గ్రూపులో మెసేజస్ కి చక్కగా స్పందించే రంగారావు గారు గ్రూపు నుండి లెఫ్ట్ అయ్యారు, సరదాగా కలవడానికి కూడా రావటం లేదు.. కొన్ని వారాలయ్యాక గ్రూప్ అడ్మిన్ నాగేంద్ర ఆయన ఇంటికి వెళ్ళేసరికి , బాగా చలిగా ఉండటం వలన కొన్ని కర్ర దుంగల మంటల పక్కన చలి కాగుతూ ఒంటరిగా కూర్చున్నారు.. నాగేంద్రను చూసి విష్ చేసారు.. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది.. కాలుతూ నాట్యం చేస్తున్న జ్వాలను చూస్తున్నారు.. మధ్యలో నాగేంద్ర లేచి బాగా కాలుతున్న కర్ర దుంగను పక్కకు లాగేసి మరల కుర్చీలో కూర్చున్నారు.. జరిగే దానిని నిశితంగా చూస్తున్నాడు రంగారావు.. పక్కకు లాగిన , బాగా కాల్తున్న ఒంటరి దుంగ, క్రమేపీ మంట ఆరి చల్లబడి నల్లని బొగ్గుగా మారింది.. తిరిగి చచ్చుబడి, చల్లబడిన దుంగను కాలుతున్న మంటల్లో వేసాడు అడ్మిన్. అది తిరిగి కాలుతున్న దుంగలతో కలసి మండి వేడిని కాంతిని ఇచ్చింది. నాగేంద్ర లేచి వెళ్ళడానికి గేట్ దగ్గరకు చేరాడు.. ఇంటికి వచ్చి నందుకు, మనసుకు హత్తుకునే పాఠం చెప్పినందుకు ధాంక్యూ నాగేంద్రా ! రేపటి నుండి మన మీటింగులకు వస్తాను. తిరిగి మన వాట్సప్ గ్రూపులో నన్ను ఏడ్ చెయ్ అన్నాడు.. అసలు జీవితంలో గ్రూపు ఎందుకంటే ప్రతి మెంబరు మిగిలినవారి నుండి జ్వాల , వేడిని ( fire & heat ) పొంది ఉత్తేజాన్ని పొంద టానికి.. గ్రూపు లోని వారందరూ వేడి తగ్గకుండా ఏక్టివ్ గా ఉండాలి.. గ్రూపనేది ఒక కుటుంబం. ఏదో ఒక సమయంలో కొన్ని msgs, మాటల యుద్ధాలు, అపార్ధాలు గ్రూపు సభ్యుల్ని బాధ పెట్టొచ్చు.. గ్రూపనేది మనం కలవడానికి, ఆలోచనలు పంచుకో డానికి , మనం ఒంటరివాళ్ళం కాదని చెప్పడానికి.. జీవితం చాలా అందమైంది ! ఎప్పుడో తెలుసా! కుటుంబ సభ్యులు , మరియు స్నేహితులతో ఉన్నప్పుడు.. మనలో హుషారు జ్వాలలు రగిలుస్తున్న స్నేహితులు, కుటుంబంతో ఉన్న గ్రూపుకు , గ్రూపు అడ్మిన్ కు ధాంక్స్ చెబుదాం....
శుభోదయ వందనములతో..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి