రోగనిరోధకతకు విటమిన్ మాత్రలు ఎంతవరకు ఉపయోగం.అనేది ప్రస్తుత సమస్య. ఇప్పుడు కరోనామహమ్మారి నుండి ఎదుర్కొనే క్రమంలో డాక్టర్లు రోగనిరోధక శక్తిని పెంచుకొనే విషయంలో రోజు విటమిన్ మాత్తర్లు వాడమని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో అందరికి అవహగాహన కొరకు విటమనుల గూర్చి ప్రస్తావిస్తున్నాను. డాక్టర్లు ముఖ్యంగా vit-D, Vit-Bcomplex, Vit-C లను వాడటానికి సూచిస్తున్న విషయం మనందరికి తెలిసేందే. ఇప్పుడు విటమనుల గూర్చి తెలుసుకుందాం.
ముఖ్యంగా విటమినులు అనేవి మన ఆహారంలో లభ్యమైయే పోషకాలు. నిజానికి మనం పౌష్ఠిక ఆహరం తీసుకుంటే ప్రత్యేకించి విటమినులు విడిగా తీసుకోవలసిన అవసరం లేదు. కానీ ప్రస్తుత మన ఆహారంలో కావలసినంతగా విటమినులు దొరకనందువల్ల మనం విటమిను మాత్రలు తీసుకోవలసిన పరిస్థితి.
విటమినుల వాటి solubility ఆధారంగా రెండు రకాలుగా విభజించారు. అవి 1) నీటిలో కరిగేవి 2) నూనెలలో కరిగేవి. మొదటి కోవకు చెందినవి Vit-Bcomplex, Vit-C. ఇందులో Vit-Bcomplex అనునది ఒక విటిమను కాదు ఇది బి విటమినుల సమూహం. కొన్ని బి విటమినులు ఒకదానికి ఒకటి వేరు చేయటం కుదరదు అందుకే అన్ని విటమినులు కలిపి Vit-Bcomplex గా పిలుస్తారు. ఇది సాధారణ బలహీనతలను పోగొడుతుంది. మనం తేనే అన్నంలో, ఆకు కూరల్లో ఈ విటమిన్ పుష్కలంగా వున్నది కానీ ప్రస్తుత పరిస్థితులలో మనం దీనిని వలసినంతగా పొందలేక పోతున్నాము. కారణం ఏమంటే బియ్యం తెల్లగా వుండాలని బియ్యాన్ని ఎక్కువ పట్టు పట్టిస్తాము. కాబట్టి బియ్యపు ఫై పొరలో వున్న ఈ విటమిన్ తౌడులో పోతుంది. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే మనం బియ్యాన్ని రెండు, మూడు సార్లు కడిగి అన్నం వండుకుంటాము కాబట్టి ఆ వున్నా కొంచం కూడా బియ్యం కడుగు నీళ్ళల్లో కరిగి పోతున్నది. కాబట్టి మనం వలసినంత విటమిన్ పొందలేక పోతున్నాము. మనం కొన్న బియ్యం పురుగు పట్టకూడదని మిల్లు వాళ్ళు బియ్యానికి కొన్ని రసాయనిక పదార్ధాలు కలుపుతారు. కాబట్టి మనం బియ్యం కడగక తప్పదు. ఇక పొతే ఆకు కూరల విషయానికి వస్తే ఆకుకూరలు మంచిగా వృద్ధి చెందాలని రైతు రసాయనిక ఎరువులు, కూర చీడ పట్టకుండా రసాయనిక విష పదార్ధాలు చిమ్ముతున్నారు. ఏతావాత తెలిసేది ఏమంటే మనం ఆకుకూరలను శుభ్రంగా కడగక పోతే మనం రసాయనాలను భుజించాలి. తత్ కారణంగా అనారోగ్యం కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఒక పని మనం చేసి కొంత వరకు పోషకాలను కాపాడుకో వచ్చు. అది కూర పూర్తిగా కడిగి తరువాత తరగటం.
ఇక Vit-C ఇది పుల్లని రుచి కలిగిన పదార్ధాలలో అంటే నిమ్మ, ఉసిరి, మొదలగు వాటిలో ఉంటుంది. నిజానికి మన ఆయుర్వేదం ఉసిరి తింటే మంచి రోగనిరోధక శక్తి వస్తుందని చెపుతుంది. ఇప్పుడు మనం ఆయుర్వేద చ్యవనప్రాస తింటే మంచిది.
రోజుకి ఒక Vit-Bcomplex మాత్ర, ఒక Vit-C మాత్ర తీసుకుంటే మన శరీర రోగనిరోధకత పెరిగి రోగాలని తట్టుకొనే శక్తి కలుగు తుంది. ఈ మాతర్లు పొరపాటున ఎక్కువ తీసుకున్న పెద్దగా ప్రమాదం జరగదు. ఎందుకంటె మనకు కావలసిన దానికన్నా ఎక్కువ వున్న విటమినులు మూత్రంలో కరిగి పోతాయ్.
డాక్టర్ల సలహా లేకుండా vit-D మాతర్లు మనం ఇష్టమొచ్చినట్లు తీసుకోకూడదు. ఈ విటమిన్ నూనెలో కరిగే విటమిన్ కాబట్టి మనం మన శరీరానికి కావలసిన దానికన్నా ఎక్కువ తీసుకుంటే ప్రమాదము. ఇప్పటి పరిస్థితుల్లో ఈ విటమిన్ ఊపిరితిత్తులకు ఆరోగ్యం చేకూరుస్తుందని డాక్టర్లు చెపుతున్నారు. కాబట్టి తగు మోతాదుల్లో మాత్రమే ఈ విటమిన్ తీసుకోవాలి. ఈ విట్మన్ తెబ్లేట్ Vit-A విటమిన్ తో కలసి దొరుకుతాయి. ఈ రెండు విటమినులుకూడా నూనెలలో కరిగేవే. నిజానికి మనం తీసుకునే డి విటమిన్ మాతర్లు ప్రొవిటమిన్ డి కలిగి ఉంటాయి అంటే విటమిన్ డి ని తయారుచేసే పదార్ధం అంటే మన శరీరంలో వున్న ప్రొవిటమిన్ డి మనం సూర్య కాంతిలో వున్నప్పుడు సూర్య కాంతితో విటమిన్ D గా మార్పు చెందుతుంది. కాబట్టి మనకు డాక్టర్లు ప్రతి రోజు కొంత టైం ఎండలో ఉండమని చెప్పుతున్నారు.
రోజుకు ఒక Vit-Bcomplex మాత్ర, ఒక Vit-C మాత్ర తీసుకుందాం, ప్రాతఃకాలంలో ఎండలో ఉందాం ఆరోగ్యంగా ఉందాం.
ఇక్కడ పేర్కొన్న విషయాలు కేవలం సమాచారం కొరకు మాత్రమే. డాక్టర్ల సిఫారుసులేకుండా మందులు వాడటం క్షేమం కాదు.
సర్వ్ జనా సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతిః
రోజుకు ఒక Vit-Bcomplex మాత్ర, ఒక Vit-C మాత్ర తీసుకుందాం, ప్రాతఃకాలంలో ఎండలో ఉందాం ఆరోగ్యంగా ఉందాం.
ఇక్కడ పేర్కొన్న విషయాలు కేవలం సమాచారం కొరకు మాత్రమే. డాక్టర్ల సిఫారుసులేకుండా మందులు వాడటం క్షేమం కాదు.
సర్వ్ జనా సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతిః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి