8, జూన్ 2020, సోమవారం

అంతిమ లక్ష్యం

ఈ భూమిమీద పుట్టిన ప్రతి జీవి యొక్క అంతిమ లక్ష్యం మోక్షం మాత్రమే.  కానీ మనుషులు కానీ ఇతర జీవులు మోక్షము పొందటం అనేది చాల కష్ట సాధ్యం ఎందుకంటె వాటికి మనిషికి వున్న బుద్ది జ్ఞ్యానం ఉండవు కాబట్టి.  అందువలన మనకు లభించిన ఈ మానవ జన్మను సార్ధకం చేసుకోటం ప్రతి మనిషి కర్తవ్యం.  మోక్షం పొందటం కేవలం జ్ఞ్యానం వల్ల మాత్రమే సాధ్యం.  అంటే మోక్షం జ్ఞ్యాన రూపంలో వుంది.  కాబట్టి మనం ఆ బ్రహ్మ జ్ఞ్యనం పొందాలి.  ఈ జ్ఞ్యనం పొందటానికి మనకు బ్రహ్మ జ్ఞ్యానం కలిగిన గురువు దొరకాలి.  ఇలా బ్రహ్మ జ్ఞ్యానం పొందిన గురువు మాత్రమే మనకు ఈ జ్ఞ్యానాన్ని బోధించ గలడు. 
కొంతమంది గురువే తన వద్దకు వచ్చి జ్ఞ్యానాని బోధిస్తారనే భ్రాంతిలో వున్నారు.  కానీ దీనిని నేను సమర్ధించను.  ఎందుకంటె జ్ఞ్యాన సముపార్జన చేయటం మన విధి.  మన ప్రయత్నం లేనిది ఏది ఈ సృష్టిలోదొరకదు జ్ఞ్యానం పొందటానికి ముందు మన మనస్సుని శుద్ధి చేసుకోవాలి దానిని అంతఃకరణ శుద్ధి అంటారు ఇది ఆరాధన వలన సాధ్యం అవుతుంది.  మనస్సు అనేది కల్లుతాగిన కోతి లాంటిది దానిని అదుపు చేయటం మహా యోగులకే ఎంతో కష్టమైతే మరి సమాన్యులకు ఎలా సరళం అవుతుంది. కాబట్టి కొంత కాలం మనం ఆరాధన వలన అంతఃకరణ శుద్ధిని ఏర్పరచుకుంటే అప్పుడు మనం మోక్ష మార్గాన్ని అనుసరించటానికి అర్హత పొందుతాము. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఆరాధనతో ఎట్టి పరిస్థితిలో మోక్షం పొందలేము.   ఆరాధన ఈ క్రింది విధంగా ఉంటుంది. 
1) విగ్రహారాధన దీనినే మూర్తి పూజ అంటే ఒక విగ్రహాన్ని మనస్సులో భగవంతునిగా తలచి ఆ దేముడిని ఆ విగ్రహంలో చూసుకొని షోడశోపచార పూజ చేయటం.  అంటే మన ఇంటికి వచ్చిన అతిధిని ఎలా సత్కరిస్తామో ఆలా ఆ దేముడిని అతిధిగా భావించి ఆర్గ పద్యాలనూ ఇచ్చి పూజించటం.  ఒక్క విషయం ఈ ఆరాధన మన అంతఃకరణ శుద్ధి కోసం మాత్రమే కానీ అది మన అంతిమ లక్ష్యం కాదు.  
పూజించేటప్పుడు కళ్ళు పూలతో అలంకరించిన విగ్రహాన్ని చూస్తున్నాయి, చెవులు నామాన్ని వింటున్నాయి, నోరు నామ స్మరణ చేస్తున్నది, చేతులు పూలు, అక్షింతలతో విగ్రహాన్ని అర్చిస్తున్నాయి కాబట్టి పంచేంద్రియాలు పూర్తిగా పనిలో వున్నాయ్ కాబట్టి మనస్సు దేముడి మీద లగ్నాత చెందటానికి అవకాశం ఉంటుంది.  మనం చూస్తున్నాం.  ఒకవైపు ఎంతో ఖర్చు పెట్టి చక్కగా అలంకరించిన మండపంలో సత్యనారాయణ స్వామిని ప్రతిష్టించి అనేక విధాల పుష్పాలు, ఫలాలు తెచ్చి స్వామి ఆరాధన ఎంతో ఘనంగా చేస్తూవుండటం.  కానీ పూజ చేసే అంతసేపు సెల్ ఫోను పట్టుకొని మాట్లాడటం, వచ్చిన అతిధులను పలకరించడం చేస్తే మీరు చేసే పూజలో మనస్సు లగ్నాత చెందాడు కాబట్టి మీరు చేసిన ఆరాధన ఫలవంతం కాదు.  
ఇతర మనుషులను పూజించటం, సమాధులను పూజించటం మన ధర్మంలో కానీ వేదాలలో కానీ చెప్పలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలోను ఈ పనులు చేయకూడదు,  ఈ పనుల వల్ల అంతఃకరణ శుద్ధి పొందకపోగా మన విలువైన జీవిత కాలాన్ని కోల్పోతాం.  గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు ఎవరెవరు ఏ ఏ రూపాలలో నన్ను పూజిస్తారో వారికి ఆ ఆ రూపాలలో వారిని అనుగ్రహిస్తాను అని.  మీకు కావలసింది కేవలం ఐహిక వాంచితాలే ఐతే ఏమైనా చేయవచ్చు.  కానీ మోక్ష కాములు మాత్రం చేయకూడదు. .  ఈ చరా చెర సృష్టికి కేవలం భగవంతుడు మాత్రమే దేముడు.  అతడు ఒక్కడే ఒక్కడు ఇంకొకడు లేడు.  ఇక ఆరాధన క్రమంలో రెండవ విధానము చూద్దాము. 

2) యజ్ఞ యాగాది క్రతువులు: ఈ కోవకు చెందిన ఆరాధన మన ఇష్టకామ్యాలను సిద్దించుకోటం ఉపయోగ పడుతుంది.  కానీ ఇది అంతిమ లక్ష్యం కాదు. 

3) జపం: ఇది కేవలం ఒక మంత్రాన్ని జపించటం.  ఇక్కడ మనకు మూర్తి(విగ్రహం) లేదు, అలంకరణ లేదు. మంత్రాలు లేవు, అర్చన లేదు.  అంటే కేవలం చేతిలో జప మాల నడుస్తున్నది, మనస్సులో మంత్ర జపం జరుగుతున్నది.  ఈ పద్దతిలో మొదటి పధ్ధతి కన్నా అంతఃకరణ శుద్ధి పొందటానికి ఎక్కువ వీలు కలుగుతుంది. జపం వల్ల కూడా కొన్ని శక్తులు వస్తాయి కానీ అవి చాల తేలిక పాటివి.  

4) తపం :  దీనినే తప్పస్సు అని మనం విన్నాము.  ఈ ఆధునిక ప్రపంచంలో meditation అని అంటున్నాము.  కాక పోతే ఇప్పుడు మెడిటేషన్ వల్ల మన మానసిక వత్తిడి తగ్గి B.P. Sugar లాంటివి నిదానిస్తాయని వైదులు చెపుతున్నారు ఎంతో మంది ఆచరిస్తున్నారు.  కానీ నిజానికి ఇది ఒక ఆరాధన విధి.  ఫై మూడు విధానాలతో అంతఃకరణ శుద్ధి చేసుకున్న ముముక్షువు ఈ పద్దతిలో ఇంకొక అడుగు ముందుకు వేస్తాడు. 
ఇంకా వుంది 





కామెంట్‌లు లేవు: