ॐ శరీరము వంటి పదాలకి అర్థాలు
మనం తఱుచు మనలోనున్న జీవులము అనుకోకుండా, మాయపొర వలన "దేహమే నేను" అనే భ్రాంతి కలిగియుంటాం.
అసలు శరీరమన్నా, దానితోపాటు ఇతర పదాలు వాడుతున్నా, వాటి అర్థాలు మనలో చాలామందికి తెలియదు. అవి పరిశీలిద్దాం.
1. శరీరం
నశించేది కాబట్టి శరీరమని పేరు.
(శీర్యతే ఇతి శరీరమ్),
2. దేహం
అ) అన్నరసాదులచేత వృద్ధిపొందింపబడేది దేహం
(దిహ్యతే అన్నరసే నేతి దేహః)
ఆ) దహింపబడేది కాబట్టి కుడా దేహం అని పేరు,
3. తనువు
ఆహారము చేత విస్తారం చేయబడేది తనువు
(తన్యతే ఆహారేణేతి తనుః)
4. వపుః
పూర్వకర్మలచేత పుట్టంపబడేది వపుః
(ఉప్యతే ప్రాక్కర్మభిః ఇతి వపుః)
5. విగ్రహము
విశేషంగా ఆత్మచేత గ్రహింపబడేది విగ్రహం
(విశేషాత్మనా గృహ్యతి ఇతి విగ్రహః),
6. వర్ష్మము
తడుపబడేది వర్ష్మము
(వృష్యతి ఇతి వర్ష్మః).
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి