద్గీత) - 1వ భాగము.


ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా నున్న నా కొడుకులూ, పాండురాజు కొడుకులు ఏమి చేస్తున్నారు? అని ధృతరాష్ట్రుడు, సంజయుడిని ప్రశ్నించేడు. పాండురాజుని కొడుకులు అని సంబోధించడంలోనే తన కొడుకులపై ధృతరాష్ట్రునికి వున్న మమకారం, ద్వందవైఖరి తేటతెల్లమైంది. పాండురాజు తన సోదరుడే కదా? తన సోదరుని కొడుకులు అనవచ్చు కదా! 



అందుకే ధృతరాష్ట్రుడిని ఒక గుడ్డివానిగా, అధర్మవర్తనులైన కొడుకుల పట్ల మమకారిగా, అజ్ఞానిగా చూపడం జరిగింది. మరి అటువంటి అజ్ఞానికి, శ్రీకృష్ణుడు తన విశ్వరూపం ఎందుకు చూపించాడు?



భవారణ్య ప్రవిష్టస్య ద్విజ్మోహ భ్రాంతచేతసః | యేన సందర్శితః పన్థా తస్మై శ్రీగురవే నమః ||



సంసారారణ్యమున ప్రవేశించి దిక్కు తెలియక భ్రాంతితో గూడియున్నట్టి జీవునకు ఎవడు మార్గమును చూపునో అట్టి గురువునకు నమస్కారము. 



అన్నీ వుండికూడా పుత్రులయెడ మమకారంతో ధర్మాన్ని విడచి, మంచిచెడులు విస్మరించి, అజ్ఞానిగా ప్రవర్తించాడు ధృతరాష్ట్రుడు. సత్యాన్ని గుర్తుచేయడం కోసం అతనికి తన విశ్వరూపం చూపించాడు. అఙ్ఞానిని, జ్ఞానిగా మార్చడానికి తనవంతు కృషిచేశాడు జగద్గురువైన శ్రీకృష్ణుడు. గురువు సహాయము చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. గుర్తించే అర్హత సాధకునికి వుండాలి. 



అక్కడ కురుక్షేత్రంలో మానవులందరి ప్రతినిధి (Representative)గా అర్జునుడు వ్యవహరించాడు. మార్గదర్శి(Guide)గా శ్రీకృష్ణుడు నిలబడ్డాడు. శ్రీకృష్ణుడు అర్జునునికి గీతను ఉపదేశించింది మందిరంలోనో, ఆశ్రమములోనో కాదు యుద్ధక్షేత్రంలో. అందునూ కురుక్షేత్ర సంగ్రామ సమయంలో, ఇరుపక్షాలు యుద్ధానికి సిద్ధంగా నున్నప్పుడు.



జీవితమే ఒక యుద్ధము. శరీరమే కురు క్షేత్రం. ఇంద్రియవాంఛలే శత్రువులు. వీటివలన నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న మొహాన్ని, భయాన్ని, అశక్తిని ఏకరవు పెట్టాడు పార్ధుడు. మానవుల విషాదాన్ని మొత్తం ప్రశ్నలతో సంధించాడు సవ్యసాచి. యుద్ధము చేయనని నీరసంతో కూర్చుండిపోయాడు.



అన్నింటినీ మౌనంగా విన్నాడు జగద్గురువు. కురుక్షేత్రమనే శరీరంలో అంతర్గతంగా వున్న శత్రువులను జయించలేక అసమర్థునిగా చతికిలబడటం చూసి, తనలో తాను నవ్వుకొని, మానవ శరీరాన్ని ధర్మక్షేత్రంగా ఎలా మలుచుకో వచ్చునో అర్జునునికి చెప్పదలిచాడు శ్రీకృష్ణుడు. 



పార్థునిలో నున్న సామర్ధ్యం కృష్ణునికి తెలుసు. ద్రోణాచార్య, కృపాచార్యుల నుండి అతడు ఏమి నేర్చుకున్నాడో గోపాలునికి తెలుసు. పార్థునికి వాళ్ళు కేవలం ప్రాపంచిక విద్యలను మాత్రమే నేర్పారు. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలాగ, ఏమి చెయ్యాలో బోధించారు. కానీ వారు "నేను చేయగలను" అనే మనోధైర్యాన్ని శిష్యునికి కలిగించలేదు. ఆ శక్తిని ప్రసాదించే సామర్ధ్యం ఒక్క సద్గురువుకి  ఉంటుంది. 



మానవులందరి ప్రతినిధియైన పార్ధునికి "మనోధైర్యాన్ని" కలిగించి, వాస్తవాన్ని తెలియజెప్పి, అంతిమ లక్ష్యాన్ని ఎలా సాధించాలో చెప్పాలని నడుంబిగించారు  జగద్గురువు.


🕉🌞🌎🌙🌟🚩

20-వేదములు

 *20-వేదములు📚((((((((((🕉))))))))))     ఆచార్య వాణి🧘‍♂️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*11. దశోపనిషత్తులు*

((((((((((🕉))))))))))


*ఆదిశంకరులు పది ఉపనిషత్తులనెన్ను కొని వాటిపై భాష్యం వ్రాశారు. వాటిని దశోపనిషత్తులంటారు.వాటిలోనున్న, అద్వైత సిద్ధాంతాన్ని ఆయన విశదీకరించారు. వారి తర్వాత వచ్చిన రామానుజాచార్యులు, మధ్వాచార్యులు కూడ ఈ పది ఉపనిషత్తుల మీదే భాష్యాలు వ్రాశారు. కాని వీరు తమ సిద్ధాంతాలైన విశిష్టాద్వైతమూ, ద్వైతమూ ననుసరించి భాష్యాలు వ్రాశారు. పది ఉపనిషత్తుల పేర్లనూ వివరిస్తుంది ఈ శ్లోకం - ''ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ'' ఆదిశంకరులు కూడ భాష్యాన్ని పై క్రమాన్ననుసరించే వ్రాశారు.*



*ఈశావాస్య ఉపనిషత్తు :- ఈశావాస్య ఉపనిషత్తు శుక్లయజుర్వేద సంహితాంతంలో ఉంటుంది. ''ఈశావాస్యం'' అన్న మాటతో ప్రారంభమవటం వల్ల ఆ ఉపనిషత్తుకి ఆ పేరు వచ్చింది. ఈశ్వరుడు జగత్తునంతా వ్యాపించియున్నాడనీ, మనం చేసే పన్నులనన్నిటినీ భగవంతునికే అర్పించి, పరమాత్మ తత్వాన్ని అనుభవసిద్ధం చేసుకోవాలనీ ఆరంభంలోనే చెప్తుంది ఈశావాస్య ఉపనిషత్తు.''ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాంజగత్‌|తేనత్యక్తేన భుంజీథా మాగృధః కస్య స్విద్దనమ్‌''!!*



*కేనోపనిషత్తు:- దీనినే తలవకార ఉపనిషత్తని కూడా అంటారు. సామవేదంలో జైమిని శాఖలో తలవకార బ్రాహ్మణ ముంటుంది కనుక. ''దొరకని దాని కోసం కేనలో అన్వేషించు'' అని ఒక నానుడి కూడా ఉంది. ఆద్యంతాలు లేని పరమాత్ముని కనుగొనటానికి గర్వోన్నతితో దేవతలు అన్ని చోట్లా వెతికారు.*



*అప్పుడు దివ్యురాలైన అంబిక దేవేంద్రునికి స్వయంగా అనుగ్రహించిన జ్ఞానమే ఈ ఉపనిషత్తులోని విషయం. పరాశక్తి అయిన అంబిక మన శక్తులన్నీ మహాశక్తి నుండి ఉదయించినవేనని చెప్తుంది. ఇతర భాష్యాలలో వలె ప్రతి పదార్థాన్ని యిచ్చి ఆపకుండా ఆదిశంకరులు ప్రతివాక్యానికీ వేరొక భాష్యం వ్రాశారు. ఈ ఉపనిషత్తుని దృష్టిలో ఉంచుకొనే లోకమాత నుద్దేశిస్తూ వారు వ్రాసిన భక్తిగీతం ''సౌందర్యలహరి''లో ఆది శంకరులిట్లా అన్నారు - ''వేద మాతశిరస్సుపై ఉంచిన పవిత్రమైన నీ పాదాలను నా శిరస్సుపైన కూడ ఉంచు తల్లీ''. వేదాంతం వలె ఉపనిషత్తులని కూడ వేద శిరస్సులనీ, శృతి శిరస్సనీ అంటారు. అంటే, వేదాలకు శిరస్సని (శృతులకు శిరస్సని) అర్థం. ఉపనిషత్తులే వేదాలకి చివరిభాగాలు, అవే అన్నిటి కన్నా ముఖ్యమైన భాగాలు కూడా (శిరస్సు వలెనే). లోకమాత పాదాలు వేదాల శిరస్సుపై ఉండటమంటే, ఉపనిషత్తులపై ఉండటమనమాట.*



*జ్ఞానరూపిణిగా లోకమాత కేనోపనిషత్తులోనే సాక్షాత్కరిస్తుంది. లలితా సహస్రనామంలో అంబకి ''సామగానప్రియ'' అన్న నామం కూడా ఉంది. ఆ లోకమాత ఘనతకు సామవేదంలోని ఈ ఉపనిషత్తు ఆవిష్కరిస్తుంది. ''మనకి ఒక పదార్థం కనబడింది'' అన్నప్పుడు ద్వైతభావం బయట పడుతుంది. అంటే చూడబడే పదార్థం (దృక్కు) చూచేది ద్రష్ట. దేహాన్ని వేరే పదార్థం వలె మనం చూడగలుగుతాం. ''నా ఒంట్లో బాగులేద''నో ''బాగుంద''నో అన్నప్పుడు కూడ దేహం ఒక పదార్థమే. అంటే ఈ దేహాన్ని పదార్థంగా చూచేది వేరే ఒకటి ఉన్నదన్న మాట. ఈ చూచేదే ఆత్మ. దీనిని అర్థం చేసుకోలేం, చూడలేం. ఆత్మ ఎప్పటికీ దృక్కుకాలేదు. ఎప్పుడూ ద్రష్టే. దేహాదులను విడచి ఈ ''నేను'' అన్నది తనంతట తానే సంస్థిత మవ గలదు. కాని దాని ఎరుక కలగట మసాధ్యం - ఎరుక కలిగి ఉండటమంటే అదొక పదార్థమవుతుంది కదా.*



*ఆత్మ విషయంలో ఇది అసంగతం. ఆత్మని తెలుసుకోవాలంటే, ఆ తెలుసుకొనే వాడు ఆత్మ కంటె భిన్నమవాలి. ఆత్మ కన్నా భిన్నమైనది మన మెరుగ దగినది ఏమైనా ఉందా? లేదు. అందువల్లనే ''ఆత్మని తెలుసుకోవటం'' ''ఆత్మజ్ఞానం'' వంటి మాటలలో ''తెలుసుకోవటం''మన్నది మనం నిత్యవ్యవహారంలో తెలుసుకొన్నట్టు - విషయమూ, గ్రహింపూ వంటి దేమీలేదు. ఆత్మానుభూతిని పొందటమే నిజమైన జ్ఞానం. అందువల్లనే కేనోపనిషత్తు ''నాకు ఆత్మజ్ఞానం కలిగింది. అనే వానికి ఆ జ్ఞానం లేదు. ఆ స్థితిలో ఉంది వేరే ఎరుకలేని వానికే అది ఉంటుంది. దానిని చూచేవాడు నిజంగా చూడలేడు, చూడలేనివాడు చూడగలడు'' అంటుంది.*


🕉🌞🌏🌙🌟🚩

అమ్మమ్మ వాళ్ళ ఇల్లు*

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹


🌷 *అమ్మమ్మ వాళ్ళ ఇల్లు* 🌷

         (జగదీశ్ కొచ్చెర్లకోట)

              🌷🌷🌷

“వెళ్ళగానే ఉత్తరం రాయి! మీ అమ్మగార్నడిగానని చెప్పు!" నడుస్తున్న రైల్తోపాటు పరిగెడుతూ నాన్నగారు చెప్పే మాటలు రైలువేగం పెరిగేకొద్దీ అలా అలా దూరమైపోయాయి.


ఏడాదికోసారి సెలవుల్లో పుట్టింటికి పిల్లల్నేసుకుని కోడిపెట్టలా బయల్దేరేది అమ్మ. అయిదుగురిలో నాలుగోవాణ్ణి. సాధారణంగా మెయిలో, ఈస్టో ఎక్కేవాళ్ళం. అక్కడంతా ఈస్ట్‌కోస్టుని ఈస్టంటార్లెండి.


కూర్చునేందుకు చోటు వెంటనే దొరక్కపోయినా తుని, అన్నవరం దాటేటప్పటికి కొంచెం ఖాళీ అయ్యేది. ఇక రాజమండ్రిలో చాలామంది దిగిపోయేవారు.


కూర్చున్న తరవాత కిటికీ దగ్గర కూర్చోడానికి పోటీ వుండేది. కళ్ళలో బొగ్గు నురుసులు పడి కళ్ళు ఎర్రగా అయిపోతాయని చెప్పినా వినేవాళ్ళం కాదు.


ఎక్కిన ప్రతిసారీ జామకాయలు కొనాల్సిందే! రైలు తూర్పుగోదావరిలో ప్రవేశించిందనడానికి ఈ జామకాయలే సాక్ష్యం. 


అప్పటిదాకా నిశ్శబ్దంగా వుండే రైల్లోకి కుంభమేళాల్లో నాగసాధువులా ఎలా, ఎక్కణ్ణించి ప్రవేశించేవాడో తెలీదు..పెద్దబుట్టనిండా బాగా దోరగాపండిన జామకాయలేసుకుని వచ్చేవాడు.


‘జాంకే...జాంకే...జాంకే!'అంటూ పొలికేకలు పెడుతోంటే మాగన్నుగా నిద్దర్లుపోతున్నవాళ్ళు కూడా ఉలిక్కిపడి లేచి కొనుక్కునేవారు. ఇక ఇతర చిరుతిళ్ళు ఎలాగూవుండేవి.


పదిన్నరా పదకొండింటికి గూడెంలో దిగేవాళ్లం. చిన్నొంతెన దిగిన వెంటనే రోడ్డు దాటితే అమ్మమ్మా వాళ్ళిల్లు. గుమ్మంలోనే ఎదురయ్యేది అమ్మమ్మ..


అమ్మను ఏ ఏభయ్యేళ్ల తరవాతో చూస్తున్నంత ఉద్విగ్నతతో చూస్తూ ‘వచ్చావా?' అనేది! ప్రతి వేసవిసెలవులకీ అదే పలకరింపు! 


తెల్లగా, బక్కపలచని శరీరం, 

నిగనిగలాడే నల్లని జుట్టు, 

పాపిట్లో కుంకం, 

నుదుట గుండ్రంగా బొట్టు.. అంత గుండ్రంగా ఎలావస్తుందో నా చిన్నిబుర్రకి అర్ధమయ్యేది కాదసలు! 

ఆపుకుంటున్న ఆనందం, 

ఆపుకోలేని చిరునవ్వు.... 


ఇదే కాన్ఫిగరేషన్ అమ్మమ్మది.


వచ్చిన పావుగంటకే అందరిళ్ళూ తిరిగెయ్యాలని వుండేది మాకు. ఇద్దరు మేనమామలు ఒకే ఇంట్లో వుండేవారు. ఎదురుగా మరో ఇంట్లో ఆయుర్వేదం మావయ్య వుండేవాడు.


అమ్మమ్మకి చుట్టాలంటే ఇష్టం. తాతగారికి చుట్టలంటే ప్రాణం. సొంతంగా పొగాకుతో చుట్టలు చేసుకుని కాలుస్తుండేవారు. ఏదో ముక్తసరిగా మాట్లాడేవారంతే! ఎక్కువగా పుస్తకాలు చదివేవారు. మొదటి రోజంతా మేం వచ్చామన్న వార్త ఊళ్ళో వున్న మిగిలిన బంధువులకి చేరెయ్యడంతోనే అయిపోయేది. 


ఒకనాడుదయం “మగపిల్లలంతా కాలవకెళుతున్నారు! నువ్వూవెళ్ళరా!" అంటూ బలవంతంగా లేపితే లేచాను. బారెడు పొద్దెక్కిందేమో అనుకున్నా! తీరా చూస్తే ఐదూనలభయ్యే!


పెద్దమావయ్య కొడుకులు నలుగురు, చిన్నమావయ్య కొడుకులు ఇద్దరు, ఆయుర్వేదం మావయ్య ముగ్గురు కొడుకుల్లో ఒకడు.... అందరూ తువ్వాళ్ళు కట్టుకుని చేతుల్లో సబ్బుపెట్టెల్తో నిలబడి ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ నవ్వుకుంటున్నారు. ఆ గదంతా లక్సు, మైసూర్ శాండల్ వాసన!


“వీడికీత రాదు! జాగర్తగా చూసుకోండి. గట్టుమీద కూర్చోబెట్టి రెండు చెంబుల నీళ్ళు పోసేసి చింతపల్లి వాళ్ళ అబ్బాయితో పంపించెయ్యండి. మీరంతా ఆ మూల్నించి ఈమూలదాకా ఈదుకొచ్చేవరకూ వీడుండడు!" ప్రోగ్రామ్ ఛార్టవుట్ చెయ్యడంలో అమ్మది ప్రత్యేకమైన స్కూలు.


“గట్టుమీద పోసుకునే దానికి కాలవకెందుకురా! పెరట్లో బోదుందిగా! ఆడాళ్ళతో కలిసి అక్కడ పోసుకో ఏం పోసుకుంటావో!" అని నాకేఁవీ అర్ధంకాని విధంగా జోకులేసేసి వెళిపోయారు. వాళ్ళలో ముగ్గురు గజీతగాళ్ళు. చిన్నొంతెన మీదకెక్కి అక్కణ్ణించి కాలవలోకి దూకేవారు. 


వాళ్ళ స్నానాలు అవ్వడమంటూ వుండదు. ఇంటినుంచి నాలాంటి అర్భకుడొకడు మళ్ళీ వెళ్ళి “ఇకచాలు రమ్మంటున్నారు తాతగారు!" అని కురుపు సలిపినట్టు సలుపుతోంటే ఓ గంటా గంటన్నరకి విసుక్కుంటూ బయటకొచ్చేవారు. అలాంటి పన్లకి నన్నే పంపిస్తూ వుండేవారు.


ఇద్దరు మావయ్యల ఇళ్ళ మధ్యలో ఖాళీ జాగా వుండేది. పిల్లలందరికీ అక్కడే వరసగా అన్నాలూ అవీ! కబుర్లతోనే సగం కడుపు నిండిపోయేది. 


తాతగారు పూజ చేసుకుంటోంటే పక్కనే కూర్చునేవాళ్ళం. అమ్మమ్మ చూసి మురిసిపోయేది. పిచ్చమ్మమ్మ! తనకేం తెలుసు మేం ఆయన నైవేద్యం పెట్టే తెల్లబెల్లం కోసం కూర్చున్నామని! మావూళ్ళో అదేంటో బెల్లం నల్లగా ఏడిసేది. ‘రుచి బానేవుంటుందిరా!' అనేవారు నాన్నగారు. అసలు చూట్టానికి బావుండాలిగా తినాలంటే!


కరెంటు పోతే ఆరుబయట మడతమంచాల మీద పెద్దవాళ్ళు పడుకునేవారు. పిల్లలంతా చప్టాలమీదా, చాపలమీదా చేరి పాటలు, మిమిక్రీలు, జోకులు...ఒకటేఁవిటి! 


రైలు దిగ్గానే నేను చేసే మొదటిపని రేడియోలో విజయవాడ వివిధభారతి పెట్టడం. మావూళ్ళో అవేం వచ్చేవికావు. ఎంత సంబరంగా వుండేదో అవన్నీ వింటోంటే! 


మావయ్యా వాళ్ళింట్లో అల్మారా తెరిస్తే ఓరకమైన వింత వాసన వచ్చేది. అందులో కాశ్మీర్ స్నో సీసాలు, క్యూటికురా పౌడర్ డబ్బాలు, రీటా నూనె సీసాలు, భావన అల్లం, భావన జీలకర్ర పొట్లాలు.... వెరసి ఓ మధురమైన పరిమళం. ఇప్పటికీ గుర్తే నాకు.


పెద్దమావయ్య ఓ విజ్ఞానఖని. తెగ చదువుతూ వుండేవాడు. మా బాబాయ్, అంటే పిన్నిభర్త ఎప్పడైనా మావయ్యకి పకోడీలో, పల్లీలో ఇచ్చినా  చేతికిచ్చేవాడు కాయితం తీసేసి.


‘చేతికి పొట్లం ఇస్తే అది చదువుతూ కూర్చుంటాడు తిండం మానేసి' అనేవాడు! ఏ విషయం మీదైనా మాటాడుతుండేవాడు మావయ్య. 


చిన్నమావయ్యకి సంగీతమన్నా, ఇతర కళలన్నా ప్రాణం. రాత్రి పదింటికి మా దగ్గర్నుంచి రేడియో లాక్కునేవాడు, సంగీత కార్యక్రమాలు వినాలని!


ఇక మా బాబాయ్! ఈయన నవ్వులబండి. ఎక్కడున్నా ఇట్టే తెలిసిపోతుంది. అందాకా స్తబ్దుగా వున్న వాతావరణం ఒక్కసారిగా ఓపదిమంది నవ్వులతో ఫెళ్ళుమని పేలేది. వెంటనే గుమ్మంలో సూట్ కేసుతో నల్లగా నిగనిగలాడే నవ్వులరేడు మా బాబాయ్ ప్రత్యక్షం!


రిక్షా దిగ్గానే, ఇంకా లోపలికి రాకుండానే వేసిన జోకుతో ఆ అలజడి మొదలయ్యేది. ఆయనుండే మూడురోజులూ మరి నవ్వులవానే! పడక్కుర్చీలో కూర్చుని ప్రపంచాన్నంతట్నీ చుట్టేసేవాడు.


అప్పుడప్పుడు పెద్దపండక్కి కూడా వెళ్లేవాళ్లం. వీధిపేరు సామవేదంవారి వీధి. బావుందికదా? చూడ్డానికి చిన్నొంతెనంతే ఉండేదిగానీ సందడికి మాత్రం పెద్దొంతెనంత!


మట్టిరోడ్డవ్వడం వల్ల అందరిళ్లముందూ ముదురాకుపచ్చని తడి. ఊరంతా తిరిగి ఎంతో ఓపిగ్గా తెచ్చుకున్న పేడతో కళ్లాపి చల్లేవారు. 


‘ఆ చివర బేమ్మర్లింటిముందు ముగ్గుజూసారా? చాలా బోందండే! అంతకంటే పెద్దదేద్దావఁనీ!’ అంటూ ఛాలెంజింగ్ టార్గెట్లు సెట్ చేసుకునేవారు. అయితే అదేమన్నా చిన్న వ్యవహారమా? నడువుఁలు పడిపోయేలా రెండేసిగంటలు వంగుని పెద్దపెద్ద ముగ్గులేసేస్తూ ఉండేవారు. 


డార్క్ బ్యాక్‌గ్రౌండ్ లో తెల్లగా మెరిసిపోతున్న శివుడి కళ్ల ముగ్గు, కొబ్బరిబోండాల ముగ్గు, రథం ముగ్గు చూసి తెగ ముచ్చటేసేసేది. స్వతహాగా చిన్నప్పట్నుంచీ ఆర్టిస్టునవ్వడం వల్ల ఇట్టాంటి ఆకర్షణలవీ ఎక్కువే!


ముగ్గు మధ్యలో మూడంటే మూడు గొబ్బెమ్మలు, ప్రతీ గొబ్బెమ్మ మీదా పల్లకీ ఎక్కినంత సంబరంతో ఎక్కి కూర్చుని గర్వంగా పలకరించే బంతిపూలూ ఓ ముచ్చట. నెలగంట మొదలైనప్పటినుంచీ ముక్కనుమదాకా వాళ్లకదే పని! 


ఊళ్లో కృష్ణచెరువని ఒకటుండేది. నిండుగా నీళ్లు, మధ్యలో వేణువు వాయిస్తున్న కృష్ణుడి విగ్రహం చూసి చాలా ముచ్చటేసేది నాకు. అది దాటిన తరవాత మా పెద్దమ్మా వాళ్లిల్లు. అక్కడికెళ్లిన ప్రతిసారీ ఆ చెరువుని చూడ్డం ఓ తీపిజ్ఞాపకం.


పండగ సినిమాలయితే విజయా టాకీసు, రేలంగి చిత్రమందిర్, రామతులసి థియేటర్లలో కొత్తవేసేవాడు. పిల్లలంతా కలిసి ఒకే సినిమాకి, ఒకే ఆటకెళ్లాలి. అట్నించి వచ్చాక మళ్ళీ ఆ సినిమాని రెండ్రోజులపాటు అదేపనిగా చెప్పుకుంటూ ఉండాలి. అదంతా ఓ ప్రోటోకాల్!


తోడికోడళ్ళు సినిమాలో కన్నాంబ పెద్దకోడలు. పండగలకి ఇంటికొచ్చిన పిల్లలందర్నీ తనచుట్టూ పడుకోబెట్టుకుంటూ ఉంటుంది. సావిత్రొచ్చి కోప్పడుతుంది.


‘అసలే జబ్బుమనిషివి. ఎందుకక్కయ్యా అలా పిల్లలందర్నీ పక్కన పడుకోబెట్టుకుంటావు? వాళ్లు నిన్ను పడుకోనిస్తారా?’ 


‘నే పడుకుంటానో పడుకోనో నీకెందుకు? పొద్దంతా కష్టపడి పన్జేస్తావు. నువ్వెళ్లి నిద్రపో. పిల్లలన్నాక ఓ దగ్గర పడుకోకబోతే ఎలా?’ అంటుంది బుంగమూతి పెట్టుకుని. ఎంత సహజమైన నిజమో కదా?


అచ్చం అలానే మొత్తం పిల్లలందరం కలిసి పదిహేనుకి పైనే తేలేవాళ్లం. అయినా అందరం ఒక దగ్గరే కింద బొంతలవీ వేసుకుని పడుకునేవాళ్లం. అర్ధరాత్రిదాకా కబుర్లూ, నవ్వులూ నడుస్తూ ఉండగా ఏ చిన్నమావయ్యో గట్టిగా ఓ కేక వెయ్యడంతో అవన్నీ ఆగిపోయేవి. ఆ తరవాత చెదురుమదురు సంఘటనలు మొదలయ్యేవి.


ఓ పదినిమిషాల పాటు లోగొంతుతో గుసగుసలు, దుప్పటి ముసుగుల్లో నవ్వలేక చావడాలు, ఓ... కదిలిపోవడాలు, దాంతో పక్కనున్న వదినో, బావో లేచి ఓ రెండు పీకడాలు అయ్యాక అప్పుడు వాతావరణం మొత్తం పూర్తి అదుపులోకి వచ్చేది. మళ్ళీ తెల్లారే ఏ భోగిమంటకో లేపితే లేవడమే! 


ఇన్ని సరదాలు, సందళ్ల మధ్య ఎప్పుడూ కనబడే పెద్ద లోటు... నాన్నగారు ఉండకపోవడం. ఆయన చాలాసార్లు వచ్చేవారే కాదు. 


పిల్లల్నేసుకుని కోడిపెట్టలా అమ్మే బయల్దేరేది. 


వేసవి సెలవులు, సంక్రాంతి సంబరాలు అయిపోవడమంటే ఆనందానికి ఆనకట్ట కట్టేసినట్టే! నూటికి నూరుపాళ్ళూ జుర్రేసుకునేవాళ్ళం ఆ కాలాన్నంతట్నీ!

🌷 *జగదీశ్ కొచ్చెర్లకోట*🌷

మౌనభక్తి

 *మౌనభక్తి.*


ఎనభయ్యయిదేళ్ల వయసులో..ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ..

ప్రతి శని వారం నాడు ఉదయానికల్లా మాలకొండ చేరి.. ఆ లక్ష్మీ నారసింహుడిని దర్శించుకొని..అదేరోజు సాయంత్రానికి మొగలిచెర్ల గ్రామంలో సిద్ధిపొందిన అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి వచ్చి.. పల్లకీ సేవ చూసుకొని, ఆరాత్రికి అక్కడే నిద్ర చేసి, తెల్లవారి ఆదివారం నాడు శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించి, సాయంత్రానికి తన ఊరు చేరతాడు సింగయ్య..


దాదాపు 45 సంవత్సరాల క్రిందట, శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, మాలకొండ లో తపస్సు చేసుకునే రోజుల్లో, దిగంబరిగా ఉన్న ఆ స్వామిని చూసాడు..ఆనాటి నుంచీ స్వామి వారి మీద గురి కుదిరింది..ఆయన సింగయ్యకు చెప్పింది కూడా ఏమీ లేదు..చెయ్యెత్తి ఆశీర్వదించడం తప్ప..


మౌనమే ప్రశ్న..మౌనమే సమాధానం!!


ఆ తరువాతి కాలంలో సింగయ్య మాలకొండ వెళ్లినప్పుడల్లా శ్రీ స్వామివారిని దర్శించుకోవడం ఒక అలవాటుగా మార్చుకున్నాడు..స్వామివారి దర్శనం ప్రతిసారీ దొరికేది కాదు..ఇద్దరిమధ్యా మౌనమే తప్ప మాటలు లేవు..శ్రీ స్వామివారు సింగయ్యను చూసినప్పుడు పలకరింపుగా నవ్వేవారు..అంతే..అదే మహాభాగ్యం గా తోచేది సింగయ్యకు..


ప్రకాశం జిల్లా, కందుకూరు మండలం మోపాడు గ్రామ నివాసి ఈ తన్నీరు సింగయ్య..భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు..


తన మాటల్లోనే చెప్పాలంటే, "అంతా స్వామి దయవల్ల  లక్షణంగా ఉన్నారు..స్వామివారిని చూసినప్పటి నుంచీ ఆయన్నే నమ్ముకున్నానయ్యా..ఎన్నో సార్లు ఆ మహానుభావుడిని చూసా..ఏనాడూ నాతో ఒక్క మాట మాట్లాడలేదు..కానీ నన్ను చూసి నవ్వేవాడు..ఆ స్వామి నన్ను చల్లంగా చూడబట్టే నాకు ఈరోజు ఏ బాదరబందీలూ లేవు..ఏదో ఆ పిలుపొచ్చేదాకా స్వామి దగ్గరికి వస్తావుంటా.."


అందరినీ చిరునవ్వుతో పలకరించుకుంటూ దేవాలయపు ఆవరణంతా తిరుగుతూ ఉంటాడు..మా అర్చక స్వాములూ ఆయనతో కలివిడిగా ఉంటారు..ఆదివారం మధ్యాహ్నం స్వామి వారి హారతి ముందుగా నా దగ్గరకు వచ్చి, నా చేతిలో ఓ అరటి పండు పెట్టి, నవ్వి వెళ్ళిపోతాడు...కొన్నేళ్లుగా మా ఇద్దరి మధ్యా జరుగుతున్న తప్పనిసరి కార్యక్రమం..


తనకు స్వామి అనుగ్రహం ఉందని గట్టిగా నమ్మినప్పుడు..కాదనడానికి మనమెవరం?


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం... మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం...ప్రకాశం జిల్లా.. పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).