11, జూన్ 2020, గురువారం

మాస్కులు మనలని ఎంతవరకు కాపాడుతాయి


ఇప్పుడు ప్రజలల్లో ముకానికి ఒక మాస్క్ కట్టుకుంటే ఇక మనం సురక్షితం కరోనా మన దారికి రాదు అనే ఒక భావనలో వున్నారు వారికి మస్కుల పనితీరు గూర్చి తెలియ చేయటానికి ఇది వ్రాస్తున్నాను. 
ముందు కరోనా అంటే ఏమిటో సూక్ష్మంగా వివరిస్తా: ఇది ఒక వైరస్ అని మనకి మర్చినెల  నుంచి తెలుసు.  ఈ వైరస్ సూక్ష్మ పరిమాణంలో ఉంటుంది, అంటే మన కంటికి కనపడనంత చిన్నది.  బ్యాక్టీరియాలు కూడా మన కంటికి కనపడవు.  కానీ ఈ వైరస్ ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. మాములుగా మన రక్త పరీక్షా చేసే మైక్రోస్కోపులో కూడా ఇది కనపడదు అంటే అర్ధం చేసుకోండి ఇది యెంత పరిమాణంలో ఉంటుందో.  అతి సూక్షమమైనది కాబట్టి దీనిని నివారించటానికి అది దురలేని సూక్ష్మ మైన మాస్క్ ధరించాల్సి ఉంటుంది.  కానీ అది సాధ్యమా అంటే మనకు సాధ్యం కాదని చెప్పాలి. 
మనం ప్రస్తుతం మెడికల్ షాపులో దొరికే మాస్కులు కానీ బట్టతో కుట్టిన మాస్కులు కానీ ధరిస్తున్నాం. మెడికల్ షాపులోని మాస్కుని సర్జికల్ మాస్కు అంటారు.  ఇది ఒక సారి వాడి పారేయాలి.  కానీ కొంతమంది మరల మరలా వాడుతున్నారు.  ఇది మంచిది కాదు.  దీనివల్ల మనం రక్షించబటం అటుంచి వైరస్ భారిన పడటానికి ఎక్కువ దోహదం చేస్తుంది.  0.06 microns-0.14 microns మైక్రాన్ల ఉంటుంది. (ఒక మిల్లి మీటరు 1000 మిక్రోనులు అంటే ఒక మిక్రోన్లో 6/100 - 14/100 సైజులో ఈ వైరస్ ఉంటుంది.  దానిని కేవలం ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపులో మాత్రమే చూడగలం.    కానీ ఈ సర్జికల్ మాస్కు అంత సూక్ష్మమైన దానిని నివారించ లేదు. సర్జికల్ మాస్కు ఈ వైరస్ నివారణకు పూర్తిగా సహకరిస్తుందన్న విషయం WHO నిర్ధారణ చేయలేదు. ఈ మాస్కులు వాడితే వెంటనే వాటిని పారవేయండి. 
ఇక మనం వాడే బట్ట మాస్కులు; ఈ బట్ట మాస్కులు కూడా పూర్తిగా వైరస్ ని నివారించలేవు. మనం ఒక చిన్న ఉదాహరణతో ఈ విషయాన్నీ తెలుసుకుందాం. బాగా మలింగంగా వున్న నీటిని తీసుకొని ఈ బట్ట మాస్కుతో వాడకట్టండి తరువాత చుడండి వడపోసిన నీరు పూర్తిగా పారదర్శకంగా ఉన్నాయా లేదా. తప్పకుండ పారదర్శకంగా వుండవు.  ఆ నీటి పక్కన RO నీటిని పెట్టి చూడండి మీకు తేడా తెలుస్తుంది. మనకు లభించే నీరు బోరు నీరు కానీయండి పంపు నీరు కానీయండి అవి పూర్తిగా స్వచ్చమైనవి కావు అందుకే మనం RO తో యాంత్రికంగా వడపోసిన నీటిని సేవిస్తున్నాము. నీటిలోని కలుషితాలను  రెండు రకాలుగా పేర్కొన వచ్చు 1) నీటిలో తేలి ఉండి నీటిలో కరుగకుండా వుండే కలుషితాలు (suspensors) ఇవి చెత్త చెదారం, మట్టిరేణువులు మొదలైనవి. నీటిని కొంతకాలం అంటే కొన్ని రోజులు కదలకుండా వుంచుతే ఈ పదార్ధాలు వాటంతట ఏవ్ కిందికి చేరుకుంటాయి.  ఇవి వైరస్ ల కన్నావాటికన్నా పెద్దవైన బ్యాక్టీరియాలకన్నా పెద్దవి.  కానీ వీటినికూడా మనం వాడే బట్ట మాస్కు నివారించలేదు.  దీని బట్టి బట్ట మాస్కు పనితనం ఎంతవరకు అన్నది మనం ఆలోచించాలి.   2) నీటిలో కరిగివున్న లవణాలు వీటి గూర్చి ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి వివరించటంలేదు. బట్టతో చేసిన మాస్కులు వాడితే మీరు ఇంట్లోకి వచ్చిన వెంటనే వాటిని సబ్బుతో ఉతకండి. తరువాత మాత్రమే వాటిని ధరించండి. ఎట్టి పరిస్థితిలోను మాస్కుని మీరు బైటి వైపు తాకవద్దు. 
మరి మాస్కులు వాడటం ఎందుకు. నిజానికి సూక్షమంగా పరిశీలిస్తే మనం వాడే మాస్కులు 100 శాతం క్షేమకరం కాదు. కానీ ఎదుటువాడు తుమ్మినా, దగ్గినా అతని నోటి నుంచి, ముక్కు నుంచి వచ్చే droplets తుప్పర్లు మన మీద పడకుండా కొంత వరకు సాయ పడతాయి.  కాబట్టి మూతికి మాస్క్ వేసుకున్నానని రోడ్ల మీద విచ్చల విడిగా తిరగవద్దు. మీ మస్కులో కూడా risk వుంది ఇది తెలుసుకోండి. మీరు 

కామెంట్‌లు లేవు: